“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, జులై 2011, మంగళవారం

రాహుకేతువులు - రాశి ఫలితాలు

May 2011 నుంచి December 2012 వరకూ ఏడాదిన్నర పాటు నీచ స్థితిలో ఉండబోతున్న రాహు కేతువుల ప్రభావాలు ఏ ఏ రాశులపైన ఎలా ఉంటాయో చెప్పమని నన్ను చాలామంది కోరుతున్నారు. విడివిడిగా అందరికీ సమాధానం ఇవ్వడం వీలుకాదు. అందుకే ఈ వ్యాసం వ్రాస్తున్నాను. ఇందులో చాలా పాయింట్స్ వారి జీవితాలలో జరుగుతున్నాయని మరింత వివరంగా వ్రాయమని కొందరు ఈ మెయిల్ ద్వారా కోరారు. అందుకే ఇతర గ్రహాలనుకూడా లెక్క లోకి తీసుకుని కొన్ని మార్పులు చేసి వ్రాస్తున్నాను.

ఆయా ఫలితాలను అర్ధం చేసుకుని జాగ్రత్తపడటం ద్వారా,తగిన రేమేడీలు పాటించడం ద్వారా, మేలు పొందవచ్చు.

మేష రాశి వారికి 
కళ్ళ జబ్బులు తీవ్రమౌతాయి. చదువు సంధ్యలలో అనుకోని హటాత్ మార్పులు వస్తాయి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. మాటమీద అదుపు లేకపోవడం వల్ల గొడవలు వస్తాయి. గుహ్య స్థానంలో దురదలు మొదలైన రోగాలు, దీర్ఘ రోగాలు విజ్రుమ్భిస్తాయి. కష్ట నష్టాలు చుట్టుముడతాయి. అదే సమయంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముందు మాట తూలడం తరువాత పశ్చాత్తాప పడటం ఉంటుంది. ఒక్క క్షణం బేలతనం మరొక్క క్షణం విపరీతమైన ధైర్యాలతో మనసు ఊగిసలాట అవుతుంది. పిల్లలకు మంచి జరుగుతుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. రోగులకు సేవలు అందించవలసి వస్తుంది. 
వృషభ రాశి వారికి , 
హటాత్తుగా అనారోగ్యం పాలుకావడం జరుగుతుంది. యాక్సిడెంట్లు అవుతాయి. దెబ్బలు తగులుతాయి. ప్రత్యర్ధుల ప్లానులకు బలి కావడం ఉంటుంది. చిన్న చిన్న కారణాలకు ఎక్కువ రోజులు అనారోగ్యాలు పీడిస్తాయి. పార్ట్ నర్లు, భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి. కొంతమంది దుర్మరణం చెందటం జరుగుతుంది. విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. అయితే ఈ ఖర్చులు మంచి పనులకై ఉంటాయి. డిప్రెషన్లో పడతారు. లోకం అంతా నిరాశామయంగా కనిపిస్తుంది. తన శక్తిమీద తనకే నమ్మకం సడలుతుంది. ఇంట్లో దైవ సంబంధమైన కార్యాలు జరుగుతాయి. చదువు కుంటుపడుతుంది.

మిథున రాశి  వారికి,
ఆస్పత్రిలో చేరడం జరుగుతుంది. జైళ్ళు, ఆస్పత్రులు సందర్శించవలసి వస్తుంది. హటాత్ ప్రయాణాలు జరుగుతాయి. శత్రు విజయం కలుగుతుంది. అసంభవం అనుకున్న పనులు అనుకోకుండా నెరవేరుతాయి. చిన్న చిన్న రోగాలు చికాకు పెడతాయి. అనుకోని ఖర్చులు హటాత్తుగా తలెత్తుతాయి. కాని సమయానికి ధనం ఎలాగో సర్దుబాటు అవుతుంది. పెద్దలు ఆదుకుంటారు. గృహ సౌఖ్యం లోపిస్తుంది. ఇంటిలో ఎప్పుడూ చిర్రు బుర్రులు ఉంటాయి. ఇల్లు విడిచి ఎటైనా పోదామని అనిపిస్తుంది.

కర్కాటక రాశి వారికి,
అనుకోని లాభాలు హటాత్తుగా వచ్చి పడతాయి. స్నేహితులు సహాయ పడతారు. విలాసాలు పెరుగుతాయి. పార్టీలు జల్సాలు జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలూ ఎక్కువ అవుతాయి. మనస్సు చంచలం అవుతుంది. కుతంత్రాలు ఊపందుకుంటాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. సంతానానికి చెడు జరుగుతుంది. ఉద్యోగులకు అధికారం పెరుగుతుంది. మాట చెల్లుబడి అవుతుంది. ధైర్యం పెరుగుతుంది. మాట కరుకుగా ఉంటుంది. ఇతరులను ఆదేశించడం వార్నింగులు ఇవ్వడం జరుగుతుంది.

సింహ రాశి వారికి ,
గృహ సౌఖ్యం లోపిస్తుంది.ఇంట్లో అనుకోని చెడు సంఘటనలు జరుగుతాయి. చికాకులు ఎక్కువ అవుతాయి. త్రిప్పట అధికమౌతుంది. తల్లికి గండం. చదువు చట్టుబండలౌతుంది. వాహన ప్రమాదాలు కలుగుతాయి. వృత్తిలో హటాత్తుగా చెడు జరుగుతుంది. చెడ్డ పేరు పైన పడుతుంది. పుణ్య క్షేత్ర సందర్శనం, సాధువులను గురువులను కలవడం జరుగుతుంది. అనుకోకుండా ధనలాభం కలుగుడుంది. కాని ఆ ధనం నిలబడదు. మనసులో మాటలో జంకు భయం ఏర్పడతాయి. ఏమి చెయ్యాలో పాలుపోని స్తితులు కలుగుతాయి.

కన్యా రాశి  వారికి,
కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఉన్నత విద్య ఫలిస్తుంది. పుణ్య క్షేత్ర సందర్శనం ఉంటుంది. సాధువులు గురువులను కలుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. కుటుంబంలో పెద్దలు గతిస్తారు. మాటలో ధైర్యం పెరుగుతుంది. కాని మనసులో పీచు పీచు మంటూ ఉంటుంది. ఆహారంలో లోపాలవల్ల రోగాల పాలౌతారు. జీర్ణశక్తి మందగిస్తుంది.

తులా రాశి వారికి,
కళ్ళ జబ్బులు తీవ్రమౌతాయి. చదువు సంధ్యలలో అనుకోని హటాత్ మార్పులు వస్తాయి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. మాటమీద అదుపు లేకపోవడం వల్ల గొడవలు వస్తాయి. గుహ్య స్థానంలో దురదలు మొదలైన రోగాలు, దీర్ఘ రోగాలు విజ్రుమ్భిస్తాయి. కష్ట నష్టాలు చుట్టుముడతాయి. ఇతరుల అధికారానికి తలవంచవలసి వస్తుంది. పార్ట్ నర్లు  మోసంచేస్తారు. సోదరులకు, పెద్దలకు గండకాలం. అనవసరమైన పనులకు ఖర్చులు పెట్ట వలసి వస్తుంది.

వృశ్చిక రాశి వారికి ,
హటాత్తుగా అనారోగ్యం పాలుకావడం జరుగుతుంది. యాక్సిడెంట్లు అవుతాయి. దెబ్బలు తగులుతాయి. ప్రత్యర్ధుల ప్లానులకు బలి కావడం ఉంటుంది. చిన్న చిన్న కారణాలకు ఎక్కువ రోజులు అనారోగ్యాలు పీడిస్తాయి. పార్ట్ నర్లు, భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి. కొంతమంది దుర్మరణం చెందటం జరుగుతుంది. మనసు పరిపరివిధాలుగా పోతుంది. దురుసు మాటలు ఎక్కువ అవుతాయి. దానివల్ల సన్నిహితులు బాధ పడతారు. రాష్ బిహేవియర్ ఎక్కువౌతుంది. జీర్ణక్రియ  మందగిస్తుంది. వేళకు తినక  పోవడం వల్ల, నానా తిండీ తినడం వల్లా అనారోగ్యాలు వస్తాయి. కుటుంబంలో పెద్దలు అనారోగ్యాల పాలౌతారు. కాని చివరకు అంతా సుఖాంతం అవుతుంది.కీడు చేస్తారేమో అనుకున్న వారినుంచి కూడా మేలే జరుగుతుంది.

ధనుస్సు వారికి ,
ఆస్పత్రిలో చేరడం జరుగుతుంది. జైళ్ళు, ఆస్పత్రులు సందర్శించవలసి వస్తుంది. హటాత్ ప్రయాణాలు జరుగుతాయి. శత్రు విజయం కలుగుతుంది. అసంభవం అనుకున్న పనులు అనుకోకుండా నెరవేరుతాయి. చిన్న చిన్న రోగాలు చికాకు పెడతాయి. అనుకోని ఖర్చులు హటాత్తుగా తలెత్తుతాయి. మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. మంత్ర తంత్రాల మీద, దైవ సంబంధమైన పనుల మీదా ఆసక్తి పెరిగుతుంది. కాని ఆచరణలో ఆలస్యాలు అవుతాయి. అనుకున్న పనులు ఎందుకు చెయ్యలేకపోతున్నారో అర్ధం కాదు. ఉద్యోగంలో అన్నీ ఆలస్యాలే అవుతుంటాయి. సమయానికి అనుకున్న పనులు పూర్తీ కావు.

మకర రాశి వారికి,
లాభాలు వచ్చి పడతాయి. స్నేహితులు సహాయ పడతారు. విలాసాలు పెరుగుతాయి. పార్టీలు జల్సాలు జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలూ ఎక్కువ అవుతాయి. మనస్సు చంచలం అవుతుంది. కుతంత్రాలు ఊపందుకుంటాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. సంతానానికి చెడు జరుగుతుంది. ధర్మ చింతన పెరుగుతుంది. తమకు న్యాయంగా రావలసినవి కూడా రాకుండా పోతాయి. కుటుంబలో పెద్దలకు అనారోగ్యం చేస్తుంది. వైరాగ్యం పెరుగుతుంది.
కుంభ రాశి వారికి,
గృహ సౌఖ్యం లోపిస్తుంది.ఇంట్లో అనుకోని చెడు సంఘటనలు జరుగుతాయి. చికాకులు ఎక్కువ అవుతాయి. త్రిప్పట అధికమౌతుంది. తల్లికి గండం. చదువు చట్టుబండలౌతుంది. వాహన ప్రమాదాలు కలుగుతాయి. వృత్తిలో హటాత్తుగా చెడు జరుగుతుంది. చెడ్డ పేరు పైన పడుతుంది. దీర్ఘ రోగాలు విజ్రుమ్భిస్తాయి. ధన నష్టం కలుగుతుంది. మాటలో జంకు భయం శాంతం తయారౌతాయి. చాలా కాలంగా అనుకుంటున్న ఉన్నత విద్యలు, దగ్గర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరులకు మంచి జరుగుతుంది. మనసులో భయం ఆందోళనా అధికం అవుతాయి.

మీనరాశి వారికి,
కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఉన్నత విద్య ఫలిస్తుంది. పుణ్య క్షేత్ర సందర్శనం ఉంటుంది. సాధువులు గురువులను కలుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. కుటుంబంలో పెద్దలు గతిస్తారు. శత్రు బాధ మిక్కుటమౌతుంది. దిష్టి ఎక్కువౌతుంది. బిజినెస్స్ లో ఆలస్యాలు ఆటంకాలు ఎక్కువ అవుతాయి. సమయానికి ఎలాగో ధనం సర్దుబాటు అవుతూ ఉంటుంది. కాని మనశ్శాంతి ఉండదు.