అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

31, మే 2021, సోమవారం

ఆస్ట్రేలియాలో ఎలుకల బెడద - రాహుకేతువుల ప్రభావం

SA - South Australia; NSW- New South Wales; QL- Queensland;ఒక దేశాన్ని గాని, కుటుంబాన్ని గాని, మనిషిని గాని ఒకే విధమైన దురదృష్టం వదలకుండా వెంటాడుతున్నదంటే దానికి తప్పకుండా కారణాలుంటాయి.  ఆ కారణాలలో కొన్ని మాత్రమే మనకు కనిపిస్తాయి. కనిపించని కారణాలు ఎన్నో ఉంటాయి. వాటినే 'పూర్వకర్మ' అంటాము. మనిషి జాతకంలో అయితే, ఆ పూర్వకర్మను కనిపెట్టి తొలగించుకునే ఉపాయాలుంటాయి. వాటినే పరిహారక్రియలంటారు. అయితే,...
read more " ఆస్ట్రేలియాలో ఎలుకల బెడద - రాహుకేతువుల ప్రభావం "

30, మే 2021, ఆదివారం

ఆస్ట్రేలియాలో ఎలుకల వర్షం ఎందుకు?

ఈ విషయాన్ని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారో లేదో నాకు గుర్తులేదు. ఎందుకంటే దానిని నా చిన్నపుడు చదివాను. అందులో ఇదుందో లేదో మీరే చెప్పాలి.ఆస్ట్రేలియాలో ప్రస్తుతం లక్షలాది ఎలుకలు వీరవిహారం చేస్తున్నాయి. ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. పంటలను, నిలువ చేసిన ధాన్యాన్ని లక్షల ఎలుకలు తినేస్తున్నాయి. అవి ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయి. కొన్ని ఇళ్లలో అయితే, కప్పులనుంచి జలజలా ఎలుకల వర్షం కురుస్తోందట. ట్రాప్ పెడితే...
read more " ఆస్ట్రేలియాలో ఎలుకల వర్షం ఎందుకు? "

27, మే 2021, గురువారం

యాస్ తుఫాన్ భీభత్సం - కుజశుక్రుల ఆచ్చాదనా యోగపు మరో ఫలితం

అతి పెద్ద తుఫాన్ల పట్టికలో చేర్చబడిన 'యాస్' తుఫాను ఇండియాను, బాంగ్లాదేశ్ ను గత మూడు రోజులుగాఎలా వణికించిందో చూసాం. లక్షలాది మంది ప్రజలు దీనివల్ల ఈ మూడు రోజులుగా నానా అగచాట్లు పడ్డారు. కొంతమంది చనిపోయారు కూడా. ఇది కూడా ఆచ్చాదనాయోగపు మరో ఫలితమే. నేనింతకు ముందు కూడా చెప్పాను, ఒకే గ్రహయోగం అనేక దేశాలలో అనేక విధాలుగా ఫలితాలు చూపిస్తుందని. దానికి యాస్ తుఫాను కూడా మరో ఉదాహరణ !23 వ తేదీన బంగాళాఖాతంలో...
read more " యాస్ తుఫాన్ భీభత్సం - కుజశుక్రుల ఆచ్చాదనా యోగపు మరో ఫలితం "

శాన్ జోస్ కాల్పులు - ఆచ్చాదనాయోగం

26-5-2021 బుధవారం నాడు ఉదయం 6-24 గంటల ప్రాంతంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో, శాన్ జోస్ లోని ఒక రైల్వే యార్డులో ఒక వ్యక్తి జరిపిన కాల్పులలో ఎనిమిది మంది చనిపోయారు. చివరకు నేరస్తుడు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు.  పదిహేను సంవత్సరాలు అతనితో కాపురం చేసి విడాకులు తీసుకున్న అతని మాజీ భార్య చెప్పిన ప్రకారం అతనికి చాలా కోపం ఉండేది. సాటి ఉద్యోగులతో గొడవలు పడుతూ ఉండేవాడు. చివరకు ఇలా...
read more " శాన్ జోస్ కాల్పులు - ఆచ్చాదనాయోగం "

20, మే 2021, గురువారం

పానీ పూరీ - బూజు బ్రెడ్డు

కరోనాకు తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగసంట !అసలీ రోగాలు ఎలా పుడతాయో, వీటిని ఎవడు కనుక్కుంటున్నాడో అర్ధం కాక తెగ ఆలోచిస్తుంటే మాగన్నుగా నిద్రపట్టేసింది. నిద్రలో కల! కలలో యధావిధిగా తనే ప్రత్యక్షమైంది. తనంటే మళ్ళీ అపార్ధం చేసుకోకండి. కర్ణపిశాచే !కుశలప్రశ్నలూ అవీ అయ్యాక, నా సందేహాన్ని తనదగ్గరే వెలిబుచ్చాను.'అసలేంటీ గోల? ఈ కరోనా ఏంటి? బ్లాక్ ఫంగస్ ఏంటి? అసలివెప్పట్నుంచీ ఉన్నాయి? ఎందుకిప్పుడే విజృంభిస్తున్నాయి? సెలవివ్వుము' అనడిగా.కర్ణపిశాచి...
read more " పానీ పూరీ - బూజు బ్రెడ్డు "

16, మే 2021, ఆదివారం

టౌటే తుఫాన్ - శుక్ర రాహువుల ప్రభావం

14-5-2021 తేదీన కేరళదగ్గరలోని అరేబియా మహాసముద్రంలో ఒక వాయుగుండం పుట్టింది. 15 వ తేదీకల్లా అది తుఫానుగా మారింది. నేటికది ఇంకా తీవ్రరూపం దాల్చింది. గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయి. నూరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తుఫాన్ చేసే అల్లకల్లోలాన్ని సరిగ్గా ఎదుర్కోడానికి మూడురాష్ట్రాలూ సిద్ధపడుతున్నాయి. మంత్రులు వెస్ట్ కోస్ట్ లో మకాం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుని...
read more " టౌటే తుఫాన్ - శుక్ర రాహువుల ప్రభావం "

12, మే 2021, బుధవారం

రష్యా స్కూల్లో కాల్పులు - అమావాస్య ప్రభావం

11-5-2021 మంగళవారం ఉదయం 9. 20 నిముషాలకు రష్యాలోని కజాన్ సిటీలో ఒక స్కూల్లో, ఒక దుండగుడు జరిపిన కాల్పులలో తొమ్మిదిమంది విద్యార్థులు చనిపోయారు. 18 మంది విద్యార్థులు గాయపడ్డారు. దుండగుడు ఇంతకుముందు అదే స్కూల్లో చదివాడని అంటున్నారు. అతనికి మానసిక సమస్యలున్నాయని కూడా అంటున్నారు. జ్యోతిష్యపరంగా ఏం జరిగిందో చూద్దాం.నిన్న నిండు అమావాస్య. అమావాస్యరోజున పిచ్చోళ్లకు పిచ్చి ఉద్రేకిస్తుందన్నది ప్రపంచవ్యాప్తంగా...
read more " రష్యా స్కూల్లో కాల్పులు - అమావాస్య ప్రభావం "

11, మే 2021, మంగళవారం

ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ - జ్యోతిష్య విశ్లేషణ

జెరూసలేం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ మళ్ళీ రాజుకుంది. చిలికి చిలికి గాలివానౌతోంది. ఇజ్రాయెల్ మీద పాలస్తీనా రాకెట్ దాడులు చేసింది. చాలామంది చనిపోయారు. ఇజ్రాయెల్ ప్రతీకారదాడులు మొదలుపెడితే ఏమౌతుందో  అన్ని దేశాలకూ తెలుసు. అందుకని అందరూ రంగంలోకి దిగి ఇజ్రాయెల్ ను ఆగమంటున్నారు. కానీ ఇజ్రాయెల్ ఆగదు. దెబ్బకు దెబ్బ తీస్తుంది. తియ్యకపోతే అన్ని ముస్లిందేశాల మధ్యన దాని మనుగడే ప్రశ్నార్థకమౌతుంది.ముందు...
read more " ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ - జ్యోతిష్య విశ్లేషణ "

కర్ణుడి చావు - కరోనోపాఖ్యానం

మొన్నొక రోజున కరోనా వైరస్ కలలో కొచ్చింది.అదేంటోగాని నాకెప్పుడూ ఇలాంటి కలలే వస్తుంటాయి. ఏ అప్సరసైనా కల్లోకి రాకపోతుందా అని కళ్ళు కాయలు కాచేలా అర్ధరాత్రి దాకా ఎదురుచూచినా ఒక్కతీ కలలోకి రాదు. కరోనా లాంటివి కలల్లో కొస్తుంటాయి. ఖర్మ ! ఏం చేస్తాం?'ఏంటి ఇలా వచ్చావ్?' అనడిగా నీరసంగా.'చూశావా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా కోటిమందిని లేపేశా' అంది గర్వంగా.'అదేంటి? WHO లెక్కల ప్రకారం ఇప్పటిదాకా పోయినవాళ్లు 3.2 మిలియన్ మాత్రమే. అంటే 32 లక్షలు....
read more " కర్ణుడి చావు - కరోనోపాఖ్యానం "

9, మే 2021, ఆదివారం

ఆఫ్ఘనిస్తాన్ కారుబాంబు దాడి - జ్యోతిష్య విశ్లేషణ

8-5-2021 శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో ఒక స్కూల్ బయట జరిగిన కారుబాంబు దాడిలో 50 మంది స్కూలు పిల్లలు చనిపోయారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది ఆడపిల్లలు.ఏం జరిగిందో జ్యోతిష్యపరంగా చూద్దాం.ఏయే రాశులు ఏయే దేశాలను సూచిస్తాయి అన్న విషయం మీద ఇప్పటివరకూ జ్యోతిష్య ప్రపంచంలో స్పష్టత లేదు. నేను చేస్తున్న ఈ రీసెర్చి ఆ లోటును పూరిస్తున్నది. గతంలో నన్ను...
read more " ఆఫ్ఘనిస్తాన్ కారుబాంబు దాడి - జ్యోతిష్య విశ్లేషణ "

6, మే 2021, గురువారం

స్వామి నిర్మలానంద - ఒక విస్మృత మహనీయుడు -3 (జాతక విశ్లేషణ)

స్వామి జననసమయంలో చంద్ర - రవి - బుధదశ జరిగిందని అన్నాను. ఇందులో అమావాస్యయోగం, బుధాదిత్యయోగం, గృహకలహయోగం కలసి ఉన్నాయి. కనుక ఈయనకు గృహసౌఖ్యం లేదని, జీవితం కష్టాలమయమని, ఈయనకు అమితమైన తెలివితేటలున్నాయని, ఎంతో  లోకప్రసిద్ధి కలుగుతుందని, కానీ చివరకు అనామకంగా ఈయన చరిత్ర ముగుస్తుందని జననకాలదశ చెబుతోంది. ఈ విధంగా జననకాలదశ లోని యోగాలద్వారా జీవితం మొత్తాన్నీ ఒకచూపుతో సింహావలోకనం చెయ్యవచ్చు. ఇది...
read more " స్వామి నిర్మలానంద - ఒక విస్మృత మహనీయుడు -3 (జాతక విశ్లేషణ) "