అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

31, జులై 2016, ఆదివారం

మా అమెరికా యాత్ర - 33 (గౌరీమా - ఊహాతీత తపోమయ జీవితం)

హరిద్వార్ నుంచి ఋషీకేశ్ కు అదే సాధువుల గుంపుతో కలసి ఆమె చేరుకుంది.ఆ తపోభూమికి చేరుకున్న తదుపరి వారినుంచి సెలవు తీసుకుని ఒంటరిగా హిమాలయ పర్వతాలలో సంచరించ సాగింది. హిమాలయాలలో గడపిన మూడేళ్ళలో అనేక క్షేత్రాలను ఆమె దర్శించింది.బదరీనాథ్, కేదార్ నాద్,రుద్రప్రయాగ, అమర్నాథ్,ఉత్తరకాశీ వంటి లోతట్టు హిమాలయ ప్రాంతాలలో ఉన్న అన్ని క్షేత్రాలను ఆమె దర్శించింది.నిరంతరం ఆమె మనస్సు దైవధ్యానంలో మునిగి ఉండేది. తనతో...
read more " మా అమెరికా యాత్ర - 33 (గౌరీమా - ఊహాతీత తపోమయ జీవితం) "

30, జులై 2016, శనివారం

Hoton Se Chulo Tum - Jagjit Singh

Hoton Se Chulo Tum Mera Geet Amar Kardo... అంటూ జగ్జీత్ సింగ్ మధురంగా ఆలపించిన ఈ ఘజల్ Prem Geet అనే సినిమాలోనిది. ఈ సినిమా 1981 లో వచ్చింది.ఇది ఎప్పటికీ గుర్తుండే క్లాసిక్ ఘజల్ గా నిలిచిపోయిన మధురగీతం. ఈ పాటను జగ్జీత్ సింగ్ ఎంత అద్భుతంగా పాడాడో చెప్పలేము. ఆయనంత గొప్పగా పాడలేకపోయినా నా చేతనైనంతలో పాడటానికి ప్రయత్నం చేశాను.నా అభిమానులకు నచ్చుతుందనే ఆశిస్తున్నాను. ఈ మధురగీతాన్ని నా గళంలో...
read more " Hoton Se Chulo Tum - Jagjit Singh "

27, జులై 2016, బుధవారం

IAF -32 విమానం ఏమైంది? - ప్రశ్న శాస్త్రం ఏమంటోంది?

మొన్న శుక్రవారం నాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం IAF - 32 చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ కు వెళుతూ మధ్యలో మాయమై పోయింది. అందులో 29 మంది మనుషులున్నారు. ఇప్పటివరకూ దీని జాడా జవాబూ లేవు. ఇది ఏమైందో ఎక్కడుందో ప్రశ్న శాస్త్ర సహాయంతో చూద్దాం. ఈరోజు ఉదయం 10.59 కి ప్రశ్నను చూడటం జరిగింది.ఆ సమయానికి వేసిన చార్ట్ పైన ఇస్తున్నాను. ద్విస్వభావ లగ్నం ఉదయిస్తూ విషయంలో ఉన్న సందిగ్ధతను సూచిస్తున్నది.మన:కారకుడైన...
read more " IAF -32 విమానం ఏమైంది? - ప్రశ్న శాస్త్రం ఏమంటోంది? "

26, జులై 2016, మంగళవారం

శ్రీవిద్యా రహస్యం E Book ఈరోజు రిలీజైంది

నాచే వ్రాయబడిన 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకం రిలీజై ఒకటిన్నర ఏళ్ళయింది. అప్పటినుంచీ చదివిన ప్రతివారినీ ఇది మంత్రముగ్ధులను చేసింది.ఇంకా చేస్తున్నది.ఇది చదివి ఎందఱో నాకు అభిమానులుగా మారారు.చాలామంది శిష్యులుగా మారి నిజమైన ఆధ్యాత్మిక పధంలో నడుస్తున్నారు.అయితే, ఈ పుస్తకాన్ని E Book రూపంలో కూడా విడుదల చెయ్యమని చాలామంది చాలారోజులనుంచీ నన్ను కోరుతున్నారు. ఆపని ఇప్పటికి అయింది. తిధుల ప్రకారం ఈరోజు నా పుట్టినరోజు గనుక నేటి రోజున శ్రీవిద్యారహస్యం...
read more " శ్రీవిద్యా రహస్యం E Book ఈరోజు రిలీజైంది "

22, జులై 2016, శుక్రవారం

Barkha Rani Zara Jamke Barso - Mukesh

ఈరోజు మధురగాయకుడు ముకేష్ జన్మదినం. ముకేష్ చంద్ర మాధుర్ (ముకేష్) పాడినవి అనేక మధుర గీతాలున్నాయి.వాటిల్లోంచి ఏ పాట పాడదామా అని ఆలోచిస్తుంటే,' ప్రస్తుతం వర్షాకాలమేగా? వర్షాలు పడినా పడకపోయినా, ఆయన పాడిన ఒక మాంచి రొమాంటిక్ వానపాట ఉన్నది పాడతావా? సీజనూ మూడూ రెండూ కలిసొస్తాయి?' అంటూ చిలిపిగా అడిగింది కర్ణపిశాచి. సాధ్యమైనంత సీరియస్ గా దానివైపో సారి చూచి - 'సరే అలాగే' అంటూ...
read more " Barkha Rani Zara Jamke Barso - Mukesh "

రెండేళ్ళ క్రితం చెప్పిన జ్యోతిషం ఇప్పుడు అక్షరాలా నిజమౌతోంది

జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా అద్భుతమైన శాస్త్రం.మనిషి జీవితంలోనే గాక,ప్రపంచంలో కూడా ముందు ముందు ఏమేం జరుగుతుంది?అన్న విషయాన్ని చెప్పగలిగేది ఈ ఒక్క శాస్త్రం మాత్రమే.అయితే దీనిని శుద్ధంగా నేర్చుకోవాలి.ఉపాసనా పూర్వకంగా నేర్చుకోవాలి.అప్పుడు అది ఇచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి.ఇందులో ఏమీ అనుమానం లేదు. నేను సెప్టెంబర్ 2014 లో 'రోహిణీ శకట భేదనం' అనే పోస్ట్ లు వ్రాస్తూ ఆ సీరీస్ చివరి పోస్ట్ లో ఎర్రని అక్షరాలతో ఇలా వ్రాశాను. మార్చి-సెప్టెంబర్...
read more " రెండేళ్ళ క్రితం చెప్పిన జ్యోతిషం ఇప్పుడు అక్షరాలా నిజమౌతోంది "

21, జులై 2016, గురువారం

మా అమెరికా యాత్ర - 32 (గౌరీమా అద్భుత జీవితం: పురుషుడా - పురుషోత్తముడా?)

తన సాధనకు ఇంట్లో భార్యనుంచి సహకారం లేదని చెప్పి బాధపడిన ఒక భక్తునితో శ్రీ రామకృష్ణులు ఇలా అంటారు. 'సాధనలో నీకు నిజంగా నిజాయితీ ఉంటే,నీ మనస్సు శుద్ధమైనదే అయితే - అన్నీ కాలక్రమేణా సర్దుకుంటాయి.నీకు సరిపోయే విధంగా అన్ని పరిస్థితులనూ అమ్మే సరిదిద్దుతుంది.నీ బాధను ఒదిలి పెట్టి సంతోషంగా నీ సాధనను కొనసాగించు. పరిస్థితులు ఎలా మారుతాయో నువ్వే చూస్తావు.' ఈ మాటలు అక్షరాలా నిజాలు. ఇవి ఈనాటికీ అనేక మంది...
read more " మా అమెరికా యాత్ర - 32 (గౌరీమా అద్భుత జీవితం: పురుషుడా - పురుషోత్తముడా?) "