“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, జూన్ 2023, శుక్రవారం

ఘర్ వాపసి

పాకిస్తాన్ సోషల్ మీడియా ప్రముఖుడు  ఫేషన్ మోడల్, షయాన్ అలీ ఇస్లాం మతాన్ని వదలిపెట్టి హిందూధర్మాన్ని స్వీకరించాడు. కృష్ణభక్తునిగా మారాడు. కారణం? కాశ్మీర్ మీద ఒక వీడియో చేసున్న పాకిస్తాన్ ఆర్మీ, దానికి మ్యూజిక్ చెయ్యమని ఇతన్ని కోరింది. ఇతను కాదన్నాడు. ఇక ప్రతీకారం మొదలైంది. 'నువ్వు 'రా' ఏజెంట్ వి. ఇజ్రాయెల్ ఏజెంట్ వి' అంటూ అతన్ని నానా హింసలు పెట్టారు. వెంటాడారు. ప్రాణభయంతో పాకిస్తాన్ వదలి పారిపోయిన ఇతను అమెరికాలో తలదాచుకున్నాడు. తాను ఇస్లాంను వదిలేస్తున్నామని ప్రకటన చేశాడు.

తన పూర్వీకుల మతమైన హిందూ (సనాతన) ధర్మాన్ని ఇకనుంచి అనుసరిస్తానని ప్రకటించాడు. కొన్నేళ్ళనుంచి ఆ ధర్మాన్ని అధ్యయనం చేస్తున్నానని, అది తనకు బాగా నచ్చిందని అన్నాడు. పాకిస్తాన్ ఆర్మీ తనను వేటాడి హింస పెడుతున్నప్పుడు అల్లా తనను ఏమాత్రం రక్షించలేదని, కృష్ణుడే తనను రక్షించాడని అన్నాడు. ఇస్కాన్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపాడు.

హిందూమతాన్ని వీడి ఇతర మతాలలోకి మారుతున్న అజ్ఞానులకు ఇలాంటి సంఘటనలు కనువిప్పు కావాలి.

అసలు, పాకిస్తాన్ ముస్లిములు గాని, వాళ్ళను సమర్ధించే ఇండియా ముస్లిములు గాని తెలుసుకోవలసిన విషయం ఒకటుంది.

ఇప్పటి ముస్లిముల పూర్వీకులందరూ హిందువులో, పార్సీలో, ఇంకా ఇతర చిన్న చిన్న మతాలకు చెందినవారో అయి ఉంటారు. ఇస్లాం రాక మునుపు పర్షియా (నేటి ఇరాన్) లో జొరాష్టర్ మతం ఉండేది. అది ఇస్లాం లాగా క్రూరమైన మతం కాదు. దాని అనుచరులే నేడు ఇండియాలో మనం చూస్తున్న పార్సీలు. ఇస్లాం అరాచకాలకు తట్టుకోలేక కట్టుబట్టలతో పర్షియా నుండి  పారిపోయి వచ్చి ఇండియాలో స్థిరపడిన వాళ్లే వీళ్ళు.

అదే విధంగా, నేడు కాశ్మీర్ లో ఉన్న ముస్లిముల పూర్వీకులు చాలామంది హిందువులే. చౌధురీ, భట్ మొదలైన పేర్లున్న ముస్లిములందరి పూర్వీకులూ కాశ్మీరీ పండిట్లే. అంటే బ్రాహ్మణులే. రాణా అన్న పేరున్న ముస్లిముల పూర్వికులు హిందూ క్షత్రియులు. మతం మారడం ద్వారా వీళ్ళందరూ మాతృధర్మానికి ద్రోహం చేసినవారే.

అదే విధంగా, నేటి ఇండియన్ క్రైస్తవుల పూర్వీకులందరూ హిందువులే. మధ్యయుగాలలోని హిందువులు జిజియా పన్ను కట్టలేక, నవాబులిచ్చే రాయితీలకు ఆశపడి, లేదా ప్రాణభయంతో మతాలు మారినవారే గాని, హిందూమతంలో లేనిదేదో ఇస్లాంమతంలో  ఉండటం వల్ల మాత్రం కాదు. ప్రస్తుతకాలంలో క్రైస్తవ మతంలోకి మారుతున్న హిందువులు కూడా డబ్బుకు ఆశపడో, కులపరంగా రెచ్చగొట్టబడో మతాలు మారేవారే గాని, క్రైస్తవమతంలో ఏదో ఉండి మాత్రం కాదు.

అసలు, హిందూధర్మంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఏమీ లేదు. మన గ్రంధాలను, బైబిలు, ఖురాన్ మొదలైన ఇతర మతాల గ్రంధాలను కూలంకషంగా అధ్యయనం చేస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమౌతుంది. బైబిలును క్షుణ్ణంగా చదివినవాడెవడూ క్రైస్తవంలోకి మారడు. క్రైస్తవంలో ఉండడు. అదే విధంగా ఖురాన్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాడెవడూ ఇస్లాంలోకి మారడు, ఇస్లాంలో ఉండడు. మూర్ఖంగా ఆ మతాలను అనుసరించేవారు ఆయా గ్రంధాలను పూర్తిగా చదవనివారే. వాటిల్లో ఏముందో తెలిస్తే, మానవత్వం ఉన్న వాడెవడూ వాటిలో ఉండలేడు.

షయాన్ అలీ అదే చేశాడు. తన పూర్వీకుల మతమైన హైందవ (సనాతన) ధర్మంలోకి ఘర్ వాపసీ అయ్యాడు. ఇన్నాళ్లకు అతడిని దేవుడు కరుణించాడు. హింసమతాన్ని వీడి సత్యధర్మంలోకి అడుగుపెట్టాడు. కోట్లాది ఇతర ముస్లిములు ఇతన్ని ఆదర్శంగా తీసుకోవలసి ఉంది. కోట్లాది క్రైస్తవులు కూడా వాస్తవాన్ని తెలుసుకొని ఘర్ వాపసి కావలసిన అవసరం ఉంది.

భారతదేశం మళ్ళీ హిందూదేశంగా మారినప్పుడే దేశంలో శాంతి నెలకొంటుంది. ఇది సత్యం.  అంతేకాదు, ప్రపంచశాంతి కూడా అప్పుడే విలసిల్లుతుంది.

'నీ పొరుగు వాడిని నీలాగా ప్రేమించు' అని జీసస్ చెప్పాడు. ఇది హిందూమతం నుంచి  పక్కా కాపీ కొట్టబడిన భావన. జీసస్ పుట్టిన యూదుమతంలో ఈ భావన ఎక్కడా లేదు. అంతేకాదు, జీసస్ పుట్టక ముందు ఎన్నో వేల ఏళ్ల నుంచీ భారతదేశంలో హిందువులందరూ దీనిని పాటిస్తున్నారు. కానీ నేటికీ క్రైస్తవులు దీనిని పాటించడం లేదు. వాళ్ళ కేకు మనం తింటాం. కానీ మన ప్రసాదం వాళ్ళు తినరు. మనకు పరమతసహనం పుట్టుకతో వస్తుంది. వాళ్ళకు ఇతర మతాలంటే ద్వేషం ఎక్కించబడుతుంది. కనుక హిందూమతమే శాంతిమతం అనేది రుజువు అవడం లేదా?

'ఇస్లాం అంటే శాంతి' అని  ముస్లిములంటారు. కానీ ఇస్లాం చరిత్ర అంతా రక్తంతో తడిసిన చరిత్ర. ఇస్లామిక్ దేశాలలో ఎక్కడా శాంతి అనేది నేటికీ లేదు. ఇతర మతాలను అది ఛస్తే ఒప్పుకోదు. 'యూదులను, క్రైస్తవులను, ముస్లిములు కానివారిని ఎక్కడికక్కడ చంపండి' అని ఖురాన్ లో స్పష్టంగా వ్రాయబడి ఉంది.  ఇలాంటి బోధలు చేసే మతం శాంతిమతం ఎలా అవుతుంది? ఊరకే చెప్పుకుంటే సరిపోతుందా?

ఇతర మతాలు 'శాంతి శాంతి' అని అరుస్తాయి. కానీ ఆచరణలో మాత్రం హింసను ప్రేరేపిస్తాయి. హిందూధర్మం అలా కేకలు పెట్టదు, మాయమాటలు చెప్పదు. ఆచరణలో శాంతిని ఆచరించి చూపిస్తుంది. అదే ఇతర మతాలకు హిందూధర్మానికి ఉన్న భేదం.

ఈ  విషయం అందరికీ తెలుసు. కానీ, ఘర్ వాపసీ కావాలంటే భయంగా ఉంటుంది. ప్రాణం మీదకు వచ్చినపుడు తప్ప అలా మారరు. నేడు షయాన్ అలీకి ప్రాణం మీదకు వచ్చింది. సాటి ముస్లిములే అతన్ని వెంటాడి చంపబోయారు. ఇస్కాన్ ఆదుకుంది. కృష్ణభక్తిలోని మాధుర్యం అర్థమైంది. తన పూర్వీకుల మతంలోకి మారిపోయాడు. తన తాతముత్తాతలు చేసిన తప్పును ఈ విధంగా దిద్దుకున్నాడు.

నా శిష్యులలో ఒకాయన నాతో ఇలా అన్నాడు, ' నా భార్య షిరిడీ సాయిబాబా భక్తురాలు. మా మామగారి కుటుంబం అందరూ అంతే, అందుకే ఆమె మన మార్గంలోకి రాలేకపోతోంది. భయపడుతోంది'

'మీ కులదైవం ఎవరు?' అని నేనన్నాను.

'వెంకటేశ్వర స్వామి' అన్నాడు.

'మరి ఆయనని వదలిపెట్టి షిరిడీ సాయిబాబా పూజలు మొదలుపెట్టినప్పుడు ఆ భయం కలగలేదా? అప్పుడు లేని భయం ఇప్పుడు వెనక్కు రావాలంటే ఎందుకు? వెంకటేశ్వరస్వామి అంటే లేని భయం సాయిబాబా అంటే ఎందుకు' అని నేనడిగాను.

వేంకటేశ్వరస్వామి హిందువు కదా ! 'పోన్లే పాపం' అని ఊరుకుంటాడు. బాబా అలా కాదు కదా. ఆయన ముస్లిం ఫకీర్, అసలే కోపం ఎక్కువ. తాట తీస్తాడు. బహుశా ఆమె భయం అదై ఉంటుంది.

'షిరిడీ సాయి పూజ మొదలు పెట్టావంటే ఇస్లాం వైపు నువ్వు రెండడుగులు వేసినట్లే అని గ్రహించు' అని నీ భార్యకు చెప్పు అని నా శిష్యునితో చెప్పాను.

గుంటూరు బ్రాడీపేటలో సరిగ్గా ఇదే జరిగింది.

కొన్నేళ్ల క్రితం బ్రాడీపేట 4/7 లో ఒక రావిచెట్టు కింద ఎవరో ఒక సాయిబాబా విగ్రహాన్ని పెట్టారు. స్వార్థ భక్తులవల్ల క్రమేణా అది ఒక గుడిగా మారింది. ట్రాఫిక్ జాములు అయ్యే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఉన్నట్టుండి ఆ ప్రక్క సందులోనే  ఒక మసీదు వెలిసింది. బ్రాడీపేటలో బ్రాహ్మణుల ఇళ్ళు ఎక్కువగా ఉంటాయి. ముందు మెల్లిగా అక్కడొక సాయిబాబా గుడి వెలిసింది. ఇప్పుడు  బ్రాహ్మణుల ఇళ్ల మధ్యన ఒక పెద్ద మసీదు కట్టబడింది.  ప్రస్తుతం అక్కడ ముస్లిములు ఎవరూ లేరు. కానీ వన్ టౌన్ నుంచి రోజూ ఉదయం సాయంత్రం ఒక వందమంది టోపీలు పెట్టుకుని వచ్చి ఇక్కడ నమాజ్ చేసి పోతున్నారు. త్వరలోనే ఒక మటన్ షాపు కూడా అక్కడ వెలవబోతోంది. త్వరలో బ్రాడీపేట మరో వన్ టౌన్ కావడానికి రంగం సిద్ధం అయింది.

అదీ సంగతి ! 'బాబా బాబా' అన్నందుకు జరిగిన శాస్తి ఇదన్నమాట !

తమ కులదైవాన్ని, ఇష్టదైవాన్ని వదిలేసి క్రైస్తవం లోకి, ఇస్లాం లోకి, బాబా భక్తి లోని మారడానికి ఏమీ భయం కలగదు. కానీ వెనక్కు రావాలంటే మాత్రం భయంట ! ఏమి కాకమ్మ కబుర్లో !

మనిషి మనస్తత్వం ఇంతే. ద్వేషమో, స్వార్థమో, ప్రాణభయమో ఏదో ఒకటి లేనిదే ఎవరూ తమ పూర్వీకుల మతాన్ని మార్చుకోరు. తిరిగి ఘర్ వాపసీ కావాలంటే కూడా ఇవే భయాలు వారిలో ఉంటాయి. కానీ అసత్యాన్ని అనుసరిస్తూ ఎంతకాలం ఉండగలం? అది సాధ్యం కాదు కదా ! డబ్బులకోసం మాతృధర్మాన్ని ఎంతకాలం తాకట్టు పెట్టగలం?

మీ మాతృధర్మమైన హిందూధర్మాన్ని వీడి ఇతర మతాల ప్రలోభాలకు పడిపోతున్న  వేలాది లక్షలాది అజ్ఞానులారా ! ఇకనైనా కళ్ళు తెరవండి. మాతృదేశానికి మాతృధర్మానికి ద్రోహం చెయ్యకండి. పాస్టర్ల, ముల్లాల మాయమాటలు నమ్మకండి.

ఘర్ వాపసి ఒక్కటే మీకు మార్గం. ఈ రోజు కాకపోతే రేపైనా ఇది తప్పదు.

మంచిపనికి ఆలస్యం ఎందుకు?