నాలుగేళ్ల క్రితం గౌతమీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం జరిగి ఇలాగే ప్రయాణీకులు మంటల్లో మాడిపోయారు. మళ్లీ నిన్న తమిళ్ నాడు ఎక్స్ ప్రెస్ లో అదే రకమైన ఘటన జరిగి 30 మంది పైగా సజీవదహనం అయ్యారు.దీన్నుంచి ఎవరైనా ఏమైనా నేర్చుకున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
అమెరికాలో ట్విన్ టవర్స్ ప్రమాదం జరిగితే మళ్లీ అలాంటి ప్రమాదం ఇంకోటి జరక్కుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అనుమానం ఉన్న ప్రతిచోటా ఇప్పటికీ సోదాలు చేస్తున్నారు. చైనాలో ఒక రైలు ప్రమాదం...
31, జులై 2012, మంగళవారం
తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదం - ఎవరేం నేర్చుకోవాలి?
read more "
తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదం - ఎవరేం నేర్చుకోవాలి?
"
లేబుళ్లు:
ఇతరములు
21, జులై 2012, శనివారం
రాజేష్ ఖన్నా జాతకం -- కొన్ని ఆలోచనలు

బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా 29-12-1942 తేదీన అమృత్ సర్ లో పుట్టాడని అంటున్నారు. కాని చాలామంది అతను పాకిస్తాన్ లోని బురేవాలే లో పుట్టాడని చెప్తున్నారు. ఏది ఏమైనా అతని జనన తేదీ మాత్రం అదేనంటున్నారు.జనన సమయం ఖచ్చితంగా తెలియదు. కనుక అతని జాతకాన్ని పైపైన పరిశీలిద్దాం.
శని గురువులు వక్రీకరణ స్తితిలో ఉండటం మొదటగా కనిపించే విషయం. ఇలాంటి వారికి పూర్వకర్మ చాలా బలంగా ఉంటుంది. అయితే...
లేబుళ్లు:
జ్యోతిషం
20, జులై 2012, శుక్రవారం
రాజేష్ ఖన్నా మరణం -- రాహుకేతువుల ప్రభావం
పాతతరపు హిందీ రొమాంటిక్ హీరో రాజేష్ ఖన్నా పోయాడు. పుట్టిన ప్రతివాడూ పోకతప్పదు. మనిషి ఎన్నింటిని తప్పుకున్నా తప్పనిది చావు ఒక్కటే. అది వింత కాదు. కాని ఈ సంఘటన కొన్ని గ్రహస్తితులకు సరిగ్గా అతికినట్లు సరిపోవడం అసలైన వింత.
18-12-2011 న "మార్గశిర పౌర్ణమి - మేదినీ జ్యోతిష్యం" అని ఒక పోస్ట్ వ్రాస్తూ కొన్ని మాటలు వ్రాశాను. దాని లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
http://teluguyogi.blogspot.in/2011/12/blog-post_18.html
"పోయినసారి...
లేబుళ్లు:
జ్యోతిషం
16, జులై 2012, సోమవారం
బలులు - మొక్కులు
నిన్న ఒక పనిమీద హైదరాబాద్ లో ఉన్నాను. నా ఖర్మకాలి, నాకు పనిఉన్న ప్రదేశం నేరేడ్ మెట్ కట్టమైసమ్మ గుడి దగ్గరగా ఉంది. అక్కడ దృశ్యాలు చూస్తే పొట్టలో తిప్పి వాంతి వచ్చినంత పనైంది. నిన్న బోనాల పండగ అని అక్కడివారు చెప్పారు. ఆడవాళ్ళందరూ అమ్మవారిలాగా తయారై ముఖానికీ కాళ్ళకూ పసుపు పూసుకుని గుంపులు గుంపులుగా కలశాలు తలమీద మోస్తూ చేతిలో వేపాకులతో అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది.
గుడి ప్రహరీ గోడలోనే ఒకచోట ఒక...
లేబుళ్లు:
ఇతరములు
10, జులై 2012, మంగళవారం
విశ్వాత్మ(స్వామి విశ్వాత్మానంద) గారు ఇక లేరు
నా బ్లాగు చదువరులకు ఒక దుర్వార్త. నేను పోయినేడాది విశ్వాత్మగారి గురించి వ్రాసినప్పుడు చదివినవారికి ఆయన గుర్తుండి ఉంటారు. మొన్న ఆదివారం 8-7-2012 న హటాత్తుగా ఆయన చనిపోయారు. ఆ సంఘటన కూడా చాలా బాధాకరంగా జరిగింది. ఆయన శరీరం మూడురోజులనుంచీ విజయవాడ NTR Health University మార్చురీ లో పోస్ట్ మార్టం కోసం వేచి ఉన్నది.
ఆదివారం నాడు ఉదయమే ఆయన ఒక శిష్యునితో కలిసి సీతానగరం వైపు కృష్ణానదీ తీరంలో ఒక పూజను నిర్వహించి తిరిగివస్తున్నారు....
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
8, జులై 2012, ఆదివారం
రాహుకేతువుల ఆవృత్తులు - ప్రపంచవ్యాప్త సంఘటనలు- ఒక పరిశీలన

రాహుకేతువులు ఛాయాగ్రహాలైనప్పటికీ వాటి ప్రభావం భూమ్మీద అమితంగా ఉంటుంది అనేది సత్యం. వీటియొక్క విద్యుత్ అయస్కాంతప్రభావం భూమిమీద ఖచ్చితంగా ఉంటుంది అని ఎన్నో సార్లు రుజువైంది. వీటి యొక్క సైక్లిక్ మూమెంట్ వల్ల అనేక సంఘటనలు భూమ్మీద యాక్టివేట్ అవుతుంటాయి.ఈ రాహుకేతువులు రాశిచక్రాన్ని ఒకసారి చుట్టి రావడానికి 18 ఏళ్ళు పడుతుంది. కనుక ప్రతి 18 ఏళ్ళకూ వీటియొక్క ఒక సైకిల్ పూర్తి అవుతుంది. అందుకనే మనిషి...
లేబుళ్లు:
జ్యోతిషం
6, జులై 2012, శుక్రవారం
హిగ్స్ బోసాన్ కణావిష్కరణ - జ్యోతిష్య కోణాలు

4-7-2012 న హిగ్స్ బోసాన్ కణం కనుక్కున్నామని జెనీవాలో శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీనిని దైవకణం అంటున్నారు. ఈ కణం ఉందని ఊహాత్మకంగా లెక్కల ఆధారంగా ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నప్పటికీ దీని ఉనికిని నిర్ధారించడం ఇదే మొదటిసారి. నేను పాతికేళ్ళ క్రితం డిగ్రీ చదివే సమయంలోనే మోడరన్ ఫిజిక్స్ లో సబ్ అటామిక్ పార్టికిల్స్ గురించి చదివినప్పుడు చాలా ఇంట్రస్ట్ కలిగేది. మనకు తెలిసిన ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్...
లేబుళ్లు:
జ్యోతిషం
5, జులై 2012, గురువారం
ఇదా మానవత్వం?
నిన్న గాక మొన్న జరిగిన ఒక సంఘటన చూచాక మనుషుల మీద నమ్మకం నాకు పూర్తిగా నశించింది. మనుషుల్లో పచ్చి స్వార్ధం తప్ప ఇంకేమీ లేదనీ, మన బ్రతుకులన్నీ దొంగ బ్రతుకులేననీ, మనుషుల్లో మనుషులు లేరనీ ఉన్నవి జంతువులేననీ పూర్తిగా అర్ధం అయింది.
మొన్న గుంటూరులో ఒక వ్యానూ ఒక టూవీలరూ గుద్దుకుని, ఆ వ్యాను టూవీలర్ నడుపుతున్న వ్యక్తీ కాళ్ళ మీదుగా ఎక్కింది. అతనికి రెండు కాళ్ళూ నుజ్జు అయిపోయాయి. కుయ్యో మొర్రో అని ఏడుస్తూ రోడ్డు మీద పడి రక్షించమని...
లేబుళ్లు:
ఇతరములు
2, జులై 2012, సోమవారం
గురుపూర్ణిమ (గుండెధైర్యం లేనివాళ్ళు చదవొద్దు)
ఈరోజు ఉదయమే కొంతమంది నా దగ్గరకొచ్చి గురుపూర్ణిమ చందా అడిగారు. "సరే దాందేముంది ఇస్తాలేగాని దానితో ఏం చేస్తారు?" అని అడిగాను. సాయిబాబా గుళ్ళో ప్రత్యెకపూజ చేయిస్తామని చెప్పారు. "మామూలు పూజే వేస్ట్ అని నేననుకుంటుంటే ప్రత్యేకపూజ కూడానా?" అన్నాను. ఇంకొకసారి నా దగ్గరకొచ్చి ఇలాంటి పిచ్చిమాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. పరిస్తితి తేడాగా ఉంటుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపాను.
గురుపూర్ణిమ అంటూ రకరకాల గుళ్ళలోనూ, గురువుల...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)