27, మే 2021, గురువారం
శాన్ జోస్ కాల్పులు - ఆచ్చాదనాయోగం
20, మే 2021, గురువారం
పానీ పూరీ - బూజు బ్రెడ్డు
కరోనాకు తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగసంట !
అసలీ రోగాలు ఎలా పుడతాయో, వీటిని ఎవడు కనుక్కుంటున్నాడో అర్ధం కాక తెగ ఆలోచిస్తుంటే మాగన్నుగా నిద్రపట్టేసింది. నిద్రలో కల! కలలో యధావిధిగా తనే ప్రత్యక్షమైంది. తనంటే మళ్ళీ అపార్ధం చేసుకోకండి. కర్ణపిశాచే !
కుశలప్రశ్నలూ అవీ అయ్యాక, నా సందేహాన్ని తనదగ్గరే వెలిబుచ్చాను.
'అసలేంటీ గోల? ఈ కరోనా ఏంటి? బ్లాక్ ఫంగస్ ఏంటి? అసలివెప్పట్నుంచీ ఉన్నాయి? ఎందుకిప్పుడే విజృంభిస్తున్నాయి? సెలవివ్వుము' అనడిగా.
కర్ణపిశాచి అలిగింది.
'అంతేలే. పనున్నపుడేగా నేన్నీకు గుర్తొచ్చేది' అంది నిష్టూరంగా.
వార్నీ ! మనుషుల్నేగాక వీటిని కూడా భంగపోవాలా? సరే ఏం చేస్తాం? అనుకుంటూ,
'మా బుజ్జి కదూ ! నీకేం కావాలో చెప్పు. ఒక డజను రెండిసివర్ వయల్స్ బ్లాకులో కొనివ్వనా? తీసికెళ్తావా? మీలోకంలో ఫ్రిజ్ లో దాచుకుంటావా?' అడిగా బ్రతిమిలాడుతూ.
కర్ణపిశాచి పాపం అల్పసంతోషి. కరిగిపోయింది.
'సరే ! చెప్తా విను. ఇవన్నీ పురాణకాలంలోనే ఉన్నాయి' అంది సీరియస్ గా.
నాకు కళ్ళు గిర్రున తిరిగాయి.
'అవునా?' అన్నా తెగ హాచ్చర్యపోతూ.
'అవును. ఎక్కువ నటించకుండా విను. కరోనా పుట్టింది ద్రౌపదితో' అంది.
నిద్రలోనే కెవ్వున కేకేశాను.
'మరి బ్లాక్ ఫంగస్ పుట్టింది హిడింబి తోనా?' అడిగా సిన్సియర్ గా.
'కరెక్ట్. అందుకే నువ్వంటే నాకు తెగిష్టం. నిద్రలో కూడా నీ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తోంది మరి' అంది మురిసిపోతూ.
నాకు మళ్ళీ భలే హాచ్చర్యమేసింది 'ఏంటి ఇంత కరెక్టుగా ఎలా గెస్ చేశానబ్బా' అని.
అయినా సరే హాచ్చర్యాన్ని పక్కనపెట్టి 'ఇవి రెండునూ ఎట్లుద్భవించినవి? ఎట్లు మనవరకూ వచ్చినవి? ఎట్లు మనలను పీడించుచున్నవి? ఆ వృత్తాన్తమంతయూ పూసగుచ్చినట్లుగా వివరించుము' అంటిని.
'వినుము. వివరించెదను' అని పిశాచి చెప్పదొడంగినది.
'పాండవులు వనవాసం చేసే సమయంలో అడవిలో కుటీరాలు వేసుకుని వాటిల్లో ఉండేవారు. కానీ ఈ గెస్టులున్నారు చూశావూ, వాళ్ళను వెతుక్కుంటూ వస్తూనే ఉండేవాళ్ళు' అంటూ మొదలు పెట్టింది.
చెబుతున్నదాన్ని మధ్యలోనే ఆపి - 'ఏదీ ఇప్పుడు కూడా, మా ఇంటికి రావద్దురా బాబూ ఎవరింట్లో వాళ్ళుండండిరా బాబూ అని మొత్తుకుంటున్నా కూడా, తెగించినట్టి గెస్టులు, బంధువులు వస్తుంటారు చూడు అలాగన్నమాట' అన్నాను.
'ఆ అంతే అలాగే ! ఆ విధంగా, చాలామంది గెస్టులు వాళ్ళకోసం కూడా వస్తూ ఉండేవారు. పాపం ద్రౌపది ఆ విధంగా వచ్చిన గెస్టులందరికీ వండి పెడుతూ ఉండేది. పైగా ఒకరా ఇద్దరా? పాండవుల ఫాన్స్ అందరూ వస్తూ ఉండేవారు. ఆ మహాతల్లి అందరికీ వండి వడ్డిస్తూ ఉండేది. ఇలా ఉండగా, ఒకరోజున అనుకోకుండా సాయంత్రం పూట చాలామంది గెస్టులు వచ్చిపడ్డారు. ఏం తెలీని ద్రౌపది, అప్పటికే సిద్ధంగా ఉన్న పూరీపిండిని చిన్న చిన్న పూరీలు చేసి, నీళ్లలో మసాలా వేసి ఉడికించి, పానీపూరీలు చేసి వారందరికీ పెట్టింది. అందరూ తృప్తిగా తిని వెళ్లిపోయారు. ఆ విధంగా పానీపూరీ పుట్టింది' అంటూ ఆగింది కర్ణపిశాచి.
'ఇదంతా బానే ఉందిలేగాని, దీనికీ కరోనాకీ సంబంధం ఏమిటో చెప్పిచావుము' అన్నా.
'వస్తున్నా. నీకన్నీ తొందరే, కొంచం ఆగు. గెస్టులు అలా వెళ్ళిపోయాక ద్రౌపది ముందు ఒక రాక్షసి ప్రత్యక్షమైంది'
' ఎవరు నువ్వు? ఎందుకొచ్చావ్?' అనడిగింది ద్రౌపది.
'నేనీ అడివిలోనే ఆ చెట్టుమీదనే ఉంటాను. నా పేరు కరోనా. ఎందరో గెస్టులు మీ ఇళ్లకు వచ్చిపోవడం చూస్తూ ఉన్నాను. వారందరికీ నువ్వు చాలా శ్రద్ధగా భక్తిగా సేవ చెయ్యడం కూడా చూస్తున్నాను. కానీ ఈరోజున నీవు చేసిన క్రొత్త వంటకం నాకు చాలా నచ్చింది. నాక్కూడా అది చేసి పెట్టుము' అని రిక్వెస్ట్ చేసింది కరోనా రాక్షసి.
పోన్లేపాపం అనుకున్న ద్రౌపది రాక్షసి కోరినట్లే పానీపూరీలు చేసి పెట్టింది. తృప్తిగా తిన్న రాక్షసి మాయమయ్యేముందు ద్రౌపదికి ఒక వరం ఇచ్చింది.
'ముందుముందు కలియుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు నేను విజృంభించి సర్వనాశనం చేయబోతున్నాను. భూభారం తగ్గించబోతున్నాను. కలియుగంలో మనుషులు శుచీశుభ్రతా లేకుండా, ఎక్కడబడితే అక్కడ తింటూ తాగుతూ విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటారు. అదే వాళ్లకు శాపమౌతుంది. అలాంటివాళ్లను నేను తినేస్తాను. ఆ సమయంలో ఎవరైతే పానీపూరీల బండ్లదగ్గర రోడ్లమీద నానాచెత్తా తింటూ ఉంటారో వాళ్ళను ఎక్కువగా ఎటాక్ చేస్తాను. కానీ నీ పేరు తలచుకుని పానీపూరీ తినేవాళ్ళజోలికి మాత్రం పోను. ఇదే నేనిస్తున్న వరం' అని చెప్పి మాయమైపోయింది కరోనా రాక్షసి.
వింటున్న నాకు మతిపోయింది. 'అమ్మా ఇదా రహస్యం ! ఈ విషయం తెలీక కదా, అమెరికోడు నానామందులూ తయారు చేస్తున్నాడు. లోకమంతా తల్లక్రిందులైపోతోంది. చచ్చేవాళ్ళు చస్తుంటే, బతికున్నవాళ్ళు వాక్సిన్లకోసం కొట్టుకుచస్తున్నారు. సింపుల్ గా పానీపూరీ తింటే కరోనా నయమౌతుందా? భలే సీక్రెట్ చెప్పావే? ఓకే, మరి బ్లాక్ ఫంగస్ కధ చెప్పు' అడిగా ఉత్సాహంగా.
'ఏంటి? ఉత్సాహం చాలా ఎక్కువగా ఉందే? సరే విను' అంటూ 'ఒసేయ్ ఇట్రావే' అని ఎవరినో పిలిచింది కర్ణపిశాచి.
వెంటనే నల్లగా తుమ్మమొద్దులాగా అందంగా ఉన్న ఒకమ్మాయి ప్రత్యక్షమైంది.
నేను కలలోనే ఝడుసుకుని 'అమ్మోయ్ ! ఈ అమ్మాయెవరు?' అంటూ అరిచా.
'భయపడినట్లు ఎక్కువగా నటించవద్దని ముందే చెప్పానీకు. ఈ అమ్మాయే బ్లాక్ ఫంగస్. మన సంస్కృతభాషలో 'నీలకిణ్వని' అంటార్లే. మీకు తెలీక బ్లాక్ ఫంగస్ అంటున్నారు. సంస్కృతం, ఆయుర్వేదం మరచిపోతే ఇలాగే ఉంటాయి మీ బ్రతుకులు' అంది పిశాచి.
'సరే ఒప్పుకున్నా తల్లీ, మేమన్నీ మరచిపోయాం. భ్రష్టులమైపోయాం. ఎక్కువగా తిట్టకు. విషయంలోకి రా' బ్రతిమిలాడా.
'నేనెందుకు? తనే చెప్తుంది. చెప్పవే కిన్నీ' అంది పిశాచి ముద్దుగా.
'కిన్నీ? అబ్బో , ముద్దుపేర్లు కూడానా మీకు' అనుకున్నా లోలోపల.
గుర్రుగా చూసిన కిన్నీ చెప్పడం మొదలుపెట్టింది.
'భీముడు ఆటవికరాజ్యానికి వెళ్లి, వాళ్ళను మల్లయుద్ధంలో జయించి, వాళ్ళమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరే హిడింబి. పెళ్లయ్యాక ఆ అమ్మాయి కూడా వీళ్లతోబాటే ఉంటూ ఉండేది. ఆమెను నేటి రాజస్థాన్ ప్రాంతంలో ఉంచాడు భీముడు. అయితే అందరితో ఉండకుండా ఆమె తనదైన వేరే కుటీరంలో ఉండేది. ద్రౌపది పాండవులందరికీ కామన్ భార్య అయినప్పటికీ, అందరికీ మళ్ళీ వేరే భార్యలుండేవారు. అలాంటి వాళ్లలో, భీముడికి హిడింబి ఒక భార్య. ఆ హిడింబి రాక్షసమ్మాయని అందరూ అంటారుగాని రాక్షసులనేవాళ్ళు అసలు లేరు. అడివిమనుషులనే అలా పిలిచేవారు అప్పట్లో. కనుక హిడింబి ఆటవిక అమ్మాయి. వాళ్ళ తిండి తిప్పలు తేడాగా ఉంటాయి. వాళ్లకు పులిసిన పదార్ధాలంటే భలే ఇష్టం. పులిసిన కల్లు త్రాగుతారు, పులిసిన పండ్లు తింటారు, ఆహారం కూడా పులవబెట్టి తింటేనే వాళ్లకు బాగుంటుంది. అందుకని ఆమె అలాంటి తిండి తయారుచేసుకుని తింటూ ఉండేది. ఇదిచూసి పాండవుల మిగతా భార్యలందరూ ఒకరోజున ఆమెను గేలిచేశారు. ఎందుకంటే, వాళ్లంతా రాజస్థాన్ ప్రాంతం నుంచి వచ్చిన తెల్లటి అందగత్తెలు. ఆమె నల్లగా ఉంటుందని, పులిసిన తిండి తింటుందని, అందరూ కలసి ఆమెను ఎగతాళి చేశారు.
ఆమెకు వాళ్ళమీద కోపమొచ్చి ఇలా శాపం పెట్టింది 'ముందు ముందు ఎవరైతే ఆహారాన్ని మూడు నాలుగురోజులు మురగబెట్టి పులవబెట్టి తింటారో, వాళ్లకు బ్లాక్ ఫంగస్ అనే రోగం వచ్చుగాక. ఎక్కువగా ఇది బ్రెడ్ మీదా, పులవబెట్టి, ఎండ తగలని చోట్లలో ఉండే ఆహారం మీదా, ఫ్రిజ్ లోనూ పుట్టుగాక. అది సోకినవారందరూ చచ్చుదురుగాక'.
ఈ శాపాన్ని విని భయభ్రాంతులైపోయిన మిగతా సవతులందరూ ఆమె కాళ్ళమీద పడి ప్రార్ధించగా ఎట్టకేలకు కరుణించిన ఆమె శాపవిమోచనం ఇలా అనుగ్రహించింది.
'పులిసిన పదార్ధాలు తినేముందు నన్ను తలుచుకుని ఎవరైతే తింటారో వాళ్ళను మాత్రం ఈ బ్లాక్ ఫంగస్ ఏమీ చెయ్యదు'.
'ఓహో ఇదా కనెక్షన్? అందుకా ఈ నీలకిణ్వని ఇలా రాక్షసిలాగా ఉన్నప్పటికీ మహా అందంగా ఉంది? హిండిబి రాజస్థాన్లో ఉండేదా? అందుకేనా అక్కడే బ్లాక్ ఫంగస్ ఎక్కువగా ఉంది?' అనుకున్నా లోలోపల.
'సరే వాళ్లెవరో చేసిన నేరాలకి మనకు పడుతోందన్నమాట శిక్ష? బాగుంది. అయితే, ఇప్పుడేం చెయ్యమంటారో చెప్పండి, మీరిక వెళ్తే నెన్నిద్రపోవాలి' అన్నా పెద్దగా ఆవలించినట్టు నటిస్తూ. లేకపోతే, ఇలాగే కథలమీద కధలు చెబుతూ వదిలేటట్టు లేరు.
'అదే మరి మీ మనుషుల బుద్ధి? పనైపోయాక వెంటే వెళ్లిపొమ్మంటారు. అందుకే మేం మీకు కనిపించనిది. మీ దగ్గరకు రానిది' అన్నారిద్దరూ ముక్తకంఠాలతో.
'ఛీ ఛీ నేనలాంటోన్ని కాను. పనితో సంబంధం లేదుగాక లేదు. నేనెప్పుడూ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాను. మరచిపోయే ప్రసక్తే లేదు. మరి ఈ కరోనా, బ్లాక్ ఫంగస్ సమస్యలకు ఉపాయం చెప్పండి' అడిగా ఇద్దర్నీ ప్రాధేయపడుతూ.
'భారతమంతా విని, ఇంతకీ పాండవులకు ద్రౌపదేమౌతుంది? అన్నాట్ట నీలాంటోడు. అలా ఉంది నీ సంగతి. విన్నావుగా అంతా. అందులోనే సీక్రెట్ ఉంది. రోజూ రోడ్లమీద బండ్లదగ్గర, దుమ్మూధూళీ మధ్యలో, పానీపూరీలను నానాచెత్తా ఉన్న మసాలానీళ్ళ బకెట్లో ముంచుకొని తింటూ ఉన్నాసరే, ద్రౌపదీదేవిని భక్తిగా స్మరించి, ఆ తర్వాత అవన్నీ తింటే, కరోనా మీ జోలికి రాదుగాక రాదు. అదే విధంగా, వారంనాటి డేట్ ఎక్స్ ఫైర్ అయిన బ్రెడ్డూ, మురగబెట్టిన మైదాపిండీ, కుళ్ళిన మజ్జిగా, మురిగిపోయిన కూరలూ, ఫంగస్ పప్పూ, ఫ్రిజ్ లో పెట్టుకుని బాగా మెక్కుతున్నప్పటికీ, హిడింబిదేవిని భక్తిగా తలచుకుంటే, బ్లాక్ ఫంగస్ మీ దరిదాపులకే రాదు. ఎన్ని సార్లు చెప్పమంటావ్ నీ మొద్దు బుర్రా నువ్వూనూ' అంది కరోనా చాలా కోపంగా.
'ఆమ్మో కోపం వద్దు శాంతించండి. సరే రేపట్నించీ అలాగే చేస్తా. ప్రామిస్' అన్నా ఇద్దరికీ చేతులో చెయ్యేస్తూ.
చెయ్యి విదిలించుకుని, కోపంగా చూస్తూ మాయమైపోయారిద్దరూ.
అర్థమైందా నాయనలార ! పానీపూరి, బూజు బ్రెడ్డు, ప్రిజ్ లో మురగబెట్టిన కూరలు, బూజుపప్పు, కుళ్ళిన పెరుగు, మురిగిన మజ్జిగ, నెలనాటి సాంబారు, కుళ్ళిన మాంసం, పులిసిన చేపలు, కుళ్ళిపోయిన నానా జంతువులు, అన్నీ సుష్టుగా తినండి. ద్రౌపదీదేవినీ, హిడింబీదేవినీ మాత్రం తలుచుకోండి. ఈ ఒక్కటీ చెయ్యండి చాలు. అవన్నీ తినకుండా మీరెలాగూ ఉండలేరు. తినడం మానలేరు. కనుక ఈ ఒక్క ట్రిక్కు పాటించండి. వాతాపి జీర్ణం ! మీరు తిన్న నానా చెత్తంతా శుభ్రంగా అరిగిపోతాయి. ఏ మందూ అక్కర్లేదు. ఏ వాక్సినూ అక్కర్లేదు. మీకే రోగమూ రాదు.
ఏంటీ లోకం తగలబడుతుంటే నీ పరాచికాలు? నీరోకీ నీకూ పోలికలున్నాయే అంటారా? మనందరమూ నీరోలమే. ఎవడేం పాటిస్తున్నాడు గనుక? నేను చూస్తున్నంత వరకూ ఎవ్వడూ ఏదీ పాటించడం లేదు. హ్యాపీగా తిరుగుతున్నారు. వచ్చినపుడు ఎక్కడో చేరుతున్నారు. బ్రతికితే బ్రతుకుతున్నారు. పోతే పోతున్నారు. ఎవడికీ ఏ విధమైన లెక్కా లేదు. జమా లేదు. అంతా డ్రామా ! అంతే !
అర్థమైందా? ఉంటా మరి !
హ్యాపీ కరోనా ... హ్యాపీ బ్లాక్ ఫంగస్ !
ఎంజాయ్ యువర్ డేస్ !
16, మే 2021, ఆదివారం
టౌటే తుఫాన్ - శుక్ర రాహువుల ప్రభావం
జ్యోతిష్యదుర్భిణీ లోనుంచి ఏం జరుగుతున్నదో చూద్దాం.
శుక్ర రాహువుల పాత్ర
జలకారకుడైన శుక్రుడు ప్రస్తుతం రాహువును వేగంగా సమీపిస్తున్నాడు. రాహువుకూడా శుక్రుడినే సూచిస్తూ ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. అక్కడే మరొక జలగ్రహమైన చంద్రుడు కూడా ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. కనుక జలభూతం అమితమైన బలాన్ని సంతరించుకుంది. వీరి కోణదృష్టి మకరంలో ఉన్న శనిమీదున్నది. మకరరాశి భారతదేశానికి సూచిక. మన దేశపు స్వతంత్రసమయలగ్నం వృషభమే. అదే వృషభంలో ఇప్పుడు జలభూతం విజృంభించడం, టౌటే తుఫాన్ అదే సమయంలో తలెత్తడం కాకతాళీయమనుకుందామా?
శుక్రుడు రాహువుయొక్క 5 డిగ్రీల పరిధి (ఆర్బ్) లోకి రాగానే అరేబియా సముద్రంలో డిప్రెషన్ మొదలైంది. శుక్ర రాహువుల మధ్యన దూరం తగ్గుతున్న కొద్దీ తుఫాన్ బలపడుతున్నది. ఈ క్రింది పట్టికను గమనించండి.
డిప్రెషన్ మొదలైన 14 వ తేదీన, అది తుఫాన్ గా మారిన 15, 16 వ తేదీలలో శుక్రుడు వృషభం 15 డిగ్రీలలోపలే ఉన్నాడు. అంటే, పశ్చిమదిశలో ఉన్నాడు. కనుక భారతదేశంలోని పశ్చిమ సముద్రంలో తుఫాన్ మొదలైంది. 17 వ తేదీనుంచి శుక్రుడు 15 డిగ్రీలను దాటి, ఉత్తరదిక్కులోకి ప్రవేశించాడు. కనుక తుఫాన్ ఉత్తరదిక్కుగా దిశను తీసుకుని, గోవా మీదుగా గుజరాత్ వైపు వెళ్లడం మొదలుపెట్టింది.
వృషభరాశిలో ఉన్న శుక్రుడు సవ్యదిశలో ముందుకు ప్రయాణిస్తున్నాడు. రాహువు దానికి వ్యతిరేకంగా అపసవ్యదిశలో ప్రయాణిస్తూ శుక్రుడిని మ్రింగబోతున్నట్లుగా కదులుతున్నాడు. వీరిద్దరి కంజక్షన్ ఎల్లుండి అంటే 18 వ తేదీన జరుగుతుంది. కనుక ఆ రోజున తుఫాన్ తీరాన్ని తాకుతుంది.ఆ తరువాత బలహీనపడిపోతుంది. 19 నుంచి శుక్రుడు రాహువును దాటి ముందుకు సాగిపోతాడు. కనుక తుఫాన్ బలహీనపడుతుందని ఊహిస్తున్నాను.
చూద్దాం ముందుముందు ఏం జరుగనున్నదో !
12, మే 2021, బుధవారం
రష్యా స్కూల్లో కాల్పులు - అమావాస్య ప్రభావం
11, మే 2021, మంగళవారం
ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ - జ్యోతిష్య విశ్లేషణ
అక్కడసలేం జరుగుతోందో జ్యోతిష్యపరంగా చూద్దాం.
6-5-2021 న అక్కడ గొడవలు మొదలయ్యాయి. ఎందుకు మొదలయ్యాయి అన్నది నెట్లో ఉంటుంది గనుక మళ్ళీ నేను వివరించి చెప్పవలసిన పని లేదు. క్లుప్తంగా చెప్పాలంటే జెరూసలేం రెండు ముక్కలుగా విడగొట్టబడి ఇద్దరి అధీనంలో ఉన్నది. తూర్పువైపు పాలస్తీనా అదుపులో, పడమర వైపు ఇజ్రాయెల్ అదుపులో ఉంది. అక్కడ జరిగిన ఒక గొడవతో రెండుపక్షాలకూ యుద్ధం మళ్ళీ మొదలైంది.
అసలిదంతా బ్రిటిష్ వాడి చలవే. ఈనాడు మనం పాకిస్తాన్ తో, బాంగ్లాదేశ్ తో తంటాలు పడటమూ, ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్న ముస్లిం దేశాలతో గొడవలు పడుతూ దినదినగండంగా జీవిస్తూ ఉండటమూ ఇవి రెండూ తెల్లవాడి చలవలే. మన దేశాన్ని రెండు ముక్కలు చేసి రెండు పాకిస్థాన్ల మధ్యన మనల్ని ఇరికించి వాళ్ళు తప్పుకున్నారు. అదే విధంగా ముస్లిం దేశాల మధ్యలో ఒక చిన్న ముక్కని 'ప్రామిస్డ్ ల్యాండ్' అంటూ ఇజ్రాయెల్ అనేపేరుతో సృష్టించి రావణకాష్టానికి ఆజ్యం పోశారు. అలాంటి రావణకాష్ఠమే కాశ్మీర్ కూడా. 70 ఏళ్ళనుంచీ రగులుతున్న ఆ కాష్టం బీజేపీ పుణ్యమా అని, మోదీగారి పుణ్యమా అని, ఆరిపోయింది. ఈ ఒక్కపని చేసినందుకు భారతదేశం బీజేపీకి కలకాలం ఋణపడి ఉండాలి. ఇంకొక వెయ్యేళ్ళు మన దేశాన్ని బీజేపీనే పాలించాలనేది నా ఆకాంక్ష. సరే అది ఇంకో సబ్జెక్ట్ గనుక ప్రస్తుతం దానిని కొంచం ప్రక్కన ఉంచుదాం.
బ్రిటిష్ వాడు తన పాలించిన దేశాలన్నింటిలోనూ, దోచుకున్నంత దోచుకుని, ఆ తర్వాత చిచ్చుపెట్టి మరీ ప్రక్కకు తప్పుకున్నాడు. ఆ చిచ్చులు ఈ నాటికీ రగులుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ కీ మనకూ పక్కపక్క సంవత్సరాలలో స్వతంత్రం వచ్చింది. మన సమస్యలు కొన్ని తీరాయి. కానీ ఇజ్రాయెల్ సమస్య మాత్రం ఈనాటికీ రగులుతూనే ఉన్నది.
ఆ రోజున గ్రహస్థితిని పైన ఇచ్చాను చూడండి.
మిడిల్ ఈస్ట్ లోని ముస్లిం దేశాలలాగే, ముస్లిం దేశం కాకపోయినప్పటికీ ఇజ్రాయెల్ కూడా ధనూరాశిలోనే ఉంటుంది. ధనూరాశి ప్రస్తుతం శనికేతువుల మధ్యన దుర్ఘటనాయోగంతో బందీ అయ్యి ఉన్నది. శని 19 డిగ్రీలలో, కేతువు 18 డిగ్రీలలో ఉన్నారు.అంతేగాక వీరి మధ్యబిందువును యుద్ధకారకుడైన కుజుడు మిధునం 13 వ డిగ్రీ పైనుంచి బలమైన సప్తమదృష్టితో చూస్తున్నాడు. యురేనస్ కోణదృష్టి మేషం 16 డిగ్రీల నుండి ధనుస్సు 16 డిగ్రీలను చూస్తోంది. ధనుస్సులో ఇది శనికేతువుల మధ్యబిందువైంది. ఈ యోగం వల్ల ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యన మళ్ళీ గొడవలు మొదలయ్యాయి.
8-5-2021 నాడు మళ్ళీ గొడవలయ్యాయి. ఆరోజున ముస్లిముల పవిత్రరాత్రి అయిన లయలతుల్ కదర్. ముస్లిముల ప్రార్ధనల అనంతరమే వాళ్ళు అందరినీ ఎటాక్ చేస్తారన్నది జగమెరిగిన సత్యం. అలాగే ఆరోజున కూడా జరిగింది. అప్పటినుంచీ నేటివరకూ ప్రతిరోజూ అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నేటికి రాకెట్ దాడులు చేసుకునే వరకూ పరిస్థితి పెరిగిపోయింది.
ముస్లిములు మెజారిటీగా ఉన్న దేశంలో మిగతా వారిని బ్రతకనివ్వరనేది పచ్చినిజం. కానీ వాళ్ళను మిగతా వాళ్ళు ఉండనిస్తారు. దానికి కారణం పోన్లేపాపం అనే మనస్తత్వం. కానీ, మెజారిటీగా మారేకొద్దీ, వాళ్లకు ఇస్లాం పిచ్చి ముదిరిపోతుంది. పక్కవాళ్ళను కూడా మతం మారమంటారు లేదా చావమంటారు. ఈ మౌలికలోపం ఇస్లాం బోధనలలోనే ఉంది. అలాంటి దేశాలను చుట్టూ పెట్టుకుని 72 ఏళ్లుగా ఇజ్రాయెల్ నెట్టుకొస్తూ, ఇంత ఎదిగిందంటే, నిజంగా ఆ దేశాన్ని ఎంతో అభినందించాలి. నావరకూ నేను ఇజ్రాయెల్ ను ఎంతో ఇష్టపడతాను. దానికి కారణం మనకూ వారికీ సమస్యలలోను, ఆలోచనా ధోరణిలోనూ పోలికలున్నందుకేనేమో !
శనికేతువులచేత ఏర్పడిన దుర్ఘటనాయోగం, రాహుశనులచేత ఏర్పడిన శపితయోగదృష్టి, కుజదృష్టులు ఈ పరిస్థితికి ప్రేరకాలు.జూన్ 2 వరకూ నవాంశలో మిధునంలో శపితయోగం కొనసాగుతుంది. దానిదృష్టి ధనుస్సుమీద ఉంటుంది. అంతవరకూ మిడిల్ ఈస్ట్ లో ఈ గొడవలు సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు.
కర్ణుడి చావు - కరోనోపాఖ్యానం
9, మే 2021, ఆదివారం
ఆఫ్ఘనిస్తాన్ కారుబాంబు దాడి - జ్యోతిష్య విశ్లేషణ
6, మే 2021, గురువారం
స్వామి నిర్మలానంద - ఒక విస్మృత మహనీయుడు -3 (జాతక విశ్లేషణ)
స్వామి జీవితంలో ఈఈ దశలు జరిగాయి.
పుట్టుకనుంచి 22 - 2 - 1864 వరకూ చంద్ర మహాదశ
22 - 2 -1864 నుంచి 22 - 2 -1871 వరకూ కుజ మహాదశ
22 - 2 - 1871 నుంచి 21 - 2 - 1889 వరకూ రాహు మహాదశ
21 - 2 - 1889 నుంచి 23 - 2 - 1905 వరకూ గురు మహాదశ
23 - 2 - 1905 నుంచి 23 - 2 - 1924 వరకూ శని మహాదశ
23 - 2 - 1924 నుంచి 23 - 2 - 1941 వరకూ బుధ మహాదశ
26-4- 1938 న బుధ - గురు - రాహుదశలో స్వామి మరణించారు.
ఇప్పుడు స్వామి జీవితంలోని ముఖ్యఘట్టాలను గమనిద్దాం.
శ్రీమంతులైన ఒక క్షత్రియ కుటుంబంలో అయిదుగురు అన్నలకు తమ్ముడిగా స్వామి జన్మించాడు. తల్లిదండ్రులు దేవనాధదత్, తారకామణిదేవి. దేవనాధదత్ గారికి నాడీవిజ్ఞానం తెలుసు. దీర్ఘరోగాలతో బాధపడుతున్న రోగి నాడిని పరీక్షించి అతను ఇంకా ఎన్నాళ్లు బ్రతుకుతాడో, ఎప్పుడు చనిపోతాడో ఆయన ఖచ్చితంగా చెప్పగలిగేవాడు. అప్పట్లో చాలామంది గంగానదీతీరంలో చనిపోవాలని కోరుకునేవారు. కనుక చివరిఘడియలలో అక్కడకు వెళ్లి నివసించేవారు. అలాంటివారికి దేవనాధ్ దత్త ఒక దేవుడిలాగా కనిపించేవాడు. ఆయన సూచించిన సమయానికి కాశీకి వెళ్లి అక్కడే వారు తృప్తిగా కన్నుమూసేయారు. ఈ విద్యతో ఆయన చాలా ధనం ఆర్జించాడు. ఆస్తులు సంపాదించాడు. అంతేగాక, ఆముదం మిల్లు, పిండి మిల్లు, లక్క మిల్లు, సల్ఫ్యూరిక్ యాసిడ్ పేక్టరీలు పెట్టి శ్రీమంతుడయ్యాడు. దశమాధిపతి కుజుడు నీచభంగరాహువుతో పంచమంలో ఉండటం వల్ల ఈయన తండ్రిగారికి ఒక విచిత్రవిద్య తెలిసి ఉంటుందన్న సూచన స్వామి జాతకంలో ఉన్నది.
పితృకారకుడైన రవి బుధునితో కలసి సహజనవమస్థానమైన ధనుస్సులో ఉండటం తల్లిదండ్రులకున్న ఆధ్యాత్మిక చింతనను సూచిస్తున్నది. స్వామి పూర్వీకులు కృష్ణభక్తులు. రాధాకృష్ణులను వీరు కులదేవతలుగా ఆరాధించేవారు. అంతేగాక దుర్గాదేవిని కూడా ఆరాధించేవారు. బెంగాల్లో కృష్ణభక్తీ, దేవీభక్తి అధికం. అదే వీరి కుటుంబంలో కూడా ఉండేది. స్వామి జాతకంలో లాభస్థానంలో రెండు గ్రహాలున్నాయి. వృశ్చికంనుంచి రాహుకుజులు చూస్తున్నారు. తృతీయంనుంచి శని చూస్తున్నాడు. మొత్తం అయిదు గ్రహాల ప్రభావం ఏకాదశం మీదున్నది. అందుకే అయిదుగురు అన్నల తర్వాత తమ్ముడిగా స్వామి జన్మించాడు.
వీరికి కలకత్తాలోనే గాక, కాశీలో కూడా ఇల్లుండేది. ఏడాదిలో కొన్ని నెలలు అందరూ కాశీలో నివసిస్తూ ఉండేవారు. స్వామి చిన్నపుడు బలహీనంగా ఉండేవాడు. ఆరోగ్యం అంత గట్టిది కాదు. కనుక పదకొండేళ్ళవరకూ ఆయన స్కూలుకు పోలేదు. ఇంటిలోనే చదువుకున్నాడు. సంస్కృతాన్ని కూడా ఇంటిలోనే నేర్చుకున్నాడు. ఈ ప్రజ్ఞతోనే సంస్కృతంలో ఆయన చక్కగా మాట్లాడగలిగేవాడు. అంతేగాక సంస్కృతంలో ఉన్న ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాది వేదాంత మూలగ్రంధాలను ఆయన చదివి ఆకళింపు చేసుకున్నాడు. ఈ జ్ఞానంతోనే, తర్వాత ఏళ్లలో బేలూర్ మఠంలోని బ్రహ్మచారులకు, స్వాములకు బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులను ఆయన బోధించాడు. దీనికి సూచికగా నవమాధిపతి మరియు సాంప్రదాయ జ్ఞానానికి కారకుడూ అయిన గురువు సొంత ఇంటిని సూచించే చతుర్దంలో శుక్రునితో కలసి ఉన్నాడు. శుక్రుని కలయిక ఇంటిలో ఉంటూ సొంతంగా చదువుకునే రాక్షసప్రవృత్తిని సూచిస్తుంది. అలా కాకపోతే, ఇంకో యోగం ఉన్నట్లయితే, గురుకులంలోనే ఆయన విద్య సాగి ఉండేది.
ఒకానొక సందర్భంలో ఆ విధంగా కాశీలో ఉన్న సమయంలోనే, 30-12-1873 నాడు స్వామి తల్లిగారు కాశీలోనే మరణించారు. అప్పుడు స్వామి జాతకంలో కుజ మహాదశ అయిపోయి రాహు మహాదశ మొదలైంది. అది రాహు - గురు - గురుదశ. ఇది గురుఛండాలయోగపు దశ. చతుర్ధం నుంచి నీచరాహువు, ద్వితీయ మారకస్థానంలో మారకుడైన కుజుని ఇంటిలో కుజునితో కలసి బలంగా ఉన్నాడు. గురువు రోగస్థానాధిపతిగా లగ్నంలోనే ఉన్నాడు. ఇది ఖచ్చితంగా తల్లిగారికి మారకదశ. కనుక తల్లిగారు చనిపోయారు. లగ్నంలో గురుశుక్రుల ప్రభావంవల్ల కాశీవంటి గొప్ప పుణ్యక్షేత్రంలో ఆవిడ మరణం సంభవించింది. అదేవిధంగా, చంద్రలగ్నాత్ గమనిస్తే - సప్తమ మారకస్థానంలో ఉన్న నీచరాహువు, రోగస్థానంలో ఉన్న గురువు, గురుఛండాలదశలు కనిపిస్తున్నాయి. అలాంటి చెడుదశలో ఆమెకు మరణం రాక మరేమౌతుంది?
మరుసటి సంవత్సరం అక్కడి బెంగాలీ తోలా హైస్కూల్లో సరాసరి ఆయనకు అడ్మిషన్ దొరికింది. అక్కడ హరిప్రసన్న అనే అబ్బాయితో స్నేహం ఏర్పడింది. ఈ హరిప్రసన్న అనే అబ్బాయి తర్వాతికాలంలో శ్రీ రామకృష్ణుల పరమభక్తుడై స్వామి విజ్ఞానానందగా ప్రసిద్ధి గాంచాడు. సివిల్ ఇంజనీర్ గా ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానంలో పనిచేసిన ఆయనే బేలూర్ మఠంలోని శ్రీరామకృష్ణ దేవాలయాన్ని ప్లాన్ గీసి, దగ్గరుండి కట్టించింది. మా గురువుగారైన స్వామి నందానందగారు , స్వామి విజ్ఞానానందగారి శిష్యులే.
స్వామి విజ్ఞానానందగారు రామాయణకాలంలోని జాంబవంతుడు. రామావతార సమయంలో ఈయన రాములవారికి ఎంతో సేవ చేశాడు. రామసేతువుని నిర్మించడంలో ప్రముఖపాత్ర పోషించాడు. వానరసైన్యంలోని నలుడు, నీలుడు, జాంబవంతుడు సివిల్ ఇంజనీరింగ్ తెల్సినవారు. అందుకే 13 వేల ఏళ్ళక్రితమే సముద్రం మీద వారధి కట్టగలిగారు. అదే జాంబవంతుడు ఈ జన్మలో విజ్ఞానానందస్వామిగా పుట్టి సివిల్ ఇంజనీరింగ్ లో ప్రవీణుడై, బేలూర్ మఠంలోని శ్రీరామకృష్ణ దేవాలయం ప్లాన్ ను తానే గీచి, దగ్గరుండి దానిని అద్భుతంగా నిర్మించాడు.
కృష్ణావతారసమయంలో జాంబవంతుడు కృష్ణునితో కుస్తీ పట్టాడు. శ్రీరామకృష్ణుల అవతారసమయంలో ఒకనాడు శ్రీరామకృష్ణులు హరిప్రసన్నను ఇలా అడిగారు 'ఏరా ! నాతో కుస్తీ పట్టగలవా?' ఆయన అప్పటికే నడివయసులో ఉన్నారు. హరిప్రసన్న యువకుడు, ఆరడుగుల ఎత్తుతో మంచి బలంగా ఉండేవాడు. 'ఈయన నాతో ఏమి గెలవగలడులే?' అని లోలోపల అనుకున్నప్పటికీ, ఆయన ఎందుకడిగారో అర్ధంకాని హరిప్రసన్న సరేనన్నాడు. ఐదడుగుల విగ్రహంతో బలహీనంగా ఉన్న రామకృష్ణులు బలిష్ఠుడైన హరిప్రసన్నను సునాయాసంగా గోడకు అదిమిపెట్టేశారు. ఆయన్ను తాకడంతోనే శరీరంలోని శక్తంతా ఉడిగిపోయి కుప్పకూలినట్లుగా అయిపోయాడు హరిప్రసన్న. 'ఇప్పుడేమంటావ్?' అంటూ నవ్వుతూ శ్రీరామకృష్ణులు అతన్ని వదిలేశారు.
శ్రీరామునితో యుద్ధం చెయ్యాలన్న కోరికను ఒక సందర్భంలో వెలిబుచ్చుతాడు జాంబవంతుడు. 'ఇప్పుడు కాదు, వచ్చే అవతారంలో నీ కోరిక తీరుస్తానని' వరమిస్తాడు శ్రీరాముడు. అది కృష్ణావతారంలో నెరవేరింది. అది పూర్తిగా తీరలేదేమో? లేక, గతాన్ని మరొక్కసారి గుర్తు చేద్దామని అనుకున్నారేమో శ్రీరామకృష్ణులు. ఆ విధంగా హరిప్రసన్నతో సరదాగా కుస్తీ పట్టి, అతన్ని గోడకు నొక్కిపట్టారు. అలాంటి హరిప్రసన్న, తులసీచరణ్ కు కాశీలో క్లాసుమేటయ్యాడు. భవిష్యత్తులో తులసి కార్యరంగంకూడా దక్షిణభారతమే కావడం గమనార్హం. కనుక స్వామి కూడా గతజన్మలో వానరసైన్యం లోనివాడేనా? అందుకేనా, దక్షిణభారతదేశంలోనే ఆయన దాదాపు 30 ఏళ్ళపాటు తన రక్తాన్ని ధారపోసి శ్రీ రామకృష్ణులు చూపిన మార్గంలో దీనులకోసం, ఆర్తులకోసం, సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగల్చడం కోడం పనిచేశాడు?
అంతేకాదు. స్వామి ఎప్పుడు త్రివేండ్రం వెళ్లినా కన్యాకుమారికి వెళ్లి జగన్మాత దర్శనం చేసుకుని, కొన్నాళ్ళు అక్కడ ఉండి తిరిగివస్తూ ఉండేవాడు. బహుశా వానరసైన్యంలో ఉన్నపుడు అక్కడి సముద్రతీరంలో తాము చేసినపని గుర్తుకురావడం వల్లనేనా స్వామి అలా చేసేవాడు? ఎవరికి తెలుసు? ఒకవేళ అవన్నీ గుర్తుకొచ్చినా కూడా, వాళ్ళెవరూ ఆ విషయాలు బయటకు చెప్పేవారు కారు.
స్వామివిజ్ఞానానంద గారికి పూర్వజన్మలో తాను జాంబవంతుడినన్న విషయం బాగా తెలుసు. ఆయన రామభక్తుడు. శ్రీరామకృష్ణులవారిలో శ్రీరాముడిని ఆయన ధ్యానించేవాడు. తన చివరిదశలో అలహాబాద్ (నేటి ప్రయాగరాజ్) రామకృష్ణమఠంలో ఉంటూ ఆయన వాల్మీకి రామాయణాన్ని అనువాదం చేస్తూ కాలం గడిపారు. మొదటి రెండు కాండాలను అనువాదం చేసిన ఆయన 1938 లో అక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో ఆయనకు అనుక్షణం కళ్ళెదురుగా సీతారాములు, ఆంజనేయుల దర్శనం నిరంతరం కలిగేదని నాకు స్వయానా నందానందస్వాముల వారే చెప్పారు. ఆయననోట నేనీ విషయాన్ని స్వయంగా విన్నాను. అంతటి రామభక్తితత్పరుడాయన !
అంతేకాదు, విజ్ఞానానందస్వామికి, నిర్మలానందస్వామికి ఉన్న అనుబంధంలో ఇంకొక్క విచిత్ర విషయం వినండి. వీరిద్దరూ 1938 లో ఒకే ఒక్కరోజు తేడాతో చనిపోయారు. విజ్ఞానానందస్వామి శ్రీరామకృష్ణ మఠం మిషన్ల సర్వాధ్యక్షునిగా 25-4-1938 న ప్రయాగలో చనిపోతే, చిన్నప్పుడు ఆయన క్లాసుమేటూ, తర్వాతికాలంలో సోదరభక్తుడూ, సోదరస్వామీ అయిన నిర్మలానందస్వామి 26-4-1938 న కేరళలోని ఒట్టపాలెం ఆశ్రమంలో చనిపోయారు. ఒకే ఒక్క రోజు తేడా ! అంతే !
ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? గతజన్మలలో విజ్ఞానానందస్వామి జాంబవంతుడని రామకృష్ణభక్తులలో అందరికీ తెలిసిన విషయమే. మరి నిర్మలానందస్వామి కూడా వానరసైన్యంలోని వాడేనని నా విశ్వాసం. బహుశా ఆయన, జాంబవంతునికి మంచి స్నేహితుడైన నీలుడై ఉంటాడని నా ఊహ. ఎందుకంటే, నిర్మలానందస్వామి ఎన్నోఏళ్ళు కేరళలోని ఏ నదీతీరంలో నివసించారో, ఆ 'భారత్ పులా' నదికి ఉన్న ప్రాచీన నామం నీలానది ! నీలానదీ తీరాన్నే ఆయన తన ఆశ్రమస్థాపనకు ఎంచుకున్నాడు. చివరకు అక్కడే శ్రీ రామకృష్ణ నిరంజన ఆశ్రమంలో కన్నుమూశాడు.
అంతేకాదు, యువకునిగా ఉన్న రోజులలో అసలైన సన్యాసిగా దేశాటనం చేస్తూ, డబ్బును తాకకుండా, మధుకరంతో జీవిస్తూ, కప్పుకింద నిద్రించకుండా ఆకాశమే కప్పుగా జీవిస్తూ, నిరంతరధ్యానంలో ఏళ్లకేళ్ళు గడిపిన నిర్మలానందస్వామి ఒకసమయంలో హిమాలయ అడవులలో దారితప్పి ఒక రాత్రంతా దట్టమైన అడవిలో చెట్టుక్రింద ఉండవలసి వఛ్చినపుడు ఒక అడవి కోతుల గుంపు ఆయనకు ఆతిధ్యం ఇచ్చి , తినడానికి పండ్లు తెచ్చిచ్చి, ఆయన ఎదురుగా చితుకులతో మంటను రాజేసి, రాత్రంతా ఆయనకు కాపలాగా ఉండి ఆయనకు రక్షణగా నిలిచాయన్న అద్భుత సంఘటన మీకు తెలుసా? ఇది నిజంగా జరిగింది. ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో ముందు ముందు వివరిస్తాను.
ఆయన గతజన్మలో వానరసైన్యంలోని నీలుడు కాకపోతే, శ్రీరామునికి నమ్మినబంటు కాకపోతే, శ్రీ రామకృష్ణుల అనుగ్రహానికి ఎలా పాత్రుడౌతాడు? ఆయనతోబాటుగా ఈ భూమికి ఎందుకొస్తాడు? కోతుల గుంపు హిమాలయ అడవులలో ఆయననెందుకు రక్షించి, తినడానికి తిండి పెట్టి, రాత్రంతా కాపలా కాచి రక్షించాయి? చెప్పండి మరి !
(ఇంకా ఉంది)
5, మే 2021, బుధవారం
అసలు నిజం
అనగనగా ఒక భూమి దాని జనాభా రోజురోజుకీ పెరిగిపోతున్నది. వనరులేమో రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. వాతావరణంలో వేడి పెరిగిపోతోంది. జనాభా ఎక్కువైన దేశాలనుంచి జనం వలసలుపోయి ఇతర దేశాలను ఆక్రమిస్తున్నారు. అక్కడ వీళ్ళ జనాభా పెరిగిపోయి గొడవలు జరుగుతున్నాయి. ఏం చెయ్యాలో ఎవరికీ పాలుపోవడం లేదు. మేధావులు గోలపెడుతున్నారు.
ఇలాంటి పరిస్థితిలో, ఉన్నట్టుండి ఇద్దరు ప్రపంచమేధావులకు భలే ఆలోచనొచ్చింది. వాళ్లిద్దరూ ప్రపంచంలోనే పెద్ద పెట్టుబడిదారులు. అయితే రెండు వేర్వేరు దేశాలకు, వర్గాలకు చెందినవాళ్లు. అయితేనేం? ఇలాంటప్పుడు బాగా కలుస్తారు.
'నువ్వు వైరస్ తయారు చెయ్యి. నేను వాక్సిన్ తయారు చేస్తాను. మనవరకూ జాగ్రత్తలు తీసుకుందాం. వైరస్ సృష్టించేది మనమే గనుక దానికి ఏమేం చెయ్యాలో మనకు తెలుసు. కనుక మీవాళ్ళకూ మా వాళ్లకూ ఢోకా లేదు. మిగతా వాళ్ళు పోతారు. పోతే పోనీ ! జనాభా తగ్గి భూమి బాగుపడుతుంది. ఒకపక్కన జనాభా తగ్గుతుంది. పోయినవాళ్లు పోగా ఉన్నవాళ్లు వాక్సిన్ కొంటారు కాబట్టి ఇంకోపక్కన డబ్బులొస్తాయి. ఎటు చూసినా మనకే లాభం'' అనుకున్నారిద్దరూ.
ప్లాన్ని అమలుచేశారు. అనుకున్నట్లే అంతా జరుగుతోంది. కోట్లల్లో జనం చస్తున్నారు. కోట్లల్లో డబ్బులొస్తున్నాయి. కానీ వీళ్ళ ప్లాన్ కొంత బెడిసికొట్టింది. ఈ లోపల కొన్ని దేశాలు వాళ్లకు వాళ్ళే వాక్సిన్ తయారు చేసుకున్నాయి. వీళ్ళ బిజినెస్ కుంటుపడుతోంది. అందుకని కొత్త వ్యూహం మొదలుపెట్టారు.
'ఆ వాక్సిన్ మంచిది కాదు. అది వాడవద్దు. మా వాక్సిన్ ఒక్కటే మంచిది. ఇదొక్కటే వాడండి' అనేదే ఆ వాదన. ఈ వాదనకు తోడుగా ఆయా దేశాలలో ఉన్న మీడియాని కొనేసి, సాధ్యమైనంతగా దుష్ప్రచారం చెయ్యమని, భయభ్రాంతులు సృష్టించమని, పురమాయించారు.
ఇక మీడియా రంగంలోకి దిగింది. చూపినదె చూపిస్తూ, చెప్పినదే చెబుతూ జనాన్ని భయపెట్టడం మొదలుపెట్టింది. విసుగుపుట్టి చాలామంది టీవీలు చూడటం మానేశారు. వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం బాగుంటున్నాయి.
వైరస్ సోకినప్పటికీ, ఇంట్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు బానే ఉన్నారు. ఆస్పత్రిలో చేరినవాళ్లు పోతున్నారు. డాక్టర్లు తప్పుడు వైద్యం చేస్తున్నారని, మొదట్లోనే ఇవ్వాల్సిన మందులను రోగం బాగా ముదిరిన తర్వాత ఇస్తున్నారని అప్పుడు ఉపయోగం ఉండదని మరికొందరు మేధావులు గగ్గోలు పెడుతున్నారు. ముదిరాకే మా దగ్గరకొస్తున్నారు మేమేం చెయ్యాలని డాక్టర్లు అంటున్నారు.
కానీ, మీడియా చేస్తున్న భయభ్రాంత ప్రచారం వల్ల మంచే జరిగింది. జనం భయపడి ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్ట్టారు. వైరస్ అదుపులోకి వస్తున్నది.
ఈ లోపల డాక్టర్లు, మందుల షాపులు, ఆక్సిజన్ సిలండర్లు అమ్మేవాళ్ళ దందా మొదలైంది. రోజుకి నూరు రూపాయల వైద్యం సరిపోయేచోట లక్షలు వసూలు చెయ్యడం మొదలైంది. బెడ్లతో సహా అన్నింటినీ బ్లాకులో అమ్మడం మొదలైపోయింది. 'ఎవడెలాపోతే నాకెందుకు? అవకాశాన్ని సొమ్ము చేసుకుందాం' అనే ధోరణి మొదలైపోయింది. చచ్చేవాడు చస్తున్నాడు. బ్రతికేవాడు బ్రతుకుతున్నాడు. ఎవడి ఖర్మ వాడిది. ఎవడి ధైర్యం వాడిది. ఎవడి అవకాశం వాడిది. ఎవడి చావు వాడిది. ఎవడి బ్రతుకు వాడిది.
కోట్లుమూలుగుతున్నవాడు దిక్కులేకుండా చస్తున్నాడు. వాడి శవాన్ని అనాధశవంలాగా అంత్యక్రియలు చేస్తున్నారు. అమెరికాలో పిల్లలున్నా రాలేని పరిస్థితి. అక్కణ్ణించే వాళ్ళు 'టాటా మమ్మీ, టాటా డాడీ' అంటూ చేతులూపుతున్నారు. చేతులు దులుపుకుంటున్నారు. అప్పటిదాకా ఎంతో ఆప్యాయతలు కురిపించినవాళ్లు అవసరానికి ముఖం చాటేస్తున్నారు. ఎవరికీ వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు పిలుపొస్తుందో అంటూ బ్రతుకుతున్నారు.
ఇదంతా చూస్తూ ప్రపంచమేధావులు నవ్వుకుంటున్నారు. ఈ వైరస్ నుంచి లోకం బయటపడుతుందా? ఒకవేళ పడితే పడనీయ్. దీని బాబులాంటివి ఇంకా బోలెడన్ని వైరస్ లు వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. కోట్ల డాలర్లు పెట్టి ల్యాబుల్లో రీసెర్చి చేయించి మరీ కొత్త కొత్త వైరస్ లను సృష్టించి ఆల్రెడీ దగ్గర పెట్టుకున్నారు. ఒకదాని తర్వాత మరొకటి లోకంమీదకి వదుల్తారు. ఎవడేమై పోతే వాళ్ళకెందుకు? వాళ్ళ దందా ప్రస్తుతం నడుస్తోంది. వాళ్ళాడే చదరంగంలో దేశాలు, మనుషులు పావులు. ఈ గ్లోబల్ వ్యాపారంలో మనుషులే వస్తువులు. ప్రాణాలే పెట్టుబడులు.
కానీ ఎలాంటి ఆటగాడి ఆట్టైనా కూడా కొన్నాళ్ళకి ముగుస్తుంది. పులిమీద స్వారీ చేసేవాడిని కూడా పులి ఒకరోజున మింగుతుంది. సాగినంత కాలం సాగుతుంది ఎవడిదైనా ఆట. ఆ తర్వాత ఆడేవాడూ ఉండడు, పావులూ ఉండవు. అనంత కాలగమనంలో ఇలాంటి ఆటగాళ్లు ఎంతమంది కనుమరుగైపోయారో? ఎన్ని పావులు మట్టిలో కలసిపోయాయో?
ఇంతకీ, ఈ మొత్తం ప్రహసనంలో అసలు నిజమేంటి?
అన్నీ తన చేతిలోనే ఉన్నాయని అనుకుంటున్నంతవరకూ మనిషి బ్రతుకింతే. ఇప్పటికి కనిపిస్తున్నదే నిజమని అనుకుంటూ ఉన్నంతకాలం మనిషి బ్రతుకింతే. ఏది శాశ్వతమో ఏది కాదో తెలీనంతవరకూ మనిషి బ్రతుకింతే. స్వార్ధమే పరమార్థమనుకుంటున్నంత వరకూ మనిషి బ్రతుకింతే.
ఎలా బ్రతకాలో తెలీనంతవరకూ ఏదో ఒకటి మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఎలా బ్రతకాలో తెలిస్తే, చావు కూడా మనల్ని భయపెట్టదు. కానీ, చావు ఎదురైనప్పుడు కాదు నేర్చుకోవలసింది ఎలా బ్రతకాలో. అది ఇంకా ఎంతో దూరంలో ఉన్నప్పుడే ఆ విద్యను నేర్చుకోవాలి. అలా బ్రతకాలి.
ఈ నిజాన్ని ఇంకా సమయం ఉన్నపుడే గ్రహించినవాడే అసలు మనిషి. వాడిదే అసలైన బ్రదుకు. వాడిదే అసలైన చావు. వాడికి ఉన్నా ఒకటే పోయినా ఒకటే. మిగతావాళ్ళు నిరర్ధకజీవులు. వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే.
ఇదే అసలు నిజం.
4, మే 2021, మంగళవారం
మెక్సికో సిటీ మెట్రో రైలు ప్రమాదం - జ్యోతిష్య విశ్లేషణ
శని, సూర్యుడు, రాహువు ఈ సంఘటన వెనుక ఉన్న ముఖ్య గ్రహాలు. శని సూర్యులమధ్యన ఖచ్చితమైన కేంద్రదృష్టి ఉన్నది. ఇది ఘోరప్రమాదాలను సృష్టించే శక్తిని కలిగి ఉంటుంది. ఇకపోతే, శనిరాహువులమధ్యన ఖచ్చితమైన కోణదృష్టి ఉన్నది. ఇది బలమైన శపితయోగాన్ని రేకెత్తిస్తుంది. హఠాత్ సంఘటనలకు, విద్రోహచర్యలకు కారకుడైన యురేనస్ సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నాడు.
యాక్సిడెంట్ జరిగినపుడు మెక్సికో సిటీలో ధనుర్లగ్నం ఉదయిస్తున్నది. యాక్సిడెంట్లకు సూచికగా ఉన్న ఆరవ ఇల్లు వృషభంలో ఉచ్చరాహువు, బుధుడు ఉన్నారు. బుధుడు దశమాధిపతిగా ఆరవ ఇంటిలో ఉంటూ యాక్సిడెంట్ ను సూచిస్తున్నాడు.
దేశాలకు, రాశులకు ముడిపెట్టాలని చాలా పాతకాలం నుంచీ జ్యోతిష్కులు ప్రయత్నించారు. రకరకాల జ్యోతిష్కులు రకరకాలుగా వీటిని చెప్పారు. వీరిలో ఎక్కువమంది పాశ్చాత్య జ్యోతిష్కులున్నారు. కానీ వీరిలో ఏకాభిప్రాయం లేదు. వీరిని గౌరవిస్తూనే, నా లాజిక్ ను కొంత వివరిస్తాను.
మిథునరాశి అనేది అమెరికాకు సూచికని చాలామంది జ్యోతిష్కులు ఒప్పుకున్న విషయం ! దీనిని ఆధారాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు, అమెరికాకు దక్షిణాన ఉన్న మెక్సికో వృషభం అవ్వాలి. ప్రస్తుతం రాహు బుధులున్నది వృషభరాశిలోనే గనుక నా లాజిక్ దీనికి సరిపోతోంది. పైగా, భారతదేశం యొక్క రాశి మకరమని కూడా ఏకాభిప్రాయమున్నది. భారతదేశమూ, మెక్సికో రెండూ ప్రపంచపటంలో దక్షిణాదిలోనే ఉంటాయి గనుక, మకరానికి కోణరాశియైన వృషభం మెక్సికో రాశి కావడం సమంజసంగానే ఉంటుంది.
యాక్సిడెంట్ జరిగిన సమయంలో గురుహోర జరుగుతున్నది. గురువు దశమంలో ఉండాలంటే అది వృషభమే అవ్వాలి. కనుక మెక్సికో దేశపు రాశి వృషభమని నేను భావిస్తున్నాను. అయితే ఇది అంతిమభావన కాదు. ఇంతకంటే మెరుగైన లాజిక్ దొరికేవరకూ దీనిని మనం అనుసరిద్దాం.
వృషభలగ్నం నుంచే చూచినప్పుడు ప్రయాణాలకు సూచకుడైన చంద్రుడు దూరప్రయాణాలకు సూచికైన మకరంలో బాధకుడైన శనితో కలసి ఉండటం రవాణా ప్రమాదాన్ని సూచిస్తున్నది. అంతేగాక వీరిద్దరి దృష్టి కర్కాటకం పైన ఉన్నది.
ప్రమాదసమయంలో కుజ - రాహు - శనిదశ జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైన దశ అనే విషయం నా వ్రాతలు చదివేవారికి బాగా తెలుసు. వృషభం నుంచి చూస్తే, రెండింట ఉన్న కుజుడు స్వదేశంలో ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. లగ్నంలోనే ఉన్న రాహువు రవాణా ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. నవమంలో ఉంటూ తృతీయాన్ని చూస్తున్న శని మళ్ళీ రవాణా ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. చంద్రలగ్నం నుంచి చూస్తే - ఆరవయింట్లో ఉన్న కుజుడు ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. రాహువుతో ఆరవ అధిపతి బుధుడు కలసి ఉన్నాడు. శని చంద్రునితోనే ఉంటూ ఏడుపును సూచిస్తున్నాడు. నవాంశలో మిథునంలో కలసి ఉన్న శనిరాహువులు భయంకరమైన యోగాన్ని సృష్టిస్తూ సహజతృతీయ రాశి అయిన మిథునం ద్వారా రవాణాప్రమాదాన్ని సూచిస్తున్నారు.
అష్టమి ఘడియలలో ఈ ప్రమాదం జరిగింది. కొన్ని కొన్ని తిధులు ఇలాంటి సంఘటనలకు చాలా బాగా పనిచేస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. అలాంటి వాటిల్లో అష్టమి ఒకటి. అదీ సరిపోయింది.
అదన్నమాట సంగతి !








