“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, మార్చి 2011, శనివారం

సూపర్ మూన్

మొన్న చైనాలో, నిన్న జపాన్ లో, తరువాత కొద్ది గంటల్లో ఇండోనేషియాలో జరిగిన విలయం సూపర్ మూన్ ఎఫెక్ట్ వల్లనే అని జ్యోతిష్య గ్రూపుల్లో నమ్ముతున్నారు. అలా నమ్మడానికి వెనుక బలమైన కారణాలున్నాయి. మార్చి లో భూ, జల ప్రళయాలు రాబోతున్నాయనీ, అవి ఫలానా ప్రదేశాలలో వస్తాయనీ ముందే ఒక అమెరికన్ జ్యోతిష్కుడు చెప్పాడు. వాటిలో ఫసిఫిక్ కోస్టూ, జపానూ కూడా ఉన్నాయి. దానిని అందరూ కొట్టి పారేశారు. శాస్త్రజ్ఞులు అయితే అస్సలు నమ్మలేదు. కాని జరిగిందేమిటి? అతను చెప్పింది చాలావరకూ సరిగ్గానే జరిగింది. అతని పేరు రిచర్డ్ నాల్. "సూపర్ మూన్" అన్న పదాన్ని కాయిన్ చేసింది ఇతనే అంటారు. అతని వెబ్ సైట్ ఇక్కడచూడండి.

http://www.astropro.com


అసలు సూపర్ మూన్ అంటే ఏమిటో చూద్దాం. భూమిచుట్టూ చంద్రుడు తిరిగే కక్ష్య దీర్ఘవృత్తాకారంగా ఉండటం వల్ల నెలలో రెండుసార్లు చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. కాలగమనంలో అలా చాలాసార్లు రావటం జరుగుతుంది. వాటి సరాసరి దూరం కంటే (3,85,000 Km) బాగా ఎక్కువగా చంద్రుడు భూమికి సమీపంగా వచ్చినపుడు అదే సమయంలో అమావాస్య గాని పౌర్ణమి గాని అయితే, అది సూపర్ మూన్ అవుతుంది. అలాటి సందర్భాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. సమయంలో భూమ్మీద విలయాలు జరగటం మామూలే. కారణం-- చంద్రునికి సముద్రజలాలలో ఆటుపోట్లు కలిగించే శక్తి ఉన్నదని అందరికీ తెలుసు. పౌర్ణమి అమావాస్య ప్రభావాలు+ చంద్రుడు భూమికి దగ్గరగా రావడం= వీటి క్యుములేటివ్ ప్రభావం వల్ల అతి తీవ్రమైనశక్తి భూమ్మీద పడుతుంది. కనుక విలయాలు జరుగుతాయి.

ఇలా సూపర్ మూన్ వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక విలయం జరిగింది. ఇంకా ముందు కూడా జరిగాయి. చరిత్ర పరిశీలిస్తే మనకు కనిపిస్తుంది. రిచర్డ్ నాల్ తన యాస్ట్రో మేపింగ్ విధానంతో ప్రదేశంలో విలయాలు రావచ్చో కూడా వ్రాసాడు. దాదాపుగా అదే ఫసిఫిక్ కోస్ట్ ప్రదేశంలో ఇప్పుడు జల, భూ ప్రళయాలు జరిగాయి. ఇప్పటి వరకూ కొట్టి పారేసిన శాస్త్రజ్ఞులు ఇప్పుడేమంటారో? ప్రజల సొమ్ముతో కోట్లాది డాలర్లు పెట్టి జరుపుతున్న సైంటిఫిక్ రీసెర్చి ఇప్పుడేమంటుంది? ఇవేమీ లేకుండా జ్యోతిష్య విజ్ఞానం సాయంతో ఒక సామాన్య వ్యక్తి ఈ విలయాన్ని ముందే ఎలా ఊహించగలిగాడు? అతనికి ఆధారమైన జ్యోతిష్య శాస్త్రం మరి నిజమా కాదా?

రిచర్డ్ నాల్ వ్రాసిన మార్చి-2011 ఫోర్ కాస్ట్ ఇక్కడ చూడండి.

http://www.astropro.com/homeNS45.html

అతను చెప్పిన జోస్యం నుంచి కొన్ని మాటలు చూద్దామా?

The March 19 SuperMoon is by far the most significant storm and seismic indicator this month, but it’s not the only one. Lesser geocosmic shock windows also up the ante for unusually strong storms and moderate to severe seismic activity (including magnitude 5+ earthquakes, subsequent tsunami, and volcanic eruptions). These lesser windows include March 1-7 (surrounding the new moon on the 4th), March 23-26 (bracketing the lunar south declination peak on the 25th), and from late on the 31st on into early April.


రిచ్టర్ స్కేల్ మీద 5+ స్థాయిలో భూకంపాలు వస్తాయని రిచర్డ్ నాల్ వ్రాశాడు. అలాగే జపాన్ లో వచ్చిన భూకంపం 8+ స్థాయిలో వచ్చింది. మార్చి మొదటి వారం లో ఇవి జరగవచ్చు అని అతను చెప్పాడు. ఒక నాలుగు రోజుల తేడాతో ఇవి జరిగాయి. ఏ పరికరమూ లేకుండానే, రాబోయే భూకంప సమయాన్నీ, ప్రదేశాన్నీ, స్థాయిని కూడా చాలావరకూ అతను అంచనా వెయ్యగలిగాడు. అంతేగాక భూకంపం తర్వాత, సునామీ, అగ్నిపర్వత ప్రేలుడూ రావచ్చని చెప్పాడు. అలాగే జరిగింది. ఇది రికార్డ్ కాబడిన నిజం. జ్యోతిష్య శాస్త్రం బూటకం అని పందాలు కాసిన వారందరికీ చిత్త శుద్ధి ఉంటే వారు పందెం కాసినమొత్తాన్ని రిచర్డ్ నాల్ కు పంపించే ధైర్యం ఉందా? లేక తోక ముడుస్తారా? జ్యోతిష్యశాస్త్ర విమర్శకులకు ఎవరికీ ధైర్యమూ చిత్తశుద్దీ లేదని నాకు బాగా తెలుసు. వారు అనబోయేది కూడా ఏమిటో నేను చెప్పగలను. జపాన్ లో పలానా వీధిలో, పలానా ఇంటి నంబర్ ఉన్న ఇంట్లో ఉన్న వ్యక్తి, పలానా సమయానికి నీళ్ళలో కొట్టుకుపోతాడని రిచర్డ్ నాల్ చెప్పలేదుగా అని వెకిలిగా మాట్లాడతారు. కానీ, ఎటువంటి సైన్సుపరికరాలు లేకుండానే, ప్రభుత్వసహాయమూ లేకుండానే, ప్రజాధనం వృధా చెయ్యకుండానే, జరగబోతున్న విలయాన్ని జ్యోతిశ్శాస్త్ర సహాయంతో ఇంత దగ్గరగా, ఇంత స్పష్టంగా ఎలా ఊహించగలిగాడు? ఈ మాత్రం యాక్యురసీ అయినా అసలు ఎలా వచ్చింది? అన్న విషయానికి మాత్రం విలువివ్వరు. ఆలోచించరు.


యింత జరిగినాకూడా, జ్యోతిష్యం అసలు శాస్త్రంకాదు-- అంతా బూటకమే-- అని జ్యోతిష్యశాస్త్రం పుట్టిన గడ్డమీదనే వాదించుకుంటూ మనం కాలం గడుపుదాం. లోపు కాలం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది ఎవరి కోసమూ ఆగదుగా మరి.

ఇంకా వింతేమిటంటే, బిర్లా సైన్స్ సెంటర్ వారు కూడా-- చంద్రుడు భూమికి దగ్గరగా రావటం వల్ల ఏమీ జరగదు. చంద్రుడు మరీదగ్గరగా ఏమీ రావటం లేదు. మహా అయితే మామూలుకంటే ఒకటి లేదా రెండు కిలోమీటర్లు దగ్గరకు వస్తాడేమో దానికే ఇంత జరుగుతుందా? అని చిన్నపిల్లల్లా నటిస్తూ మాట్లాడటమే విడ్డూరం. మరి ఎందుకిలా జరుగుతుందో మాత్రం శాస్త్రజ్ఞులు చెప్పరు. వారికి అర్ధమైనా కాకపోయినా, "జ్యోతిష్యం" అన్న పదం కనిపిస్తే చాలు వారికి "అబద్దం" అన్న పదం వెంటనే తడుతుంది. అలా తట్టడానికైనా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయో లేవో మరి. కళ్ళెదురుగా కనిపిస్తున్న దానిని కూడా ఒప్పుకోలేక పోవడానికి కారణాలేమిటో, పంధాను "సైంటిఫిక్ స్పిరిట్" అని ఎలా అంటారో తేల్చడానికి ఒక ఏభై కోట్ల రూపాయలతో కమిటీ వేస్తె పోతుంది. ప్రజా ధనం సద్వినియోగం అవుతుంది.

ఇక జియాలజీ శాఖవారు ఏమంటారో చూద్దాం. "ప్లేట్ టేక్టానిక్స్" అన్నదానివల్ల ఇలా అప్పుడప్పుడు భూకంపాలు వస్తాయని వారు వాక్రుచ్చారు. పదం ఏమిటో బ్రహ్మపదార్ధంలా ఉందే అని బిత్తరపోవాల్సిన పని లేదు. భూమిలో ఉన్న ప్లేట్లు తీరూతెన్నూ లేకుండా కదలటం వల్లనే అలా జరుగుతుందని దాని సారాంశం. మరి ప్లేట్లకు బుద్ధీ జ్ఞానం ఉండద్దూ . శాస్త్ర " అజ్ఞుల" అనుమతి తీసుకుని కదలాలని వాటికి తోచలేదు. ఏం చేస్తాం? అసలవి ఎందుకు కదులుతున్నాయో మాత్రం వీరు చెప్పరు. దానికి చాలా కారణాలుంటాయి, చెప్పినా మీకర్ధం కావు. అంటారు.( అసలు సంగతేమంటే వారికే ఆ సబ్జెక్టు పూర్తిగా అర్ధం కాలేదు). జనం ఆ మాటల్ని గుడ్డిగా నమ్మి "భలే భలే" అని అరుస్తూ జలప్రవాహంలో కొట్టుకుపోతూ జేబురుమాళ్ళు ఊపుతుంటారు. అసలైన సైంటిఫిక్ స్పిరిట్ అదేగా మరి.

గురుత్వాకర్షణ వల్ల సముద్రాలూ అల్లకల్లోలం అవుతాయి, ప్లేట్లూ కదులుతాయి. అసలు కారణం చెబుతున్నవారినేమో "మూఢనమ్మకం" అనే పేరుతొ నమ్మరు. పోనీ వారు చెప్తారా అంటే అదీ చెప్పలేరు. ఒకవైపు సూర్యుని గురుత్వాకర్షణ, ఇంకో వైపు బలమైన చంద్రుని ఆకర్షణ, సూర్య చంద్రులకు భూమి దగ్గరగా వస్తుండటం, పౌర్ణమి ప్రభావం -- వీటివల్ల ఏమీ జరగదు, అంతా ఉత్తదే, తూచ్ అని మనల్ని నమ్మమని ఘనత వహించిన శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. విని ఆనందించండి.