నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

7, ఆగస్టు 2016, ఆదివారం

Eduta Nilichindi Choodu - Karthikఎదుట నిలిచింది చూడు...జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు...చినుకంటి చిన్నదేమో

అంటూ కార్తీక్ పాడిన ఈ పాట 'వాన' అనే సినిమాలోది.ఈ సినిమా 2008 లో రిలీజైంది.

ముందుగా, ఈ పాటను ఎందుకు పాడవలసి వచ్చిందో చెప్తాను.

మొన్న ఒక శిష్యునితో మాట్లాడుతున్నపుడు - 'మీరు అన్నీ పాత హిందీ మెలోడీస్ పాడుతున్నారు.బానే ఉంది.కానీ తెలుగులో కూడా మంచి మెలోడీస్ ఉన్నాయి.వాటిని కూడా పాడొచ్చు కదా?' అనడిగాడు.

'ఉన్నాయి కానీ మెలోడీస్ అనేవి తెలుగులో తక్కువగా ఉన్నాయి.అందులోనూ మోడరన్ సాంగ్స్ లో మరీమరీ తక్కువ.అందుకే పాడటం లేదు.' అని చెప్పాను.

'లేదండి.'వాన' సినిమాలో కార్తీక్ పాడిన పాట చాలా మంచి మెలోడీ.దానిని పాడండి.'అన్నాడు.

'కమలాకర్ సంగీతం అంటే నాకూ ఇష్టమే.ఇప్పుడు మనం మరచిపోతున్న వయోలిన్,సరోద్,ఆర్గాన్,ఫ్లూట్ మొదలైన కొన్ని బిట్స్ ఆయన స్వరాలలో మనం ఇంకా వినవచ్చు.అవి చాలా మధురంగా ఉంటాయి.ఆ పాట నాకూ ఇష్టమే.సరే పాడుతాను.' అని చెప్పాను.

ఈ పాట అలా పాడానన్న మాట.

పోతే, ఈ సినిమా నేను చూడలేదు కాబట్టి, ఈ పాట సందర్భం ఏంటో నాకు తెలీదు.అందుకే అది వ్రాయడం లేదు.

ఈ పాటను మీరు చాలాసార్లు వినే ఉంటారు. నా స్వరంలో,నా స్టైల్లో, ఇప్పుడు మరొక్కసారి వినండి మరి.

Movie:--Vaana (2008)
Lyrics:--Seeta Rama Sastry
Music:--Kamalakar
Singer:--Karthik
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------
ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచి పోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా
ఎదుట నిలిచింది చూడూ

నిజంలాంటి ఈ స్వప్నం ... ఎలా పట్టి ఆపాలీ
కలే అయితే ఆ నిజం... ఎలా తట్టుకోవాలీ
ఔనో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా
ఎదుట నిలిచింది చూడూ...

నిన్నే చేరుకోలేకా ... ఎటెళ్ళిందో నా లేఖా
వినేవారు లేకా ... విసుక్కుంది నా కేకా
నీదో కాదో వ్రాసున్న చిరునామా
ఉందో లేదో ఆచోట నా ప్రేమా
వరం లాంటి శాపమేదో సొంతమైందిలా

ఎదుట నిలిచింది చూడు ... జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు ... చినుకంటి చిన్నదేమో
మైమరచి పోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా
ఎదుట నిలిచింది చూడూ...