“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, నవంబర్ 2014, సోమవారం

Telugu Melodies-పూచెను సుమములే వెన్నెల జారగా...




(సౌండ్ క్లారిటీ కోసం,ఈ పాటను మంచి స్పీకర్స్ లో వినండి.కంప్యూటర్ స్పీకర్ లో మీకు ఆ క్లారిటీ రాదు)
----------------------------------------------
నేను పాడిన కరావోకే పాటలలో మొదటిదిగా 'పూచెను సుమములే వెన్నెల జారగా..' ఈ పోస్ట్ లో ఇస్తున్నాను.

ఇది 'ఖిల్తే హై గుల్ యహా..' పాటకు తెలుగులో నేను వ్రాసుకున్న సాహిత్యం. కొంచం హిందీ పాట భావాన్నీ కొంత నా భావాన్నీ కలిపి ఈ పాట వ్రాశాను.పాట లిరిక్స్ ఈ క్రింద ఇస్తున్నాను.పాడుకోవడం వరకూ ఈ లిరిక్స్ వాడుకోవాలని ఎవరైనా అనుకుంటే నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.కానీ కమర్షియల్ పర్పస్ కు వాడరాదు.


ఇదొక మధుర ప్రేమగీతం.

కురుస్తున్న వెన్నెలలో పూవులు విరుస్తున్నాయి. హృదయం నీకోసం వేచి చూస్తున్నది,సమయం ముందుకు దొర్లిపోతున్నది,ఈ ప్రపంచం నిత్యం కాదన్న సత్యాన్ని ప్రేయసికి వివరిస్తూ ప్రేమను ఆస్వాదించడంలో ఆలస్యం చెయ్యవద్దని చెబుతూ పాడే పాట.

ఎంతో ఫీల్ తో వ్రాసిన పాట.అంతే ఫీల్ తో పాడిన పాట.

విని ఆనందించండి.

పాట:--
పూచెను సుమములే...

రచన-గానం:--

సత్యనారాయణ శర్మ.
-------------------------

పూచెను సుమములే – వెన్నెల జారగా

వేచెను హృదయమే – వలపుల తేలగా
పూచెను సుమములే – వెన్నెల జారగా
వేచెను హృదయమే....

{రేపిక వచ్చునా – మాపిక మిగులునా

ఈ మృదు సమయమే – కదలక నిల్చునా}-2
ఉన్న రెండు క్షణములే - ప్రేమ నింపి చూడుమా

పూచెను సుమములే – వెన్నెల జారగా

వేచెను హృదయమే...

{మేఘపు రాగమే – యేరుల తేలదా

పూవుల గుండెలో – చల్లని జ్వాలగా}-2
నాదు హృదయమందు మెదలె- నీ అగాధ వేదన

పూచెను సుమములే – వెన్నెల జారగా

వేచెను హృదయమే...

{ప్రేమను కోరుచు – వేచెను నామది

నిన్నిక తోడుగా – రమ్మనె ఈ నిశి}-2
అన్ని మరచి ఈక్షణం –నన్ను కలువజాలవా

పూచెను సుమములే – వెన్నెల జారగా

వేచెను హృదయమే – వలపుల తేలగా

పూచెను సుమములే....