28, మార్చి 2026, శనివారం

ఎడారిమతాలున్నచోట శాంతి ఉండదు

నిన్న శ్రీరామనవమి నాడు తన నియోజకవర్గంలోని  ఆకివీడులో, ఒక రామాలయాన్ని సందర్శిద్దామని వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిమీద, ఆయనవెంట ఉన్న వారిమీద కత్తులతో, మేకులతో భౌతికదాడి జరిగింది. పోలీస్ ఎస్కార్ట్ తో ఆయన ఆ గుంపునుండి బయటకు రావలసి వచ్చింది. ఆయన వెంట ఉన్నవారిలో కొంతమందికి గాయాలయ్యాయి.

దాడిచేసినది దళితక్రైస్తవుల ముసుగులో ఉన్నవారని ఆయన ఆరోపించారు.

శాంతిని అనుసరించవలసిన క్రైస్తవులు దాడిచేయడమేంటి? అదీగాక మేకులతో దాడిచేయడమేంటి? నాకైతే నవ్వొచ్చింది. అంటే, వారు నమ్మే జీసస్ ను రోమన్లు మేకులు కొట్టి చంపేశారు గనుక, వాళ్లకు నచ్చని అందరినీ మేకులతో దాడిచేద్దామని ప్రయత్నమా? ఇదెక్కడి వింతో నాకైతే అర్ధం కాలేదు.

పశ్చిమగోదావరి జిల్లాలలో గత అరవై డెబ్బయి ఏళ్లుగా క్రైస్తవప్రచారం ముమ్మరంగా జరిగింది. అనేక సంస్థలు పుట్టుకొచ్చి, లక్షలమంది నిమ్నవర్గపు హిందువులను క్రైస్తవులుగా మార్చేశాయి. చాలాచోట్ల ఊళ్లకు ఊళ్లే ఈ విధంగా మార్చబడ్డాయి. అలా మారినవారిలో ఎస్సీ ఎస్టీలు బీసీలు ప్రముఖంగా ఉన్నారు. వారిలో తక్కువశాతం మంది మాత్రం ఇప్పటికీ మారకుండా నీతిగా ఉన్నారు.

నీతిగా అని ఎందుకన్నానంటే, చెప్పుకునే మతమేమో క్రైస్తవం, పేపరుమీద మతమేమో హిందూమతం. లేకపోతే రిజర్వేషన్ రాదుగా? మరి, అది నీతెలా అవుతుంది? అందుకని అలా అనవలసి వచ్చింది !

అంతకుముందు ఆయా ఏరియాలలో అన్నింటిలోనూ రామాలయాలుండేవి. క్రమేణా అవి పాడుబడిపోయాయి. సందుసందుకీ చర్చిలు వెలిశాయి. దశమభాగాలు దండుకొని పాస్టర్లు కోటీశ్వరులయ్యారు. మతవ్యాపారాలు విస్తరించాయి. ఓట్లకోసం నాయకులు వారికి తందానతాన పాడారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టబడ్డాయి. చీలికలు ఏర్పడ్డాయి.

దేశంలో నార్త్ ఈస్ట్ లోని సెవెన్ సిస్టర్ రాష్ట్రాలు ఏకమొత్తంగా క్రైస్తవంలోకి మార్చబడ్డాయి. ఈ పని గత యాభై ఏళ్లుగా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ వచ్చింది. ఆ తరువాత స్దానం ఆంధ్రాలోని పశ్చిమగోదావరి జిల్లాదే అని నా అనుమానం. అంత ఎక్కువగా కన్వర్షన్స్ అక్కడ జరిగాయి.

ఈ లోపల, చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని, రికార్డులో హిందువులుగా ఉన్నప్పటికీ, క్రైస్తవులుగా మారి అనేకమంది డబల్ బెనిఫిట్ పొందారు. అక్కడేమో రిజర్వేషను, ఇక్కడెమో మతప్రచారం, విదేశీఫండ్స్, వాటిలో ముప్పావలా నొక్కేసి, పావలా పంచి మళ్ళీ మతమార్పిడులు, ఈ విధంగా ఈ అవినీతికుట్రలు దశాబ్దాలుగా సాగుతూ వచ్చాయి.

నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో, ఇప్పటివరకూ హిందూరిజర్వేషన్ వరాలను అనుభవిస్తూ, సమాజంలో క్రైస్తవులుగా చెలామణీ అవుతున్న దొంగలందరూ బయటకు రావల్సి ఉంటుంది. పెద్దపెద్ద ఉద్యోగాలలో ఇప్పటికే తరతరాలుగా స్థిరపడి ఉన్న వీరంతా,  ఆ విధంగా బయటపడి తమ తప్పులను ఒప్పుకుంటారా? సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సరే. పిల్లికి గంటకట్టేదెవరు? చూడాలి.

పోతే, ఇన్ని దశాబ్దాలుగా, ఈ న్యాయవిరుద్ధమైన రిజర్వేషన్ ను ఉపయోగించుకొని ఇప్పటివరకూ ఎన్ని కోట్లమంది ఉద్యోగాలు సంపాదించారో లెక్క తీయవలసిన అవసరం ఉన్నది. మరి, అన్ని కోట్లమంది అసలైన అర్హులు తమ అవకాశాలను పోగొట్టుకున్నట్లే కదా? వారికి జరిగిన నష్టాన్నెవరు పూడుస్తారు? పూడ్చిపెట్టబడిన  ప్రభువు లేచొచ్చి పూడుస్తాడా?

అదలా ఉంచితే, శాంతిమతాలైన క్రైస్తవం, ఇస్లాంలు ఎక్కడ అడుగుపెడితే అక్కడ చీలికలు, విభేదాలు, గొడవలు, హింస, యుద్ధాలు, నాశనం తప్పకుండా జరుగుతుందనేది నిజం. నేడు ప్రపంచంలోని ఏ దేశంలో చూచినా ఇది రుజువౌతుంది. కారణమేంటంటే, వారి మూలసిద్ధాంతమే - 'నా మతం కరెక్టు, నీది తప్పు. మా దేవుడు రైటు, మీవాడు రాంగు, మతం మారతావా చస్తావా?' అనేది తప్ప ఇంకొకటి ఉండదు. ఉన్నతమైన తత్త్వశాస్త్రం గాని, తమకంటే ప్రాచీనమైన మతాలనుండి కాపీకొట్టకుండా సొంతంగా పుట్టిన భావాలు గాని, వాటిలో ఎక్కడా లేకపోవడం ఇంకొక కారణం.

క్రైస్తవానికీ, ఇస్లాముకూ యూదుమతమే మూలం. కానీ ఇస్లాం ఆ రెండింటితో ఇప్పుడు యుద్ధం చేస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాల మధ్యన ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? ఈ మూడూ అబ్రహామిక్ మతాలే. వీటితో ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి వస్తున్నది. మళ్ళీ ఈ మూడూ చెప్పేవి శాంతి కబుర్లే. వింతగా లేదూ?

అందరూ ముస్లిములే ఉన్నచోట షియాలు, సున్నీలు అని కొట్టుకుంటారు. అందరూ క్రైస్తవులే ఉన్నచోట కాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు అని కొట్టుకుంటారు. వీళ్ళలో ఇంకా చాలా గ్రూపులు, డినామినేషన్లు ఉన్నాయి. బయటకు ఆ గొడవలన్నీ కనిపించవు. లోతుగా చూచినవారికి మాత్రమే అర్ధమౌతాయి. తెలియనివారికి మాత్రం అవి చాలా శాంతిమతాలని మాయమాటలు చెబుతారు.

ఒక రాష్ట్ర డిప్యూటీస్పీకర్ పరిస్థితే ఇలా ఉంటే, ఇక ఆ ఏరియాలలో ఇతరులు శాంతిగా బ్రతికేదెలా సాధ్యపడుతుంది? ఆలోచించండి. హైద్రాబాద్ పాతబస్తీ లాగా, పశ్చిమగోదావరి జిల్లా కూడా తయారైనట్లు కనపడుతోంది. దానికీ దీనికీ మూలం ఆ రెండుమతాలే. అవి అడుగుపెట్టిన చోట శాంతి అనేది ఉండదనేది వాస్తవం.

ఇంకా సందేహాలేమైనా మిగిలున్నాయా?