అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

31, డిసెంబర్ 2015, గురువారం

నడక

మార్గమేమో సరళం మనసేమో సంక్లిష్టం ఎలా సాధ్యమౌతుంది? నడక ఆకలేమో అల్పం ఆశేమో అనంతం ఎలా కుదురుతుంది? పడక ప్రస్తుతం వెలితి ప్రయాణం భీతి ఎప్పటికి దక్కేను? ప్రమోదం వీడని అహం వదలని ఇహం ఎందుకాగుతుంది? వినోదం చుక్కలపై దృష్టి లోలోపల నిత్యసృష్టి ఎలా అందుతుంది? ఆకాశం ఫలసాయం ఆమోదం వ్యవసాయం అతిహేయం ఎలా తీరుతుంది? ఆక్రోశం త్రికరణం వెక్కిరిస్తుంది ప్రతి ఋణం తీరనంటుంది ఎలా దక్కుతుంది? ముక్తి అనుభవం ఆగనంటుంది అనుదినం...
read more " నడక "

30, డిసెంబర్ 2015, బుధవారం

ఓ మహర్షీ ఓ మహాత్మా...

గుండె గుహలో నిత్యమెపుడు నేను నేనను స్పందనముతో వెలుగు కేవలమేది కలదో అదియె నేనను నిజము నెరుగ చిన్తనమునో మగ్నతమునో శ్వాస నియమపు ఊత వలనో అడుగు జేరుచు అణగిపోవుచు అన్ని లోకము లాక్రమించుచు ఆత్మ తానై నిలిచి జూడగ ఆట ముగియును అంతు దెలియును సాధనంబుల సారమిదియే అంటూ సాధనా సారాన్ని మొత్తం ఒకే ఒక్క శ్లోకంలో ఇమిడ్చి చెప్పిన మహనీయుడు రమణమహర్షి పుట్టినరోజు మొన్న 26-12-2015 మార్గశిర బహుళ ద్వితీయ. తేదీల...
read more " ఓ మహర్షీ ఓ మహాత్మా... "

29, డిసెంబర్ 2015, మంగళవారం

2nd Martial arts class Videos

27-12-2015 న గుంటూరులో జరిగిన రెండవ మార్షల్ ఆర్ట్స్ క్లాస్ నుంచి కొన్ని ఎంపిక చెయ్యబడిన వీడియో క్లిప్స్ ను ఇక్కడ చూడండి. https://youtu.be/ISQUVPRFA...
read more " 2nd Martial arts class Videos "

2015 లో పంచవటిలో ఏం జరిగింది?

2015 అయిపోవస్తున్నది. ఈ సంవత్సరంలో 'పంచవటి' లో చాలా మార్పులు చేర్పులు జరిగాయి.అనేక రకాలైన కార్యక్రమాలు ఊపందుకున్నాయి.నా దారిలో నడవడానికి ఇష్టపడే అనేక కొత్త మెంబర్లు 'పంచవటి' లో చేరారు. కొందరేమో రకరకాల కారణాలవల్ల ఇక్కడ ఇమడలేక నిష్క్రమించారు.మరికొందరు ఇందులో మెంబర్స్ అయినప్పటికీ,రకరకాల మానసిక ఆలోచనలలో భయాలలో చిక్కుకుని,ఈయన్నసలు అనుసరించాలా వద్దా, అని తేల్చుకోలేక సైలెంట్ గా ఉంటున్నారు.వారికి కాలం వేగంగా వృధా అవుతున్నది....
read more " 2015 లో పంచవటిలో ఏం జరిగింది? "

28, డిసెంబర్ 2015, సోమవారం

2nd Martial Arts Class Photos

ముందే ప్లాన్ చేసినట్లు, రెండవ తంత్ర - మార్షల్ ఆర్ట్స్ క్లాస్ 27-12-2015 న జయప్రదంగా జరిగింది.నాతో గత నాలుగైదు ఏళ్ళుగా సన్నిహితంగా ఉంటున్న నా శిష్యులను మాత్రమే ఈ క్లాస్ కు ఎంపిక చెయ్యడం జరిగింది. ఈ క్లాస్ లో "ఐకిడో" విద్యను పరిచయం చేస్తూ దానినుండి కొన్ని టెక్నిక్స్ ను వీరికి నేర్పడం జరిగింది. అన్ని వీరవిద్యలలోకీ "ఐకిడో" అనేది చాలా రిఫైండ్ మార్షల్ ఆర్ట్ అని చాలామంది అభిప్రాయపడతారు.కారణమేమంటే...
read more " 2nd Martial Arts Class Photos "

25, డిసెంబర్ 2015, శుక్రవారం

అసలైన క్రైస్తవం

ఈరోజు క్రీస్తు జన్మదినంగా ప్రపంచం భావిస్తున్నది.అది నిజమో కాదో ఎవరికీ తెలియదు.అదొక నమ్మకం అంతే.ప్రపంచం నమ్మకాల మీదనే నడుస్తున్నది గాని సత్యాన్ని అనుసరిస్తూ నడవడం లేదు.ఏ మతమైనా నమ్మకాల నీడలోనే నిద్రిస్తున్నది గాని సత్యపు వెలుగులో నడవడం లేదు.ఆ విషయాన్ని అలా ఉంచుదాం. క్రిస్మస్ సందర్భంగా ఆసలైన క్రైస్తవం ఏం చెబుతున్నదో చూద్దాం.అసలిదంతా ఎందుకంటే - అసలైన క్రైస్తవానికీ అసలైన హిందూమతానికీ ఏమీ భేదం...
read more " అసలైన క్రైస్తవం "

24, డిసెంబర్ 2015, గురువారం

Yun Tho Humne Laakh Haseen - Mohammad Rafi

  24-12-1924 న మహమ్మద్ రఫీ జన్మించాడు.ఈరోజు ఆయన జన్మదినం. అందుకని ఆయనకు స్మృత్యంజలిగా ఆయన పాడిన ఒక రొమాంటిక్ సాంగ్ ను ఈరోజు పాడుతున్నాను.దీనికి సంగీతం సమకూర్చింది మధుర సంగీత దిగ్గజం ఓ.పి. నయ్యర్.సాహిత్యం సమకూర్చింది సాహిర్ లూధియాన్వి. "యూ తో హమ్నే లాఖ్ హసీ దేఖే హై తుం సా నహి దేఖా..." మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా పాడిన ఈ పాట 'తుం సా నహీ దేఖా' అనే సినిమాలోది.ఇదే రాగాన్ని తెలుగులో ఘంటసాల...
read more " Yun Tho Humne Laakh Haseen - Mohammad Rafi "

22, డిసెంబర్ 2015, మంగళవారం

రంగనాధ్ విషాదాంతం వెనుక కొన్ని కోణాలు- ఆత్మహత్య నేరమా?

రంగనాధ్ విషయంలో జరిగింది ఆత్మహత్య అని అందరూ అంటున్నారు. పోలీస్ పరిశోధన ఇంకా జరుగుతూనే ఉన్నప్పటికీ,ఆయన టీవీ ఇంటర్వ్యూలలో బాహాటంగా చెప్పిన విషయాలను బట్టీ,మొదట్నించీ ఆయన మనస్తత్వాన్ని బట్టీ,ప్రస్తుత గ్రహప్రభావాన్ని బట్టీ అది ఆత్మహత్యే అని ప్రస్తుతానికి మనం కూడా అనుకుందాం.అధికారిక విచారణలో ఏం తేలుతుందో గమనిద్దాం. ఈ సందర్భంలో ఒక మౌలికమైన ప్రశ్న తలెత్తుతున్నది. 'ఆత్మహత్య అనేది తప్పా?' అనేదే ఆ ప్రశ్న. ఈ విషయం మీద అనేక దృక్కోణాలున్నాయి. >>జీవితం...
read more " రంగనాధ్ విషాదాంతం వెనుక కొన్ని కోణాలు- ఆత్మహత్య నేరమా? "