“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, ఏప్రిల్ 2022, ఆదివారం

శనీశ్వరుని రాశిమార్పు - ఫలితాలు

ఎల్లుండి అంటే 26-4-2022 న శనీశ్వరుడు మకరరాశిని వదలిపెట్టి కుంభరాశిలోకి మారబోతున్నాడు. కుంభంలో 2025 మార్చి వరకూ ఉంటాడు. ఈ రాశిమార్పు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, దీనివల్ల కోట్లాదిమంది మనుషుల జీవితాలు ఎలా ప్రభావితం అవబోతున్నాయా చూద్దాం.

మేషం

మూడేళ్ళుగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా  పడుతున్న కష్టాలు పోతాయి. లాభాలు మొదలౌతాయి. సంతానలాభం కలుగుతుంది. కొందరికి సంతానంతో కష్టాలు మొదలౌతాయి. సర్కిల్ పెరుగుతుంది.

వృషభం

దానధర్మాలపైన ఆసక్తి పెరుగుతుంది. దేశాలు తిరుగుతారు. కష్టాలు మొదలౌతాయి. తండ్రికి తల్లికి ఆరోగ్యం చెడుతుంది. మానసికంగా కృంగిపోతారు. ఆధ్యాత్మికులైతే గట్టెక్కుతారు.

మిథునం

ఆధ్యాత్మికచింతన ఎక్కువౌతుంది. దూరదేశాలకు వెళతారు. డబ్బుకు ఇబ్బంది పడతారు. పెద్దలకు కష్టకాలం మొదలౌతుంది. గతకర్మ పక్వానికి వస్తుంది. తమ్ముళ్లకు  చెల్లెళ్లకు కష్టకాలం మొదలౌతుంది.

కర్కాటకం

అష్టమశని మొదలౌతుంది. ఇంట్లో చికాకులు ఎక్కువౌతాయి. కష్టాలు నష్టాలు  చుట్టుముడతాయి. ఆరోగ్యం  క్షీణిస్తుంది. కొందరికి ప్రాణగండం కూడా ఉంటుంది.  

సింహం

సప్తమశని మొదలౌతుంది. భార్యకు/ భర్తకు కష్టకాలం. ఇద్దరికీ ఆరోగ్యాలు  చెడతాయి. దూరదేశప్రయాణం ఉంటుంది. వివాహజీవితం దెబ్బతింటుంది.

కన్య

మంచికాలం మొదలౌతుంది. మూడేళ్ళుగా పడుతున్న మానసికవేదన తొలగిపోతుంది. ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఆస్పత్రులు సందర్శిస్తారు. 

తుల

ఆధ్యాత్మిక చింతన ఊపందుకుంటుంది. అది లేనివారు సమాజసేవలో పడతారు. లేదా డిప్రెషన్ కు లోనవుతారు. సంతానానికి మంచి జరుగుతుంది.

వృశ్చికం 

అర్ధాష్టమ శని మొదలౌతుంది. కష్టకాలం. డిప్రెషన్ లో పడతారు. ఇంట్లో చికాకులు ఎక్కువౌతాయి. తల్లికి గండం. చదువు కుంటుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో చికాకులు కలుగుతాయి. వాహనప్రమాదం జరుగవచ్చు.

ధనుస్సు 

ధైర్యం పెరుగుతుంది. గత రెండేళ్లుగా పడుతున్న కష్టాలు  తేలిపోతాయి. స్థలమార్పు ఉంటుంది. సమాజసంబంధాలు పెరుగుతాయి. అధికారయోగం ఉంటుంది. ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది.

మకరం 

ఏలినాటిశని మూడవపాదం మొదలౌతుంది. గత అయిదేళ్లుగా పడుతున్న చికాకులు మెల్లిగా మారడం మొదలౌతుంది. కుటుంబం పెద్దదౌతుంది. బాధ్యతలు పెరుగుతాయి.

కుంభం

ఏలినాటిశని రెండవపాదం మొదలౌతుంది. అనారోగ్యాలు మొదలౌతాయి. స్థలమార్పు ఉంటుంది. ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది. లోకానికి మేలు చేస్తారు. జీవితభాగస్వామికి కష్టకాలం మొదలౌతుంది.

మీనం

ఏలినాటి శని మొదటిపాదం మొదలౌతుంది. ఖర్చు పెరుగుతుంది. రాబడి తగ్గుతుంది. స్థలమార్పు ఉంటుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం చెడుతుంది. ఆస్పత్రిని సందర్శిస్తారు.

  • రాబోయే రెండున్నరేళ్ళపాటు ఈ ఫలితాలు వెంటాడతాయి.
  • రాశినుంచి, లగ్నం నుంచి కూడా ఈ ఫలితాలను చదువుకోండి.
  • వ్యక్తిగతజాతకాన్ని, దానిలో ప్రస్తుతం జరుగుతున్న దశలను కూడా కలుపుకుని చూచుకుంటే  ఈ ఫలితాలు 100% సరిపోతాయి.

30 ఏళ్ల క్రితం అంటే, 1992 లో మీ జీవితంలో ఏం జరిగిందో చూచుకోండి. అవే సంఘటనలు ఇప్పుడు జరగకపోయినా, ట్రెండ్స్ మాత్రం అవే ఉంటాయి. అర్ధం చేసుకుంటే అర్ధమౌతాయి.