Love the country you live in OR Live in the country you love

9, జూన్ 2016, గురువారం

ఇప్పుడు మేమేం చెయ్యాలి?

నా గత పోస్ట్ చదివిన చాలామంది, ఇప్పుడు మేమేం చెయ్యాలి? అని అడుగుతున్నారు.అందరికీ విడివిడిగా సమాధానం రాయడం కుదరదు గనుక, వారికోసం ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

స్త్రీ గర్భవతి అయిన దగ్గరనుంచీ హోమియో ట్రీట్మెంట్ లో ఉంటే, పుట్టిన పిల్లకు ఎటువంటి టీకాలూ అక్కరలేదు.టీకాలు వెయ్యకపోయినా పాపకు ఏమీ కాదు.ఇదొక అనవసర భయంమాత్రమే.

నేను మా అమ్మాయికి ఏ టీకాలూ వేయించలేదు.తను శుభ్రంగా హాయిగా ఉంది.ఇప్పుడు హోమియో డాక్టర్ కూడా అయింది.నేను చెప్పేదే చేస్తాను.చేసేదే చెప్తాను.నేను ఆచరించి ఇతరులకు చెబుతాను గాని ఊరకే కబుర్లు చెప్పను.

కానీ నాలా ఉండాలంటే మీకు చాలా ధైర్యం ఉండాలి. తర్వాత్తర్వాత పిల్లలకు ఏ అనారోగ్యం వచ్చినా వారికి హోమియో ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వాలి.ఇంకే విధమైన మందులూ వాడక్కరలేదు.నేనలాగే చేశాను.కనుక నమ్మకంగా చెప్పగలను.

టీకాలనేవి చాలా అసహజమైనవి.అవి జంతుసిరం నుంచి తీసినవి.కొన్నేమో సింధటిక్ గా తయారు అయినవి.అవి మనిషికి ఏ మాత్రం అవసరం లేదు.కానీ వాడిస్తున్నారు.వాడుతున్నారు. పడుతున్నారు.మరి ఆయా రోగాలు వస్తే ఎలా అని మీ అనుమానం కదా? చిన్నప్పటినుంచీ హోమియో ట్రీట్మెంట్ లో ఉంటే ఈ రోగాలు ఏవీ మీ దగ్గరకి కూడా రావు.ఆరోగ్యం కూడా బాగుంటుంది.ఇప్పుడైనా కళ్ళు తెరవండి.సత్యమార్గంలో నడవండి.

"USA లో హోమియోపతి లేదు.వాడనివ్వరు. మాకు మంచి డాక్టర్ దొరకరు" - అంటే నేనేమీ చెప్పలేను.అవన్నీ నాకూ తెలుసు.మీరు వెదకాలి.అన్నీ రెడీగా మన ఒళ్లోకి వచ్చి పడవు.ప్రయత్నం చెయ్యాలి.అప్పుడే ఫలితం ఉంటుంది.

మంచి మొగుడు,మంచి భార్య,మంచి పిల్లలు,మంచి స్నేహితుడు/స్నేహితురాలు,మంచి డాక్టరు,మంచి గురువు, మంచి దారి చూపేవాడు - ఎవరైనా సరే దొరకాలంటే మన ఎకౌంట్లో మంచి కర్మ ఉండాలి. లేకపోతే వాడు/వాళ్ళు మన పక్క ఇంట్లోనే ఉన్నాకూడా మనకు దొరకరు.వాడే ఎదురుగా వచ్చి హెల్ప్ చేస్తానన్నా సరే మనం తీసుకోము,పైగా అనుమానిస్తాము. అవమానిస్తాము.

ఇది కర్మ నియమం.కర్మను జయించాలంటే విశ్వప్రయత్నం చెయ్యాలి.ఊరకే కూచుంటే ఏదీ కాదు.కాలం దొర్లిపోతుంది. అంతే.

గొప్పగొప్ప పనులన్నీ గొప్పవైన ప్రయత్నం వల్లనే జరిగాయిగాని ఊరకే కూచుంటే జరగలేదు.ఊరకే కూచుంటే ఆత్మజ్ఞానం మాత్రం వస్తుంది.ఇంకేమీ రాదు.అదొక్కటే నాకు చాలు అనుకుంటే అలాగే కూచోవచ్చు.కానీ అలా కూచోడం కూడా అందరూ చెయ్యలేరు. ప్రపంచంలోని అన్ని పనులలోకీ అతి కష్టమైన పని అదే అన్న సంగతి అందులోకి దిగిన అతి త్వరలోనే తెలుస్తుంది.

చాలామంది ఇలా అనుకుంటారు.

'సమయం వచ్చినపుడు అదే జరుగుతుంది.మనం ఏమీ చెయ్యక్కర్లేదు.సమయం వస్తే, దేవుడే నన్ను దగ్గరకు తీసుకుంటాడు.గురువే నా దగ్గరకు వెతుక్కుంటూ వస్తాడు'- ఇలా అనుకుంటారు.

ఇది ఎన్నటికీ జరగదు.ఆ "సమయం" అనేది ఎప్పటికీ రాదు.ఈలోపల చావు మాత్రమే వస్తుంది.ఇలా ఆలోచించడం మనం అహంకారానికి పరాకాష్ట తప్ప ఇంకేమీ కాదు.విశాల విశ్వంలో మనమెంత మన బ్రతుకెంత? మనకు ఇంత అహంకారం అవసరమా? అందరూ మనల్ని వెతుక్కుంటూ రావడానికి మనమేమైనా రామకృష్ణ పరమహంసలమా? ఇంత అహంకారం మనిషికి తగునా?

అలా ఏమీ చెయ్యకుండా కూచుంటే ఏదీ జరగదు.సమయం వృధా అవుతుంది.జీవితం వృధా అవుతుంది.చివరకు చింతించవలసి వస్తుంది.జీవితంలో ప్రయత్నం అనేది చాలా అవసరం.సరియైన దారికోసం ప్రయత్నం అవసరం.అది దొరికాక దానిలో నడవడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నమవసరం.

ఆటిజం అనేది వచ్చాక ఒక్క హోమియోపతి సిస్టం లోనే తగ్గుతుంది.ఇంక ఏ వైద్య విధానమూ దీనిని తగ్గించలేదు.ఇది నిజమో కాదో మీరే అనుభవంలో చూడండి.తెలుసుకోండి.

సరియైన దారేంటో నేను చెబుతున్నాను కదా.

ప్రయత్నించండి.