“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

8, ఫిబ్రవరి 2014, శనివారం

ఫిబ్రవరి 2014-దేశఫలితాలు


13-2-2014 న 2.15 కి న్యూడిల్లీలో సూర్యుని కుంభసంక్రమణం జరుగుతుంది.ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

ఎన్నికలు దగ్గర పడుతున్నందువల్ల ప్రజలను నానారకాలుగా మభ్య పెట్టాలని అధికారంలో ఉన్న నాయకుల ప్రయత్నాలూ కుయుక్తులూ మొదలౌతాయి.

ప్రజలమధ్యన చిచ్చు పెట్టాలని దుష్టశక్తులు ప్రయత్నిస్తాయి.అందుకు అవసరమైతే హింసను సృష్టించడానికి కూడా వెనుకాడవు.లోపల్లోపల ఇందుకోసం వ్యూహరచనలు జరుగుతాయి.ముఖ్య సమస్యలనుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి విధ్వంసరచనను వాడుకోవాలని కొన్ని వర్గాలు ప్రయత్నిస్తాయి.

ఫిబ్రవరి 15 న రాబోతున్న పౌర్ణమికి అటూ ఇటూగా నాయకుల మీద కుట్రపూరిత ఎటాక్ జరిగే అవకాశం ఉన్నది.లేదా ఎవరైనా నాయకులకు, అధికారులకు ప్రమాదం పొంచి ఉన్నది.వారి ఆరోగ్యాలు దెబ్బతినవచ్చు.

సింపతీ కోసం తమమీద తామే దాడులు ప్లాన్ చేయించి ఓట్లు కొట్టేయాలనే క్షుద్రరాజకీయం జరిగినా ఆశ్చర్యం లేదు.

కొన్ని ప్రాంతాలలో కల్లోలమూ విధ్వంసమూ జరిగే సూచనలున్నాయి. వాహనప్రమాదాలూ అగ్నిప్రమాదాలూ కూడా జరుగవచ్చు.ప్రజలకు జాగ్రత్త అవసరం.