15, మే 2026, శుక్రవారం

సనాతనాన్ని మళ్ళీ నిర్మూలిద్దాం

'సనాతనాన్ని నిర్మూలించాలి' అని ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ అన్నాడు. దానికి వంతపాడుతూ TVK ఎమ్మెల్యే ముస్తఫా 'సనాతనాన్ని నిర్మూలించడానికే మేము పుట్టాము' అన్నట్లుగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి  జోసెఫ్ విజయ్ ఏమీ మాట్లాడలేదు. ఊరకే చూస్తూ కూచున్నాడు.

కేరళలో కాంగ్రెస్ వచ్చింది. కర్ణాటకలో ఇప్పటికే ఉంది. తమిళనాడులో హిందూవ్యతిరేక ప్రభుత్వమే ఒక క్రొత్త ముసుగులో మళ్ళీ వచ్చింది.  తెలంగాణాలో కాంగ్రెస్ ఉంది. ఆంధ్రా ఒక్కటే అటూ ఇటూ ఊగులాడుతోంది.

ఇది చాలా మంచి పరిణామం.

పదిహేనేళ్ల తర్వాత, రాష్ట్రం సర్వనాశనం కాబోతున్న అంచులో మాత్రమే బెంగాల్ కు బుద్దొచ్చింది. ఇప్పుడు తవ్వుతుంటే సరిహద్దులలో వందలాది సొరంగాలు బయటపడుతున్నాయి. కోటిమంది పైన బాంగ్లాదేశ్ ముస్లిములు, రోహింగ్యాలు మన దేశంలో ఇప్పటికే ఉన్నారు. బెంగాల్లో బీజేపీ రాకపోయి ఉంటే ఒకటి రెండేళ్లలో దేశం పాకిస్తాన్ బాంగ్లాదేశ్ ల చేతులలోకి వెళ్ళిపోయి ఉండేది. కనీసం చివరి నిముషంలోనైనా బెంగాలీలు కళ్ళు తెరిచారు. సంతోషం.

కానీ దక్షిణాది అయిదురాష్ట్రాలకు మాత్రం ఇంకా తెలివి రావడంలేదు. బహుశా ఇంకా ఇంకా చేతులు కాలాలేమో? అప్పుడు మాత్రమే కళ్ళు తెరుస్తారేమో? 

ఈ వైరస్ ను ఇప్పుడు సౌత్ రాష్ట్రాలు పెంచి పోషిస్తున్నాయి. వీటికెప్పుడు బుద్ధొస్తుందో తెలీదు. చూడబోతే మన దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనికిరాదని అనిపిస్తోంది. ఇదంతా ఊహించే, ఇలా జరగాలని చాలా ముందునుంచి కోరుకునే, ఇటువంటి పరిపాలనావ్యవస్థను, ఇటువంటి రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారేమో ఘనత వహించిన నాయకులనిపిస్తోంది.

పూర్తిగా కుళ్లిపోయేదాకా కళ్ళు మూసుకోవడం, చివర్లో లబో దిబో అనడం మనకు అలవాటేగా?

తమిళనాడు హిందువులారా !  లేవకండి. ఇదేవిధంగా నిద్రపోతూ ఉండండి. 'మిమ్మల్ని నాశనం చెయ్యడానికే మేం వచ్చాం' అనేవాళ్లకే ఓట్లేసి గెలిపించండి. ఉదయనిధికి, ముస్తఫాకి,  జోసెఫ్ విజయ్ లాంటి వాళ్ళకి పూర్తిగా మద్దతివ్వండి.  కాళ్లకు మొక్కండి. సన్మానాలు చెయ్యండి. వెనక్కు తగ్గద్దు. ఇదే అజెండాతో ముందుకెళ్ళండి. ఒకనాటికి మీకే తెలుస్తుంది.

వ్యక్తిగతస్వార్ధాలకోసం దేశాన్నే ముంచేసేవాళ్ళని మన దేశంలోనే చూడగలం మరి !

It happens only in India !