“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

8, జూన్ 2022, బుధవారం

నూపుర్ శర్మ అన్నదాంట్లో తప్పేంటి?

బీజీపీ ప్రతినిధి నూపుర్ శర్మ టీవీలో డిబేట్ సమయంలో మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడింది. అదికూడా అవతలి వ్యక్తి మాటమాటకీ రెచ్చగొడుతుంటే ఆ విషయం ఎత్తింది. తరువాతి శుక్రవారం నాడు ప్రార్ధనల అనంతరం కాన్పూర్ లో అల్లర్లు మొదలయ్యాయి. అల్లర్లకు దిగిన 36 మంది ముస్లిమ్స్ ని అరెస్ట్ చేశారు. ఎక్కడో ఒమన్ లో ఉన్న గ్రాండ్ ముఫ్తి, ఆల్ ఖలీలీ అనేవాడు 'ఇది ప్రతి ముస్లిం మీదా దాడి' గా వక్రీకరించాడు. వెంటనే గల్ఫ్ అంతటా ఇండియా వస్తువులను అమ్మడం మానేశారు. గల్ఫ్ దేశాలు ఇండియా రాయబారులను పిలిపించి మరీ సంజాయిషీ అడిగాయి.

నూపుర్ శర్మ పైన, పార్టీ చర్య తీసుకుంది. నవీన్ జిందాల్ మీద కూడా వేటు పడింది. కొన్ని దేశాలు శాంతించాయి. మరికొన్ని శాంతించలేదు. ఈ మొత్తం గొడవ వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది. ఇండియాలోని తీవ్రవాద ముస్లింల హస్తాలూ ఉన్నాయి.

ఇంతా చేస్తే, నూపుర్ శర్మ అన్న దాంట్లో తప్పేంటి? ఉన్న విషయాన్నే ఆమె మాట్లాడింది. మహమ్మద్ ప్రవక్త చిన్న భార్య పేరు ఆయేషా. ఈమె అబూ బకర్ కూతురు. మహమ్మద్ కు 53 ఏళ్ల వయసులో, ఈ అమ్మాయికి 6 ఏళ్ల వయసులో వీళ్ళ పెళ్లి జరిగింది. ఈమెకు 9 ఏళ్ల వయసు రాగానే మహమ్మద్ సంసారం మొదలుపెట్టాడు. అప్పుడాయనకు 56 ఏళ్ళు. ఈ విషయం అనేక హదీసులలో ఉంది.  హదీస్ అంటే, చూచినవాళ్లు చెప్పిన రిపోర్ట్ అన్నమాట. ఇలా జరిగిందని స్వయానా ఆయేషాయే చెప్పిందని కొన్ని హదీసులలో ఉంది. మరి జరిగినదానిని అంటే తప్పేంటి?

ఎడారి వేడిప్రాంతాలలోను, ఒంటెమాంసం లాంటి కొన్నికొన్ని తిండ్లు తినే ప్రాంతాలలోను ఆడపిల్లలు త్వరగా పెద్దమనుషులౌతారు. ప్రస్తుతం కూడా, హార్మోన్ పాలు, హార్మోన్లు కలిగిన తిండి వాడే అమెరికాలోని అమ్మాయిలు కొంతమంది 9 ఏళ్లకే పెద్దమనుషులౌతున్నారు. అలాగే ఆయేషా కూడా అయి ఉండవచ్చు. సంసారం మొదలు పెట్టి ఉండవచ్చు.  ఆ ఎడారి తెగలలో, వయసుతో పట్టింపు లేని అలాంటి ఆచారాలు ఉండి ఉండవచ్చు. లేదా, ముసలివాడౌతున్న మహమ్మద్ తరువాత అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అబూ బకర్ ఆ ప్లాన్ చేసి తన కూతుర్ని ఆయనకు కట్టబెట్టి ఉండవచ్చు. నిజానికి జరిగింది అదే ! మహమ్మద్ మామ అబూ బకర్ కూ, అల్లుడు ఆలీకి మధ్యన జరిగిన అధికారపోరులోనే షియా సున్నీ వర్గాలు పుట్టాయి. ఆ రావణకాష్టం ఇప్పటికీ మండుతూనే ఉంది. వేలాదిమంది ప్రాణాలు పోతూనే ఉన్నాయి.

కానీ ఇక్కడి విషయం అది కాదు. ప్రస్తుత విషయం, 56 ఏళ్ల మహమ్మద్, 9 ఏళ్ల చిన్నపిల్ల ఆయేషాతో సంసారం చేశాడన్నదే నూపుర్ శర్మ మాట్లాడిన విషయం. ఇది చారిత్రక వాస్తవమే !

'ఎవరూ దానిగురించి కామెంట్ చేయకూడదు. అలా చేస్తే అది ఇస్లాం మీద దాడి చేయడమే' - అనడమే అర్ధం లేని విషయం, జరిగింది ఒకటైతే, ఒమన్ దేశపు గ్రాండ్ ముఫ్తి అలా వక్రీకరించి, గల్ఫ్ ని రెచ్చగొట్టడం మంచి పనేనా? ఇది దైవత్వమా, సైతాన్ లక్షణమా? ఉన్నవిషయాన్ని ఉన్నట్లు చెబితే తప్పేంటి?

ఇస్లాం మీదా, ముస్లిముల మీదా ఎవరూ దాడి చేయలేదు. అలా చేసే పనైతే, ఇండియాలో ఉన్న ముస్లిములు ఇన్నేళ్ళుగా హాయిగా బ్రతకడం సాధ్యమయ్యేదే కాదు. స్వతంత్రం వచ్చినపుడు 3 కోట్లున్న వాళ్ళు ఇప్పుడు 30 కోట్లు అవడమూ సాధ్యమయ్యేది కాదు. ఇంకా చెప్పాలంటే, అల్లర్లన్నీ వాళ్ళు చేస్తున్నవే. దౌర్జన్యాలూ, కుట్రలూ చేస్తున్నది వాళ్ళే. హిందువులెవ్వరూ అలాంటి పనులు చేయరు. వారి జీవనవిధానం అది కాదు. 

మహమ్మద్ ప్రవక్త గురించి ఉన్నవిషయాన్ని ఉన్నట్టు చెప్పినందుకు ఇంత గోల అయ్యే పనైతే, మరి దేవుడి అవతారాలైన శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని, సాక్షాత్తూ ఈశ్వరుడిని, ఇతర హిందూదేవతలని ఇష్టం వచ్చినట్లు తిడుతున్న వాళ్ళను ఏం చెయ్యాలి? దేవాలయాలను ధ్వంసం చేస్తున్నవాళ్లను ఏం చెయ్యాలి?

అయితే, ఒకందుకు ఇది మంచిదే.

ఈ విషయంలో నూపుర్ శర్మ తాత్కాలికంగా బలి అయ్యి ఉండవచ్చు. తప్పదు కాబట్టి బీజేపీ ఈ చర్యను తీసుకుని ఉండవచ్చు. కానీ ఎలాంటి తోడేళ్ళ వంటి దేశాలమధ్య ఇండియా బ్రతుకుతున్నదో అందరికీ అర్ధం అవుతున్నది. వేలాది ఏళ్ళనుంచీ ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచే మన దేశం పైన దాడులు జరిగాయి. అవేమో ఎడారి దేశాలు. మనదేమో రత్నగర్భ. ఆ దేశాలే వందలాది ఏళ్లుగా మన దేశాన్ని దోచుకున్నది ! దేశాన్ని మూడు ముక్కలు చేసింది ! ఈ దౌర్జన్యపు పరిస్థితి ఈనాటికీ మారలేదు. ఇప్పటికీ ఆ దేశాల కన్ను ఇండియా మీదే ఉంది.

ఇండియాలో హిందువుల పరిస్థితి నానాటికీ ఎలా తయారౌతున్నదో ఈ సంఘటనతో అందరికీ అర్ధం అవుతున్నది. ఇస్లాం గ్రంధాలలో ఉన్నవిషయాన్నైనా సరే, మనం నోరెత్తి అనకూడదు. మనల్ని మాత్రం వాళ్ళు ఎలాగైనా తిట్టవచ్చు. అదికూడా మన దేశంలో !

గల్ఫ్ దేశాలలో, పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో మన దేవతావిగ్రహాలను, మన దేవాలయాలను ముస్లిమ్స్ ధ్వంసం చేస్తే మనమెందుకు ఊరుకోవాలి మరి? ప్రపంచంలోని ఎక్కడ ఏ ముస్లింకి ఏది జరిగినా గల్ఫ్ గొడవచేసే పనైతే, ఆ ముస్లిమ్స్ అందరినీ గల్ఫ్ లోనే ఉంచుకోవాలి. ఆయా దేశాలలో వాళ్ళెందుకు ఉన్నట్టు? అందరూ గల్ఫ్ కే పోయి అక్కడే ఉండాలి కదా?

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందుముందు మన దేశం ఏమౌతుంది? మరో కాశ్మీర్ అవుతుంది ! ఈ సంగతి ఏ చిన్నపిల్లాడైనా చెబుతాడు. 

అలా కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

ఒకటి - కామన్ సివిల్ కోడ్ రావాలి.

రెండు - ఇండియాను హిందూదేశంగా ప్రకటించాలి.

మూడు - మతప్రచారాన్ని, మతమార్పిడులని నిరోధించాలి.

నాలుగు - మతం మారితే రిజర్వేషన్ రద్దు చేయాలి. ఆ రిజర్వేషన్ తో పొందిన ఉద్యోగాలను, ఇతర రాయితీలను వెంటనే రద్దు చేయాలి.

కనీసం ఇవి చేయగలిగితే, అప్పుడు దేశం ఏ సమస్యా లేకుండా ఉంటుంది. లేదంటే, ముందుముందు ప్రతి రాష్ట్రమూ  కాశ్మీర్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు కేరళలో ఏం జరుగుతోందో చూస్తున్నారుగా ! ప్రతిరాష్ట్రంలోనూ అదే జరుగవచ్చు.

హిందువుల్లారా విభేదాలు విడచిపెట్టండి. ఐకమత్యంతో ఒకటవ్వండి. ఇప్పుడైనా మన దేశాన్ని రక్షించుకోండి. లేదా ముందుంది కష్టకాలం !

బీజేపీ తప్ప ఈ దేశానికి రక్ష ఇంకేదీ లేదు. గుర్తించండి.

ఒక ఆడపిల్ల అయి ఉండి అంత దైర్యంగా నేషనల్ డిబేట్లో మాట్లాడినందుకు నూపుర్ శర్మను అభినందించాలి. కోట్లాదిమంది మగాళ్లు చేయలేని పనిని ఒక ఆడపిల్ల చేసింది.

We support Nupur Sharma !