8, నవంబర్ 2026, ఆదివారం

పూర్ణాయుష్కుడు లాల్ కృష్ణ అద్వానీ

ఒక వ్యక్తి 66 ఏళ్ళనుండి 99 ఏళ్ల లోపు బ్రతికితే  దీర్ఘాయుష్కుడనీ, నూరుదాటి నూట ఇరవైవరకూ బ్రతికితే పూర్ణాయుష్కుడనీ జ్యోతిషశాస్త్రం అంటుంది. ఆ లెక్కన లాల్ కృష్ణ అద్వానీగారు పూర్ణాయుష్కుడే.

ఈయన 8 నవంబరు 1927 న, నాటి లాహోర్ లో పుట్టాడు. సమయం ఉదయం 9.27 గంటలు. తేదీలప్రకారం ఈరోజున 99 ఏళ్లను పూర్తిచేసుకుని 100 లో అడుగుపెట్టాడు. ఈయన జాతకంలోని పూర్ణాయుర్యోగాలను గమనిద్దాం.

కుజరాశిలో శనికేతువులుండటం తపస్వీయోగం. తపస్సనేది హిమాలయాలలోనే చేయనక్కరలేదు. ఒక గమ్యంకోసం తపిస్తూ బ్రతికేది ఏదైనా తపస్సే అవుతుంది. తపించడమే తపస్సని జిల్లెళ్ళమూడి అమ్మగారనేవారు. భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో చూడాలని తపించిన దేశభక్తుడీయన. కనుక ఈయనయొక్క జాతకంలో ఈ యోగం ఉండటం వింత ఏముంటుంది?

ఈ యోగం క్రమశిక్షణను ఇస్తుంది. ఇది ఉన్నవాడు జీవితాన్ని చాలా క్రమబద్ధమైన విధానంలో జీవిస్తాడు. ఆహారవిహారాలలో జాగ్రత్తగా ఉంటాడు. కనుక ఎక్కువకాలంపాటు బ్రతుకుతాడు. శని లగ్నంలో ఉన్నవాడు క్రమశిక్షణతోనే జీవిస్తాడు. పైగా శనికి తృతీయాధిపత్యం కూడా పట్టింది. తృతీయం ఆయుస్థానాలలో ఒకటని మనకు తెలుసు.

ఆఫ్కోర్స్, ఆయుష్షనేది చాలావరకూ జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ, క్రమశిక్షణాయుతమైన జీవితంతో జీన్స్ ను కూడా మార్చుకోవచ్చు. ఇది కష్టమేగాని, అసాధ్యమేమీ కాదు.

తపస్వియోగంపైన గురుదృష్టి చాలామంచిది. ఇది మార్గంలోని అడ్డంకులను తొలగిస్తుంది. గురువక్రత్వం వల్ల  ఆయనయొక్క పంచమదృష్టి మిథునంపైన పడుతుంది. ఇది లగ్నం నుండి అష్టమభావమౌతుంది. అష్టమభావం ఆయుస్థానం గనుక, దీర్ఘాయుష్షు లభిస్తుంది.

ఈయనది అశ్వినీరాశి రెండవపాదం. దేవవైద్యుల నక్షత్రం గనుక, ఏదైనా అనారోగ్యం కలిగినప్పటికీ త్వరగా తేరుకునే శక్తిని ఈ నక్షత్రం ఇస్తుంది.

రవిశుక్రులు నీచస్తితులలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, లగ్నంలో శనివల్ల రవికి, చంద్రునికి సప్తమంలో బుధునివల్ల శుక్రునికీ నీచత్వంపోయి రాజయోగంగా మారుతుంది.

చంద్రునినుండి తృతీయాధిపతి బుధుడు సప్తమకేంద్రంలో ఉండటంచేత, వక్రతవల్ల ఉచ్ఛస్థితి పట్టడంచేత ఆయుష్షుకు బలం కలిగింది. అష్టమంలోని తపస్వీయోగం ఆయుష్షును పెంచుతుంది. అష్టమశని దీర్గాయుష్షునిస్తాడు.

సూర్యునినుండి తృతీయాధిపతి గురువు స్వస్థానంలో ఉన్నాడు. వక్రత్వం వల్ల కలిగే పంచమస్థితి గురుదృష్టిని సూర్యునిపైన ఉంచుతుంది. దీనివల్ల కూడా ఆయుష్షు  పెరుగుతుంది. నవమాధిపతి బుధుని లగ్నస్థితి మంచిది. వక్రత్వం వల్ల ద్వాదశభావంలో ఉచ్ఛస్థితి లభిస్తుంది. తులాలగ్నానికి ద్వాదశభావం మంచిదే. లగ్న/అష్టమాధిపతి శుక్రునికి ద్వాదశంలో ఉచ్ఛత్వం కూడా మంచిదే. అష్టమంలో రాహువుయొక్క ఉచ్ఛస్థితి ఆయుష్షుకు మంచిది.

ఆరూఢలగ్నం కన్య అవుతుంది. దానినుండి తృతీయంలో తపస్వియోగం ఉన్నది. అష్టమంలో పూర్ణచంద్రుడున్నాడు. కనుక ఇక్కడనుండి కూడా ఈ రెండుభావాలూ బలంగా ఉన్నాయి.

దీనికితోడుగా నవాంశచక్రంలో  సూర్యుడు, చంద్రుడు, గురువు ముగ్గురూ ఉచ్ఛస్థితులలో ఉన్నారు.

ఇన్ని గ్రహస్థితులు ఈయన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ భద్రంగా చూస్తున్నాయి. కనుక విజయవంతంగా 99 ఏళ్లను పూర్తిచేసుకుని 100 వ ఏడులోకి అడుగుపెట్టాడు.

రాజకీయాలలో ఉంటూ నిండునూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతకడం చాలా కష్టం. దానికెంతో క్రమశిక్షణతో కూడిన జీవితమూ, దైవానుగ్రహమూ ఉండాలి. అవి రెండూ ఈయనకున్నాయని ఈ జాతకయోగాలు చెబుతున్నాయి.

మోదీగారు అద్వానీగారి శిష్యుడే. ఆయనతో కలసి పనిచేసిన అనుచరుడే. తమ తరంవారు కలలుగన్న భారతదేశాన్ని, తన శిష్యుని నాయకత్వంలో అన్నిరంగాలలో ముందుకు దూసుకుపోతున్న భారతదేశాన్ని చూచి కనీసం తన జీవితం చివరిదశలోనైనా, తృప్తిపడగలగడం అద్వానీగారి జాతకంలోని అదృష్టం.

మనదేశం ఎన్నో ఒడిదుడుకులను, గాంధీనెహ్రూల కాలంనాటి కుట్రలను, కుతంత్రాలను తట్టుకుంటూ, ఏ విధంగా వాటిని దాటుకుంటూ ఈ స్థితికి వచ్చిందో, ఈ క్రమంలో ఎంతమంది సమిధలై చరిత్రపుటలలో కలసిపోయారో గత ఎనభైఏళ్లుగా చూస్తూ వచ్చిన ఇలాంటి కురువృద్ధులు తమ జ్ఞాపకాలను, అనుభవాలను అక్షరబద్ధం చేయాలి. 

2008 లో విడుదలైన ఈయన ఆత్మకథ My country, My life నేను చదవలేదు. చూడాలి ఏం వ్రాశాడో !

read more " పూర్ణాయుష్కుడు లాల్ కృష్ణ అద్వానీ "

ఉపవాసాలతో చనిపోతే జీసస్ కనిపిస్తాడా? సో వాట్?


వెర్రితలలేసే క్రైస్తవప్రచారాలు  ఎలాంటి దారుణమైన రూపాలు తీసుకుంటాయనేదానికి కెన్యా పాస్టర్ పాల్ మెకంజీ  కేసు ఒక ఉదాహరణ. 

మొన్న 6 వ తేదీన కెన్యా కోర్టు ఇతనికి 200 ఏళ్ల జైలుశిక్ష వేసింది. 28 మంది ఇతని అనుచరులకు కూడా శిక్షలు పడ్డాయి. నేరం? తిండిపెట్టకుండా మాడ్చి, హింసించి, 440 మందిని వీళ్ళు చంపేశారు. వాళ్లంతా ఎవరు? పాపం అమాయక క్రైస్తవభక్తులు. వాళ్లలో 190 మంది చిన్నచిన్న పిల్లలే. 

ఎందుకలా చేశాడు? అలా చనిపోతే స్వర్గానికి పోతారని, జీసస్ ను కలవొచ్చని తన చర్చిలో చేసిన బోధలతో జనాన్ని నమ్మించాడు. పిచ్చిజనం నమ్మారు. చచ్చారు. తవ్వితే ఆ శవాలన్నీ బయటపడ్డాయి. వాళ్లలో కొంతమందిని బ్రతికుండగానే పూడ్చేసినట్లు ఆధారాలు దొరికాయి.

కెన్యాలో పేదరికం ఎక్కువ. ఇతను పెద్దగా చదువుకోలేదు. బాల్యం బాధాకరంగా గడిచింది.  టాక్సీ డ్రైవర్ అయ్యాడు. ఆ కసితో విద్యావ్యవస్థపైనా, వైద్యంపైనా, విదేశీ సంస్కృతిపైనా ద్వేషం పెంచుకున్నాడు. ఒకరకంగా సైకో అయ్యాడు. తన టాక్సీలో ఎక్కిన ప్యాసింజర్లతో మాటలు కలిపి బోధలు చేసేవాడు.

మెల్లిగా ఒక చర్చి పెట్టాడు. దానిపేరు 'గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్'. విదేశీ (బ్రిటిష్, అమెరికా) సంస్కృతిని, వాళ్ళ విద్యా వైద్యవిధానాలను వ్యతిరేకించేవాడు. చదువుకోవద్దని, ఇంగ్లీషు మందులు వాడద్దని ప్రచారం చేసేవాడు. అయితే, విదేశాలలో పుట్టిన క్రైస్తవమతాన్ని మాత్రం స్వీకరించాడు. క్రమేణా వేలాదిమంది అనుచరులు పోగయ్యారు. సొంత టీవీ ఛానల్ పెట్టాడు. 2019 లో ఇతనిపైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పోలీసులు ఆ చర్చిని మూయించారు.

షకహోలా అనే ఒక అడవిలోకి మకాం మార్చాడు. అందులో 800 ఎకరాలను ఆక్రమించాడు. అక్కడే తన చర్చిని నడిపేవాడు. ప్రయివేట్ ఆర్మీలాంటి దానిని ఏర్పాటు చేసుకున్నాడు.వందలాది గుడిసెలను నిర్మించాడు.

బోధించి, భయపెట్టి, కొట్టి, తన అనుచరులను వారి పిల్లలను వాటిలో బంధించేవాడు. అదొక కాన్సెన్ట్రేషన్ క్యాంప్ లాంటిది. మోడ్రన్ లైఫ్ అంతా సైతాన్ మాయ అనీ, దానినుంచి బయటపడి ఉపవాసప్రార్ధనలు చేస్తూ చనిపోవడం ఒక్కటే జీసస్ ను చేరుకోవడానికి మార్గమని భోధించేవాడు. నెలల తరబడి ఆ ఉపవాసాలు తట్టుకోలేక తన చర్చి ఆవరణలోనుంచి పారిపోవాలని ప్రయత్నించిన పెద్దలను, పిల్లలను, తన అనుచరులతో కొట్టించి, వారిని చంపేసి అక్కడే పూడ్చేసేవాడు. అలాంటి శవాలు 500 పైనే ఉన్నాయని అంటున్నారు. 440 ఇప్పటికి బయటపడ్డాయి.

ఏప్రిల్ 2023 లో విచారణ మొదలైంది. 2026 లో తీర్పు వచ్చింది.

కెన్యాలోనే  కాదు. మనదేశంలో కూడా ఇటువంటి అబద్ధప్రచారాలతో అమాయకులను నమ్మించి మతాలు మారుస్తున్న పాస్టర్లు చాలామంది ఉన్నారు. అయితే, ఈ లెవల్లో ఉపవాసప్రార్ధనలు చేసి చనిపొమ్మని వాళ్ళు చెప్పకపోవచ్చు. కానీ, రకరకాల ఆశలు చూపి, హిందూమతమంటే ద్వేషం ఎక్కించి, మతం మారుస్తున్నారు. ఇదొక పెద్ద లాభసాటి వ్యాపారమై పోయింది. పిచ్చిజనం మోసపోతున్నారు.

ఇతను పుట్టినది 1973 లేదా 1976 అని నెట్ చెబుతోంది. సరియైన జననవివరాలు లేవు.  అది 1973 అని నేనంటాను. కారణం? 1973 లో మాత్రమే అటువంటి నరరూపరాక్షస యోగం ఉంది. చార్టు పైనిచ్చాను చూడండి.

రాహుకేతువులు, గురువు నీచస్థితులలో ఉన్నారు. వక్రగురువుకు గురుఛండాలయోగం పట్టింది. శనికేతుయోగం ఉంది. కుజగురురాశుల సంబంధం ఉన్న కుజునికి, ఉచ్ఛబుధునితో దృష్టి ఉండటం వల్ల మొండితనం, పాస్టర్ వేషం, అతితెలివీ ఏర్పడ్డాయి. ఈ యోగాలు 1976 లో లేవు.  కనుక, ఇతను పుట్టినది 1973 లో మాత్రమే.

14 ఏప్రిల్ 2023 న ఇతను అరెస్టయ్యాడు. సరిగ్గా అది మేషసంక్రాంతి సమయం అయింది. గోచార శనిగురువుల దృష్టి రహస్యాలకు నెలవైన వృశ్చికంపైన ఉంది. అందుకే ఇతని రహస్యాలన్నీ ఆనాడు బయటపడ్డాయి. మూడేళ్ళ విచారణ తర్వాత ఇప్పుడు శిక్ష పడింది.

ఇండియాక్రైస్తవులు, కమ్యూనిస్టులు, కాంగ్రెసువారు ఇలాంటి న్యూసుల గురించి మాట్లాడరు. పేపర్లు కూడా మాట్లాడవు. బ్రాహ్మణులు గుళ్ళలో రేపులు చేస్తున్నారని నేహాబోరా అంటే, పేపర్లన్నీ దాన్ని మొదటిపేజీలో వేస్తాయి. ఇలాంటి వార్తలకు మాత్రం ప్రచారం ఉండదు. ఆమె ఎన్ని రేపులను దగ్గరుండి చూసిందో పాపం ! లేదా బాధితురాలేమో !

ఒకవేళ ఎక్కడైనా ఎవడో ఒక పూజారి అలాంటిపనిని చేస్తే, హిందువులు అతన్నేమీ క్షమించరు. వాళ్లే శిక్షిస్తారు. లేదా, శిక్ష పడాలని నిస్పక్షపాతంగా కోరుకుంటారు. అంతేగానీ, క్రైస్తవులు ముస్లిములు చేసేటట్లుగా అటువంటివాడిని నిస్సిగ్గుగా వెనకేసుకురారు. సమర్ధించరు.

అసలు, క్రైస్తవం, ఇస్లాం బోధించే స్వర్గమూ నరకమూ రెండూ అబద్దాలే. అవి లేవు. వాటి పేరుతో అమాయకులను భయపెట్టి మోసం చేస్తున్నారు. అంతే!

అదేవిధంగా, జీసస్ రెండవరాకడ కూడా అబద్దమే. అది జరగదు. కొన్ని ఇస్లాం శాఖలలో చెప్పేటట్లు 'మెహదీ' మళ్ళీ వస్తాడనే భావన కూడా అబద్దమే. అంతిమతీర్పు అనేది లేనేలేదు. అది అబ్రహామిక్ మతాల మాయ. అదీ అబద్దమే. 

సరే వాళ్ళ అబద్దాలను వాళ్ళు చెప్పుకోనివ్వండి. కానీ ఇతర మతాలపైన, ముఖ్యంగా హిందూమతం పైన, బురదజల్లడం, ద్వేషం రెచ్చగొట్టడం మాత్రం తప్పులే.

స్వర్గనరకాలనేవి పెద్దభ్రమలని  ఉపనిషత్తులలోని వేదాంతభావనలంటాయి. అందుకే నేనంటాను, వేదాంతాన్ని అధ్యయనం చేస్తేనే, అసలైన హిందూమతమేమిటో అర్ధమౌతుందని. పురాణాలను పట్టుకొని కూచుంటే అదెప్పటికీ అర్ధం కాదు. వేదాంతపు కోణం నుండి పురాణాలను చదివినపుడు మాత్రమే అసలైన హిందూమత స్వరూపస్వభావాలు అర్ధమౌతాయి. 

కానీ నేడు ఏ హిందూమత బోధకులూ దీనిని చెప్పడం లేదు. ఉత్తపురాణాలను బోధిస్తున్నారు. వాటిని పట్టుకొని అవే సర్వస్వమైనట్లు జనం  కొట్టుకుంటున్నారు.

సరిగ్గా చెప్పేవారూ లేరు. చెప్పినా వినేవారూ లేరు. అదే మనకు పట్టిన దరిద్రం.

పాల్ మెకంజీ లాంటివాళ్లు చరిత్రలో చాలామందున్నప్పటికీ, అమ్ముడుపోయిన మీడియా, ఇలాంటి న్యూసులకు అంత ప్రాధాన్యతనివ్వదు. ఇస్తే, జార్జి సోరోస్ ఇచ్చే డబ్బులు ఆగిపోతాయి కదా !

క్రైస్తవం నూరిపోస్తున్న ఇలాంటి అబద్ధాలతో ఎంతమంది ఈ విధంగా భ్రమలలో పడిపోతున్నారో మరి? అసలూ, అంతమంది తనను నమ్మిన అమాయకులు అలా దారుణంగా చంపబడుతుంటే, జీసస్ ఏం  చేస్తున్నాడు? మెకంజీకి దర్శనమిచ్చి "ఒరే  అలా  చెయ్యకురా. తప్పురా" అని చెప్పాలి కదా? మరెందుకు చెప్పలేదో?

బైబిలు అబద్ధాలనూ, పాస్టర్ల అబద్ధాలనూ నమ్ముతున్న అమాయక క్రైస్తవులను ఆ జీససే రక్షించాలి. ఆయనంటూ అసలెక్కడైనా ఉంటే !

read more " ఉపవాసాలతో చనిపోతే జీసస్ కనిపిస్తాడా? సో వాట్? "

1, నవంబర్ 2026, ఆదివారం

ఇజ్రాయెల్ కు ఏం కాబోతోంది?

ఇజ్రాయెల్ ఎన్నికలయ్యాయి.  ఈ దేశ భవిష్యత్తు ఎలా ఉందో చూద్దాం.

రాజకీయ విశ్లేషణ

ప్రస్తుతం ఇజ్రాయెల్ లో 38 పార్టీలున్నాయి. అన్నీ ఎన్నికలలో పాల్గొన్నప్పటికీ, 11 పార్టీలు మాత్రమే చట్టసభలో అడుగుపెట్టగలిగే ఓట్లసంఖ్యను పొందాయి. 

చట్టసభలో 120 సీట్లున్నాయి. వాటిలో నెతన్యాహు కూటమికి 53, ప్రతిపక్షానికి 48, అరబ్ పార్టీలకు 19 సీట్లొచ్చాయి. నెతన్యాహు కూటమిలో 5 మిత్రపక్షపార్టీలున్నాయి.

విచిత్రమేంటంటే ప్రతిపక్షం కూడా యూదులదే. నేషనల్, లిబరల్ అని అధికార, ప్రతిపక్ష యూదు పార్టీలను అనుకోవచ్చు. నేషనల్ భావజాలం ఉన్న నెతన్యాహు కూటమేమో, ఇజ్రాయెల్ యూదుల దేశమని, అయితే అరబ్బులు, క్రైస్తవులు మొదలైనవారు శాంతియుతంగా, కొన్ని హద్దులకు లోబడి ఉండవచ్చని అంటుంది. ప్రతిపక్ష యూదులేమో అరబ్బులను ఇతరులను కూడా ఉండనివ్వాలని, అయితే వారికి హద్దులు పెట్టకూడదని అంటారు. 

ఈ రెండువర్గాలుగా విడిపోవడమే యూదులు చేస్తున్న అతిపెద్ద తప్పు. కలిసి ఒకేమాటమీద ఉంటే వీళ్లకు మొత్తం 101 సీట్లొచ్చేవి. చీలడం వల్ల, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత మెజారిటీ (61 సీట్లు) ఎవరికీ రాలేదు. ఈ క్రమంలో  వీరి విపక్షమైన అరబ్బులు బలపడుతున్నారు.

మనదేశంలో హిందువులు చేస్తున్న తప్పునే, ఇజ్రాయెల్ లో యూదులు చేస్తున్నారు. అందుకే ఇండియా, ఇజ్రాయెల్ రెండూ ఒకేబాటలో నడుస్తున్నాయి. రెండింటి భవిష్యత్తూ గందరగోళమే.

ఐకమత్యం లేకపోవడమే యూదులకూ హిందువులకూ గల ప్రధానమైన లోపం. అదే వారి శాపం కూడా.

ఇది రాజకీయ విశ్లేషణ. ఇప్పుడు, జ్యోతిషశాస్త్ర పరంగా గమనిద్దాం.

జ్యోతిష విశ్లేషణ

ఇజ్రాయెల్ కు 14-5-1948 న స్వాతంత్రం వచ్చింది. సమయం సాయంత్రం 3. 50. ఇప్పుడు జాతకాన్ని పరిశీలిద్దాం.

ఈ జాతకంలో పాక్షిక కాలగ్రస్తయోగం, మాలికాయోగం, నిత్యఏడుపు యోగం, ఎండ్రకాయ యోగాలున్నాయి. మొదటి రెండూ సరే, చివరి రెండూ ఏమిటని మీకు సందేహం రావచ్చు. సంస్కృతపదాలైతే మీకు అర్ధంకావడం కష్టమని, తేలికగా ఉండాలని, మీ సౌలభ్యం కోసం  వాటిని నేనే పెట్టాను.

ఎప్పుడూ ఏదో సమస్యతో ఏడుస్తూ ఉండేది నిత్యఏడుపు యోగం. ఒకడు ఎదుగుతుంటే, పదిమంది కలిసి వాడిని క్రిందకు లాగేది ఎండ్రకాయయోగం. బాగున్నాయి కదా ! ఎంతసేపూ గ్రంధాలలో ఉన్న పదాలనే వాడితే ఎలా? మనమూ కొన్ని సృష్టించాలిగా ! 

పోతే, సూర్యుడు బలహీనుడు. గురుబలం లేదు. చంద్రబలం లేదు.

శత్రువులు మిత్రులలాగా నటిస్తూ వెన్నుపోటు  పొడుస్తారు. ఆపదలమధ్యన దారులు వెతుక్కుంటూ బ్రతుకుతారు. 'దినదినగండం నూరేళ్లాయుష్షు' అనే సామెత సరిగ్గా సరిపోతుంది. అంత గొప్ప జాతకమేమీ కాదు.

నవాంశ చక్రాన్ని గమనిద్దాం.

ఇంటిదొంగలతో, వాళ్ళ కుట్రలతో ప్రమాదం ఉంటుంది. ఏది చేయాలన్నా అనేకవర్గాలనుండి ప్రతిఘటన ఉంటుంది. కొన్ని దూరదేశాల పైన ఆధారపడి ఈ దేశం ఎక్కువగా నడుస్తుంది.

ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశానికి రాహు మహర్దశ నడుస్తున్నది. ఇది 2022 లో మొదలై, 2040 వరకూ ఉంటుంది. ఇది మంచిదశ కాదు. యుద్ధాలు, కష్టనష్టాలతో కూడి నడుస్తుంది.

ఈ దశలో, 2025-27 మధ్యలో రాహు-గురుదశ నడుస్తుంది. ఇదే సమయంలో, గోచార యురేనస్, 9వ భావంలోని బలహీన సూర్యుడు, బుధులపైన సంచరిస్తున్నాడు. కనుక ఇతరదేశాల జోక్యాలు, కుట్రలు, మన దేశంపైన ఉన్నట్లే, ఈ దేశంపైన కూడా చాలా ఉన్నాయి. ఈ సమయంలో నమ్మకద్రోహాలు, వెన్నుపోట్లు ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్నది అదే. నమ్మకద్రోహాలు, కుట్రలవల్లనే ఈ ఎన్నికలలో అరబ్ పార్టీలు డిసైడింగ్ ఫేక్టర్స్ గా అవతరించాయి.

ఎవరికైతే మనమంటే పడదో,  ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, వాళ్లనే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఏమౌతుంది? అదే ప్రస్తుతం అక్కడ  జరుగుతోంది. ముందుముందు ఇక్కడా జరుగుతుంది.

2027-30 మధ్యలో రాహు-శనిదశ నడుస్తుంది. ఈ దశలో ఇజ్రాయెల్ చాలా నష్టపోతుంది. గందరగోళం ఎక్కువౌతుంది. అల్లర్లు, కష్టనష్టాలు, సంక్షోభం ఎదురౌతాయి. 

2030 తర్వాత వచ్చే బుధదశలో, ఇతరదేశాల సహాయంతో మాత్రమే ఈ సంక్షోభం నుండి ఇజ్రాయెల్ గట్టెక్కుతుంది.

ప్రస్తుతానికి మాత్రం ఇజ్రాయెల్ పరిస్థితి ఏమీ బాగాలేదు. భవిష్యత్తుకూడా, 2030 వరకూ అస్సలు బాలేదు.

యహోవానే ఈ దేశాన్ని రక్షించాలి !

read more " ఇజ్రాయెల్ కు ఏం కాబోతోంది? "