Love the country you live in OR Live in the country you love

22, సెప్టెంబర్ 2016, గురువారం

జ్యోతిష్య శాస్త్రం సత్యమే - ఇవిగో రుజువులు - 3

5-9-2014 న అంటే సరిగ్గా రెండేళ్ళ క్రితం రోహిణీ శకట భేదనం అనే పోస్ట్ లు నేను వ్రాస్తూ ఈ క్రింది పేరాను రెడ్ కలర్ లో వ్రాశాను.
  • మార్చి-సెప్టెంబర్ 2016 ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన కాలం. ఎందుకంటే,ఒకటిన్నర నెల వ్యవధిలో రాశి మారే కుజుడు,ఆసమయంలో మాత్రం దాదాపు ఆరునెలల కాలం స్తంభన,వక్ర స్థితులలోకి ప్రవేశిస్తూ వృశ్చికంలో ఉన్న శనీశ్వరునితో కలసి ఉండబోతున్నాడు.ఆ సమయంలో వారిద్దరి భయంకరమైన సప్తమదృష్టి వృషభం మీద పడుతున్నది.కన్యారాశిలో ఉన్న రాహువు యొక్క పంచమదృష్టి కూడా ఆ సమయంలో వృషభం మీద పడుతున్నది.కనుక ఇదొక భయంకరమైన Compounding effect ను సృష్టించబోతున్నది.కాబట్టి ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా భయంకర దుర్ఘటనలు ఖచ్చితంగా జరుగబోతున్నాయని నేను ఈరోజు(ఒకటిన్నర సంవత్సరం ముందుగా) చెబుతున్నాను.కావలసిన వారు వ్రాసి పెట్టుకోండి.అవి జరిగినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను.
కావలసిన వారు ఈ క్రింది లింక్ చూడండి.


రోహిణీ శకట భేదనం జరిగే ఈ సమయంలో " లోకులు కష్టాల సముద్రంలో మునిగిపోతారు.' అని వరాహమిహిరాచార్యుడు రెండువేల సంవత్సరాల క్రితం సూత్రీకరించి పెట్టాడు. ఈ సూత్రాన్నే నేను ఉపయోగించి రెండేళ్ళ క్రితం చెప్పాను. అది నేడు ఖచ్చితంగా జరుగుతున్నది గమనించండి.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు నీళ్ళలో మునిగి ఉన్నాయి.అపార్ట్ మెంట్లలోకి నీళ్ళు వచ్చాయి.ప్రజల పరిస్థితి దుర్భరంగా ఉన్నది. ఈ రోజునైతే అవి ప్రయాణిస్తున్న రోడ్లు ముందూ వెనుకా నీళ్ళు పారుతూ ఎన్నోచోట్ల బస్సులు రైళ్ళూ జల దిగ్బంధనం అవుతున్నాయి.

వరాహమిహిరాచార్యుని జ్యోతిష్యసూత్రం ఖచ్చితంగా రుజువౌతున్నదా లేదా? మీరే చెప్పండి !!

నేడు హైదరాబాద్ పరిస్థితి ఏమిటో కొన్ని ఫోటోలు ఈ క్రింది లింకులలో చూడండి.






"2016 మార్చి సెప్టెంబర్ ల మధ్యలో వస్తుంది ఈ చెడుసమయం" అంటూ టైం స్లాట్ తో సహా స్పష్టం గా రెండేళ్ళ క్రితం చెప్పినది ఇప్పుడు జరుగుతున్నదా లేదా?

జ్యోతిష్యశాస్త్రం ఒక గొప్ప సైన్సే నని ఇప్పటికీ నమ్మకపోతే మీకు శాస్త్రీయధోరణి లేనట్లే లెక్క !! రుజువులు చూపించినా నమ్మలేని prejudiced mindset మీకు ఉన్నట్లే లెక్క !!