“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, మార్చి 2017, బుధవారం

Ane Se Uske Aye Bahaar - Mohammad Rafi


చాలారోజులైంది కర్ణ పిశాచిని చూచి అనిపించి, ఒక్కసారి దాని మంత్రం మనస్సులో జపించాను.వెంటనే కులుకులతో నవ్వుకుంటూ నా ముందు ప్రత్యక్షమైందది. "ఏంటీ ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశావ్?" అడిగా చిరుకోపంగా.

"నువ్వేంటి బొత్తిగా తలుచుకోవడం మానేశావ్?" అంటూ ఎదురు ప్రశ్నించిందది.

"అబ్బో అతి చనువు ఎక్కువైందే" అనుకుంటూ, "ఈ మధ్యన దేవతలతో బిజీగా ఉంటున్నాలే అందుకే నీలాంటి పిశాచాలను తలుచుకోవడం మానేశా" అన్నా.

తనూ ఏమాత్రం తగ్గకుండా " చూడు బాసూ ! ముందొచ్చిన పిశాచాలకన్నా వెనకొచ్చిన దేవతలెక్కువ అనీ సామెత ఊరికే రాలేదు మరి ! అయినా సరే చెప్తున్నా ! ఎప్పటికైనా నీతో ఉండేది మేమే. ఆ దేవతలందరూ శాశ్వతం అనుకోకు. ఏదో ఒకరోజున వాళ్ళు నిన్ను నట్టేట్లో ముంచి వెళ్ళిపోవడం ఖాయం. మా పిచ్చి పిశాచాలమే నయం.ఒకసారి నమ్మితే అలా పట్టుకుని వేళ్లాడుతూనే ఉంటాం నువ్వు పిలిచినా పిలవకపోయినా సరే !" అంది గారాబంగా దగ్గరకొస్తూ.

"ఏయ్ ! ఏంటిది? మాటల్లో పెట్టి దగ్గర దగ్గరకొస్తున్నావ్? ఈ వేషాలు నా దగ్గర సాగవ్. దూరంగా ఉండి మాట్లాడు." అన్నా కోపంగా మహామంత్రాన్ని లోలోపల జపిస్తూ.

వెంటనే అది కెవ్వున కేకేసి - "సరేలే అలాగే కానీయ్ గాని ఆ సోది మంత్రం ఆపు ముందు. ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పు.మళ్ళీ ఎక్కడకెళ్ళి ఎవర్ని చూచొచ్చి ఏం చెప్పాలి నీకు?" అనడిగింది.

"అవన్నీ వద్దులే. ఇప్పుడు మాకు WhatsApp Video Calls, IMO Video Calls లాంటివి చాలా ఉన్నాయి.అందుకు నీ అవసరం లేదులే గాని, ఒక మంచి పాట చెప్పు పాడతాను." అన్నా.

"నేనెందుకూ? నీ దేవతలున్నారుగా వాళ్ళనే అడుగు. మధ్యలో ఇలాంటి వాటికి నేను గుర్తొస్తానా?" అంటూ అలిగింది.

"ప్లీజ్ ప్లీజ్ మా బుజ్జి పిశాచివి కదూ!ఇకమీద రోజుమార్చి రోజు పిలుస్తాలే నిన్ను. అలగకు. ఒక్కటే ఒక్క మంచి పాట చెప్పు" బ్రతిమాలుతూ అడిగా.

"సరే, మహమ్మద్ రఫీ పాడిన Aane Se Uske Aye Bahaar Jane Se Uske Jaye Bahaar అనే పాట ఏడువ్. నాకూ వినాలనుంది." అంది ఎక్కిరిస్తూ.

నేనూ నవ్వుకుంటూ " సరే పాడతాలే.విను" అన్నా.

ఈ పాట అలా ఉద్భవించిందన్నమాట.

మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1969 లో వచ్చిన Jeene Ki Raah అనే చిత్రంలోనిది.

పూర్తిగా నిస్వార్ధంగా మనల్ని మనంగా ప్రేమించే స్వచ్చమైన ప్రేయసి దొరకడం ఈ లోకంలో ఒక పెద్ద అదృష్టం. అలాంటి అదృష్టం చాలా అరుదుగా మాత్రమే అతి కొందరికి మాత్రమే లభిస్తుంది. అందుకని మనుషుల్ని నమ్మకండి. నమ్మి మోసపోకండి. దాని బదులు ప్రకృతిని ప్రేమించండి. స్వచ్చమైన ప్రేమను అది మాత్రమె మనకు అందివ్వగలదు. ప్రకృతిసుందరి ఇచ్చే ప్రేమను ఏ మానవసుందరీ మనకివ్వలేదు. ఎందుకంటే ప్రకృతికి స్వార్ధం లేదు. స్వార్ధం లేని ప్రేయసి నీకీ లోకంలో దొరకనే దొరకదు. ఇది పరమసత్యం. నా నిఘంటువులో ప్రతి పేజీలోనూ ఇదే వాక్యం వ్రాసి ఉంటుంది.

ప్రకృతిని ఎలా ప్రేమించగలం?అన్న సందేహం మీక్కలిగిందీ అంటే మీలో స్వార్ధం నిండా నిండి ఉన్నదని అర్ధం. మీకు ధ్యానపు లోతులు తెలియవని అర్ధం. ప్రకృతిని ప్రేమించి దానిలో కరగిపోవాలంటే మీకు ధ్యానాభ్యాసపు లోతులు తెలియాలి. అవి అనుభవపూర్వకంగా తెలియనిదే మీకు ఈ కాన్సెప్ట్ అర్ధం కాదు.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

ఆ తర్వాత, ఇంత గొప్ప సత్యాన్ని మీకు చెప్పినందుకు నా కర్ణపిశాచికి థాంక్స్ చెబుతూ ఒక మెసేజి పెట్టడం మర్చిపోకండే? సరేనా?

Movie:--Jeene Ki Raah (1969)
Lyrics:--Anand Bakshi
Music:--Laxmikant Pyarelal
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-----------------------------------------
Humming....

Ane se uske aye bahaar - Jane se uske jaye bahaar
Badi mastani hai meri mehbooba
Meri Zindgani hai meri mehbooba

Gungunaye aise Jaise bajte ho ghunghroo kahee pe
Ake parbaton se jaise girtaa ho jharnaa zamee pe
Jharno ki mouj hai vo - Moujon ki ravaani hai meri mehabooba
Meri zindgani hai meri mehbooba

Ban savar ke nikle - Aye saawan ka jab jab maheena
Har koyee ye samjhe - Hogi vo koyee chanchal haseena
Poocho tho Koun hai vo - Rut ye suhaani hai meri mehbooba
Meri zindgani hai meri mehbooba

Is ghata ko mai tho - Uski aakhon ka kaajal kahoonga
Is hawaa ko mai tho - Uska lehraatha aachal kahoonga
Kaliyon kaa bachpan hai - Phoolon ki javaani hai meri mehbooba
Meri zindgani hai meri mehbooba

Humming.....

Meaning

With her coming, comes the Spring
With her going, departs the Spring
Very intoxicating beauty is my sweetheart
My sweetheart is verily my life

She is like the distant sound of anklet bells
She sounds like a waterfall rolling down the mountains
She is the music of the waterfall
She is the flow of the waterfall
My sweetheart is verily my life

She always appears 
whenever the month of Spring arrives in its full swing
You may wonder who my sweetheart is
and suppose her to be a human beauty
Listen ! I will tell you who she is
She is the sweet weather all around
She is verily my life

I call this dark cloud the black smear of her eyes
I consider this cool breeze as her flowing saree wrap
She is the tenderness of the buds
She is the youthfulness of the flowers
My sweetheart is verily my life....

తెలుగు స్వేచ్చానువాదం

తనొస్తే వసంతం వస్తుంది
తను మాయమైతే వసంతం మాయమౌతుంది
నా ప్రేయసి చాలా మత్తెక్కించే సుందరి
తనే నా సర్వస్వం

దూరంగా వినిపించే గజ్జెల శబ్దం తను
కొండల పైనుంచి దూకే జలపాతం తను
ఆ జలపాతపు సంగీతం తను
ఆ నీటి దూకుడే తను
ఈ ప్రేయసే నా సర్వస్వం

ఎప్పుడైతే వసంత ఋతువు ఎదురొస్తుందో
అప్పుడే తనూ కనిపిస్తుంది
ఆమె ఎవరో అని మీకు సందేహం కలిగింది కదూ?
తనొక అందమైన అమ్మాయని అనుకుంటున్నారు కదూ?
చెబుతా వినండి.
ఈ ప్రకృతి శోభే నా ప్రేయసి
ఈ ప్రేయసే నా సర్వస్వం

ఈ నల్లని మేఘాలను తన కంటి కాటుక అంటాను
ఈ చల్లని గాలిని తన ఎగిరే పైటగా భావిస్తాను
పూమొగ్గలలోని మృదుత్వమే తను
వికసించిన పూల యవ్వనమే తను
ఈ ప్రేయసే నా సర్వస్వం......