“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, జనవరి 2023, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 82 (డెట్రాయిట్ డౌన్ టౌన్ ఫోటోలు)

మేముంటున్న చోటనుండి డెట్రాయిట్ డౌన్ టౌన్ కేవలం ఇరవై నిముషాల ప్రయాణ దూరంలో ఉంటుంది. ఇవాళ మధ్యాన్నం అక్కడికెళ్లి డెట్రాయిట్ నదిని, నది ఆవలిగట్టున ఉన్న కెనడాలోని విండ్సర్ సిటీని చూచి వచ్చాము.

సాయంత్రం నాలుగప్పుడు కూడా నది ఒడ్డున చలి మూమూలుగా లేదు. ఫోటో తీద్దామని గ్లోవ్స్ లోంచి చేతులు బయటకు తీస్తే, పదే పదినిముషాలలో మొద్దుబారి కొంకర్లు పోయాయి. అంత చలిగా ఉంది. ఇక రాత్రయితే అక్కడెవరూ ఉండరని చెప్పారు. నాలుగుకే షాపులన్నీ మూసేస్తున్నారు.

ఇక్కడనుంచి నదిమీదుగా కెనడాకు ఒక బ్రిడ్జి ఉంది. దానిమీదుగా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. పదిహేను నిముషాలలో కెనడాకు చేరుకోవచ్చు. నదిక్రిందుగా టన్నెల్ కూడా ఉంది. దానిలో నుంచి కార్లు, గూడ్స్ ట్రెయిన్ కూడా కెనడాకు పోతున్నాయి.

నది ఒడ్డున జెనరల్ మోటార్స్ కంపెనీ వారిది పెద్ద బిల్డింగ్ ఉంది. దానిపేరు రినైజాన్స్ బిల్డింగ్. దాని దగ్గర తీసుకున్న ఫోటోలను, డెట్రాయిట్ రివర్ ఫోటోలను, దూరంగా కనిపిస్తున్న కెనడాను (విండ్సర్ సిటీ) ఇక్కడ చూడండి.







డెట్రాయిట్ రివర్ ఒడ్డున



డెట్రాయిట్ రివర్ ఒడ్డున - ఆవలి ఒడ్డున కెనడా


డెట్రాయిట్ రివర్ ఒడ్డున



రినైజాన్స్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లోని రెస్టారెంట్ లో


డెట్రాయిట్ రివర్ ఒడ్డునున్న జనరల్ మోటార్స్ రినైజాన్స్ బిల్డింగ్ 




డెట్రాయిట్ నుండి కెనడాకు పోయే టన్నెల్ ఇదే