“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, మార్చి 2011, బుధవారం

హోమియో అద్భుతాలు-థైరాయిడ్ మందు దుష్ప్రభావం

మధ్యన ఇరవై తొమ్మిదేళ్ళ ఒక వివాహిత నా వద్దకు ట్రీట్మెంట్ కోసం వచ్చింది. ఆమె పేరు ఇతర వివరాలు చెప్పను. గత నాలుగేళ్ల నుంచి మందులు వాడి, డాక్టర్ల చుట్టూతా తిరిగీ, విసుగెత్తి చివరకు నా వద్దకు వచ్చింది. అమ్మాయిపెళ్ళికాక ముందు నా పేషంటే. మధ్యలో మానేసి రకరకాల మందులు వాడింది. ఇప్పుడు పరిస్తితి ఘోరంగాతయారౌతున్నది కనుక మళ్ళీ హోమియోపతి గుర్తొచ్చింది.

వాళ్ళ ఫామిలీ హిస్టరీ నాకు తెలుసు. ఇంతకు ముందు ట్రీట్మెంట్ ఇచ్చినపుడు వాళ్ళ పెద్దలనుంచి ఏమేమి రోగాలుసంక్రమించాయో నాకు తెలుసు కాబట్టి ట్రీట్మెంట్ తేలిక అయింది.

తనకు నాలుగేళ్ల క్రితం బాబు పుట్టినపుడు థైరాయిడ్ ప్రాబ్లెం ఉన్నట్లు గుర్తించారు. హైపో థైరాయిడిజం అని బాబుతోపాటే దానికి కూడా నామకరణం చేసారు. అప్పటి నుంచి ముగ్గురు ఎం. డీ. దగ్గర రకరకాల ట్రీట్ మెంట్లు జరిగాయి. మొత్తం మీద థైరాయిడ్ మాత్రలు ( ఆమె భాషలో) వేసుకుంటే రోజుకు బాగుంటుంది. లేకపోతె గొంతు నెప్పి, గొంతుబొంగురు పోవటం, అతి నీరసం, ఇంకా రకరకాల బాధలు వస్తాయి. కనుక మాత్రలు జీవితాంతం వాడాలి అని డాక్టర్లుచెప్పారు. అమ్మాయి వాడుతున్నది. అంతా బాగానే ఉంది.

గత కొద్ది నెలలుగా ఈమెకు కొత్త కొత్త బాధలు రావటం మొదలైంది. ఉన్నట్టుండి కళ్ళముందు అంతా గిర్రున తిరిగిపోతున్నట్లు గా ఉంటుంది. పడుకుంటే రూము మొత్తం గిర్రున తిరిగిపోతూ ఉంటుంది. ఒక పక్కనుంచి ఇంకొక పక్కకుతిరిగితే మళ్ళీ గిర్రున తల తిరుగుతుంది. కదులుతున్న వాహనాలను చూచినా, లేక ప్రయాణం చేసినా కళ్ళు తిరిగిరోడ్డుమీదే పడిపోతానేమో అనిపిస్తుంది. నడుస్తుంటే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి తడబడి గోడకు కొట్టుకోవడంజరుగుతోంది. మంచి పేరున్న ఎం. డీ. లు అందరూ చూచి రకరకాల టెస్టులు చేయించి అన్ని రీడింగ్సూ నార్మల్ గాఉన్నాయి. మాకు అర్ధం కావడం లేదు. అని చెప్పీ చెప్పకుండా విటమిన్లూ ఇతర అనవసర మాత్రలూ వాడించిఊరుకున్నారు. బాధ మాత్రం తగ్గలేదు.

అల్లోపతీ వైద్యంలో ఉన్న చిక్కే ఇది. అప్పటి కప్పుడు బాధలు తగ్గుతాయి. ఇది అణచివేత వల్ల జరుగుతుంది. కాని అణచబడిన రోగం లోపల ఇతర అవయవాలకు సైలెంట్ గా వ్యాపిస్తుంది. అందుకే కొన్నేళ్ళ పాటు అల్లోపతీ మందులు వాడితే అప్పుడు కొత్తకొత్త బాధలు ఇంకా లోతైనవి రావటం చూడవచ్చు. విషయం డా|| హన్నేమాన్ రెండు వందలసంవత్సరాల నాడే చెప్పాడు. ఏం చేస్తాం? మన ఖర్మ బాగాలేనప్పుడు మంచి చెప్పినా ఎక్కదుగా మరి. ఎక్కడ ఎంతవదలాలో అంత వదిలితే గాని తత్త్వం బోధపడదాయె.

డాక్టర్లు చేయించిన టెస్టులు అన్నీ చూచాను. ప్రస్తుతం అన్ని రీడింగ్సూ నార్మల్ గా ఉన్నాయి. కాని కొత్త రోగంమొదలైంది. అప్పటి వరకూ వైద్యం చేసిన డాక్టర్లు చేతులెత్తేశారు.

ముందుగా థైరాయిడ్ టాబ్లెట్ ను వెంటనే మానివేయ్యమని చెప్పాను. అమ్మాయి భయపడింది. దానిని మానుకుంటే ఏమౌతుందో అని. ఏమీ కాదు. నీవు హోమియో వాడుతున్నంత వరకూ ఏమీ పరవాలేదు. అని ధైర్యం చెప్పి మళ్ళీ లక్షణాలు ఒకసారి సరిచూచాను. పడుకుంటే రూం మొత్తం గిర్రున తిరిగిపోతున్నట్లు ఉండటం, ఒకవైపు నుంచి మరొక వైపుకు తిరిగితే బాగా ఎక్కువ కావడం, రెండు లక్షణాలను చూచాను.

ఈ లక్షణాలకు బ్రయోనియా, సైక్లామేన్, కోనయం, పల్సాటిల్లా అనే మందులు సరిపోయాయి. మంచం మీద పడుకుంటే తల గిర్రున తిరిగే లక్షణానికి బెల్లడోన్నా, కోనయం, లాక్ డిఫ్లోరేటం సరిపోతున్నాయి. వీటన్నిటిలో మళ్ళీ ఔషధ లక్షణాలనూ, రోగి లక్షణాలనూ, రోగ లక్షణాలనూ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి చూడగా "కోనయం మాక్యులేటం " అన్న మందు సరిపోయింది. కానీ ఇది కాన్సర్ కు వాడే మందు. ఇది ఇండికేట్ అవుతున్నది ఏమిటి అన్న అనుమానం వచ్చింది. ఇదే సోక్రటీస్ కు ఇవ్వబడి ఆయన ప్రాణం తీసిన "పాయిజన్ హెమ్లాక్" అనే విషం . మొక్క నుంచి తీసినదే అయినా ఇది విషపూరితమైనది. .కాని దీనిని పోటేన్సీ లోకి మారిస్తే అమృతం అవుతుంది. అదే హోమియో ఔషదాలలోని అద్భుతం. పాము విషాలు కూడా ఇక్కడ అమృత గుళికలుగా మారతాయి.

ఎక్యూట్ మందులు ఈమెకు ఎలాగూ పనిచెయ్యవు. ఎందుకంటే ఈమెది క్రానిక్ డిసీజ్ మాత్రమె కాక అల్లోపతిలో ముదరబెట్టిన రోగం. అనుమాన నివృత్తి కోసం " మీకుఎక్కడైనా గట్టిగా ఉండే కణుతుల వంటివి ఎప్పుడైనా వచ్చాయా" అని అడిగాను. లేవు అని చెప్పింది. ఉన్నట్టుండి గుర్తొచ్చినట్టు " కుడి పాదం లో గట్టి "ఆనె" ఒకటి మధ్యనే వస్తున్నది. అని చూపించింది. ఆ "ఆనె" కొంచం పెద్దదిగా ఉండి మధ్యలో హోల్ పడి ఉంది. నడుస్తుంటే నేల తగిలిన చోట నొప్పిగా ఉంటుంది. ఇప్పుడు అనుమాన నివృత్తి అయిపొయింది. కొన్నేళ్ళు గనుక అమ్మాయి ఇదే థైరాయిడ్ మందును గనుక ఇలాగే వాడితే తనకు కాన్సర్ రావటం ఖాయం అని తేలిపోయింది.


ఇవేమీ తనకు చెప్పకుండా--"కోనయం" మందును రెండువందల పోటేన్సీలో ఒక్క డోస్ ఇచ్చి పంపాను. మర్నాడు అమ్మాయి ఆనందం సంభ్రమం కలగలిసిన స్వరంతో ఫోన్ చేసింది." సార్. మీరు మందిచ్చి ఇరవై నాలుగు గంటలుగడిచాయి. ఇప్పటి వరకు ఒక్క సారికూడా తూలుడు రాలేదు. రాత్రి హాయిగా నిద్ర పోయాను. పడుకుంటే కళ్ళు తిరగలేదు. అన్నిబాధలూ శాంతించాయి." అని ఇంకా ఏమేమో పొగుడుతోంది. నేను చెప్పిన జాగ్రత్తలు మరచిపోకుండా పాటించమని చెప్పి ఫోన్ కట్ చేసాను.

ప్రస్తుతం వారం రోజులు గడిచాయి. ఇంత వరకూ మళ్ళీ ఒక్కసారి కూడా ఆమెకు కళ్ళు తిరగలేదు.

"కాని ట్రీట్మెంట్ అయిపోయిందని అనుకోవద్దు. క్రానిక్ డిసీజ్ అంత త్వరగా తగ్గదు. కొన్ని నెలలు మందు వాడవలసివస్తుంది" అని చెప్పాను. ప్రస్తుతం థైరాయిడ్ టాబ్లెట్స్ వాడటం లేదు. ఇతర సమస్యలు బాగా తగ్గుముఖం పట్టాయి. విచిత్రం ఏంటంటే కాలిలో "ఆనె" కూడా కరిగిపోతున్నది.

హోమియోపతి ట్రీట్మెంట్ ఈ విధంగా ఉంటుంది.