“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

6, జూన్ 2018, బుధవారం

Zindagi Ka Safar - Kishore Kumar


Zindagi ka safar Haiye kaisa safar -  Koi samjha nahi Koi jana nahi

అంటూ కిషోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1970 లో వచ్చిన Safar అనే సినిమాలోది. ఇది నిరాశతో కూడిన విషాదగీతం అయినప్పటికీ మరపురాని మధురగీతాల కోవకు చెందినదే.


జీవితం చాలా విచిత్రమైనది.


ఇక్కడ ఎవరికీ కడుపు పూర్తిగా నిండదు. ఎవరికీ మనసూ నిండుగా పండదు. ఏదో దక్కిందని అనుకునే లోపు అది కాస్తా మాయమౌతుంది. ఏదో పొందామని విర్రవీగేలోపు ఇంకోవైపు బొక్క పడుతుంది.


బ్రతుకుదారిలో ఎటు పోతున్నామో ఎవరికీ తెలీదు. జీవితంలో చివరకు మిగిలేది ఏమిటో ఎవరికీ అర్ధం కాదు. మరి ఏమీ అర్ధం కాని ఈ జీవితంలో ఈ ప్రాకులాటంతా దేనికోసమో అసలే తెలీదు. పోనీ ఈ జీవితం ముగిశాక ఎక్కడకు పోతామో, అసలేమౌతామో అసలే తెలీదు.


సరిగా బ్రతకనూ బ్రతకలేం. పోనీ దీన్ని వదలి ఆవలకు పోనూ పోలేం. ఎంత విచిత్రమైనది ఈ జీవితం?


నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:-- Safar (1970)
Lyrics:-- Indeevar
Music:--Kalyanji Anandji
Singer:-- Kishore Kumar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------
Zindagi ka safar Haiye kaisa safar
Koi samjha nahi Koi jana nahi
Zindagi ka safar Haiye kaisa safar
Koi samjha nahi Koi jana nahi
Haiye kaisi dagar Chalte hai sab magar
Koi samjha nahi Koi jana nahi

Zindgi ko bahot pyar hamne diyaaaaa
Maut se bhi mohabbat Nibhayenge hum
Rote rote zamane - me aye magar
Haste haste zamane se jaayenge hum
Jayenge par kidhar – Hai kise ye khabar
Koi samjha nahi Koi jana nahi

Aise jeevan bhi hai – Jo jiye hi naheee
Jinko jeenese pehle Hi maut aagayi
Phool aise bhi hai – Jo khile hi nahee
Jinko khilne se pehle – Khizaa kha gayi
Hai pareshaa nazar – Thak gaye chaaragar
Koi samjha nahi Koi jaana nahi
Zindagi ka safar Haiye kaisa safar
Koi samjha nahi Koi jana nahi

Meaning

Journey of life !
What a journey it is !
None could understand it !
None could comprehend it !

What is its pathway?
that everyone walks through
None could understand it !
None could comprehend it !

We loved life very much
We have to fulfill our promise to death also
Crying we come into this world
But, will have to leave it smiling
We will go but where?
Nobody knows anything about it

There are some lives which are not lived at all
Death swallowed them even before they lived
There are some flowers that did not bloom
Before they could bloom, winter withered them away
Their mind is confused, Their world is dead

Journey of life !
What a journey it is !
None could understand it !
None could comprehend it !

తెలుగు స్వేచ్చానువాదం

జీవన పయనం
ఎంత వింత పయనం ఇది?
ఎవరూ దీన్ని అర్ధం చేసుకోలేరు
దీని మర్మాన్ని ఎవరూ గ్రహించలేరు

దీని దారి ఎక్కడకు పోతుందో ఎవరికీ తెలీదు
కానీ అందరూ ఆ దారిలో నడుస్తూనే ఉంటారు
ఎవరూ దీన్ని అర్ధం చేసుకోలేరు
దీని మర్మాన్ని ఎవరూ గ్రహించలేరు

మనం జీవితాన్ని ఎంతో ప్రేమిస్తాం
చావును కూడా అంతే ప్రేమించాలి
ఏడుస్తూ ఈ లోకంలోకి వస్తాం
నవ్వుతూ ఇక్కడనుంచి వెళ్లిపోవాలి
కానీ ఎక్కడకు పోతామో?
ఎవరికీ తెలీదు
ఎవరూ దీన్ని అర్ధం చేసుకోలేరు
దీని మర్మాన్ని ఎవరూ గ్రహించలేరు

కొన్ని జీవితాలు అసలు జీవించనే లేదు
అవి జీవించక ముందే మరణం వాటిని వరించింది
కొన్ని పూవులు అసలు వికసించనే లేదు
వికసించక ముందే వాటిని శిశిరం మింగేసింది
వాటి చూపులు నిరాశతో కూడి ఉన్నాయి
వాటి ప్రపంచం ఆగిపోయింది

జీవన పయనం
ఎంత వింత పయనం ఇది?
ఎవరూ దీన్ని అర్ధం చేసుకోలేరు
దీని మర్మాన్ని ఎవరూ గ్రహించలేరు