“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

22, మార్చి 2011, మంగళవారం

ఫిలిప్పైన్స్ లో భూకంపనలు

మొన్న ఆదివారం నాడు ఫిలిప్పైన్స్ లో 6+ స్థాయిలోనూ, తైవాన్ లో 5+ స్థాయిలోనూ, అండమాన్లో స్వల్పంగానూ భూకంపాలు వచ్చాయి. శనివారం సూపర్మూన్ వచ్చింది. ఆదివారం నాడే భూకంపాలు జరిగాయి. అదే రోజున ఎన్నోచోట్ల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరిగాయి. రహదారులు రక్తసిక్తం అయ్యాయి.

సూపర్మూన్ కు రెండురోజుల ముందు నుంచీ అనేకుల జీవితాల్లో చికాకులు, గొడవలు, పని వత్తిడీ అధికం అయ్యాయి. వ్యక్తిగతి స్థాయిలోనే గాక దేశాధినేతల స్థాయిలో కూడా భావోద్వేగాలు పెచ్చరిల్లి, కుతంత్రాలు మితిమీరి, లిబియా పైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కూటమి దాడులు జరుగుతున్నాయి. జపాన్ కోలుకోవటానికి కనీసం అయిదేళ్ళు పడుతుందని అంటున్నారు. జపాన్ లిబియాల సంక్షోభం స్టాక్ మార్కెట్ల మీద పడే అవకాశం గట్టిగానే ఉంది. ప్రభావం రాబోయే కొద్ది రోజులలో కనిపించవచ్చు.

మొత్తం మీద సూపర్ మూన్ ప్రపంచానికి మరిచిపోలేని చెడు గుర్తుల్ని మిగిల్చింది అని చెప్పవచ్చు. కొసమెరుపు ఏమంటే టాంక్ బండ్ విగ్రహాల విధ్వంసం కూడా సూపర్ మూన్ పరిధిలోనే జరిగింది.