“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

15, మార్చి 2018, గురువారం

అర్ధరాత్రి ఆడది

అర్ధరాత్రి
ఒంటరి ఆడది రోడ్డుమీద కొచ్చింది
పదిమంది మొగాళ్ళు చుట్టూ మూగారు
వాళ్ళలో అందరూ నీతులే చెప్పారు
ఎవరిని నమ్మాలో ఎవరిని కూడదో ఆమెకు తెలీదు
తెలుసుకోవడం సాధ్యమూ కాదు
ఒకరి తర్వాత ఒకరిని గుడ్డిగా నమ్మింది
ఆ తర్వాతేమైందో ఎవరైనా ఊహించగలరు
ఆమె గ్యాంగ్ రేప్ కు గురైంది
ఆ ఒక్కరాత్రి మాత్రమే...

అర్ధరాత్రి
మన దేశానికి స్వతంత్రం వచ్చింది
పదిమంది నాయకులు పార్టీలు పెట్టారు
వాళ్ళలో అందరూ నీతులే చెప్పారు
ఎవరికి అధికారం ఇవ్వాలో ఎవరికి కూడదో
ఈ దేశానికీ తెలీదు
ఒక పార్టీ తర్వాత ఇంకొక పార్టీని గుడ్డిగా నమ్మింది
అధికారం కట్టబెడుతూ వచ్చింది
ఆ తర్వాతేమౌతోందో కనిపిస్తూనే ఉంది
దేశం గ్యాంగ్ రేప్ కు గురౌతూనే ఉంది
గత డెబ్భై ఏళ్ళుగా....