అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

29, జూన్ 2011, బుధవారం

నిత్యజీవితంలో జ్యోతిశ్శాస్త్రం

మొన్న 27-6-2011 న ఒక పనిమీద విజయనగరం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఒక ప్రముఖ వ్యక్తిని కలవవలసిన పని ఉంది. ఉదయం 9.30 కల్లా వాళ్ళ ఆఫీసుకు చేరి వెయిట్ చేస్తూ కూచున్నాము. ఆయనకు ఆ రోజున ఏదో పని ఉందనీ, లేటుగా వస్తారనీ, ఎప్పుడు వస్తారో తెలీదనీ  వాళ్ళ పీ.ఏ. చెప్పారు. నాతొ వచ్చిన వారికి ఆదుర్దాగా ఉంది. పని చూసుకొని వెంటనే వెనక్కు తిరిగి వెళ్ళాలని వారి తాపత్రయం. తిరుగు ట్రెయిన్ మధ్యాన్నం మూడు గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. ఒకవేళ...
read more " నిత్యజీవితంలో జ్యోతిశ్శాస్త్రం "

24, జూన్ 2011, శుక్రవారం

కవలల జాతకాలు -- పరిశీలన -- 2

జ్యోతిశ్శాస్త్రమనేది ఒక అద్భుతమైన శాస్త్రం. మానవ జీవితాన్ని సంపూర్తిగా చదవడానికి అది తోడ్పడుతుంది. అయితే ఎవరికిబడితే వారికి అది దక్కదు. అది బజారులో దొరికే వ్యాపార వస్తువు కాదు. జ్యోతిషం అంటే  మాయమాటలు చెప్పటమే అనుకుంటారు కొందరు. ఇది పొరపాటు అభిప్రాయం. అది ఉత్త గణితం మాత్రమే  అని చాలామంది అనుకుంటారు. ఇదీ పొరపాటు అభిప్రాయమే. గణితం శరీరం వంటిది. స్ఫురణ ఆత్మ వంటిది. రెండూ కలిసినప్పుడే ఫలితం...
read more " కవలల జాతకాలు -- పరిశీలన -- 2 "

20, జూన్ 2011, సోమవారం

కవలల జాతకాలు - పరిశీలన

ఒకే సమయంలో పుట్టిన కవలల జీవితాలు విభిన్నంగా ఎందుకుంటాయి? ఈ ప్రశ్నను చాలా చోట్ల వింటుంటాము.  ఈ ప్రశ్న జ్యోతిష్యాన్ని నమ్మేవారికీ వస్తుంది. నమ్మనివారికీ వస్తుంది. నమ్మేవారికి ఈ ప్రశ్న మరింత లోతైన రీసెర్చికి దారితీస్తుంది. సూక్ష్మ రహస్యాలను అర్ధం చేసుకోడానికి వారిని ప్రేరేపిస్తుంది. నమ్మనివారిని వితండవాదానికి పురికొల్పుతుంది. అలాటి వితండ వాదాలు చేసేవారిని చూచి విజ్ఞులు నవ్వుకొని ఊరుకుంటారు. వేదాంగమైన...
read more " కవలల జాతకాలు - పరిశీలన "

16, జూన్ 2011, గురువారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం తత్త్వం - 7

ఆరుభాగాలూ చదివినమీదట కొందరికి కొన్ని సందేహాలు రావచ్చు. ఇంతకీ ఈయన చెప్పాలనుకున్నదేమిటి? జిడ్డు ఒక గొప్ప మహాత్ముడనా? ఒక భ్రష్ట యోగి అనా? ఒక పరాజిత తాత్వికుడనా? ఒక విఫల జగద్గురువనా? ఒకటి చెబుతూ ఒకటి చేసిన మోసగాడనా ? లేక లోకాన్ని ఉద్దరించాలని తలచిన బోధిసత్వుడనా? గ్రూపులతో, సంస్థలతో విసిగిపోయిన చింతనాపరుడనా? అని రకరకాల సందేహాలు చదివినవారికి ముంచేత్తవచ్చు.  నేను ఏమి చెప్పాలని ప్రయత్నం చేసానో చదువరులకు వెంటనే అర్ధం కాక పోవచ్చు....
read more " జిడ్డు కృష్ణమూర్తి జీవితం తత్త్వం - 7 "

13, జూన్ 2011, సోమవారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం-తత్త్వం-6

జిడ్డు జాతకంలో ఒక విచిత్రం ఉంది. రాహువు గురునక్షత్రంలో ఉన్నాడు. గురువు రాహు నక్షత్రంలో ఉన్నాడు. అంటే రాహు గురువులకు నక్షత్ర స్థాయిలో పరివర్తన ఏర్పడింది. ఇది ఒకరకమైన గురుచండాలయోగం. పైగా ఈయనకు నవాంశలో గురువు నీచస్తితిలో ఉన్నాడు. అందుకే ఈయనకు విదేశీ గురువులతోనూ, కలగూర గంప లాటి దియోసఫీ తోనూ పరిచయం ఏర్పడింది. ఆ గురువుల పర్యవేక్షణలో జరిగిన సాధనలో తీవ్ర ఆశా భంగం కలిగింది. తమ్ముడు నిత్యానంద మరణమే ఆ ఆశాభంగం.   చిన్నప్పటి నుంచీ...
read more " జిడ్డు కృష్ణమూర్తి జీవితం-తత్త్వం-6 "

11, జూన్ 2011, శనివారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం, తత్త్వం --5

జిడ్డు జాతకంలో ఆధ్యాత్మిక సాధనా పరంగా ముఖ్య పాత్ర వహించినది బుధుడని ముందే అనుకున్నాం. జ్యోతిష్య జ్ఞానం ఉన్న వారికి బుధుని యొక్క లక్షణాలు తెలుసు. బుధుడు తటస్థగ్రహం. మంచివారితో ఉంటె మంచివాడుగానూ, చెడ్డవారితో ఉంటె చెడ్డగానూ మారిపోతాడు. మనిషి లోని బుద్ధికి ఇతడే కారకుడు. కనుకనే మనిషి బుద్దికూడా అతని స్నేహితాన్ని బట్టి,  సహవాసాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇక్కడ బుధుని యొక్క స్థితిని కొంచం అవగాహన చేసుకోవాలి. ఇతను ఒక గ్లాసులోని...
read more " జిడ్డు కృష్ణమూర్తి జీవితం, తత్త్వం --5 "

7, జూన్ 2011, మంగళవారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం- తత్త్వం- 4

మనిషి జీవితం చాలా చిత్రమైనది. అన్నీ తెలిసి కూడా తప్పులు చెయ్యటం మనిషి బలహీనత. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అతని నైజం. కానీ ఈలోపల జరగాల్సినవి జరిగిపోతుంటాయి. కాలమూ ప్రకృతీ దేనికోసమూ ఆగవు. మనిషి ఒకపని మొదలుపెడతాడు. దాని ఫలితం తాను ఆశించినట్లే వస్తుందని అనుకుంటాడు. చాలా సార్లు అలాగే జరుగుతుంది . కాని చాలా సార్లు అలా జరుగకపోవచ్చు కూడా. అటువంటప్పుడు నిరాశ పడకుండా దాన్ని జీర్ణించుకున్నవాడే నిజమైన మానవుడు. కొత్తదనాన్నీ మార్పునూ స్వాగతించలేనివాడు...
read more " జిడ్డు కృష్ణమూర్తి జీవితం- తత్త్వం- 4 "

4, జూన్ 2011, శనివారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం- తత్త్వం- 3

ధియోసాఫీ అనేది బౌద్ధమతాన్నీ, హిందూమతాన్నీ, క్రైస్తవాన్నీ కలిపి వండిన కిచిడీ అని చెప్పవచ్చు. దీనిలో రహస్య సాధనామార్గం ఒకటి ఉంది.   మాస్టర్ మోర్య, మాస్టర్ కుతూమి, మాస్టర్ మహాచోహన్ -- వీళ్ళు ముగ్గురూ మానవ స్థాయిని దాటి ఎంతో ఎత్తుకు ఎదిగిన మహాపురుషులని వాళ్ళు ఉండేది దివ్యలోకాలలో అయినప్పటికీ ప్రస్తుతం వాళ్ళ దివ్య శక్తులతో టిబెట్ పరిసర ప్రాంతాల్లో మానవ రూపాలలో ఉన్నారని, వీరి కంటే పై స్థాయిలో  "మైత్రేయ" అనే ఒక దివ్య...
read more " జిడ్డు కృష్ణమూర్తి జీవితం- తత్త్వం- 3 "