“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

7, జులై 2016, గురువారం

Pyar Bhare Do Sharmile Nain - Mehdi Hasan



Pyar Bhare Do Shamile Nain...

అంటూ మెహదీ హసన్ మధురంగా ఆలపించిన ఈ గీతం "చాహత్" (1974) అనే పాకిస్తానీ సినిమాలోది. మెహదీ హసన్ పాడిన అనేక మధురాతి మధుర గీతాలలో ఇదీ ఒకటి.

నేను పాడే అనేక పాటల్లాగే ఇదికూడా ప్రియురాలిని ఉద్దేశించి పాడుతున్న పాటే. దీంట్లో కూడా చాలావరకూ ఉమర్ ఖయ్యాం ఫిలాసఫీ ఉంటుంది, ముఖ్యంగా చివరి చరణంలో.

ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తి స్వార్ధం కాదు. ప్రేమే.

స్వార్ధం రాక్షసశక్తి. ప్రేమ దైవశక్తి.

స్వార్ధం వెనుక ఉన్నది కూడా ప్రేమే.కానీ ఈ సంగతి స్వార్ధానికి తెలియదు. తెలిసేసరికి జీవితం ముగుస్తుంది.అప్పుడు చేసేదేమీ ఉండదు.

దైవం ప్రేమస్వరూపమే. ప్రేమ మయమే.

నిజమైన ప్రేమికుడు ప్రేయసి కళ్ళలో కూడా దైవాన్నే చూస్తాడు.

నిజానికి కన్నులు ఎన్నో భావాలను పలికిస్తాయి. చూచే చూపూ, గ్రహించే మనసూ,స్పందించే హృదయమూ ఉంటే  చాలు.ఈ ప్రపంచంలోని అణువణువులో ప్రేయసి ముఖమే కనిపిస్తుంది. ఆమె కన్నులే అతనికి కనిపిస్తాయి.

నిజమైన ప్రేమికుడూ నిజమైన భక్తుడూ ఒకరే.

భక్తికీ ప్రేమకూ ఏమీ తేడా లేదు.భక్తి పండి పక్వానికి వచ్చి పరాకాష్ఠకు చేరినప్పుడు ప్రేమగా మారుతుంది.నిజమైన భక్తుడికి సర్వే సర్వత్రా,చివరకు తన ప్రేయసిలో కూడా, తన ఇష్టదైవమే కనిపిస్తుంది.

ఆమెను (దైవాన్ని) ఎలా మరచిపోగలడు? మరచి పోయిన మరుక్షణం అతనెలా బ్రతకగలడు? ఆ ఊహే అతను భరించలేడు. కానీ ఈ విచిత్ర ప్రపంచంలో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అందుకే అతని భయం అతనికి ఉంటుంది.

ఒకవేళ తాను భయపడుతున్నదే జరిగితే, అతను కన్నీరుగా మారి కరిగిపోతాడు. భూమాత ఒడిలో కలసి ఇంకిపోతాడు.ఈ భావాన్నే చివరి చరణంలో కవి వ్రాశాడు. మెహదీ హసన్ ఎంతో మధురంగా భావయుక్తంగా పాడాడు.

కొన్ని పాటలను సినిమాలో చూడకూడదు.అలా చూస్తే చాలా పేలవంగా ఉంటాయి. పాటయొక్క భావస్ఫూర్తికి చాలా తక్కువ స్థాయిలో రసహీనంగా ఉంటాయి. ఈ పాటకూడా అలాటిదే. ఇది వింటేనే బాగుంటుంది.చూడకూడదు.

చాలా భావయుక్తమైన పాట. నిజానికి ఇదొక సూఫీ సాంగ్. సూఫీలు ప్రేమవాదులు. జీవితంలో వారికి అత్యంత ముఖ్యమైనది ప్రేమ ఒక్కటే.దానికోసం ఇంక దేనినైనా వారు ఒదులుకుంటారు. ఎందుకంటే ప్రేమే దైవం కనుక.ఎన్ని జన్మలెత్తినా విడచి పోకుండా మనతో ఉండేది అదొక్కటే కనుక.

మనం ఎంతో విశ్వసించి నమ్మినవారు కూడా మనకు ద్రోహం చెయ్యవచ్చు.మనల్ని విడచి పోవచ్చు.కానీ ప్రేమ అలా ఎన్నటికీ చెయ్యదు.అది మనల్ని వదలి ఎప్పుడూ పోదు.అలా పోయేది ప్రేమకాదు. ఒకవేళ ప్రేమే అలా మనల్ని వదలిపోతే ఆ తర్వాత మనమే మిగిలి ఉండము.

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి.

Movie:--Chahat (1974) (Pakistani Movie)
Lyrics:--Khaleel Shifai
Music:--Dr.Mujeeb Shaad
Singer:--Mehdi Hasan
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------
Pyar bhare do sharmile nain
Pyar bhare do sharmile nain, jinse milaa mere dil ko chain
Koyee jane naa kyun mujhse sharmaaye, kaise mujhe tadpaye
Pyar bhare do sharmile nain

Dil yeh kahe - geet mai tere gau,
tu hee sune - aur mai gata jau
Tu jo rahe - sath mere, duniya ko thukrau
teraa dil bahlaau
Pyar bhare do sharmile nain.......

Rup teraa - kaliyo ko sharmaye,
kaise koyee - apne dil ko bachaye
Pas hai tu - phir bhee jalu,
kaun tujhe samjhaye - savan beeta jaye
Pyar bhare do sharmile nain........

Dar hai mujhe - tujhse bichhad naa jau
Kho ke tujhe - milneki rah naa pau
Aisa naho - jab bhee teraa
Nam labon par laau, mai aansu ban jau

Jinse milaa mere dil ko chain
Koyee jane naa kyun mujhse sharmaaye, kaise mujhe tadpaye
Pyar bhare do sharmile nain

Meaning

Two beautiful and shy eyes
filled with love
From which my heart got solace
None can understand
why they are shying away from me
and how they are tormenting me....

Two beautiful and shy eyes
filled with love

My heart urges me to sing your praise
You listen and I will keep singing for you
If you continue to be mine
I will just ignore the entire world
And will entertain your heart alone

Your beauty puts the fame of roses to shame
On seeing you, how can anybody ever save his heart?
Even when you are beside me
I am burning with passion
How to make you understand this?
Alas, the rainy season is passing away fast...

I am afraid that I may drift away from you
If I lose you ever, I may not find my way to you again
If the worst shoud happen,
and if I cannot bring your name onto my lips
I just melt into tears and merge into the Earth

From whom my heart got solace
None understands
Why she shys away from me
And how she torments me

Two beautiful and shy eyes
filled with love...

తెలుగు స్వేచ్చానువాదం

ప్రేమతో నిండి సిగ్గుపడుతున్న రెండు కళ్ళు
నా హృదయానికి ఎంతో శాంతినిచ్చాయి
కానీ అవి నన్ను చూచి ఎందుకు సిగ్గుపడుతున్నాయి
ఎందుకు నన్నిలా హింసిస్తున్నాయి
ఎవరికైనా తెలుసా?

నిన్ను గురించి పాడమని నా హృదయం చెబుతోంది
నువ్వు వింటూ ఉండు, నేను నీకోసం ఇలాగే పాడుతూ ఉంటాను
నువ్వు నాతో ఉంటే చాలు, ఈ ప్రపంచాన్నే ఎదిరిస్తాను
నీ మనస్సుని రంజింపజేస్తాను

నీ అందాన్ని చూచి గులాబీలు సిగ్గుపడుతున్నాయి
నీవైపు ఒకసారి చూచాక ఎవరైనా సరే
తన హృదయాన్ని ఎలా రక్షించుకోగలడు?
నువ్వు పక్కనున్నా కూడా నేను జ్వలిస్తున్నాను
నీకెలా అర్ధం అయ్యేట్లు చెప్పను?
చూడు, వసంతం త్వరగా వెళ్ళిపోతోంది

నాకు భయంగా ఉంది
నేను నీనుంచి దూరం అవుతానేమోనని
ఒకసారి నిన్ను కోల్పోతే
మళ్ళీ నిన్ను అందుకోలేనేమోనని
ఒకవేళ అదే జరిగి
నీ పేరు నా పెదవుల పైకి రాకపోతే
నేను కన్నీరునై కరిగిపోతాను
భూమిలో కలసి పోతాను

ప్రేమతో నిండి సిగ్గుపడుతున్న రెండు కళ్ళు
నా హృదయానికి ఎంతో శాంతినిచ్చాయి
కానీ అవి నన్ను చూచి ఎందుకు సిగ్గుపడుతున్నాయి
ఎందుకు నన్నిలా హింసిస్తున్నాయి
ఎవరికైనా తెలుసా?

ప్రేమతో నిండి సిగ్గుపడుతున్న రెండు కళ్ళు....