“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, ఆగస్టు 2016, శనివారం

Bahut Khubsurat Hai Mera Sanam - Mehdi Hassan


Bahut Khubsurat Hai Mera Sanam...

అంటూ మెహదీ హసన్ ఆలపించిన ఈ మధురగీతం 1978 లో వచ్చిన Aabshar అనే పాకిస్తానీ సినిమా లోది.ఈ గీతాన్నే తర్వాత మనవాళ్ళు 1991 లో తీసిన "సాజన్" అనే సినిమాలో 'బహుత్ ప్యార్ కర్తే హై తుంకో సనమ్'...అంటూ కాపీ చేశారు.ఈ పాటను అనూరాధా పోద్వాల్, బాలసుబ్రమణ్యం విడివిడిగా పాడారు.

రెండూ మంచి పాటలే అయినప్పటికీ మెహదీ హసన్ స్వరంలో ఉన్న మాధుర్యం వేరు.ఉర్దూ పదాలలో ఉన్న సున్నితత్వం కూడా వేరుగా ఉంటుంది.ఈ రాగం కూడా చాలా మంచి రాగం.కనుకనే ఈనాటికీ ఈపాట హాంటింగ్ మెలోడీ గా నిలిచి ఉన్నది.

ఈ పాట వ్రాసిన ఉర్దూ కవి ఎవరో గాని చాలా మంచి భావుకుడై ఉండాలి.అన్ని చరణాలూ అద్భుతంగా వ్రాసినా, మూడో చరణంలో ఉన్న - ' బనాకే ముసవ్విర్ నే తోడా కలమ్' అనే భావం చాలా అద్భుతమైనది.

"సవారీ గయీ హోంగీ జబ్ తేరీ జుల్ఫే - ఉడీ హొంగి లాఖోన్ ఫరిష్టోన్ కి నీందే" -అనే భావమూ అద్భుతమైనదే.ఊరకే ఎగిరే ఆమె కురులను చూస్తె చాలు అప్సరసలకు నిద్ర పట్టదట.

"బనాయే గయే హోంగే జబ్ హోట్ తేరే - కయీ సాల్ నికలే న హోంగే సవేరే" - అసలు ఎలా వ్రాస్తారో ఇలాంటి ఆద్భుతమైన భావాలను?

'ముసవ్విర్' అంటే చిత్రకారుడు అని అర్ధం. ఒక పెయింటింగ్ వేశాక చిత్రకారుడు తన కుంచెను విరిచేశాడంటే దాని అర్ధం - ఆ పెయింటింగ్ అంత అద్భుతంగా వచ్చిందనీ, ఇక తాను ఏ చిత్రాలూ వెయ్యవలసిన పని లేదనేగా?

నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:-- Aabshar (1978)
Music:--Mohammad Ashraf
Singer:--Mehdi Hasan
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------
Bahut Khoobsoorat Hai  - Mera Sanam - 2
Khuda Aise Mukhde - Banata Hai Kam. ... 
Bahut Khoobsoorat Hai - Mera Sanam

Uthi Hain Jo Sharmili - Kajarari Aankhen,
To Suraj Ki Laau - TharTharaane Lagi Hai,
Jo SarSe Gira Hai Ye - Rangine Aanchal,
Haya In Nazaron Ko  - Ane Lagi Hai. ....
Dhanak Tooti Ayaa - Badan Mein Jo ham. ... 
Bahut Khoobsoorat Hai Mera Sanam

Sanwari Gayi Hongi - Jab Teree Zulfen,
Udi Hongi Laakhon - Farishton Ki Neenden,
Banaye Gaye Honge - Jab Hont Tere,
Kai Sal Nikle - Na Honge Savere,
Qayamat Jagaate - HainTere Qadam
Bahut Khoobsoorat Hai Mera Sanam 

Jahaan Chalte chalte  - Qadam Ruk Gaye Hain
Samajh Lo Bahaaron Ki - Manjil Wahi Hai
Khuda Ki Kasam Tu - Jahaan Se Hasi Hai
Tu Hi Dusara Tujhasa - Mumkin Nahi Hai
Bana Ke Musawwir Ne - Toda Qalam, 
Bahut Khoobsoorat Hai Mera Sanam
Khuda Aise Mukhde - Banata Hai Kam. ...
Bahut Khoobsoorat Hai Mera Sanam

Meaning

My beloved is very beautiful

God makes Such beautiful faces
Only now and then

When she lifts her shy and kajal smeared eye lids

the light of Sun became pale
When her colorful veil fell from her head
Her eyes began to show shyness
A part of rainbow became her face and enhanced its beauty
My beloved is very beautiful

When her hair flows in air
Lakhs of angels lose their sleep
When God was making her lips
Many years passed,but it did not dawn
Her every step, creates but a typhoon
My beloved is very beautiful

While walking,wherever she stops
that spot becomes the hub of Spring season
Believe me,she is the most beautiful damsel in this world
She is simply incomparable in her beauty
After making her, it seems,
the creator has smashed his brush forever

My beloved is very beautiful
God makes Such beautiful faces
Only now and then

తెలుగు స్వేచ్చానువాదం


నా ప్రేయసి ఎంతో అందమైనది

దేవుడు అలాంటి అందాన్ని
ఎప్పుడో ఒకసారి మాత్రమె సృష్టిస్తాడు

సిగ్గుతో నిండిన తన కాటుక కళ్ళను ఎత్తి చూచిందంటే

సూర్యుని కాంతి చిన్నబోతుంది
రంగు రంగుల తన మేలిముసుగు జారిపోతే
ఆ కళ్ళు సిగ్గుతో వాలిపోతాయి
ఇంద్రధనుస్సు లోనుంచి ఒక ముక్క జారి వచ్చి
తన ముఖంలో చేరి దానికి వన్నె తెచ్చింది
నా ప్రేయసి ఎంతో అందమైనది

గాలికి తన కురులు ఎగిరితే

లక్షలాది అప్సరసలకు నిద్ర పట్టదు
దేవుడు ఆమె పెదవులను చెక్కుతున్నపుడు
ఎన్నో ఏళ్ళు గడచిపోయాయి
కానీ వేకువ ఇంకా రాలేదు
ఆమె వేసే ప్రతి అడుగూ, నాలో ఒక తుఫాన్ ను రేపుతుంది
నా ప్రేయసి ఎంతో అందమైనది

నడుస్తున్న తను ఎక్కడ ఆగుతుందో
ఆ ప్రదేశంలో వసంతం వెల్లివిరుస్తుంది
ఈ ప్రపంచంలో ఇలాంటి అందగత్తె మరొకరు లేరు
ఈమెను చిత్రించిన తర్వాత దేవుడనే చిత్రకారుడు
తన కుంచెను శాశ్వతంగా విరిచేశాడు

నా ప్రేయసి ఎంతో అందమైనది
దేవుడు అలాంటి అందాన్ని
ఎప్పుడో ఒకసారి మాత్రమె సృష్టిస్తాడు....