Spiritual ignorance is harder to break than ordinary ignorance

5, మార్చి 2023, ఆదివారం

దుర్లభ స్వప్నం





తమిళదేశంలో ఫ్రెంచిలోకంలో 

సాగుతున్న  బెంగాలీల అభిజాత్యం 

అరవదేశంలో ఆవిరై పోయిన

అరవిందుల అతిమానస యోగం


పూర్ణయోగంలో మిగిలిన పూర్ణం

ఉట్టి పైకెక్కిన ఉన్నతాదర్శం 

చెట్టుపేరుతో కాయల అమ్మకం 

నీరైపోయిన నిలువెత్తు స్వప్నం 


సురగంగను భూమికి దించే 

సుదీర్ఘ యత్నం 

సుతరామూ మారలేని 

మనిషి మనస్తత్వం


అనంత గగనానికి చేరాలని 

అంతులేని ఆశలు 

అరడుగు కూడా ఎగరలేని 

అహంకారపు పక్షులు