అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

30, నవంబర్ 2017, గురువారం

Mai Hosh Me Tha - Mehdi Hassan

Mai Hosh Me Tha Tho Phir Uspe Mar Gaya Kaise  అంటూ తన గంధర్వస్వరంలో మెహదీ హసన్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ ఘజల్ ఒక అద్భుతమైన గీతం. భావానికి భావం, రాగానికి రాగం రెండూ అద్భుతమైనవే. మెహదీ హసన్ స్వరంలో ఏ పాటైనా అలవోకగా ఒదిగి ఒక పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. 'ఆయన స్వరంలో ఆ దైవమే పలుకుతుంది' అని లతా మంగేష్కర్ అన్నదీ అంటే ఇక మనం ఊహించుకోవచ్చు. అందుకే ఆయనకు "ఘజల్ రారాజు" అని పేరున్నది.ఈ...
read more " Mai Hosh Me Tha - Mehdi Hassan "

28, నవంబర్ 2017, మంగళవారం

కలబురిగి కబుర్లు - 3 (బసవన్న వచనాలు)

బసవేశ్వరుని బోధలన్నీ చిన్న చిన్న పద్యాల రూపంలో ఉంటాయి. వాటిని వచనాలు అంటారు. ఇవి జెన్ మాస్టర్ల హైకూల వంటివి. కానీ వాటికంటే కొంచం పెద్దవిగా ఉంటాయి. ఆధ్యాత్మిక సత్యాలను ఇవి క్లుప్తంగా చక్కగా విడమర్చి చెప్తాయి. వీటిని చదివిన ఎవరైనా సరే, 'కాదు' అనలేరు. అంత చక్కగా ఉంటాయి. అయితే, చాలా ఉన్నతమైన ఆధ్యాత్మికతను చెబుతూ ఉంటాయి గనుక, ఇవి ఆచరణలో సాధ్యమౌతాయా అని అనుమానం తప్పకుండా వస్తుంది. ఇది నిజమే. ఆచరణలో...
read more " కలబురిగి కబుర్లు - 3 (బసవన్న వచనాలు) "

24, నవంబర్ 2017, శుక్రవారం

"శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక" పుస్తకావిష్కరణ కార్యక్రమం

నా శిష్యులూ, పంచవటి సభ్యులూ, నా బ్లాగు పాఠకులూ, ఇంకా చాలామంది ఎదురుచూస్తున్న కార్యక్రమం అతి దగ్గరలోకి వచ్చేసింది. అదే నేను రచించిన - శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక - బుక్ రిలీజ్ ఫంక్షన్. ఈ పుస్తకం మా పంచవటి పబ్లికేషన్స్ నుంచి వెలువడుతున్న మూడవ ప్రింట్ పుస్తకం. E - Book గా కూడా అదే రోజున వెలువడుతుంది. ఈ పుస్తకానికి సంకల్పం 2016 లో అమెరికాలో పడింది. అక్కడ 'శ్రీవిద్య' మీద నేనిచ్చిన ఉపన్యాసాలను...
read more " "శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక" పుస్తకావిష్కరణ కార్యక్రమం "

23, నవంబర్ 2017, గురువారం

కలబురిగి కబుర్లు - 2

కలబుర్గి అంటే రాతిబురుజు అని అర్ధం. ఆ ఊళ్ళో బహమనీ సుల్తానుల కోట ఉంది. అందుకని ఆ పేరు వచ్చిందో ఏమో తెలీదు. ఇదంతా ఒకప్పుడు సుల్తానుల ఆధీనంలో ఉన్న ప్రాంతం. చాలాకాలం పాటు ఇది హైదరాబాద్ నిజాం అధీనంలో కూడా ఉంది. అందుకే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ. చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళున్నారు. ఇది హైద్రాబాద్ కు బాగా దగ్గర కావడంతో చదువుకోడానికి చాలామంది తెలుగువాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడకు...
read more " కలబురిగి కబుర్లు - 2 "

19, నవంబర్ 2017, ఆదివారం

నీకు చుక్క కనిపిస్తుందా??

లలితా సహస్రనామాల మీద ఈ మధ్యనే నేను వ్రాసిన పుస్తకం అచ్చు పనుల కోసం రామారావును కలుద్దామని మొన్నీ మధ్య విజయవాడలోని డీటీపీ సెంటర్ కు వెళ్ళాను. ఉదయం ఎనిమిది గంటలకే అక్కడ ఒక పెద్దాయన కూచుని రామారావుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయం పూట అయితే ఎవరూ వచ్చి డిస్టర్బ్ చెయ్యరని మా ఉద్దేశ్యం. అందుకని పొద్దున్నే మా పని పెట్టుకుంటూ ఉంటాం. కానీ షాపు తెరిచి కనిపిస్తే చాలు ఎవరో ఒకరు వచ్చి కాలక్షేపం కబుర్లు పెట్టుకుంటూ...
read more " నీకు చుక్క కనిపిస్తుందా?? "

11, నవంబర్ 2017, శనివారం

కలబురిగి కబుర్లు - 1

మా అమ్మాయిని M.D (Homoeo) లో చేర్చడానికి ఈ మధ్యన కలబురిగి (గుల్బర్గా) లో రెండు దఫాలుగా పదిరోజులున్నాను. వీళ్ళ బ్యాచ్ ఏభై మందిలో ఆరుగురు మాత్రమే సబ్జెక్టులు ఏవీ మిగుల్చుకోకుండా సింగిల్ అటెంప్ట్ లో B.H.M.S పాసయ్యారు. మళ్ళీ ఈ ఆరుగురిలో తను మాత్రమే వీళ్ళ బ్యాచ్ నుంచి M.D లో జాయినైంది. ఈ ఊరికి ఇప్పుడు కలబురిగి అని పేరు మార్చారు. గుల్బర్గా విశ్వవిద్యాలయంలోనే నేను న్యాయశాస్త్రం చదివాను. మళ్ళీ ఇప్పుడక్కడే మా అమ్మాయి మెడిసిన్ చదువుతోంది....
read more " కలబురిగి కబుర్లు - 1 "

2, నవంబర్ 2017, గురువారం

శనీశ్వరుని ధనూరాశి పున:ప్రవేశం

వారంనాడు, అంటే అక్టోబర్ 26 న శనీశ్వరుడు మళ్ళీ ధనూరాశిలో ప్రవేశించాడు. వక్రస్థితిలో వృశ్చికరాశిలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఋజుగతితో ధనూరాశి ప్రవేశం గావించాడు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ గ్రహచారం వల్ల అనేక మంది జీవితాలలో హటాత్తు మార్పులు కలుగుతాయి. కలుగుతున్నాయి. గమనించండి. ఎందుకంటే - వక్రగ్రహాలు ఋజుగతిలోకి వచ్చేటప్పుడు చాలా వేగంగా ఫలితాలనిస్తాయి. ప్రస్తుతం అలాంటి పరిస్తితిలోనే ఉన్న...
read more " శనీశ్వరుని ధనూరాశి పున:ప్రవేశం "