ప్రస్తుతం తిరుపతిలో మకాం.
పుస్తకప్రదర్శనలో మన స్టాల్ ను సందర్శిస్తున్నాం. ఒకరోజున ఇతరస్టాళ్లను చూచుకుంటూ నడుస్తుండగా ఒకాయన ఆపి, ' నేను కొన్ని సూక్తులను వ్రాసాను. చూడండి ' అంటూ ఒక కాగితాన్ని చూపించాడు.
సరే ఏంటో చూద్దామని దృష్టి సారించాను.
దానిపైన మొదట్లోనే 'ఓం శ్రీ సాయినాధాయ నమః' అని వ్రాసుంది. దానిక్రింద ఏవేవో నీతులు రాసున్నాయి. ఇలాంటి మెంటల్ కేసులను చాలామందిని చూచి ఉన్నానేమో, వెంటనే ఆ కాగితాన్ని అతనికిచ్చేసి ' మీ సూక్తులు మొదట్లోనే పెడదారి పట్టాయి. ముందు దీన్ని మార్చండి. ఆ తరువాత ఇతరులకు నీతులు చెప్పచ్చు ' అంటూ ఆ లైన్ చూపించాను.
సాయిబాబా గురించి నేనంటున్నానని అతనికి అర్థమైంది.
'మీకు బాబా నచ్చకపోతే వదిలేసి, మిగతాదాంట్లో మంచిని తీసుకోండి' అన్నాడు తెలివిగా.
వాళ్ళు చేస్తున్న తప్పేంటో వాళ్లకు అర్ధంకాదు. కానీ ఈ అతితెలివికి మాత్రం తక్కువేమీ ఉండదు.
'గ్లాసు పాలల్లో స్పూను విషం కలిసింది. విషం వదిలేసి పాలు మాత్రమే త్రాగమంటే ఎలా వీలవుతుంది? మీరు త్రాగగలరా?' అన్నాను.
అతనికి నోటమాట రాలేదు.
' సాయిబాబాకీ నాథసాంప్రదాయానికీ సంబంధం ఏంటసలు? సాయినాథ, ఏసునాధ, ఏంటి ఇదంతా? ఇలాంటి సంకరపదాలు, సంకరమంత్రాలు తయారుచేసినవాడికి అసలు మతుందా పోయిందా?' అడిగాను.
అతనలాగే చూస్తున్నాడు.
'తురకబాబాకి బీజాక్షరాలు జోడించినంత మాత్రాన ఆయన హిందువు కాలేడు. మీరు మాత్రం చివరకు ఎటూకాకుండా అయిపోతారు. నా ఈ సూక్తిని మీ సూక్తులకు చేర్చుకోండి' అని చెప్పి నా దారిన ముందుకొచ్చేశాను.
మత్స్యేంద్రనాధుడు, గోరఖ్ నాధుడు మొదలైన నవనాథులు మహాసిద్ధులు. వారందరూ ఈశ్వరభక్తులు. ఆ పేరుని కూడా కల్తీ చేస్తున్నారు నేటి కుహనాహిందువులు.
'ఎంత అజ్ఞానంలో ఉన్నార్రా హిందువులారా? మీకు చెప్పేవాడు లేడు. ఉన్నా మీరు వినరు. మీ ఖర్మ ఇంతే' అనిపించింది.