“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, మే 2010, శనివారం

గేలాక్టిక్ సెంటర్-విష్ణు నాభి-కొన్ని సంకేతాలు












గెలాక్టిక్
సెంటర్

విశ్వంలో నక్షత్ర మండలాలు అనబడే గేలాక్సీలు ఎన్నో ఉన్నాయి. సూర్యుడూ గ్రహాలూ కలిసిన మన సౌరకుటుంబం ఉన్నది పాలపుంత అనబడే ఒక గెలాక్సీలో అని మనకు తెలుసు. పాలపుంతలో మనవంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో లెక్కే లేదు. సూర్యులు ఎందరున్నారో లెక్కే లేదు. పాలపుంతకు ఒక కేంద్రం ఉంది. దానిని గేలాక్టిక్ సెంటర్ అంటారు. గెలాక్టిక్ సెంటర్ అనేది ఊహించనలవి గాని శక్తికి కేంద్రం. అది ప్రస్తుతం ధనూరాశిలో ఉంది. ధనూ రాశిలోనే గేలాక్టిక్ సెంటర్ దగ్గరగా మూలా నక్షత్రం ఉంది. ప్రాంతంలో ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉన్నదని సైన్సు అంచనా వేసింది. బ్లాక్ హోల్ ఒక పెద్ద నక్షత్రం సైజులో ఉండి, కొన్ని మిలియన్ల సూర్యుల సాంద్రతను కలిగి ఉంది.

ఇది
ఊహించ నలవి గానంత రేడియో రంగాలను వేదజల్లగల శక్తిని కలిగి ఉంది. మన సూర్యుని నుంచి ఇది దాదాపు 30,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మన సూర్యుడు తన సౌరమండల గ్రహాలతో సహా గెలాక్టిక్ సెంటర్ చుట్టూతా 200 మిలియన్ సంవత్సరాలలో ఒకసారి ప్రదక్షిణం చేస్తాడు. దీనికోసం ఆయన శూన్యంలో సెకనుకు 200 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకొక విచిత్రం ఏమిటంటే- విష్ణు నాభి అనే ప్రాంతం ఒక ఎక్కుపెట్టబడిన విల్లువంటి ఆకారంలో, ధనుస్సులాగా ఉండి ధనూ రాశి అనే పేరుకు సరిగ్గా సరిపోతూ ఉంటుంది.













విష్ణు
నాభి

మన పురాణాలు విశ్వం మొత్తాన్నీ విష్ణు స్వరూపంగా వర్ణించాయి. విశ్వం విష్ణు: అంటూ విష్ణు సహస్ర నామం కూడా చెప్పింది. విష్ణు నాబినుంచి ఉద్భవించిన కమలంలో సృష్టి మూలమైన బ్రహ్మ జననం జరిగిందని పురాణాలు చెప్పాయి. మన గెలాక్సీకి కేంద్ర స్థానం అయిన సెంటర్ ను మన భాషలో నాభి అనవచ్చు. నాభి అనగా కుదురు, కేంద్రం అని అర్ధాలున్నాయి. అంటే విష్ణునాభి అయిన గెలాక్టిక్ సెంటర్ సృష్టికి మూలం అవడానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.

ఇక్కడే ఉన్నటువంటి "మూలా" నక్షత్రమండలం ఊహకు ఆధారాన్ని కలిగిస్తున్నది. ఇందులో చాలా రహస్యాలు దాగి ఉన్నవి. సృష్టిమూలమైన మహాశక్తి ఇక్కడే ఉన్నదని మనకు సూచన ప్రాయంగా తెలుస్తున్నది.ఇదే ప్రాంతంలో ఉన్నదని సైన్స్ ఊహిస్తున్న బ్లాక్ హోల్ శక్తి స్వరూపం కావచ్చునా? విషయం పురాణాలు వ్రాశిన మహర్షులకు ఎలా తెలిసి ఉండవచ్చొ, ఈనాడు రేడియో టెలిస్కోపులకు కూడా లీలగా మాత్రమే అందుతున్న రాశికి వాళ్ళు ఆనాడే కళ్లతో చూచినట్లు "ధనూరాశి" అని ఎలా నామకరణం చేశారో, అందులో బ్లాక్ హోల్ సమీపంలోని నక్షత్రానికి "మూలా నక్షత్ర మండలం" అని ఎలా పేరు పెట్టారో మన ఊహకు అందదు.

రాహుకేతు
వులు- సృష్టి క్రమం- ఒక అంతుబట్టని రహస్యం

ధనూ రాశి బాణం ఎక్కుపెట్టిన ఒక విలుకాని రూపంలో ఉంటుంది. బాణం సరాసరి ఎదురుగా ఉన్న మిధున రాశి వైపు గురి పెట్టి ఉంటుంది. విధంగా ధనూ రాశి నుంచి మిధు రాశి వరకు ఒక గీత గీస్తే, అది జ్యోతిశ్చక్రాన్ని రెండుగా విభజిస్తుంది. మిధున రాశిలో రాహువుదైన ఆర్ద్రా నక్షత్రం ఉన్నది. ధనూ రాశిలో కేతువుదైన మూలా నక్షత్రం ఉన్నది. మిధున రాశి జంట మిధునానికి సూచిక. అనగా స్త్రీ పురుషులు జంటగా ఉన్న బొమ్మ రాశిని సూచిస్తుంది.

దీన్ని
బట్టి ఏం అర్ధం అవుతున్నది? మూలా నక్షత్రం ఉన్న ధనూ రాశి నుంచి స్త్రీ పురుషుల సృష్టి జరిగడానికి అవసరమైన శక్తి ప్రసారం మిధున రాశి వైపు జరుగుతున్నది అని తెలుస్తున్నది. అంటే ప్రధమంగా విశ్వంలో జీవావిర్భావానికి మూలం అయిన శక్తి ప్రసారం ధనూ రాశిలో ఉన్న మూలా నక్షత్ర ప్రాంతం నుంచి మిధున రాశి వైపుగా జరిగి ఉండవచ్చు.

ఇక్కడే
ఇంకొక విచిత్రం ఉన్నది. నాటికీ శిశు జననం జరిగినప్పుడు బొడ్డు కోయడం రుగుతుంది. గర్భస్ఘ శిశువుకు బొడ్డు ( నాభి) ద్వారానే తల్లినుంచి పోషణ అందుతుంది. అలాగే విశ్వం మొత్తానికీ శక్తి ప్రసారం విశ్వ నాభి అయిన గెలాక్టిక్ సెంటర్లో ఉన్న మూలా నక్షత్రం నుంచి జరుగుతూ ఉండవచ్చు. శక్తి కేంద్రంతో బంధం తెగిన మరుక్షణం జీవి మాయామోహాలకు లోబడి మానవ జన్మలోకి ఆడుగు పెట్టటం జరుగుతుండవచ్చు.











శిశు
జననానికి పట్టే తొమ్మిది నెలలు-ఇంకో జ్యోతిష రహస్యం

శిశు జననానికి తొమ్మిది నెలలు పడుతుంది. అలాగే రాశి చక్రంలో ధనూ రాశి తొమ్మిదవది. అంటే మేష రాశిలో తలతో మొదలైన శిశువు రూపం తొమ్మిది నెలలు నిండిన తరువాత ధనూరాశి చివరలో భూమ్మీదకు వస్తున్నది. తొమ్మిది రాశులను అధిగమించి, పదవ రాశి మరియు కర్మ స్థానం అయిన మకర రాశిలోకి అడుగు పెడుతూ మకరం వలె పాకుతూ కర్మల లోకంలోకి ఆడుగు పెడుతున్నది.

మూడో నెలలో పిండంలోనికి ఆత్మ ప్రవేశం జరుగుతుందని యోగవిదులు చెబుతారు. మూడో నెలలో పిండం ఆడో మగో స్ఫుటంగా తెలుస్తుంది. అందుకనేనేమో, మూడవ రాశి అయిన మిధునం యొక్క గుర్తు- స్త్రీ, పురుషులుగా ఉంటుంది. అంటే లింగ నిర్ధారణ సమయంలో జరుగుతుంది అని రహస్య సంకేతంగా సూచితం అవుతున్నది.

మూడో
రాశి అయిన మిధునం లో ఉన్నపుడు, మూడవ నెలలో, దానికి సూటిగా ఎదురుగా ఉన్న ధనూ రాశినుంచి, బాణం లాగా ఆత్మ వచ్చి పిండంలో కుదురుకుంటుందని భావం. క్రమాన్ని రహస్యంగా సూచిస్తూ ధనూ రాశి నుంచి ఎక్కుపెట్టిన బాణం దానికి ఎదురుగా ఉన్న స్త్రీ పురుషుల సంకేత రాశి అయిన మిథునం వైపుగా చూస్తూ ఉంటుంది.

అంటే
ఆత్మల పుట్టుక మూలా నక్షత్ర మండల ప్రాంతంలో జరుగుతుందా? లేక మరణం తర్వాత ఆత్మగా విశ్రాంతి తీసుకునే స్థానం ధనూరాశిలో ఉన్న మూలా నక్షత్ర ప్రాంతంలోని విపరీతమైన మహా శక్తి కేంద్రం అయిన బ్లాక్ హోల్ కావచ్చునా? మనమందరమూ మరణం తర్వాత చేరవలసిన స్థానం ఇదేనా? ఇదొక పరమ శాంతిమయ, తేజోమయ లోకం కావచ్చునా?











శ్రీ
రామ కృష్ణ- వివేకానందుల బ్రహ్మ యోని దర్శనం

వివేకానంద స్వామికి ఒకరోజున బ్రహ్మాండమైన త్రికోణాకారం ఒకటి బంగారు రంగులో వెలుగుతూ ధ్యానంలో దర్శనం ఇచ్చింది. ఆకారం జీవంతో నిండి ఉన్నట్లు ఆయనకు కనిపించింది. విషయాన్ని ఆయన శ్రీరామకృష్ణులతో చెబితే, ఆయన చాలా సంతోషించి " నీవీ రోజున బ్రహ్మ యోనిని దర్శించావు. నేను కూడా దర్శనాన్ని నా సాధనా కాలంలో పొందాను. కాని మహాత్రికోణం నుంచి అనుక్షణం అనేక బ్రహ్మాండాలు, లోకాలు వెలువడుతున్నట్లు కూడా నెను చూచాను" అని చెబుతారు. అనగా వారిరువురూ, అసంఖ్యాక లోకాలకు అనుక్షణం జన్మ నిస్తున్న ఒక మహా శక్తి కేంద్రాన్ని చూచారు. వారు చూచినది మూలా నక్షత్ర మండల ప్రాంతంలో ఉన్నటువంటి మహా శక్తి కేంద్రమైన బ్లాక్ హోల్ నేనా? ధ్యానంలో వారి మనస్సులు అన్ని కాంతి సంవత్సరాల దూరాన్ని అధిగమించి ధనూ రాశి ప్రాంతంలో ఉన్న మహా శక్తిని దర్శించి ఉండవచ్చునా?

ధ్యానాభ్యాసులు, మనకు తెలిసిన ఇరవై ఏడు నక్షత్ర మండలాలను దాటి సుదూర విశ్వాంతరాళంలోకి తమ చేతనను తీసుకుపోవలసి ఉంటుంది. బిలియన్ల కాంతి సంవత్సరాల దూరాన్ని అధిగమించి చిమ్మ చీకటితో నిండిని విశాలాంతరాళంలో ఒక నక్షత్రంలా నిరాధారంగా నిలబడవలసి ఉంటుంది. కనుక ధ్యానాభ్యాస పరులకు వారి ప్రయాణ మార్గంలో ఈ నక్షత్ర మండలాలు, కాంతి విస్ఫులింగాలు, జ్యోతిశ్చక్రాలు, దేవతా లోకాలు అన్నీ దర్శనం ఇస్తాయి.

ధనూ రాశి జాతకులు

ధనుస్సు లగ్నంగా గాని, రాశిగా గాని కలిగిన వారు, లేదా గ్రహమైనా జాతకంలో ధనుస్సు 26 డిగ్రీల ప్రాంతంలో ఉన్నవారు గెలాక్టిక్ సెంటర్ తో సూక్ష్మ అనుసంధానం కలిగి ఉంటారు. వారు చాలా ఆత్మాభిమాన సంపన్నులు కావడమే కాదు, ఉన్నత ఆశయ పరులు కూడా అయి ఉంటారు. వారి జీవితాలు చాలావరకూ ఇతరులకు శక్తినివ్వటంతోనే సరిపోతుంటాయి. ఇదంతా విష్ణు నాభి యొక్క ప్రభావమే.

వివేకానంద
స్వామి ధనూ లగ్నంలో పుట్టడమే గాక ఆయన జాతకంలో సూర్యుడు ధనూ రాశిలోనే ఉన్నాడు. కనుకనే ఆయన విశ్వం మొత్తానికీ ఉత్తేజ పూరితమైన ఆత్మ శక్తిని ప్రసాదించగల మహా శక్తి రూపుడయ్యాడు. ఆయనకు గెలాక్టిక్ సెంటర్ తో సూక్ష్మ అనుసంధానం ఉండేది. అక్కడ నుంచే ఆయనకు విశ్వశక్తి ప్రసారం జరిగేది.

ధనూ రాశి ఇరవై ఆరు డిగ్రీలు- ఒక శక్తి కేంద్రం

గోచారంలో గ్రహమైనా ప్రాంతంలోకి వచ్చినపుడు భూమి మొత్తాన్నీ ప్రభావితం చెయ్యగల మార్పులు జరుగుతుంటాయి. చంద్రుడు ప్రతినెలా ఒక సారి, సూర్యుడు ఏడాదికి ఒక సారి ప్రాంతంలోకి వస్తారు. ఆయా సమయాలలో గమనిస్తే ఒక శక్తి బదిలీ (Energy shift) ను గమనించవచ్చు. ముఖ్యంగా రాహు కేతువులు, శని, గురువు, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో మొదలైన దూర గ్రహాలు డిగ్రీల మీద సంచారం చేస్తున్నప్పుడు ధ్యానాభ్యాసకులకు చాలా అనుకూలమైన స్పందనలు ఉంటాయి.

విపరీతమైన శక్తి విష్ణు నాభి నుంచి ఆయా గ్రహాల ద్వారా భూమికి సరఫరా అవుతుంది. ఇదంతా కూడా, అధ్యాత్మికంగా కొంత పురోగతి సాధించిన వాళ్లకు బాగా అనుభూతిలోకి వస్తుంది. మామూలుగా ఏళ్ళు పట్టే ఆధ్యాత్మిక పురోగతి సమయాలలో చాలా త్వరగా జరుగుతుంది. సాధకులు సమయాలను వృధా చేస్తే చాలా నష్ట పోయిన వారౌతారు.

శక్తి సాధకులకు, తంత్ర సాధకులకు సమయం చాలా మంచిది. గెలాక్టిక్ సెంటర్ నుంచి రాహువు ద్వారా ప్రస్తుతం విపరీతమైన శక్తి భూమికి చేరుతున్నది. కనుక సాధకులైన వారు సమయాన్ని వృధా చెయ్యక సాధన తీవ్రతరం చేస్తే, విశ్వ శక్తి యొక్క ప్రసారంతో, చక్కని ఫలితాలు వారి అనుభవంలో వారే చూడవచ్చు.

ఇంకొక విచిత్రం!!! ఈ వ్యాసం వ్రాసిన సమయంలో కూడా చంద్రుడు మూలా నక్షత్రానికి దగ్గరగా వస్తూ, గెలాక్టిక్ సెంటర్ కు దగ్గరగా ఉన్నాడు. ఇది కాకతాళీయంగా జరిగిందని అనుకోలేక పోతున్నాను.