“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

1, ఏప్రిల్ 2010, గురువారం

హైదరాబాద్ అల్లర్లు-మేదినీ జ్యోతిష పరిశీలన

మొన్న 29,30 తేదీలలో పౌర్ణమి తిధి వచ్చింది. అనుకున్నట్లుగానే తిథికి కొంచెం అటూ ఇటూగా రాజధానిలో శాంతికరువైంది. గొడవలు చెలరేగాయి. దీనికి కారణాలు ఏవైనప్పటికీ, సందర్భంగా, కొన్ని గమనించదగిన గ్రహస్థితులుకనిపిస్తున్నాయి. వాటిని పరిశీలిద్దాము.

>>గొడవలు మార్చ్ 27 శనివారం రాత్రి మొదలయ్యాయని పేపర్లు రాస్తున్నాయి. ఇరవై తొమ్మిదిన పౌర్ణమి ఘడియలుమొదలయ్యాయి. కనుక రెండు రోజులు ముందే ప్రభావం కనిపించడం మొదలైంది.

>> సమయంలో చంద్రుడు సింహరాశిలో 8 డిగ్రీలలో ఉన్నాడు. కర్కాటకంలో నీచ కుజుడు 7 డిగ్రీలలోనూ, కన్యలోవక్ర శని 6 డిగ్రీలలోనూ దాదాపు సమాన దూరంలో ఉన్నారు. రెండు పాప గ్రహాలు రెండు వైపులా సమాన దూరంలో ఉండటంతో పాపార్గళం అయింది. మన: కారకుడైన చంద్రుని సంకట స్థితివల్ల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టబడ్డాయి.

>>రాహువు యొక్క తిర్యక్ పంచమ దృష్టి చంద్రుని పైన పడింది. రాహువు 23 డిగ్రీలలో ధనుస్సులో ఉన్నాడు. ఆదివారం 28-3-2010 రాత్రి ఎనిమిదిన్నరకు చంద్రుడు సరిగ్గా సింహరాశి 23 డిగ్రీలలోకి వచ్చి సరిగ్గా రాహువు యొక్క డిగ్రీ దృష్టిలోకి వచ్చాడు. రెండుపక్కలా పాప గ్రహాలు, పౌర్ణమి ఘడియలు,రాహు దృష్టి కలవటంతో ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టబడి గొడవలు మొదలైనాయని చెప్పవచ్చు.

>>హైదరాబాద్ లో ఉగాది ఘడియలు ధనూరాశిలో మొదలైనాయి. ధనూరాశి సహజ రాశి చక్రంలో నవమ భావం. కనుక మతపరమైన విషయాలను సూచిస్తున్నది. అలాగే ధనుస్సు నుంచి చంద్రుడున్న సింహ రాశి మళ్ళీ నవమభావం అయ్యి, మళ్ళీ మతపరమైన విషయాలను సూచిస్తున్నది.

>>మళ్ళీ ఏప్రియల్ ఆరున చంద్రుడు రాహువుతో ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లోకి వస్తున్నాడు. నవాంశలో తులా రాశిలో కుజ,రాహువులతో కూడి ఉన్నాడు. అదే రోజు సాయంత్రానికి నవాంశలో వృశ్చిక రాశిని ప్రవేశించి నీచ స్థితిలో ఉంటున్నాడు. ఇదీ ఒక ప్రమాద కర పరిస్తితినే సూచిస్తున్నది. చూద్దాం ఏమి జరుగుతుందో?