“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, మే 2015, ఆదివారం

Telugu Melodies-Jesudas-Sigalo Avi Virulo..



'సిగలో అవి విరులో..' అంటూ సాగే ఈ మధుర గీతం 'మేఘసందేశం' అనే సినిమా లోనిది.ఈ సినిమా 1982 లో వచ్చింది. అందులో అన్నీ హిట్ అయిన పాటలే.ఆ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు.

ప్రస్తుత గీతం ఘజల్ చాయలలో ఉన్న ఒక మధుర గీతం.ఇది కూడా ఎప్పటికీ మరపురాని టైం లెస్ క్లాసిక్ గీతమే.దానికి కారణం ఈ పాటను వ్రాసినది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.దీనిని జేసుదాస్ అద్భుతంగా పాడారు.

నేనీ సినిమాను ఇంతవరకూ చూడలేదు.దానికి కారణం ఏమంటే, ఇది రిలీజైన సమయానికి నేను గుంతకల్ లో ఉన్నాను.అప్పటికే నాకు సినిమాల మీద ఇంటరెస్ట్ పూర్తిగా పోయింది. యోగం,వీరవిద్యలు,తంత్రసాధన- ఇవే నా అప్పటి సమయాన్ని పూర్తిగా ఆక్రమించేశాయి.

ఈ సినిమా చాలా బాగుంటుందని అప్పటినుంచీ ఇప్పటివరకూ చాలామంది చెప్పారు.కేన్స్ ఫెస్టివల్ కు వెళ్లిందని కూడా చెప్పారు.కొద్దిగా సమయం చూచుకుని ఇప్పుడా సినిమాని యూ ట్యూబ్ లో చూడాలి.

ఈ ప్రస్తుత పాటలో కొన్ని అధ్బుతమైన భావాలను పొదిగిన పంక్తులున్నాయి.


'చిరునవ్వుల అరవిడిన
చిగురాకు పెదవుల మరిగి
మరలి రాలేవు నా చూపులు..
మధువుకై మెదలు తుమ్మెదలూ..'

అనే భావాన్ని కృష్ణశాస్త్రి గారు మాత్రమే వ్రాయగలరు ఇంకెవరూ ఇంత అద్భుతంగా వ్రాయలేరు అనిపిస్తుంది.ఇకపోతే,ఈ పాటను జేసుదాస్ అంతే అద్భుతంగా పాడారు.

వీటిలో మొదటి రెండూ జయదేవుని అష్టపదులు.వీటిని కూడా చక్కని మరపురాని మధురరాగాలలో మలిచారు సంగీత దర్శకుడు రమేష్ నాయుడు.మూడవ పాటను కృష్ణశాస్త్రిగారు వ్రాశారు.

Movie:--Megha Sandesham(1982)
Lyrics:--Devulapalli Krishna Shastri
Music:--Ramesh Naidu
Singer:--K.J.Jesudas
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
---------------------------------
[సిగలో అవి విరులో... అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో... మసలే వలపు తొలకరులో]-2
సిగలో అవి విరులో...

[ఎదుట నా ఎదుట...
ఏవో
సోయగాల మాలికలు]-2
మదిలోనా గదిలోనా...మదిలోనా గదిలోనా
మత్తిలిన కొత్త కోరికలు
నిలువనీవు నా తలపులు...
మరీ మరీ ప్రియా... ప్రియా
నిలువనీవు నా తలపులు
నీ కనుల ఆ పిలుపులూ...

సిగలో అవి విరులో.. అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో.. మసలే వలపు తొలకరులో.
సిగలో అవి విరులో...

[జరిగి... ఇటు ఒరిగి
పరవశాన ఇటులే కరిగి]-2
చిరునవ్వుల అరవిడిన...
చిగురాకు పెదవుల మరిగి
చిరునవ్వుల అరవిడిన...
చిగురాకు పెదవుల మరిగి
మరలి రాలేవు నా చూపులు...
మరీ మరీ ప్రియా. ప్రియా.
మరలి రాలేవు నా చూపులు...
మధువుకై మెదలు తుమ్మెదలూ.. 

సిగలో అవి విరులో.. అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో.. మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో...