నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

8, మే 2013, బుధవారం

దేశ జాతకం-వైశాఖ పాడ్యమి -2013

10 -5 -2013 న వైశాఖ పాడ్యమి కుండలి పరిశీలించి రాబోయే నెలలో మన దేశ రాష్ట్ర జాతకాలు ఎలా ఉంటాయో  చూద్దాం. మొదటగా రాష్ట్ర పరిస్తితి ఎలా ఉన్నదో గమనిద్దాం. వైశాఖ మాస ప్రారంభంలో హైదరాబాద్ లో గ్రహస్తితి ఇలా ఉన్నది.
  • అగ్నితత్వ రాశిలో అన్ని గ్రహాల కూటమి వల్ల అగ్ని సంబంధ ప్రమాదాలు జరుగుతాయి.
  • ప్రతి విషయంలోనూ ప్రతిపక్షాల దాడిని తట్టుకోవడం ప్రభుత్వానికి కష్టం అవుతుంది. 
  • పదిహేనురోజుల్లో రాబోయే పౌర్ణమి సమయంలో రాష్ట్రానికి ప్రజలకు గడ్డుకాలం సూచింప బడుతున్నది.
  • ఆ సమయంలో శత్రువుల లేక తీవ్రవాదుల ద్వారా ప్రమాదం పొంచి ఉంది.
  • పలు ప్రమాదాలలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటారు.
  • ఆర్ధికంగా రాష్ట్రానికి బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది కాని అంతర్గతంగా డొల్ల. ఆర్ధిక రంగంలో చాలా గొడవలు బయటకు కనిపించని లొసుగులు ఉంటాయి.
  • పార్టీల,నాయకుల అంతర్గత కుమ్ములాటల్లో ప్రజా సంక్షేమం,రాష్ట్ర సంక్షేమం విస్మరింపబడతాయి.
  • ఒక మత సంబంధమైన కుట్ర గాని,చండాలం గాని బయట పడుతుంది.మతాధినేతలకు ప్రమాదం ఉంది. 

ఇక దేశ పరిస్తితి ఎలా ఉంటుందో చూద్దాం.న్యూ డిల్లీ లో ఆరోజున గ్రహస్తితి ఇలా ఉన్నది.
  • లగ్నాధిపతి శుక్రుడు అష్టమ స్తితివల్ల మహిళలకు రక్షణ ఉండదు.వారిపైన దాడులు యధాప్రకారం కొనసాగుతాయి.ప్రజల్లో చట్టం అంటే భయం ఉండదు.
  • దశమంలో గురుచండాల యోగం వల్ల ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పలేని పరిస్తితిలో ఉంటుంది.పాలకులు అబద్దాలతో ప్రజలను మోసగిస్తారు.
  • తృతీయంలో వక్రశని వల్ల తమ చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకోడానికి నాయకులు కుంటిసాకులు చెప్పినా ప్రజలు నమ్మరు.అలా అని ప్రభుత్వమూ ఊరుకోదు.బుకాయిస్తూనే ఉంటుంది.
  • చతుర్దంలో కేతువు వల్ల ప్రజాజీవితం యధావిధిగా చిరాగ్గా ఉంటుంది.
  • పంచమంలో బుధుని వల్ల సూడో ఇంటలెక్చువల్స్ సమస్యలకు అనేక పరిష్కారాలు సూచిస్తూ ఉంటారు.జోరుగా చర్చలు జరుగుతూ ఉంటాయి.కానీ ఏవీ అమలవ్వవు.
  • నవమంలో అమావాస్య వల్ల మతరంగంలో ఒక దుర్ఘటన జరుగుతుంది.
మన దేశ జాతకం చూడాలంటేనే ఈ మధ్య పరమచిరాగ్గా ఉంటున్నది.ఎక్కడైనా ఒక్క మంచి విషయం కనిపిస్తుందేమో అంటే భూతద్దం వేసి వెతికినా దొరకడం లేదు.మన దేశం చైనా కాదుగా అన్ని రంగాలలో క్రమశిక్షణతో విజయాలు సాధిస్తూ అప్రతిహతంగా ముందుకు దూసుకు పోవడానికి?అయినా డబ్బుకి, కులానికి, మతానికి లొంగి ఓట్లు అమ్ముకుంటూ అవినీతి కేన్సర్ తో కుళ్ళిపోయిన మనకు ఇంతకంటే మంచి స్థితిని ఊహించడం కూడా తప్పేనేమో?