నిజమైన అదృష్టవంతులు మాత్రమే మాతో చేయి కలుపుతారు

9, ఫిబ్రవరి 2023, గురువారం

నేటి నుండి విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభంనేటి నుండి 19 తేదీ వరకూ విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గరలో గల పాలిటెక్నీక్ కాలేజీ గ్రౌండ్స్ లో, బుక్ ఫెస్టివల్ జరుగుతున్నది. దీనిలో 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' కు స్టాల్ నంబర్ 157 కేటాయించబడింది. అందులో మా పుస్తకాలన్నీ లభిస్తాయి. ఇంకా చెప్పాలంటే, మా పుస్తకాలు మాత్రమే లభిస్తాయి.

'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' (ఇండియా) సెక్రటరీ శ్రీరామమూర్తి, ఇంకా ఇతర సభ్యులు అక్కడ మీకు అందుబాటులో ఉంటారు. పంచవటి కార్యక్రమాలను గురించి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను గురించి, వారితో మాట్లాడి మీరు తెలుసుకోవచ్చు.

మా సాధనావిధానాన్ని గురించి, సనాతనధర్మాన్ని గురించి మీకున్న సందేహాలను వారితో మాట్లాడి తీర్చుకోవచ్చు. స్పష్టతను పొందవచ్చు.

మాతో కలసి నడవాలనుకునేవారు, శ్రీ రామమూర్తిగారిని మా స్టాల్ వద్ద సంప్రదించండి.