ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఫంక్షన్ జరుగుతూ ఉండగా, ఇంకొకాయన్ని తీసుకొచ్చి 'ఈయన మా ఇంకో గురువుగారు' అంటూ మళ్ళీ పరిచయం చేశాడు మొదటాయన.
'ఈయన మూడో కృష్ణుడన్నమాట' అనుకుంటూ ఆయనవైపు నిర్లిప్తంగా చూస్తూ జీవం లేని చిరునవ్వొకటి నవ్వాను.
ఆయనకూడా నావైపు అలాగే చూస్తూ 'నమస్కారం' అన్నాడు ఏదో అనాలి అన్నట్టు.
నేనుకూడా ఏడిచినట్టు ముఖం పెట్టి 'నమస్కారం' అన్నాను. కానీ లోలోపల మాత్రం నవ్వు ఉబికి వస్తోంది.
ఇక మూడో గురువుగారి పరిచయం మొదలైంది.
'ఈయన...
26, మార్చి 2019, మంగళవారం
గుడ్డి గురువులు - 2
ఇలా కాసేపు ఆలోచించి, 'ఇక చాల్లే' అనుకుంటూ పక్కనే ఉన్న వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టాను. మేము మాట్లాడుకుంటూ ఉండగా ఏనుగులా ఉన్న ఒక పిలకశాల్తీ ఉన్నట్టుండి మా గుంపులో జొరబడి - 'ఏంటి బాగున్నావా?' అంటూ మాలో ఒకరిని పలకరించి మా మాటలకు అడ్డు తగిలింది.
ఆ శాల్తీ వైపు తేరిపార చూచాను. ఏదో గుళ్ళో పూజారిలా అనిపించింది.
లోకంలో ఎవరన్నా సరే, నాలో ద్వేషభావం లేకుండా ఉండటానికి ఎప్పుడూ నేను ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ ఇద్దరు వ్యక్తులను మాత్రం...
లేబుళ్లు:
చురకలు
18, మార్చి 2019, సోమవారం
Christchurch Shooting - Astro pointers

15-3-2019 మధ్యాన్నం 1-40 కి న్యూజీలాండ్ లోని క్రిస్ట్ చర్చ్ అనే ప్రదేశంలో రెండు మసీదులలో జరిగిన కాల్పులలో ఒకచోట 50 మంది ఇంకో చోట 7 మంది కాల్చబడ్డారు.
ముస్లిమ్స్ అంటే విపరీతమైన ద్వేషం ఉన్న బ్రెంటన్ హారిసన్ టారంట్ అనే వైట్ రేసిస్ట్ చేసిన పని అది. ఆ సమయానికి ఉన్న గ్రహస్థితులను పరికిద్దాం.
కుజ శనుల మధ్యన కోణదృష్టి
---------------------------------------
కోణదృష్టి మంచిదని సాధారణంగా జ్యోతిష్కులందరూ...
లేబుళ్లు:
జ్యోతిషం
11, మార్చి 2019, సోమవారం
ఇథియోపియా విమాన ప్రమాదం - జ్యోతిష్య కోణం

ఆదివారం ఉదయం ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇధియోపియా ఎయిర్ లైన్స్ విమానం ET302 కూలి పోయింది.దానిలో ఉన్న 35 దేశాలకు చెందిన 157 మంది చనిపోయారు. ఇందులో మన భారతీయులు కూడా ఉన్నారు.
రాహుకేతువులు, యురేనస్ గోచార ఫలితాలకు అనుగుణంగానే, రాహువు వాయుతత్వ రాశిలోకి అడుగుపెట్టీ పెట్టకముందే ఘోరమైన వాయుప్రమాదం జరగడం గమనార్హం.
ఇంకో రెండురోజులలో సూర్యుడు రాశి మారి కుంభరాశి నుండి మీనరాశికి పోతున్నాడు. ప్రస్తుతం...
లేబుళ్లు:
జ్యోతిషం
5, మార్చి 2019, మంగళవారం
శివరాత్రి జాగారం
సామూహిక శివరాత్రి అభిషేకాలున్నాయ్
మీరూ రమ్మని పిలిచారు పరిచయస్తులు
సామూహికం ఏదీ నాకు పడదు
నేను రానని మర్యాదగా చెప్పాను
నాలుగు ఝాముల్లో నాలుగు రకాల పూజలు
నాలుగు రకాల నైవేద్యాలున్నాయ్
వచ్చి చూచి తరించమన్నారు
మీరు తరించండి నాకవసరం లేదన్నాను
నిద్రకు ఆగలేవా అని హేళనగా అడిగారు
నిద్రపోతూ మెలకువగా ఉంటానన్నాను
శివరాత్రి జాగారం చెయ్యాలన్నారు
జీవితమంతా జాగారమే అన్నాను
ఏమీ తినకుండా వాళ్ళు ఉపవాసం ఉన్నారు
అన్నీ తిని నేనూ ఉపవాసం ఉన్నాను
రాత్రంతా...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)