అయితే, ఎర్రజెండా మొండి మనుషులు
బుర్రనిండా విదేశీబూజు కంపులు
లేకపోతే, తురకబాబా మూఢభక్తులు
ఇటో అటో తెలియని విచిత్రజీవులు
కాకపోతే, కొలుపులు, బలులు, పల్లెటూరి మూర్ఖత్వాలు
ఇంకా కాదంటే, కోరికల భజనలు, దీక్షలు, పూజలు
అదీకాదంటే పిరమిడ్లు, సమాధులు, సూక్ష్మలోకప్రయాణాలు
ఇదీ ఒంగోలు చుట్టుప్రక్కల గోల . . .
మనుషుల అజ్ఞానం ఎంత దట్టంగా ఉందంటే
చిమ్మచీకటి కూడా దీనిని చూచి సిగ్గుపడుతోంది
చెవిటివాడికి శంఖం ఊదటం ఎలాగో
వీరికి అసలైన ఆధ్యాత్మికత నేర్పడం అలాగ
అందుకే,
ఒంగోలు బుక్ ఎగ్జిబిషన్లో మా బుక్ స్టాల్ పెట్టడం
ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి కూడా
పొరపాటున కూడా మళ్ళీ ఆపనిని చెయ్యం.
ఎడారిలో చిరుదీపం వెలుగుతోంది
దాని వెలుగు ఇతరదేశాలలో కూడా ప్రసరిస్తోంది
కానీ దాని కుదురుదగ్గర మాత్రం చీకటిగానే ఉంది.
ఏ దీపమైనా ఇంతేనేమో?