నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

10, నవంబర్ 2016, గురువారం

Jane Vo Kaise Log The Jinke - Hemanth Kumar


Jane Vo Kaise Log The Jinke Pyar Ko Pyar Milaa...

అంటూ హేమంత్ కుమార్ మధురంగా గానం చేసిన ఈ గీతం గురుదత్ నటించిన PYASA అనే హిందీ సినిమాలోది. ఈ సినిమా 1957 లో వచ్చింది. దీనిని గురుదత్ నిర్మించి దర్శకత్వం వహించి నటించాడు.ఇది అప్పట్లో పెద్ద కమర్షియల్ హిట్ మూవీ. కానీ ఇప్పడు ఇదొక క్లాసికల్ మూవీగా చూడబడుతోంది. అయితే ఈ విజయంతో దీని తర్వాత నిర్మించిన 'కాగజ్ కే ఫూల్' పెద్ద ఫ్లాప్ అయింది.

ఇది విషాద ఛాయలున్న గీతమే గానీ మధురగీతం. ఘజల్ కింగ్ జగ్జీత్ సింగ్ కూడా ఈ పాటను తన Close to my Heart ప్రోగ్రాం లో ఆలపించాడు.

అసలు ఈ పాటను రఫీ పాడవలసి ఉంది.సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ పట్టుబట్టడం వల్ల హేమంత కుమార్ చేత పాడించారు.

ఇదే రాగాన్ని 'నవమోహిని (1984)' అనే తెలుగు సినిమాలో రామకృష్ణ చేత 'సుందరరూపం చందనదీపం అందిన జాబిలికీ' అంటూ సంగీత దర్శకుడు పార్ధసారధి పాడించారు.దీనిని సి. నారాయణరెడ్డి వ్రాశారని అనుకుంటున్నాను.ఈ పాట కూడా చాలా మధురంగా ఉంటుంది. అయితే అది విషాద గీతం కాదు.శృంగార గీతం.  

నా స్వరంలో కూడా ఈ అమర గీతాన్ని వినండి మరి.

Movie:--Pyasa (1957)
Lyrics:--Sahir Ludhianvi
Music:--Sachindev Burman
Singer:--Hemanth Kumar
Karaoke Singer:--Satyanarayana Sarma
Enjoy
-----------------------------------------

Jane wo kaise Log the Jinke pyar ko pyar mila-2
Hamne tho jab kaliya maangee Katon ka haar mila
Jane wo kaise Log the Jinke pyar ko pyar mila

Khushiyon ki manzil doondi tho Gam ki gard milee-2
Chahat ki nagme chahee tho Ahe sard mile
Dilke bojhko doona kargaya Jo gamkhaar mila
Hamne tho jab kaliya maangee Katon ka haar mila
Jane wo kaise Log the Jinke pyar ko pyar mila

Bichad gayaa ----Bichad gaya
Bichad gaya har saathi lekar – Pal do pal kaa saath
Kisko pursat haijo thaame – Deewano ka haath
Hamko apna saayaa tak – Aksar bejaar milaa
Hamne tho jab kaliya maangee Katon ka haar mila
Jane wo kaise Log the Jinke pyar ko pyar mila

Iskohi jeena kehte haito – Yoohi jeelenge – 2
Uff na karenge Lab seelenge – Aasoo peelenge
Gamse ab ghabraana kaisaa- Gam sou baar mila
Hamne tho jab kaliya maangee Katon ka haar mila
Jane wo kaise Log the Jinke pyar ko pyar mila

Meaning

I wonder what kind of people get their love reciprocated
For me, whenever I asked for flowers, I got only garland of thorns

I searched for a house of love
but found myself roaming in circles of gloom
I desired for warmth of love but got only coldness of sighs
Whenever I met someone with expectation of relief
The burdens of my heart only doubled

All my companions left me, after spending but a few moments
Alas, who has time to hold a mad man's hand forever?
Even my own shadow has become sick of me

If this is what is called life, then I will live like this
I will not sigh, I will seal my lips and I will swallow my tears
Why to worry about sadness as if it is a new thing?
It came to me a hundred times earlier

I wonder what kind of people get their love reciprocated
For me, whenever I asked for flowers, I got only garland of thorns

తెలుగు స్వేచ్చానువాదం

తాము ప్రేమించినవారినుంచి
ప్రేమను ఎవరు తిరిగి పొందుతారో
ఎలా పొందుతారో 
నాకెప్పుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది

ఎందుకంటే,
నేను పూలను కోరుకున్న ప్రతిసారీ
నాకు ముళ్ళ హారమే లభించింది

సంతోషపు ప్రేమగృహం కోసం నేను వెదికాను
కానీ నాకు బాధల సుడులే ఎదురయ్యాయి
ప్రేమపలుకుల వెచ్చదనం కోసం నేను వెదికాను
కానీ నాకు నిట్టూర్పుల చల్లదనమే దొరికింది
ఓదార్పు దొరుకుతుందని ఆశించిన చోటల్లా
నా హృదయభారం రెండు రెట్లు అయింది

నా సహచరులందరూ కాసేపు నాతో గడిపి
ఆ తర్వాత తమ దారిన తాము వెళ్ళిపోయారు
ఒక పిచ్చివాడి చేతిని ఎల్లకాలం ఎవరు పట్టుకుంటారు?
చాలాసార్లు నా నీడే నన్ను భరించలేకుండా ఉంది

జీవితమంటే ఇదే అయితే, సరే, ఇలాగే జీవిస్తాను
నిట్టూర్పు కూడా వదలను, అసలు నా నోరే తెరవను 
నా కన్నీటిని నేనే దిగమ్రింగుతాను
బాధలంటే నాకు భయమెందుకు?
గతంలో ఎన్నోసార్లు అవి నన్ను వరించాయి

నేను పూలను కోరుకున్న ప్రతిసారీ
నాకు ముళ్ళ హారమే లభించింది

తాము ప్రేమించినవారినుంచి
ప్రేమను ఎవరు తిరిగి పొందుతారో
ఎలా పొందుతారో 
నాకెప్పుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది