“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, జులై 2010, గురువారం

ఆది శంకరుల జీవితం-జాతకం ( ఆఖరి భాగం )

ఇంతకు ముందరి పోస్ట్ లలో ఇప్పటివరకూ కొందరు నమ్ముతున్న శంకరుల జననతేదీలను జ్యోతిశ్శాస్త్ర రీత్యాపరిశీలించడం వాటిని ఖండించడం జరిగింది. ఇప్పుడు క్రీపూ 509 నాటి జనన కుండలిని పరిశీలించి చూద్దాం.

కుండలిలో లగ్నం పునర్వసు నక్షత్రంలోను చంద్రుడు ఆర్ద్రానక్షత్రంలోనూ ఉన్నారు. లగ్నం చరరాశిలోను చంద్రుడుద్విస్వభావరాశిలోను ఉండటం వల్ల అల్పాయుయోగం కలిగింది. లగ్నంచరరాశిలోను,హోరాలగ్నం ద్విస్వభావ (కన్యా) రాశిలోను ఉండటం వల్లఅల్పాయు యోగం కలిగింది. ద్వాదశంలో చంద్రుడు, ఆరింట పాప గ్రహం ఉన్నయోగం అల్పాయువును ఇస్తుంది.

తృతీయాధిపతి యైన బుధుడు వక్ర స్థితిలో ఉండటం, మరియుఅష్టమాధిపతియైన శని నీచ స్థితికి దగ్గరగా ఉండటం, తృతీయం పైన శనిదృష్టి వల్ల ఆయు:స్థానములు రెండూ బలహీనమైనాయి. కనుకఆయుర్భావం దెబ్బ తిన్నది. పై యోగాలన్నీ అల్పాయుష్షునుఇస్తున్నాయి. కనుక మొదటి నియమం సరిపోయింది.

ఇక శంకరుల ఆయష్షు జాతక ప్రకారం ఎంత వచ్చింది అనే విషయంపరిశీలిద్దాం.
ఆయుర్దాయాన్ని లెక్కించడానికి ఉన్న అన్ని విధానాలలోచాలావరకూ సరియైన ఫలితాన్ని ఇవ్వగల అంశాయుర్దాయ విధానరీత్యా శంకరుల ఆయుష్షును లెక్కించి చూద్దాము. ఆయుశ్శ్షును లెక్కించడానికి అంశాయుర్దాయమే సరియైన విధానమనిసత్యాచార్యులు చెప్పారు. వరాహమిహిరుడు, యవనాచార్యుడు వంటి మేధావులు వారికంటే ప్రాచీనుడైన సత్యాచార్యునిఆయుర్గణన విధానాన్ని మెచ్చుకున్నారు . కనుక విధాన రీత్యా గుణించగా, శంకరుల ఆయుష్షు దాదాపు 32 సంవత్సరాలు వచ్చింది. ఆయన జీవించినది సరిగా ముప్పై రెండేళ్ళే గనుక తేదీ చాలా వరకూ సత్యానికి దగ్గరిగాఉన్నది.

ఒక మనిషి
ఎన్నాళ్ళు బ్రతికాడన్నది ముఖ్యం కాదు, ఎలా బ్రతికాడన్నదేముఖ్యం. క్రీస్తు కూడా 33 ఏళ్ళే జీవించాడు అని అందరూనమ్ముతున్నారు. అది నిజంకాదు. క్రీస్తు జీవితాన్ని గురించి మరో సారిచూద్దాం. పోనీ ప్రస్తుతానికి అలాగే అనుకున్నా, ఆయన తన జీవితకాలంలో ఒక చిన్న గ్రూపును మాత్రమే తన అనుయాయులుగాచెసుకోగలిగాడు. వారిలో ఎక్కువమంది కూలీ నాలీ చేసుకునేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, అక్షరజ్ఞానం లేని వాళ్ళూను.

ఇక
మహమ్మద్ డెబ్బయ్ ఏళ్ళు పైబడి బ్రదికాడు. ఆయన జీవితమంతాయుద్ధాలతోనే సరిపోయింది. రక్తపాతంతో, ఊచకోతతో తన మతాన్నివ్యాప్తి చేస్తూ వచ్చాడు. ఒకే ఒక్క రోజున ఆయన సమక్షంలో మూడువేల మంది యూదులను, అదీ లొంగిపోయిన వారిని, పిల్లలు ఆడవారితో సహా అందరినీ మోకాటి తండా వేయించి, ఆయన అనుచరులు ఒక్క క్షణంలో తలలు నరికి చంపారు. ఇటువంటి సంఘటనలు ఆయన జీవితంలో అనేకం ఉన్నాయి. కావలసిన వారు గిబ్బన్ వ్రాసిన మహమ్మద్ జీవితంచదవమని కోరుతున్నాను. కాని శంకరులు 16 ఏళ్ళలో కేవలం పాండిత్యంతోనూ, తార్కిక పటిమ తోనూ, ఎక్కడా హింసలేకుండానే భారతదేశాన్ని మొత్తాన్నీ ఒక్క త్రాటిపైకి తేగలిగారు.

మహమ్మద్ ప్రవక్త తన మతాన్ని భావనలను ఒప్పుకోనివారిని నిలువునా నరికించాడు. కాని శంకరులు తన తలను వరంగా కోరినతన ప్రత్యర్ధి అయిన కాపాలికునికి సరే తీసుకోమని వరమిచ్చి తాను ధ్యాన సమాధిలో ఉన్నపుడు తల ఖండించితీసుకోమని చెప్పి ధ్యాన సమాధి నిమగ్నుడైనాడు. అదీ మహమ్మద్ ప్రవక్తకూ శంకరులకూ తేడా.

క్రీస్తు తన కాలంలోని సనాతన వాదులైన ఫార్సీలు, సద్ధూసీలతో శాస్త్ర పరంగా వాదించలేకపోయాడు. వారడిగిన ప్రశ్నలకుసరియైన సమాధానాలివ్వలేకపోయాడు. క్రీస్తు పెద్దగా చదువుకోలేదని చరిత్ర చెబుతున్నది. ఈయనకు అరమైక్ భాషతప్ప ఇతర భాషలు తెలీవని కూడా చరిత్ర కారులు భావిస్తున్నారు. కాని
శంకరులు ఎనిమిదేళ్ళకే నాలుగు వేదాలనుఔపోశన పట్టిన మహా పండితుడూ, మహా మేధావీ మరియు మహా జ్ఞాని. ఆయన కొన్ని వందల మంది మహాపండితులతోశాస్త్ర చర్చలలో వాదించి వారిని ఒప్పించి సత్యమైన అద్వైత మతాన్ని వారిచేత ఔననిపించారు. ఇది క్రీస్తుకూ శంకరులకూభేదం.

సందర్భంగా అరేబియా, ఇజ్రాయెల్ దేశాలవారికి, మన దేశంలోని ప్రజలకు కొన్ని భేదాలు స్ఫుటంగా కనిపిస్తాయి. కాలంలో ఇతర దేశాలలోని ప్రజలలో మూర్ఖత్వం ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాని మన ప్రాచీన భారతంలో, తార్కికంగా రుజువు కాని భావనలను, నమ్మకాలను, మతాన్ని ఒదులుకోవడానికి సిద్ధంగా ఉన్న మనస్తత్వం ప్రజలలోమతాధిపతులలో కనిపిస్తుంది. వాదనలో ఓడిన వారు తమ మతాన్ని మార్చుకొని శంకరాద్వైతాన్ని అనుసరించారు. ఇదిప్రాచీన భారత ప్రజలకు, ఇతర దేశాల ప్రజలకు భేదం.

వాదానికి తర్కానికి కట్టుబడటం, తను నమ్మిన సిధ్ధాంతాలు తప్పు అని తార్కికంగా తేలితే వాటిని వదులుకోడానికి సిద్ధపడేధీరోదాత్త మనస్తత్వాలు శంకరులతో వాదించి ఓడిన పండితులలో కనిపిస్తాయి. వారు వాదానికి కట్టుబడేవారు. ఈనాటికుహనా మేధావుల వలె, వాదనకు చర్చకు
ముందే కుల మతాల ప్రాతిపదికమీద ఒక నిర్ణయానికి వచ్చి, దాన్నిసమర్ధించుకుంటూ కుతర్కాలు చేసేవారు కారు. విదేశీ మతాధిపతులకు , ప్రాచీన భారత దేశ మతాధిపతులకు మధ్యన భేదం మనకు కనిపిస్తుంది. ఇతర మత ప్రవక్తలతో పోల్చి చూచుకుంటే శంకరుల వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో, ఎంతఉదాత్తమైనదో అర్ధం అవుతుంది.

ఇక ప్రస్తుత విషయానికొద్దాము

కుండలిలో చంద్రుడు ఆర్ద్రానక్షత్రంలో ఉన్నాడు. కనుక జననకాలానికి రాహుదశ జరిగింది. రాహుకేతువులుఉఛ్ఛస్థితిలో ఉండటం స్వామి జాతకంలో చూడవచ్చు. రాహుకేతువులు అనుకూలించిన వారి జీవితంలో టైమ్ వేస్ట్ అనేదిఉండదు. వారు తలచిన పనులు చకచకా జరుగుతాయి. వారు వచ్చిన పని ముగించుకొని నిష్క్రమిస్తారు. మొదటినుంచివారి జీవితాలు చూస్తే వీరు ఒక ఘనకార్యాన్ని సాధించడానికే పుట్టారు అనిపిస్తుంది. వారి జీవితం కూడా అలాగే సూటిగాఒక గమ్యం వైపు సాగుతుంది. అనవసర డైవర్షన్లు ఎక్కడా ఉండవు. స్వామి జీవితం కూడా అలాగే సాగడం చూడవచ్చు.

ఇక పోతే దశాంతర్దశా వివరాలు చూద్దాము

జనన కాలానికి రాహు మహర్దశ 14 సంవత్సరాల 6 నెలలు మిగిలి ఉన్నది. జాతక చక్రం మనవద్ద ఉన్నది. సమాచారంతో స్వామి జీవిత వివరాలు పోల్చి చూద్దాము.

** నాలుగు ఏళ్ళ వయస్సులో స్వామికి రాహు/శని/శుక్ర దశ జరిగింది.
రాహు శుక్రులు పితృస్థానమగు నవమ భావానికి ఆయుష్షును సూచించే మూడింట ఉన్నారు. శని అష్టమాధిపతిగానవమ స్థానంలో ఉండి తండ్రి మరణాన్ని సూచిస్తున్నాడు. అదే సమయంలో గోచార శని దశమ స్థానంలో జనన రవి పైనసంచారం చేశాడు. రవి సహజ కారక రీత్యా పితృకారకుడు. సమయంలోనే స్వామికి తండ్రి మరణం సంభవించింది.

**అయిదేళ్ళవయస్సులో స్వామికి ఉపనయనం అయింది. గోచార శని లాభస్థానానికి వచ్చి మంత్ర స్థానమగుపంచమాన్ని అందులో ఉన్న గురు,కేతువులను వీక్షిస్తున్నాడు. అందువల్లనే మంత్రోపదెశపూర్వకమైన ఉపనయనసంస్కారం జరిగింది.

** ఎనిమిదేళ్ళవయస్సుకే చతుర్వేదాలనూ ఔపోశన పట్టాడు. అప్పుడు స్వామికి రాహు దశలొ కేతు అంతర్ధశ నడిచింది. రాహువు లాభ స్థానంలోనూ, కేతువు మంత్ర స్థానమగు పంచమంలో వేదశాస్త్ర కారకుడగు గురువుతోనూఉన్నారు. కనుక సమయానికి స్వామికి వేదాధ్యయనం పూర్తి అయింది. రాహుదశ కేతు అంతర్ధశలో మనిషి జీవితంలోఒక ముఖ్య అధ్యాయం సమాప్తి అవుతుంది. తన జన్మలో ఒక ముఖ్య ఘట్టం కాని, దశగాని పూర్తి అవుతుంది. అలాగేఇక్కడా జరిగింది. కాల స్వరూపులైన రాహు కేతువులు ఇద్దరూ ఉఛ్ఛ స్తితిలో ఉన్నందువలన సర్వోత్తమమైన వేదవిజ్ఞానాన్ని సాంగోపాంగంగా సకాలంలో అందించారు.

**తొమ్మిదేళ్ళ వయసులో ఇల్లు వదలి బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించగల సమర్ధ గురువును వెదుకుతూ హిమాలయాలకుపయనం కట్టాడు. అప్పుడు స్వామికి రాహువులో శుక్ర అంతరం జరిగింది. రాహువు విదేశీ యానాన్ని, సంచారజీవితాన్ని ఇస్తాడని మనకు తెలుసు. విద్యా,లాభ స్థానాధిపతి యగు శుక్రుడు, ఉఛ్ఛరాహువు లాభస్థానంలో కలిసి ఉండిస్వామిని అన్ని విద్యలలోకీ అత్యుత్తమ విద్య అయిన బ్రహ్మవిద్యాన్వేషణా తత్పరుణ్ణి చేశారు. అదే సమయంలో ఓంకారేశ్వరక్షేత్రంలో తన గురువైన గోవిందయతిని కలుసుకోవడం శాస్త్రోక్తంగా బ్రహ్మవిద్యోపదేశం పొందటం జరిగాయి.

** పదహారేళ్ల వయసులో స్వామికి గురుదశలో గురు అంతర్దశ జరిగింది. అంతకు ముందు సరిగ్గా పదిహేనేళ్లవయసుకు స్వామికి గురు దశ మొదలైంది. అప్పటికే ఆయన జగద్గురువు అన్న పదానికి నిలువెత్తు నిర్వచనంగా తయారైఉన్నాడు. అఖండమైన జ్ఞానపటిమకు తోడు అపారమైన వేద విజ్ఞానాన్ని ఔపసన పట్టి పదిహేనేళ్ళ చిన్న వయస్సులోజగద్గురువుగా అవతరించిన మహనీయుణ్ణి తలచుకుంటే చాలు మనస్సు ఉప్పొంగుతుంది. అప్రయత్నంగా చేతులుముకుళిత హస్తాలై ఆయనకు నమస్కారం చేస్తాయి.

అదలా ఉంచితే, ఆయన పరిపూర్ణమైన గురువుగా మారిన సమయానికే ఆయన జీవితంలో గురుమహర్దశ మొదలుకావడం ఒక విచిత్రమైన ఘటన. గురువు ఆయన జాతకంలో మంత్ర స్థానంలో ఉఛ్ఛ స్థితిలోని కేతువుతో కలిసి ఉన్నట్టుమనం జాతక చక్రం లో గమనించ వచ్చు. అందువల్లనే ఆయనకు శాస్త్ర పాండిత్యంతో బాటు బ్రహ్మ జ్ఞానగరిమకూడాఅలవోకగా కలిగింది. గురువులో గురు అంతరం జరిగిన సమయంలోనే ఆయన ప్రస్థాన త్రయానికి భాష్యమ్ వ్రాశారు. అంతే కాదు మహాజ్ఞాని, కారణ జన్ముడు, వేద విభాగం చెసినవాడూ, గురోత్తముడూ అయిన వ్యాసభగవానుని దర్శనంకూడా ఆయనకు గురుదశలోనే వారణాసిలో జరిగింది.

** ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ గురు దశలోనే జరిగాయి. దుర్భర బాధలనూ దశలోనే ఎదుర్కొన్నాడు. తల్లి చనిపోతే దహన సంస్కారం చెయ్యనివ్వకుండా, కట్టెలివ్వకుండా, కనీసం శవాన్ని మొయ్యటానికి ఎవరూముందుకురాకుండా, కాలడిలోని చాందస మూర్ఖ బ్రాహ్మణులు అడ్డుపడితే, తల్లి దేహాన్ని తానొక్కడే మోసుకుని పోయి తనఇంటి పెరటిలో, ఎండిన అరటి చెట్లతో ఆమెను దహనం చేసినప్పుడు మహనీయుడు ఎంతగా బాధపడి ఉంటాడో ఊహిస్తేకళ్ళవెంట నీళ్ళు ధారలు కడతాయి.

** పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన తన గురువైన గోవింద భగవత్పాదులను నర్మదాతీరంలోని ఓంకార క్షేత్రంలోకలుసుకున్నాడు.
ఆ సమయంలో స్వామి జాతకంలో రాహువులో శుక్ర దశ జరిగి ఉండవచ్చు అని ఊహిస్తున్నాను. ఎందుకంటే, సామాన్యుల జాతకాలలో యోగాలైతే నీచత్వాన్నిస్తాయో అవే యోగాలు మహనీయుల జాతకాలలోఔన్నత్య కారకాలౌతాయి. శుక్రుడు స్వామికి మాతృస్థానాధిపతి మరియు లాభ స్థానంలో ఉఛ్చ రాహువుతో కలసిఉన్నాడు. రాహువు కూడా మళ్ళీ రాశ్యధిపతిగా శుక్రుని సూచిస్తున్నాడు. కనుక సమయంలోనే స్వామికి గురుప్రాప్తికలిగింది. కారణం? గురువు తల్లి వంటి వాడే కాదు. తల్లి కంటే ఎక్కువైన వాడు. తల్లి తన శరీరాన్ని పంచి శిశువుకు జన్మనిస్తుంది కనుక ఆమె ఋణం తీర్చుకోలేనిది. కాని గురువు తన శిష్యుణ్ణి జనన మరణ చక్రాన్ని దాటించి అమృతత్వాన్నిచేరగల దారి చూపగలడు. తన జీవితకాలమంతా శ్రమించి తాను సంపాదించిన జ్ఞానాన్ని ఏమీ ఆశించకుండా తన శిష్యునికిధారపోయగలడు. తనతో పాటు అతనికి భగవంతుని సన్నిధికి తీసుకుపోగలడు. కనుక గురువే అసలైన తల్లి, తండ్రి, సమస్తమూను. అటువంటి గురువును కలుసుకునే భాగ్యం మాతృస్థానాధిపతి, లాభస్థానాధిపతి ( రెండూ కలిసిమాతృలాభాన్ని సూచిస్తున్నాయి) అయిన శుక్రుని అంతర్దశలో స్వామికి ఒనగూడింది. ఇది చాలా సమంజసంగా ఉంది.

**
స్వామికి పదహారేళ్ళవయస్సులోనే గురు/గురు/బుధ దశ జరిగింది. సమయంలోనే ఆయన కుమారిల భట్టునుకలుసుకున్నాడు. సమయానికి కుమారిలభట్టు అగ్ని ప్రవేశం చెస్తున్నాడు. ఆయన మహాపండితుడు.దీనికితార్కాణంగా బుద్ధి కారకుడైన బుధుని విదశ సమయంలో జరుగుతున్నది. బుధునితో రవి కలసి ఉన్నందువల్లఅగ్నిప్రవేశాన్ని సూచించే రవి ఉఛ్చస్థితి కూడా సమంజసంగా ఉన్నది.

**2-1-491 BC కి సరియగు సాధారణ నామ సంవత్సర మాఘ శుక్ల సప్తమి రోజున స్వామి ద్వారకా మఠాన్నిభారతదేశపు పడమటి తీరంలో ప్రారంభించాడు. సమయానికి ఆయనకు గురు/శని/రాహు దశ జరిగింది. 17-12-486 BC కి సరియగు రాక్షస నామ సంవత్సర పుష్య శుద్ధ పూర్ణిమ రోజున ఉత్తరదిక్కునగల హిమాలయాలలొని జ్యోతిర్మఠాన్ని( నేటి జోషి మఠ్) ప్రారంభించాడు. అప్పుడు ఆయనకు గురు/శుక్ర/రాహు దశ జరుగుతున్నది. 8-4-485 BC కి సరియగునల నామ సంవత్సర వైశాఖ శుక్ల నవమి రోజున తూర్పుతీరంలోని పూరీలో గోవర్ధన మఠాన్ని ప్రారంభించాడు. గురు/శుక్ర/బుధ దశ ప్రాంతంలో జరిగింది. 24-12-484 BC కి సరియగు పింగళ నామ సంవత్సర పుష్య పౌర్ణిమ రోజునదక్షిణాదిన శృంగగిరిలో శారదాపీఠాన్ని ప్రారంభించాడు. అప్పుడు గురు/రవి/శుక్ర దశ జరిగింది.

గురు దశ యొక్క ప్రాముఖ్యత ముందే చూచాము. శనీశ్వరులు
నమవ స్థానంలో ఉండి ఆధ్యాత్మిక వ్యాపకాలనుసూచిస్తున్నారు. రాహు శుక్రులు లాభస్థానంలో ఉండి కార్య సాఫల్యతను ఇస్తున్నారు. రవి బుధులు దశమ స్థానంలో ఉండికార్య రంగంలో విజయాన్ని సూచిస్తున్నారు. కనుక గ్రహాల దశాంతర్దశలలో భారతదేశ నలుమూలలా నాలుగు ధర్మరక్షణా కేంద్రాలను స్థాపన చెయ్యడం చాలా సముచితంగా ఉన్నది. శుక్రుడు లగ్నాత్ చతుర్ధ లాభాధిపతి మాత్రమే గాక చంద్ర లగ్నాత్ మంత్ర స్థానాధిపతిగా ఉఛ్ఛ రాహువుతో ద్వాదశంలో ఉండటం ఒక గొప్ప యోగం. అందువల్లనే స్వామి జాతకంలో శుక్ర ప్రభావం అమితంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచించే వింశాంశ చక్రంలో ఆత్మ జ్ఞాన కారకుడగు రవి, మంత్ర స్థానాధిపతి యగు శుక్రుడు ఉఛ్ఛ స్థితిలో ఉండటం చూడవచ్చు.

** తన ముప్పై రెండో ఏట రక్తాక్షి నామ సంవత్సర జ్యేష్ట శుక్ల ఏకాదశి రోజున ఆయన స్వచ్చందంగా యోగమార్గంలోదేహత్యాగం చేసి తేజోమయుడైన పరమశివునిలో లీనమయ్యారు. ఇది ప్రస్తుత లెక్కల ప్రకారం 477 BC. సమయం లోఆయనకు గురు దశ అయిపోయి, శని దశలో శని అంతర్దశలో రవి విదశ జరుగుతున్నది. శనీశ్వరులు లగ్నానికి సప్తమఅష్టమాధిపతిగా మారకశక్తి కలిగినవాడు. రవి మారక సంజ్ఞమాత్రమే కలిగినవాడు. కాని స్వామి అవతరించిన పనిఅయిపోయింది కనుక ఇక లోకంలో ఉండటం అనవసరం అనుకుని ఉండవచ్చు. అదే సమయానికి గోచార శనిమేషరాశిలో ప్రవేశించి జనన రవి మీదుగా సంచారం చేశాడు. అది ఆయనకు నీచ స్థితి. ఇదే సమయంలో స్వామిదేహత్యాగమ్ జరిగింది.

సంఘటన జరిగింది హిమాలయాలలోని ఒక గుహలో అని కొందరు వ్రాశారు. కాని కాంచీ మఠ ఆచార్యులు మాత్రం ఇదికంచిలో జరిగింది అని చెబుతున్నారు. ఎందుకనగా శంకరులు కాంచీపీఠాన్ని మొదలు పెట్టిన తదుపరి తిరిగిహిమాలయాలకు పయనమై పోయిన దాఖలాలు లేవు.

స్వామి జీవితం లోని అన్ని ముఖ్య ఘట్టములూ జాతక వివరాలతో సరిపోతున్నవి గనుక ఆయన క్రీ పూ 509 లో జన్మించారని నేను విశ్వసిస్తున్నాను. ఈ సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుని ప్రాచీన భారత చరిత్రను మార్చవలసిన అవసరం ఉన్నది.

వివేకానంద స్వామి తన చివరి రోజులలో ఒక మాటన్నారు. "వివేకానందుడు ఏమి చేశాడో మరొక వివేకానందుడే అర్ధంచేసుకోగలడు". ఆయన భారత జాతి యొక్క ఆత్మను తట్టి లేపాడు. అధోముఖంగా ఉన్న భారతదేశ ధార్మికప్రవాహనికినూతన జీవాన్నిచ్చి ఊర్ధ్వగామినిని చేశాడు. అదే పనిని ఆది శంకరులు 2500 సంవత్సరాల క్రితం ఒంటి చేతితోసాధించగలిగారు. ధార్మిక పరంగా ముక్కలై పోయి ఉన్న భారతదేశాన్ని ఏకీకృతం చేసి వేదవిజ్ఞానానికి అసలైన భాష్యంచెప్పాడాయన. ఇది ఖచ్చితంగా మానవాతీతమైన ఏదో ఒక శక్తి యొక్క ప్రభావమేగాని సామాన్యమైన విషయం కాదు.

శంకరుల జీవితాన్ని సరిగా అర్ధం చేసుకోవాలంటే, ఆయన గురువైన గోవింద భగవత్పాదులు మొదటిసారి ఆయననుచూచినపుడు ఏమన్నారో వినాలి. సమాధి స్థితిలో నుంచి బయటకు వస్తూ ఆయన శంకరులతో " నిన్ను సాక్షాత్తూ పరమశివుని అవతారంగా చూస్తున్నాను" అంటారు. అటువంటి మహాపురుషులు ఎన్ని వేల ఏళ్ళకో ఒకరు మాత్రమే జన్మిస్తారు. వేదములలో ఉన్న అద్వైత సిద్ధాంతాన్ని ఆయన వెలికి తెచ్చారని అనుకోవడమేగాని అసలు ఆయన ప్రతిపాదించినభావనలు లోతుగా అధ్యయనం ఎవరూ చెయ్యరు. ఆయన భావాలను ఆచరించలేకపోయినా, కనీసం భారతీయునిగాపుట్టిన ప్రతి ఒక్కరూ భావాలను అర్ధం చేసుకున్నప్పుడే ఆయన గడ్డపైన పుట్టిన ప్రయోజనం కొంతైనానెరవేరుతుంది.