“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

22, డిసెంబర్ 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 70 (హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో పంచవటి స్టాల్ ప్రారంభం)


నేటినుండి జనవరి 1 వరకూ హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. దానిలో 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ప్రత్యేకస్టాల్ ను ఈ ఏడాదినుంచి మొదలుపెడుతున్నాం.

స్టాల్ నంబర్ 62 మాకు కేటాయించబడింది.

కోవిడ్ రాకముందు జరిగిన బుక్ ఎగ్జిబిషన్లలో వేరే వాళ్ళ స్టాల్స్ లో పంచవటి పుస్తకాలను పెట్టడం జరిగేది. ఈ ఏడాదినుంచి మాదంటూ ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేస్తున్నాం.

జనవరి 2023 లో విజయవాడలో జరిగే బుక్ ఎగ్జిబిషన్ లో కూడా మా ప్రత్యేక స్టాల్ ను నడపడం జరుగుతుంది.

ఇంతకుముందు మా పుస్తకాలు కావలసినవారు నాకు మెయిల్స్ ఇచ్చేవారు, 'మీ బుక్స్ ఏ స్టాల్లో దొరుకుతాయి?' అని. ఇప్పుడా బాధ లేదు. సరాసరి మా స్టాల్ కు వెళ్లి మా పుస్తకాలను చూడవచ్చు. 

అంతేకాదు, అక్కడున్న మా వాళ్ళతో మాట్లాడి, మా సంస్ధగురించి, మా ఆశ్రమం గురించి, మా సాధనామార్గం గురించి, సనాతనధర్మం గురించి, మీ సందేహాలను తీర్చుకోవచ్చు. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ, మావాళ్లు అక్కడున్నారు. వాళ్ళు కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు.

హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ ప్రారంభ సందర్భంగా, నిరాడంబరంగా  మొదలుపెట్టబడిన మా స్టాల్ ఫోటోలను ఇక్కడ చూడండి.