“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, జూన్ 2022, శనివారం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం - విశ్లేషణ

నిన్న బహుళ చవితి శుక్రవారం. పౌర్ణమి వెళ్లి జస్ట్ మూడు రోజులే అయింది. ఆర్మీ  ఉద్యోగాలకు పోటీపడుతున్న అభ్యర్థుల దాడిలో సికింద్రాబాద్ స్టేషన్ ధ్వంసమైంది.. ఇంజన్లు, రైలుబోగీలు, స్టాళ్లు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. నిప్పుపెట్టారు. ఫైరింగ్ లో ఒకతను చనిపోయాడు. అనేకమంది అరెస్టయ్యారు. గ్రహస్థితులను గమనిద్దాం.

ఏ విధ్వంసంలోనైనా కుజుడు, రాహువు, శని, యురేనస్ ల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం కూడా ఉంది.

 • శని, సున్నా డిగ్రీలలో వక్రించి రాశిసంధిలో అర్గళంలోఉంటూ సామాన్యజనం యొక్క ఖర్మను పంచిపెడుతున్నాడు.
 • కుజుడు రాహుశనుల శపితయోగంలో అర్గళబందీగా ఉన్నాడు.
 • కుజుడూ యురేనసూ 22 వ డిగ్రీ మీద ఖచ్చితమైన 2/12 దృష్టిలో ఉంటూ విధ్వంసాన్ని సూచిస్తున్నారు.
 • రాహువు కుజుడిని సూచిస్తూ, యురేనస్ తో కలసి మళ్ళీ అర్గల బందీగా ఉన్నాడు.  అటూఇటూ నాలుగురాశులలోని గ్రహాలతో అర్గలదోషానికి గురైన ఈ యోగం, అధికారుల కుట్రలకు సామాన్యుడు బలికావడాన్ని సూచిస్తోంది. 
 • శుక్రవారంనాడే ఈ విధ్వంసం జరగడం గమనించండి.
మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనే ఎందుకు ఇది జరిగింది? అని డౌటొచ్చింది కదూ ! అబ్బా ! అన్నీ చెప్పేస్తారు మరి ! ఇవి చెప్పిందే ఎక్కువ !

ఇకపోతే, జ్యోతిష్యకోణాన్ని పక్కనపెట్టి మామూలుగా మాట్లాడుకుందాం. ఈ సంఘటనపైన నా అభిప్రాయాలను వినండి.

తప్పుధోరణి
 • సమస్యను శాంతియుతంగా పరిష్కారం చేసుకోవచ్చు. నిరసనను వ్యక్తం చేయడానికి మార్గాలున్నాయి. ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరియైన పనికాదు. దేశ ఆస్తులను ధ్వంసం చేసేవాళ్ళు ఆర్మీలో ఎలా పనిచేయగలరు? ప్రలోభాలకు లొంగరని, దేశద్రోహులుగా మారరని నమ్మకం ఏమిటి?
వెనుకనుండి రెచ్చగొట్టినదెవరు?
 • ఒకప్రక్క నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ లను ED విచారిస్తోంది. కాంగ్రెస్ కి ఇది మ్రింగుడు పడటం లేదు.
 • మరోప్రక్క, నూపుర్ శర్మ అనిన దాంట్లో తప్పు లేకపోయినా, దానినొక అంతర్జాతీయ గోలగా మార్చాయి ముస్లిం ఉగ్రవాద వర్గాలు.
 • దేశం మొత్తం మీద అల్లర్లు చేయాలని ముస్లింవర్గాలు, ప్రతిపక్షరాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ రెండిట్లోనూ ఉంది.
 • ఎవరో బలమైన వ్యక్తులు వెనుక అండగా లేనిదే, విద్యార్థులు, అభ్యర్థులు ఇలా రెచ్చిపోయి దాడులు చేయరు.
 • ఇది అసంఘటిత చర్య కాదు. మూడురోజులనుంచీ (పౌర్ణమి నుంచీ) దీని ప్లానింగ్ నడిచింది. వాట్సప్ గ్రూపులే సాక్ష్యాలు.
 • ఇది ప్లానింగ్ లేని దాడి అయితే, విధ్వంసకారుల దగ్గర ఇనుపరాడ్లు ఎలా వచ్చాయి? రాళ్లు ఎలా వచ్చాయి? అంతమంది ఒకేసారి  ఎక్కడనుంచి వచ్చారు?
 • 'మేము శాంతియుతంగా ధర్నా చేద్దామని వచ్చాము. మధ్యలో ఎవరో గుంపులు మాలో జొరబడి ఈ విధ్వంసం చేశారు' అంటూ ఒక యువకుడు మీడియాలో చెప్పడం గమనార్హం.
 • తెలంగాణా రాజధానిలో, జోనల్ కేంద్ర రైల్వేస్టేషన్లోనే ఇలాంటి దాడి జరపడానికి ఎంత సాహసం ఉండాలి? ఇక్కడ ఆర్మీ యూనిట్లున్నాయి. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంటుంది. పోలీసు బలగాలుంటాయి. ఇది అడవి కాదు. ఎవరి అండా లేకుండా, కేవలం అమాయకులైన స్టూడెంట్స్ వల్ల ఇంత విధ్వంసం జరుగుతుందా?
దీనివల్ల ఏం ఒరిగింది?
 • ఒక యువకుడి ప్రాణం పోయింది. రైల్వే ప్రాపర్టీని ధ్వంసం చేస్తుంటే, ఫైరింగ్ చేసే అధికారం RPF వారికి ఉంటుంది. కేసు ఉండదు. ఈ విషయం చాలామందికి తెలియదు. వెనుకనుండి రెచ్చగొట్టినవాళ్లు క్షేమంగా ఉంటారు. గొడవలు చేసినవాళ్లు ప్రాణాలు పోగొట్టుకుంటారు.
 • ఈ యువకులందరూ క్రిమినల్ రికార్డుల్లోకి ఎక్కుతారు. వీళ్లకు ఉద్యోగాలు రావు. ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులౌతారు.
ఈ నష్టం ఎలా పూడుతుంది?
 • ఈ విధ్వంసపు నష్టం 7 కోట్లని, 20 కోట్లని, 30 కోట్లని లెక్కలు మారుతున్నాయి. అది ఎన్ని కోట్లుగా చివరకు తేలినప్పటికీ, అదంతా ఎలా పూడుతుంది?
 • ఖచ్చితంగా ప్రయాణీకులపైనే ఈ భారం పడుతుంది. వచ్చే బడ్జెట్లోగాని, అంతకు ముందేగాని, టికెట్ రేట్లు పెంచుతారు. చచ్చినట్లు ప్రజలే ఈ నష్టాన్ని భరించాల్సి వస్తుంది.
ఇంతా చేస్తే, ఈ మొత్తం ఉదంతంలో ఎవరు బాగుపడినట్లు? ఎవరు నాశనమైనట్లు? ఏం సాధించినట్లు?

ఆలోచించండి.