అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

9, డిసెంబర్ 2025, మంగళవారం

' వైద్యజ్యోతిషం రెండవభాగం' ప్రింట్ పుస్తకం విడుదల

2022 డిసెంబర్ లో 'Medical Astrology - Part 2' 'ఈ-బుక్' ను అమెరికానుండి విడుదలచేశాను. అప్పటినుండి ప్రయత్నిస్తుంటే, దాని తెలుగుఅనువాదం ఇప్పటికి పూర్తయింది. అందుకని ఈరోజున దీనియొక్క తెలుగు 'ఈ-బుక్' ను విడుదల చేస్తున్నాను. 

ఇది నా కలంనుండి వెలువడుతున్న 76 వ పుస్తకం.

ఒక వారంలో ఇది ప్రింట్ అయ్యి, 19 వ తేదీనుండి మొదలౌతున్న హైద్రాబాద్ పుస్తకమహోత్సవంలో  పంచవటిస్టాల్లో అందుబాటులోకి వస్తుంది.

మొదటిభాగంలో లాగానే దీనిలోకూడా నూరుజాతకాల విశ్లేషణలతో జలుబు నుండి ఎయిడ్స్ దాకా అనేకరకాలైన వ్యాధులను జాతకాలలో ఎలా గుర్తించాలో వివరించాను. 2022 లో మొదటిభాగం విడుదల అయినప్పటినుండి, తెలుగుపుస్తకం కోసం అనేకమంది జ్యోతిషవిద్యార్థులు, తెలుగుయూనివర్సిటీ నుండి M.A.జ్యోతిషం కోర్సు చేసినవారు, చేస్తున్నవారు అడుగుతున్నారు. ఇప్పటికి ఇది విడుదల అవుతున్నది.

2026 లో, ఇంకొక నూరు జాతకాలతో వైద్యజ్యోతిషం మూడవభాగాన్ని విడుదల చేస్తాను. ఈ విధంగా పదిభాగాలను వ్రాయాలన్నది నా సంకల్పం. మానవజాతిని బాధపెడుతున్న సమస్తరోగాలను జాతకపరంగా ఎలా గుర్తించాలో మొత్తం వెయ్యిజాతకాల విశ్లేషణలతో వివరించే ఈ గ్రంధాలు ప్రపంచ జ్యోతిషచరిత్రలోనే అరుదైన రీసెర్చిగా మిగిలిపోతాయి.

ఈ గ్రంధాన్ని వ్రాసి, ప్రచురించడంలో తోడ్పడిన నా శిష్యులందరికీ ఆశీస్సులందిస్తున్నాను. ఈ పుస్తకంకూడా జ్యోతిషాభిమానులను ఎంతగానో అలరిస్తుందని భావిస్తున్నాను.

ప్రస్తుతానికి  ఈ బుక్ ఇక్కడ లభిస్తుంది.