“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

4, డిసెంబర్ 2016, ఆదివారం

Goronka Gootike Cheravu Chilaka - Ghantasala


గోరొంక గూటికే చేరావు చిలకా ...భయమెందుకే నీకు బంగారు మొలకా ...

అంటూ ఘంటసాల మధురంగా గానం చేసిన ఈ పాట 1964 లో వచ్చిన "దాగుడు మూతలు" అన్న సినిమా లోది.ఘంటసాల పాడిన మధుర సోలో గీతాలలో ఇది మరపురాని గీతం.ఈ పాటలో రామారావు, సరోజాదేవి నటించారు.

ఈ రోజు ఘంటసాల జన్మదినం. కనుక ఈ పాటను సమర్పిస్తున్నాను.


నా స్వరంలో కూడా ఈ పాటను  వినండి మరి.


Movie:--దాగుడు మూతలు (1964)

Lyrics:--దాశరధి
Music:--కే.వీ. మహాదేవన్
Singer:--ఘంటసాల
Karaoke Singer:--సత్య నారాయణ శర్మ
Enjoy
--------------------------------
గోరొంక గూటికే చేరావు చిలకా – 2
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరొంక గూటికే చేరావు చిలకా

[ఏ సీమ దానవో ఎగిరెగిరి వచ్చావు – అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు]-2
మా మల్లె పూలు నీకు మంచి కధలు చెప్పునే – 2
ఆదమరచి ఈ రేయి హాయిగా నిదురపో
గోరొంక గూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరొంక గూటికే చేరావు చిలకా

[నిలువలేని కళ్ళు నిదరపోమ్మన్నాయీ
దాగని చిరునవ్వులు వద్దన్నాయీ అబ్బా ఉండన్నాయీ]-2
పైటచెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి-2
పలుకైనా పలుకవా బంగారు చిలకా

గోరొంక గూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారు మొలకా
గోరొంక గూటికే చేరావు చిలకా