మనకు సైన్సు పెరిగింది, తెలివి పెరిగింది అని విర్రవీగుతున్నాం. కానీ ఏం తినాలో తెలీదు. ఎలా తినాలో తెలీదు. ఎలా బ్రతకాలో తెలీదు. ఏం చెయ్యాలో తెలీదు. ఏం చెయ్యకూడదో తెలీదు. ప్రతిదీ, టీవీలో ఎవడో ఒకడు మనకు చెప్పాలి. కొన్నాళ్ళపాటు అదే వేదం. ఆ తర్వాత ఇంకొకడోస్తాడు. అప్పుడు పాతవాడు చెప్పినది నచ్చదు. ఈ క్రమంలో జనాలు మతులు పోయి, ఎవడేది చెబితే అది తినడం. ఎవడేది చెబితే అది త్రాగడం, ఎవడేది...
25, ఫిబ్రవరి 2019, సోమవారం
23, ఫిబ్రవరి 2019, శనివారం
'Warrior' - Martial Arts Short Film
నేను Fight Choreography చెయ్యగా నా శిష్యుడు లెనిన్ హీరోగా నటిస్తూ నిర్మించిన Warrior short film ను ఇక్కడ చూడండి.
ఎప్పుడో మాటల సందర్భంలో ఈ స్టోరీ లైన్ ను లెనిన్ తో అన్నాను. దాన్ని పట్టుకుని, ఒక కధను అల్లి, బెంగుళూర్ నుంచి కెమెరా మెన్ ను, కెమెరాలను తీసుకొచ్చి, సినిమా తీసి, ఆ తర్వాత బెంగుళూర్ లో ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ చేసి, కష్టపడి ఈ సినిమాను తయారు చేశాడు లెనిన్. ఇంత శ్రమపడినందుకు అతన్ని అభినందిస్తున్నాను.
https://www.youtube.com/watch?v=-8Au6upAjGc
ఈ...
లేబుళ్లు:
వీర విద్యలు
21, ఫిబ్రవరి 2019, గురువారం
యురేనస్ గోచార ప్రభావం - మార్చ్ 2019
యురేనస్ అనే గ్రహం 1781 లో సర్ విలియం హెర్షెల్ అనే శాస్త్రజ్ఞుడి చేత కనుక్కోబడింది. అతని పేరుమీద చాలారోజులు దీనిని 'హెర్షెల్' అనే పిలిచేవారు. తరువాత గ్రీక్ పురాణాలలో ఆకాశానికి అధిపతి అయిన 'యురేనస్' పేరు పెట్టారు.
యురేనస్ అనే గ్రహం మనకు మహాభారతకాలానికే తెలుసని వాదనలున్నాయి. వాటికి రుజువులుగా, మహాభారతంలోని యుద్ధపర్వాల నుంచి కొన్ని శ్లోకాలను ఉదాహరిస్తూ ఉంటారు. వాటిల్లో శ్వేత, ధూమ, ఉపకేతు మొదలైన పేర్లతో యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో...
లేబుళ్లు:
జ్యోతిషం
17, ఫిబ్రవరి 2019, ఆదివారం
అబ్బాయి తిరిగి వస్తాడా? - ప్రశ్నశాస్త్రం

ఈరోజు మధ్యాన్నం 12-22 కి ఒకరు ఈ ప్రశ్నను అడిగారు.
'మాకు తెలిసినవాళ్ళ అబ్బాయి వేరే ఇంటికి తీసుకెళ్లబడ్డాడు. అతను తిరిగి వస్తాడా?'
ప్రశ్నచక్రాన్ని గమనించగా - లగ్నాధిపతి శుక్రుడు బాధకుడైన శనితో కలసి అష్టమంలో ఉన్నాడు. కనుక 'ఇప్పట్లో రాడు' అని చెప్పడం జరిగింది. హోరాదిపతి గురువై ఉన్నాడు. అతనే అష్టమాధిపతిగా సప్తమంలో రహస్యస్థానమైన వృశ్చికంలో ఉంటూ లగ్నాన్ని చూస్తున్నాడు. కనుక ఈమె భర్త హస్తం కూడా...
లేబుళ్లు:
జ్యోతిషం
16, ఫిబ్రవరి 2019, శనివారం
పుల్వామా టెర్రర్ ఎటాక్ - రాహుకేతువుల ప్రభావం
నేను టీవీ చూచి, న్యూస్ పేపర్ చూచి ఎన్నో నెలలైపోయింది. ఏడాది కూడా దాటి ఉండవచ్చు. అన్నీ అబద్దాలు చెప్పే చెత్త మీడియా మాయాజాలానికి మనం ఎందుకు దాసోహం అనాలనిపించి, మీడియా అంటే అసహ్యం పుట్టి, ఆ రెండూ చూడటం పూర్తిగా మానేశాను. ఈరోజు ఉదయం ఆఫీస్ లో మా కొలీగ్స్ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది.
రెండు రోజుల క్రితం జమ్మూ లోని పుల్వామాలో ఇస్లాం రాక్షసుల ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధను కలిగించే సంఘటన....
లేబుళ్లు:
జ్యోతిషం
14, ఫిబ్రవరి 2019, గురువారం
రాహుకేతువుల రాశి మార్పు - 2019 - ఫలితాలు
మార్చి 7 వ తేదీన రాహుకేతువులు రాశులు మారుతున్నారు. ఇప్పటివరకూ కర్కాటకం - మకరంలో ఉన్న వీరు మిథునం - ధనుస్సులలోకి మారుతూ 18 ఏళ్ళ తర్వాత ఉచ్చస్థితిలోకి వస్తున్నారు. ఈ స్థితిలో వీరు ఏడాదిన్నర పాటు ఉంటారు.
రాశుల మధ్య ఉన్న Twilight zone ప్రభావం వల్ల గతవారం నుంచే వీరి ప్రభావం అనేకమంది జీవితాలలో, అనేక రంగాలలో కనిపించడం మొదలైపోయింది. జాగ్రత్తగా గమనించుకుంటే ఆయా మార్పులను మీమీ జీవితాలలో మీరే చూచుకోవచ్చు. ద్వాదశ రాశుల వారికి ఈ మార్పు...
లేబుళ్లు:
జ్యోతిషం
4, ఫిబ్రవరి 2019, సోమవారం
పర్సు పోయింది . దొరుకుతుందా లేదా?

ఈరోజు మధ్యాన్నం ఒకాయన ఫోన్లో ఈ ప్రశ్నను అడిగాడు.
'నిన్న నా పర్సు పోయింది. అందులో విలువైన కార్డులున్నాయి. దొరుకుతుందా లేదా? అన్నిచోట్లా వెదికాము. దొరకలేదు. ఎక్కడ పోయి ఉంటుంది?'
ఈ రోజు అమావాస్య. అమావాస్య నీడలో మరుపు రావడం, ఉద్రేకాలు పెచ్చరిల్లడం, ఆ గొడవలో పడి ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం మామూలే అనుకుంటూ ప్రశ్నచక్రం వేసి చూచాను.
ఆ సమయానికి వేసిన ప్రశ్నచక్రం ఇలా ఉంది.
లగ్నాధిపతి శుక్రుడు...
లేబుళ్లు:
జ్యోతిషం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)