19 వ తేదీనుండి 29 వ తేదీవరకు హైద్రాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్, పై అడ్రసులో జరుగబోతున్నది. దీనిలో పంచవటికి 152 వ నెంబర్ స్టాలు కేటాయించబడింది. క్రొత్తగా ప్రింట్ అయిన పుస్తకాలతో సహా మా ప్రచురణలన్నీ అక్కడ లభిస్తాయి.
'మీ మార్గమేమిటి?' అని చాలామంది నన్ను గతంలో అడిగేవారు. ఇప్పుడుకూడా మెయిల్స్ లో అడుగుతుంటారు. వారికందరికి ఒకటే జవాబు - 'అసలైన, ఆచరణాత్మకమైన హిందూమతమే నా మార్గం. అయితే అది కొద్దిమాటలలో అర్ధమయ్యేది కాదు. అందరూ అనుసరించగలిగేది కూడా కాదు. నా పుస్తకాలలో దానిని ఎంతో వివరంగా చర్చించాను. చదవండి. అర్ధమైనంత అర్ధమౌతుంది'.
నేడు హిందువులమనుకుంటున్న చాలామందికి హిందూమతం గురించి ఏమాత్రమూ సరియైన అవగాహన లేదు. పైగా వారిలో ఎన్నో అపోహలున్నాయి. అందుకే ఎవరికి తోచిన పిచ్చిపనులను వారు చేస్తూ అది హిందూమతమే అనుకుంటున్నారు. వాటన్నిటినీ సరిదిద్దడం కోసం, సరియైన అవగాహనను వారిలో పెంచడం కోసమే నేను పుస్తకాలను వ్రాస్తున్నాను. నా మార్గాన్ని కూడా వివరిస్తున్నాను.
మా సంస్థ ముఖ్యసభ్యులను మీరు పంచవటిస్టాల్ లో కలుసుకోవచ్చు. వారితో మాట్లాడి, మీకేవైనా సందేహాలుంటే తీర్చుకోవచ్చు.
ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.
