“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

31, మార్చి 2019, ఆదివారం

సంగీతం ఆధ్యాత్మికతకు వ్యతిరేకమా?

ఈ మధ్యన నా బ్లాగులో ఎక్కువగా పాటల్ని పోస్ట్ చేస్తున్నాను. అవి చూచి కొందరు నాకు మెయిల్స్ ఇస్తున్నారు. వాటిలో భాష వేరైనా, వాటి సారాంశం మాత్రం ఒకలాగానే ఉంటున్నది.

'మీ బ్లాగ్ పేరు తెలుగుయోగి అని పెట్టారు. అంటే ఆధ్యాత్మికం కదా? కానీ మీరు అన్నిరకాల పాటలూ పాడుతున్నారు. ఈ మధ్యన మీ బ్లాగులో పాటలే కనిపిస్తున్నాయి. ఇది ఆధ్యాత్మికం అంటారా?'

ఈ ప్రశ్నకు ఒక్కొక్కరికి విడివిడిగా జవాబు ఇవ్వడం కుదరదు గనుక బ్లాగు ముఖంగా సమాధానం ఇస్తున్నాను.

ఆధ్యాత్మికం అంటే మీకున్న అభిప్రాయాలు సరియైనవి కావు. ముందుగా వాటిని మార్చుకోవాల్సిన అవసరం మీకున్నది. లోకం అనుకుంటున్న ఆధ్యాత్మిక మార్గానికి నా మార్గం చాలా భిన్నమైనది. నా మార్గం చాలా ప్రాచీనమైనది. అసలైనది. నేటి నకిలీ ఆధ్యాత్మిక వ్యవస్థకు పూర్తిగా భిన్నమైనది. ఈ విషయం నా శిష్యులకు బాగా తెలుసు.

బాహ్యవైరాగ్యంతో, బాహ్యసన్యాసంతో, పూజలతో తంతులతో కూడిన మార్గాన్ని నేను బోధించను. అది సరియైనది కాదని నా గట్టివిశ్వాసం. నా శిష్యులు తమ జీవితంలో దేనినీ వదలవలసిన పనిలేదు. ఏ పూజలూ చెయ్యవలసిన పని లేదు. జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తూ అసలైన ఆధ్యాత్మికతను అందుకోవచ్చని నేనెప్పుడూ చెబుతాను. అది ఎలా? అంటే, నా మార్గంలో అడుగుపెడితేనే అది అర్ధమౌతుంది. బయటనుంచి చూస్తుంటే ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా అది మీకర్ధం కాదు. నా బ్లాగ్ ఒక కలగూర గంప. దీనిని పైపైన చదివితే నా మార్గం మీకర్ధం కాదు. పైపెచ్చు, ఇంకాఇంకా సందేహాలూ అనుమానాలే మీకు కలుగుతాయి.

సాంప్రదాయ ఆధ్యాత్మికమార్గంలో కూడా సంగీతానికి, కీర్తనలకు, భక్తిగానానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. భక్తికవులూ, భక్తియోగులూ, గానసాధకులూ, సంగీతఋషులూ ఎందఱో మన దేశంలో ఉన్నారు. నిజానికి సంగీతం అనేది దైవాన్ని సూటిగా చేర్చే ఒక అద్భుతమైన మార్గం. అయితే ఇక్కడ మీకొక సందేహం రావచ్చు.

సాంప్రదాయ కీర్తనలు మంచివే, అవి దైవంతో తన్మయత్వాన్నిస్తాయి. కానీ మీరు అవి పాడటం లేదు కదా. మీరు సినిమా మాటలు పాడుతున్నారు. ఇదెలా ఆధ్యాత్మికత అవుతుంది? అని మీకు అనుబంధ ప్రశ్న రావచ్చు. మీరు అడగకముందే దానికి జవాబు ఇస్తున్నాను.

సాంప్రదాయ సంగీతం అంతా అత్యుత్తమమైనదేమీ కాదు. ఉదాహరణకు, జయదేవుని అష్టపదులని సంస్కృతం ముసుగు తొలగించి మన భాషలో అర్ధం చేసుకుంటే ఆ పదాలలో ఉన్నంత అసభ్యత ఇంకెక్కడా ఉండదు. కానీ మడి కట్టుకున్న సాంప్రదాయ వాదులందరూ ఎంతో తన్మయత్వంతో ఆ కీర్తనలు పాడుతూ ఉండటం మనం చూడవచ్చు.

దీనికి భిన్నంగా, నేను పాడుతున్న పాటల్నిమీరు జాగ్రత్తగా గమనిస్తే, అవి హిందీ అయినా, తెలుగైనా, వాటిలో ఒక ఉదాత్తమైన ప్రేమభావం మాత్రమె మీకు కనిపిస్తుంది. చెత్త పాటల్ని నేను పాడను. ఈ లోకపు వెర్రి వేషాలనుండి, చెత్త భావనలనుండి, నిమ్నత్వాలనుండి మీ మనసులను పైకిలేపి ఒక అతీతమైన మధురభావలోకానికి నా పాటలు మిమ్మల్ని చేరుస్తాయి. వాటిల్లో చాలా సినిమాలను నేను ఇప్పటివరకూ చూడలేదు. ఇకముందు చూడను కూడా ! నాకు పాటలోని ఉదాత్తమైన భావమూ, మధురమైన రాగమే ముఖ్యం. అంతేగాని అది సినిమాపాటా లేక త్యాగరాజ కీర్తనా అనేది ముఖ్యం కాదు. అది సినిమాపాట అని చిన్నచూపు చూడకండి. వాటిల్లో కూడా ఎంతో అద్భుతమైన సున్నితమైన భావాలను పలికించే పాటలు ఎన్నో ఉన్నాయి. వాటినే నేను పాడుతున్నాను.

కనుక నేను పాడుతున్న సినిమా పాటల వల్ల నా బ్లాగుకున్న ఆధ్యాత్మిక ఇమేజికిగాని, గురువుగా నాకున్న ఇమేజికి గాని, ఏమీ భంగం వాటిల్లదని అర్ధం చేసుకోండి. ఒకవేళ ఇంతమాత్రానికే జారిపోయే శిష్యులూ అభిమానులూ స్నేహితులూ ఉంటె అలాంటి మనుషులు నాకక్కర్లేదు. అలాంటి నిలకడలేని మనుషులు నాతో నడవలేరు. నా మార్గం చాలా కష్టమైనది మరియు ఉన్నతమైనది. కనుక అల్పమనస్కులు ఈ దారిలో నడవలేరు. అలాంటివాళ్ళు జారిపోవడమే నాకూ వారికీ మంచిది.

నేను క్వాంటిటీ కంటే క్వాలిటీ కే ప్రాధాన్యత నిస్తాను. ఊరకే చుట్టూ చేరి సోదిమాటలు మాట్లాడుతూ భజన చేసే వందమంది కంటే, నన్ను సరిగా అర్ధం చేసుకుని మౌనంగా అనుసరించే ఒక్క మనిషి నాకు చాలు. అలాంటివారినే నేను ఇష్టపడతాను.

నేను పాడే పాటలు, సాహిత్యపరంగానూ, సంగీతపరంగానూ ఉన్నతమైనవే అయి ఉంటాయని గమనించండి. వాటివల్ల నాకుగాని మీకుగాని, ఆధ్యాత్మిక జీవితానికి ఇంకా మేలే జరుగుతుంది గాని భంగం ఏమీ వాటిల్లదు.

నిజమైన శ్రీవిద్యోపాసన వల్ల, సంగీతమూ, సాహిత్యమూ, ఇంకా ఎన్నో కళలూ విద్యలూ అలవోకగా సిద్ధిస్తాయి. నా బ్లాగులో మీరు చూస్తున్నది అదే.

ఈ నా జవాబుతో మీమీ సందేహాలు తీరాయని తలుస్తున్నాను.
read more " సంగీతం ఆధ్యాత్మికతకు వ్యతిరేకమా? "

26, మార్చి 2019, మంగళవారం

గుడ్డి గురువులు - 3

ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఫంక్షన్ జరుగుతూ ఉండగా, ఇంకొకాయన్ని తీసుకొచ్చి 'ఈయన మా ఇంకో గురువుగారు' అంటూ మళ్ళీ పరిచయం చేశాడు మొదటాయన.

'ఈయన మూడో కృష్ణుడన్నమాట' అనుకుంటూ ఆయనవైపు నిర్లిప్తంగా చూస్తూ జీవం లేని చిరునవ్వొకటి నవ్వాను.

ఆయనకూడా నావైపు అలాగే చూస్తూ 'నమస్కారం' అన్నాడు ఏదో అనాలి అన్నట్టు.

నేనుకూడా ఏడిచినట్టు ముఖం పెట్టి 'నమస్కారం' అన్నాను. కానీ లోలోపల మాత్రం నవ్వు ఉబికి వస్తోంది.

ఇక మూడో గురువుగారి పరిచయం మొదలైంది.

'ఈయన ఫలానా గుళ్ళో ఉంటారు. ఒకరోజున ఈయన నన్ను రమ్మని పిలిచారు. ఏంటా అని వెళ్లాను. నువ్వు ఈ రోజంతా ఎక్కడికీ వెళ్లొద్దు. ఈ గుళ్లోనే ఉండు' అన్నారు. 'ఎందుకు?' అనడిగాను. 'భూమిలోనుంచి అమ్మవారు వస్తుంది' అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మధ్యాన్నానికి నేలలోంచి అమ్మవారు వచ్చింది' అన్నాడు పరిచయం చేసినాయన.

హటాత్తుగా నా బ్రతుకు మీద నాకే విపరీతమైన అసహ్యం వేసింది. 'చూసేవాళ్ళకి మరీ ఇంత వెర్రి వెంగళప్పలాగా కనిపిస్తున్నానా?' అని అనుమానం వచ్చి ఒక్కసారి నన్ను నేనే తాట ఊడేలా గట్టిగా గిచ్చుకున్నా.

'ఏంటండీ అలా గోక్కుంటున్నారు?' అన్నాడు గురువుగారు.

'గిచ్చుకోదానికీ గోక్కోడానికీ తేడా తెలియదు వీడికి' అని మనసులో అనుకుంటూ, మళ్ళీ జవాబు సరిగా చెప్పకపోతే, 'గుడికి రండి, తీర్ధం ఇస్తా' అంటాడేమో అని భయం వేసి, ' అబ్బే అలాంటిదేం లేదండి. ఊరకే జస్ట్ ఏదో పాకినట్టుంటేనూ' అన్నా మొహమాటంగా నవ్వుతూ.

నేను సరిగా వినలేదేమో అని అనుమానం వచ్చినట్టుంది. మళ్ళీ అమ్మవారు నేలలోనుంచి బయటకు రావడం సీనంతా వివరించాడు మొదటాయన.

నేను అనుమానంగా గురువుగారి ముఖంలోకి చూచాను.

ఆయన నేలచూపులు చూస్తూ 'ఏదోలెండి అమ్మవారి దయ' అన్నాడు వినయంగా.

'ఏ అమ్మవారు నాయనా. ఇంట్లో అమ్మవారా? లేక బయట అమ్మగారా?' అందామని నోటిదాకా వచ్చిన మాట నోట్లోనే ఆగిపోయింది.

'అంత చెప్పినా కూడా నా దగ్గర నుంచి ఆశ్చర్యం గాని, ఇంకోటి గాని రాకపోయే సరికి వాళ్ళకూ నేనంటే చిరాకు వేసినట్టుంది, 'సరే ఉంటానండి' అన్నాడు మర్యాదగా చేతులు జోడిస్తూ. 'మంచిదండి' అన్నా నేనూ అదే రాగంలో.

ఇది చాలా ప్రిమిటివ్ ట్రిక్. ఆటవిక సమాజాలు ఉన్నప్పటినుంచీ ఈ ట్రిక్ భూమ్మీద ఉంది. నేలలో విగ్రహాలు పాతిపెట్టి అక్కడ తవ్వించి, 'స్వామి బయటకు వచ్చాడు. అమ్మవారు బయటకు వచ్చింది' అని జనాన్ని నమ్మించే దొంగపూజారులు దొంగస్వాములు పాతకాలంలో ఉండేవారు. ఇప్పుడూ ఉన్నారన్నమాట అని మళ్ళీ రుజువైంది. కొంతకాలం క్రితంవరకూ జనం వేలం వెర్రిగా పూజించిన ఒక బాబాగారు ఈ ట్రిక్ చెయ్యడంలో సిద్ధహస్తులు. నది ఒడ్డున ఇసకలో కృష్ణుడి విగ్రహం పాతిపెట్టి, మళ్ళీ దాన్నే తవ్వి బయటకు తీసి, పెద్ద పెద్ద సైంటిస్టులను కూడా బోల్తా కొట్టించిన ఘనుడాయన.

ఆ తర్వాత అందరూ చందాలేసుకుని ఆ విగ్రహానికి గుడి కట్టడమూ, ఆ గుడిమీద పడి ఈ మెజీషియన్ బ్రతికెయ్యడమూ జరుగుతూ ఉంటుంది.

పనీపాటా చెయ్యకుండా లోకంలో ఇతరుల మీద పడి ఊరకే బ్రతికేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. వీళ్ళనే పారాసైట్స్ అనవచ్చు. వీళ్ళలో రెలిజియస్ పారాసైట్స్ మరీ నీచులు. ఇలాంటి వారంటే నాకు చెప్పరానంత అసహ్యం. ఏదో ఒక గుడినో స్వామీజీనో ఆశ్రయించి ఇలా బ్రతికేస్తూ ఉండేవారికంటే, కూలీ నాలీ చేసుకుంటూ బ్రతికేవారికే నేను ఎక్కువ విలువనిస్తాను.

19 ఏళ్ళ వయసులో ఉన్నపుడు స్వామీజీ అయ్యే అవకాశం నాకొచ్చింది. కానీ అది పారాసైట్ బ్రతుకని నేను దాన్ని తిరస్కరించాను. ఎప్పుడో ముప్పై అయిదేళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటన ఒక్కసారి నా కళ్ళముందు మళ్ళీ మెదిలింది.

ఏంటో ఈ మాయ లోకం? అసలైన దానికి విలువ ఉండదు. నకిలీకి విపరీతమైన విలువ ఉంటుంది. ఈ ప్రపంచం తీరు ఇంతేనేమో? ఎప్పటికీ ఇది మారదేమో? అన్న ఆలోచనలు నాలో కలిగాయి.

'బుద్ధుడికి మర్రిచెట్టు కింద జ్ఞానోదయం అయింది. నీకు మామిడిచెట్టు పక్కనే అయిందన్నమాట' అంటూ నవ్వుతున్న కర్ణపిశాచి స్వరం స్టేజిమీద నుంచి హటాత్తుగా వినిపించి నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.

తలతిప్పి అటువైపు చూసిన నాకు, పురోహితుడి పక్కనే కూచుని మంత్రాలు చదువుతున్నట్టు పోజు కొడుతున్న కర్ణపిశాచి కనిపించింది.

నవ్వుతూ దానివైపు చెయ్యి ఊపాను. అదీ నన్ను చూస్తూ చెయ్యి ఊపింది.

తనకు చెయ్యి ఊపుతున్నాననుకుని పురోహితుడు నావైపు కోపంగా చూస్తున్నాడు.

'చూశావా నిన్నెలా బోల్తా కొట్టించానో?' అన్నట్లుగా కర్ణపిశాచి పగలబడి నవ్వుతోంది.

(అయిపోయింది)
read more " గుడ్డి గురువులు - 3 "

గుడ్డి గురువులు - 2

ఇలా కాసేపు ఆలోచించి, 'ఇక చాల్లే' అనుకుంటూ పక్కనే ఉన్న వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టాను. మేము మాట్లాడుకుంటూ ఉండగా ఏనుగులా ఉన్న ఒక పిలకశాల్తీ ఉన్నట్టుండి మా గుంపులో జొరబడి - 'ఏంటి బాగున్నావా?' అంటూ మాలో ఒకరిని పలకరించి మా మాటలకు అడ్డు తగిలింది.

ఆ శాల్తీ వైపు తేరిపార చూచాను. ఏదో గుళ్ళో పూజారిలా అనిపించింది.

లోకంలో ఎవరన్నా సరే, నాలో ద్వేషభావం లేకుండా ఉండటానికి ఎప్పుడూ నేను ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ ఇద్దరు వ్యక్తులను మాత్రం నేనస్సలు భరించలేను. ఒకటి పురోహితులు, రెండు గుళ్ళో ఉండే పూజారులు. దీనికి కారణాలున్నాయి.

మొదటి కారణం - వీళ్ళలో అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండో కారణం - లేకి ప్రవర్తన కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండూ నన్ను ఆమడదూరం తోసేస్తూ ఉంటాయి. మంచివారినీ, క్లాస్ గా ఉండేవారినే నేను ఇష్టపడతాను గాని ఇలాంటి అహంకార. లేకి ధోరణులు ఉండేవారితో ఒక్క క్షణం కూడా ఇమడలేను. ఈ పిలకేనుగు కూడా అలాంటి బాపతే అని, అతని సంస్కారరహిత ప్రవర్తనను బట్టి క్షణంలో అర్ధమైంది.

'ఆ బాగున్నాను' అన్నాడు మా గుంపులో ఉన్న వ్యక్తి.

'కార్యక్రమం బాగా జరిగింది. నేను పెట్టిన ముహూర్తం అలాంటిది మరి !' అన్నాడు పిలకేనుగు ఏమాత్రం సిగ్గులేకుండా డప్పు కొట్టుకుంటూ.

నాకు చచ్చే నవ్వొచ్చింది.

అతను ముహూర్తం పెట్టిందేమో ఉదయం ఆరుకి. జరిగిందేమో ఏడుంబావుకి. మరి ముహూర్తంలో అంత బలం ఉంటే, పెట్టిన టైముకి ఎందుకు జరగలేదు? అని అడుగుదామని నోటిదాకా వచ్చిందిగాని, ప్రతివారితో గొడవలు ఎందుకులే అని మౌనంగా ఉండిపోయాను.

'పెట్టింది ముహూర్తం కాదు, జరిగినదే ముహూర్తం' అన్న జిల్లెళ్ళమూడి అమ్మగారి మహావాక్యం గుర్తొచ్చి మౌనంగా నవ్వుకున్నా.

గురువారం గురుహోర అని ఉదయం ఆరుకి ముహూర్తం పెట్టాట్ట ఆ పిలకేనుగు. ఇలాంటి మిడిమిడిజ్ఞానం గాళ్ళని చూస్తుంటే తన్నాలని అనిపిస్తుంది నాకు. ఇలాంటివాళ్ళ వల్లే జ్యోతిష్యశాస్త్రం భ్రష్టు పడుతోంది. 'కామన్ సెన్స్ లేకుండా ఉదయం ఆరుకి ముహూర్తం ఏంట్రా నీ బొంద? నువ్వు ముహూర్తం పెడుతున్నది కార్యక్రమానికా? లేక టాయిలెట్ కి వెళ్ళడానికా? పైగా హైదరాబాద్ లో సూర్యోదయం 6-21 కి అవుతుంటే, నువ్వు ఆరుకి గురుహోర అని ఎలా చెప్పావురా? నువ్వు ముహూర్తం పెట్టింది గురుహోరలోనా లేక శనిహోరలోనా అప్రాచ్యుడా?' అందామని నోటిదాకా వచ్చింది. ఇలాంటి వెధవలతో మనకెందుకులే అని మళ్ళీ మింగేశాను.

నేటి పనికిమాలిన జ్యోతిష్కులలో చాలామంది 'హోరలు' అంటూ, చాలా ఇబ్బందిగా ఉండే సమయంలో ముహూర్తాలు పెడుతున్నారు. ఇది చాలా తప్పు. అసలు హోరలు అనేవి మనవి కావు. అవి గ్రీక్ జ్యోతిష్యం నుంచి మనం కాపీ కొట్టినవి. 'హోర' అనే గ్రీక్ పదం నుంచే 'హవర్' లేదా 'అవర్' అనే ఇంగ్లీషు పదం పుట్టింది. మన భారతీయ జ్యోతిష్యశాస్త్రంలోని ముహూర్తభాగంలో హోరాసిద్ధాంతం లేనేలేదు. కానీ నేటి మిడిమిడి జ్యోతిష్కులూ, గుళ్ళలో ఉండే పురోహితులూ హోరల్ని ఆధారం చేసుకుని ముహూర్తాలు పెడుతున్నారు. తెలిసీ తెలియని అజ్ఞానులు పెట్టించుకుంటున్నారు.

అసలు, పెళ్లి ముహూర్తాలూ, నిశ్చితార్ధముహూర్తాలూ గురుహోరలో పెట్టకూడదు. గురుహోర అనేది పూజలకు, మంత్రసాధనకు, తీర్ధయాత్రలకు మంచిది గాని పెళ్ళికి సంబంధించిన పనులకు మంచిది కాదు. అలాంటివాటికి శుక్రహోరను వాడాలి. ఇంతచిన్న విషయం కూడా తెలియనివాళ్ళు జ్యోతిష్కులని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇదంతా చెప్పి అక్కడ మన విజ్ఞానప్రదర్శన చెయ్యడం ఎందుకని మౌనంగా చూస్తున్నాను.

'మీకు రేపు ఆగస్ట్ లోపల ఉద్యోగంలో మార్పు ఉంటుంది.' అంది పిలకేనుగు మా గ్రూపులో ఉన్న ఒకాయన్ని చూస్తూ.

'ఓహో. మార్కెటింగ్ మొదలు పెట్టావట్రా చీప్ వెధవా' అనుకున్నా లోలోపల. చాలామంది పూజారులూ పురోహితులూ ఇంతే. నలుగురు కన్పిస్తే చాలు, ఇక వాళ్ళ బిజినెస్ మొదలుపెడతారు.

'అవునా. చాలా ధాంక్స్ అండి' అన్నాడీయన భక్తిగా పిలకేనుగుకి నమస్కారం పెడుతూ.

'నేను చెప్పినది జరిగితే మన గుడికి వచ్చి స్పెషల్ పూజ చేయించుకోండి' అన్నాడు పిలకేనుగు.

నాకు నవ్వుతో పొట్ట చెక్కలయ్యేలా ఉంది.

'ఏంట్రా! స్పెషల్ పూజ చేయించుకోవాలా? ఎవరు? దేవుడా ఇతనా?' అనుకున్నా లోలోపల.

'ఆయ్ ! అలాగేనండి. తప్పకుండా వస్తానండి' అన్నాడు వింటున్నాయన.

ఇంతగా మార్కెటింగ్ చేసినా మేమేమీ ఇంప్రెస్ అవకపోవడంతో ఏనుగుకి చిరాకేసినట్టుంది. నావైపు కోపంగా చూసి అక్కణ్ణించి మెల్లిగా వెళ్ళిపోయింది.

'బ్రతకడానికి ఇన్ని అబద్దాలు చెప్పి ఇంత మార్కెటింగ్ చెయ్యాలట్రా?' అనుకున్నా మనసులో.

జ్యోతిష్యశాస్త్రానికి ఇలాంటి చీడలు చాలామంది పట్టుకొని ఉన్నారు. శాస్త్రంలో లోతుపాతులు తెలీక, ఉదయం ఆరుగంటలకి ముహూర్తాలూ, అర్ధరాత్రి పన్నెండు గంటలకి ముహూర్తాలూ పెడుతూ ఉంటారు ఇలాంటివాళ్ళు. డబ్బుకి ఆశపడి ఇలాంటి పనులు చేస్తూ జ్యోతిష్యశాస్త్రంతో ఆటలాడే వీళ్ళకు ఋషిశాపం తప్పదు. ఆ సంగతేమో వీళ్ళకు తెలీదు.

పురోహితులూ పూజారులూ అంటే నాకున్న తేలిక అభిప్రాయం ఈ సంఘటనతో మళ్ళీ బలపడింది.

(ఇంకా ఉంది)
read more " గుడ్డి గురువులు - 2 "

22, మార్చి 2019, శుక్రవారం

Meet Na Mila Re Manka - Kishore Kumar


Meet Na Mila Re Manka...

అంటూ కిషోర్ కుమార్ హుషారుగా ఆలపించిన ఈ గీతం 1973 లో వచ్చిన Abhimaan అనే చిత్రం లోనిది. సచిన్ దేవ్ బర్మన్ కు అభిమాన గాయకుడు కిషోర్ కుమార్. అందుకే ఈ గీతాన్ని కిషోర్ చేత పాడించాడు సచిన్ దా.

నేను వెదుకుతున్న స్నేహితురాలు నాకింకా దొరకలేదంటూ ఈ పాట చాలామంది హృదయగత భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పాట నా ఫేవరేట్ సాంగ్స్ లో ఒకటి.

జీవితంలో అతి పెద్ద అదృష్టం ఏది అంటే, ఎందఱో ఎన్ని రకాలుగానో చెబుతారు. ఎక్కువమంది డబ్బు ఆస్తులు సంపాదించడం అని చెబుతారు. కానీ నేను మాత్రం - మనల్ని పూర్తిగా అర్ధం చేసుకునే ఒక మంచి స్నేహితురాలు దొరకడమే అతి పెద్ద అదృష్టం- అని చెబుతాను.

ఈ రొమాంటిక్ గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి !

Movie:--Abhimaan (1973)
Lyrics:--Majrooh Sultanpuri
Music:-- S.D.Burman
Singer:-- Kishore Kumar
Karaoke singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------
Humming
Meet na mila re manka – 2
He Meet na mila re manka
Meet na mila re manka
Koi tho Milan ka – 2
Karo re upaay Re
Meet na mila re manka – Meet naa

Chain nahi baahar
Chain nahi ghar me re
Chain nahi baahar
Chain nahi baahar
Chain nahi ghar me
Man mera dharti par – Aur kabhi ambar me
Usko doonda Har nagar me Hard dagar me
Gali gali dekha – Nayan uthaay Re
Meet na mila re manka – Meet naa

Roj me apne hi
Pyaaar ko samjhaavoo Re
Roj me apne hi
Pyaaar ko samjhaavoo
Vo nahi aayega – Maan nahi paavoo
Shaam hee se Prem Deepak Mai Jalaavu
Phir wahi Deepak – Din me bujhaay Re
Meet na mila re manka – Meet naa

Der se man mera Aas liye dole
Der se man mera Aas liye dole Re
Der se man mera
Der se man mera Aas liye dole
Preet bhari baani Saaz mera bole
Koi sajni Ek khidki bhina khole
Laakh tarane Raha mai sunaay Re
Meet na mila re manka – 2
Koi tho Milan ka – Karo re upaay Re
Meet na mila re manka – Meet naa
He ye meet naa...

Meaning

I have not met the friend of my heart yet
Please find a way for us to meet
I have not met the friend of my heart yet

There is no peace outside
there is none in the house, either
on the Earth, in the sky
I have searched for her in every town
and in every path
Every lane I searched with a hopeful look

Everyday I console my heart
I can't accept that she may never appear in my life
Every evening I light the lamp of love
in the day I put it off

For a long time, my heart nurtured this dream
A theme of love emerges from my songs
though I sang a hundred thousand songs of love
not a single damsel opened her window

I have not met the friend of my heart yet
Please find a way for us to meet
I have not met the friend of my heart yet


తెలుగు స్వేచ్చానువాదం

నా హృదయం కోరుకుంటున్న స్నేహితురాలు
నాకింకా కనిపించలేదు
ఎవరైనా ఏదైనా మార్గం చూపండి
మేమిద్దరం ఎలాగైనా కలుసుకోవాలి

ఇంటిలోనూ శాంతి లేదు
బయటా లేదు
ఈ భూమ్మీదా ఆకాశంలోనూ
ఆమెకోసం ప్రతి ఊరూ ప్రతిదారీ గాలించాను
ప్రతి వీధీ ఎంతో ఆశతో వెదికాను

ప్రతిరోజూ నా ప్రేమకు నచ్చచెబుతూ ఉంటాను
ఆమె నాకు ఎప్పటికీ కనిపించదేమో అని చాలాసార్లు అనిపిస్తుంది
కానీ ఆ ఊహను నేను ఏ మాత్రం ఒప్పుకోలేను
ప్రతి సాయంత్రమూ నా ప్రేమదీపాన్ని వెలిగిస్తూనే ఉంటాను
మళ్ళీ పగటిపూట ఆర్పేస్తూ ఉంటాను

ఎంతోకాలం నుంచీ నా మనస్సుకు ఒక ఆశ ఉంది
నా పాటల్లో ప్రేమే తొణికిసలాడుతూ ఉంటుంది 
ఇప్పటికి లక్ష ప్రేమగీతాలు పాడాను
కానీ ఒక్క ప్రేయసి కూడా తలుపులు తెరవలేదు

నా హృదయం కోరుకుంటున్న స్నేహితురాలు
నాకింకా కనిపించలేదు
ఎవరైనా ఏదైనా మార్గం చూపండి
మేమిద్దరం ఎలాగైనా కలుసుకోవాలి
read more " Meet Na Mila Re Manka - Kishore Kumar "

18, మార్చి 2019, సోమవారం

Christchurch Shooting - Astro pointers

15-3-2019 మధ్యాన్నం 1-40 కి న్యూజీలాండ్ లోని క్రిస్ట్ చర్చ్ అనే ప్రదేశంలో రెండు మసీదులలో జరిగిన కాల్పులలో ఒకచోట 50 మంది ఇంకో చోట 7 మంది కాల్చబడ్డారు.

ముస్లిమ్స్ అంటే విపరీతమైన ద్వేషం ఉన్న బ్రెంటన్ హారిసన్ టారంట్ అనే వైట్ రేసిస్ట్ చేసిన పని అది. ఆ సమయానికి ఉన్న గ్రహస్థితులను పరికిద్దాం.

కుజ శనుల మధ్యన కోణదృష్టి
---------------------------------------
కోణదృష్టి మంచిదని సాధారణంగా జ్యోతిష్కులందరూ అనుకునే మాట. కానీ ఆ దృష్టిలో ఉన్న గ్రహాలు పరస్పర శత్రువులై ఉండి, అవి కూడా ప్రమాదకరమైన గ్రహాలైనప్పుడు కోణదృష్టి కూడా భయంకరమైన ఫలితాలనిస్తుంది అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఈ సమయంలో కుజుడూ శనీ ఇద్దరూ చాలా దగ్గరగా కోణదృష్టిలో ఉన్నారు.

కుజుని భరణీ నక్షత్రస్థితి
--------------------------------
భరణి యమనక్షత్రం. కనుక యుద్ధాలకు రక్తపాతానికి కారకుడైన కుజుడు ఈ నక్షత్రంలో ఉన్నపుడు తప్పకుండా సామూహిక మరణాలు జరుగుతాయి. అదే మళ్ళీ ఇప్పుడు రుజువైంది.

రాహు గురుల మధ్యన గల షష్ఠ - అష్టక దృష్టి
----------------------------------------------------------
రాహుగురుల సంబంధం, అది ఏ రకంగా ఉన్నాసరే, అది మంచిది కాదు. ఎందుకంటే దీనిని జ్యోతిష్యశాస్త్రంలో 'గురుచండాల యోగం' అని పిలిచారు. అంటే, మతపరమైన విధ్వంసం జరిగే యోగం అని చెప్పవచ్చు. ఇప్పుడు జరిగింది అదేగా !

రాహు గురువుల నక్షత్ర స్థితి
------------------------------------
గురువు, బుధునిదైన జ్యేష్టానక్షత్రంలో ఉన్నాడు. రాహువు బుధుని సూచిస్తూ గురువుదైన పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. అంటే, వీరిద్దరికీ నక్షత్రస్థాయిలో పరివర్తనా యోగం ఉన్నది. శత్రువులైన వీరు ఇలాంటి సంబంధంలో ఉండటం మంచిది కాదు. కనుక తెలివైన ప్లానింగ్ తో కూడిన ఇలాంటి రక్తపాతపు సంఘటన జరిగింది.

బుధరాహువుల సంబంధం అతితెలివిని ఇస్తుంది. రాహు గురువుల సంబంధం  మతపరమైన గొడవలను సృష్టిస్తుంది. ప్రస్తుతం జరిగింది అదేగా !

బుధుని వక్ర నీచ స్థితి
---------------------------
బుద్ధికారకుడైన బుధుడు వక్రించి ఉండటం వక్రబుద్ధికి సూచన. అలాగే నీచస్థితిలో ఉండటం నీచమైన ప్లాన్స్ కు సూచిక. ఈ రెండూ కలసి ఆ హంతకుని చేత అలాంటి పనిని చేయించాయి.

ముస్లిమ్స్ అంటే పెరుగుతున్న అంతర్జాతీయ ద్వేషం
---------------------------------------------------------------------
ముస్లిమ్స్ ఏ దేశంలో ఉన్నా శాంతిగా ఉండరని, ఆ దేశంలో మతపరమైన చిచ్చు పెడుతూ ఉంటారన్న నమ్మకం ప్రపంచ వ్యాప్తంగా అనేకదేశాలలో గత ఇరవైఏళ్ళుగా బలపడుతూ వస్తున్నది. ఈ నమ్మకానికి ఆధారాలుగా ముస్లిమ్స్ చేసిన, చేస్తున్న అనేక పనులు నిలుస్తున్నాయి. ముస్లిమ్స్ అంటే క్రైస్తవులలో పెరుగుతున్న విద్వేషమే ఈ సంఘటన వెనుకనున్న బలమైన కారణం ! దీనిని Islamophobia అని పిలుస్తున్నారు. ఈ phobia ప్రబలడానికీ, వ్యాప్తి చెందడానికీ ముస్లిములే, ముఖ్యంగా పాకిస్తాన్ వంటి దేశాలే ముఖ్యమైన కారకులు !

మూడో ప్రపంచయుద్ధం అంటూ వస్తేగిస్తే, అది క్రైస్తవదేశాలకూ ముస్లిం దేశాలకూ మధ్యన మాత్రమే వస్తుందని జ్యోతిష్కులే కాదు, ప్రపంచ సామాజిక శాస్త్రవేత్తలూ, మేధావులూ కూడా ఎప్పటినుంచో అంటున్నారు. విచిత్రమేమంటే ఈ రెండు మతాలూ 'శాంతి' 'శాంతి' అంటూనే ఉంటాయి. దానినే బోధిస్తున్నామంటాయి. కానీ ఆచరణలో మాత్రం అదెక్కడా కనిపించదు. ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగిన రక్తపాతం అంతా ఈ రెండు మతాల వల్లే జరిగింది.

ఆ మార్గంలో రాజుకుంటున్న నిప్పుకు ఈ సంఘటనలు సూచికలని భావిద్దామా?
read more " Christchurch Shooting - Astro pointers "

17, మార్చి 2019, ఆదివారం

Ye Wadiya Ye Fizaye - Mohammad Rafi


Ye Wadiya Ye Fizaye Bula Rahihi Tumhe  అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1963 లో వచ్చిన Aaj Aur Kal అనే చిత్రంలోనిది. ఈ గీతానికి కూడా సాహిర్ లూదియాన్వి సాహిత్యాన్ని సమకూర్చగా, రవి శంకర్ శర్మ ( రవి ) సంగీతాన్ని సమకూర్చారు. ఇది కూడా నాటికీ నేటికీ చెక్కు చెదరకుండా ఉన్న మధురప్రేమ గీతమే.

1963 ప్రాంతాలలో వచ్చిన సినిమా పాటల్లో కూడా ఎంతో భావుకత ఉండేది. అప్పటి రాగాలు కూడా ఎంతో మధురమైనవి. కనుకనే ఈనాటికీ ఆ పాటలు అజరామరంగా నిలచిపోయి ఉన్నాయి.

నా స్వరంలో కూడా ఈ అమరగీతాన్ని వినండి మరి !

Movie:-- Aaj Aur Kal ( 1963)
Lyrics:-- Sahir Ludhianvi
Music:-- Ravi Shankar Sharma (Ravi)
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------
Ye wadiyan ye fizayen bula rahi hai tumhe
Khamoshiyon ki sadayen bula rahi hai tumhe
Ye wadiyan ye fizayen bula rahi hai tumhe

Taras rahe hai jawaa – Phool hot chune ko – 2
Machal machalke havaye – bula rahi hai tumhe-2
Khamoshiyon ki sadayen bula rahi hai tumhe
Ye wadiyan - ye fizayen - bula rahi hai tumhe

Tumhari zulfon se - khushbu ki bheekh lene ko-2
Jhuki  jhukisi ghatayen - bula rahi hai tumhe-2
Khamoshiyon ki sadayen bula rahi hai tumhea
Ye wadiyan - ye fizayen - bula rahi hai tumhe

Hasin champayi pairon ko jabse dekha hai - Haay
Hasin champaye pairon ko jabse dekha hai
Nadi ki mast adayen - Bula rahi hai tumhe-2
Khamoshiyon ki sadayen bula rahi hai tumhe
Ye wadiyan - ye fizayen - bula rahi hai tumhe

Mera kaha na suno – Inki baat tho sunlo -2
Har ek dilki - duvayen – bula rahi hai tumhe-2
Khamoshiyon ki sadayen bula rahi hai tumhe
Ye wadiyan ye fizayen bula rahi hai tumhe

Meaning

These valleys, these spaces are calling you
The voices of silence are calling you
These valleys, these spaces are calling you

These young flowers are yearning to touch your lips
These anxious winds are calling you

To get the alms of the aroma of your hair
Low bent clouds are calling you

Even since it saw your lovely flowery feet
The intoxicated waves of flowing stream are calling you

Don't listen to my songs, listen to them
Blessings of every heart are calling you

These valleys, these spaces are calling you
The voices of silence are calling you
These valleys, these spaces are calling you

తెలుగు స్వేచ్చానువాదం

ఈ లోయలు ఈ ఆకాశం నిన్ను పిలుస్తున్నాయి
నిశ్శబ్దం యొక్క స్వరం నిన్ను పిలుస్తోంది
ఈ లోయలు ఈ ఆకాశం నిన్ను పిలుస్తున్నాయి

ఈ లేలేత పువ్వులు
నీ పెదవులను తాకాలని ఆశపడుతున్నాయి
గాలి అలజడితో నిండి
నిన్ను పిలుస్తోంది

నీ కురుల సువాసనను భిక్షగా కోరుతూ
నేలకు వంగిన ఈ మేఘాలు నిన్ను పిలుస్తున్నాయి

పువ్వుల వంటి నీ అందమైన పాదాలను చూచి
మత్తెక్కిన ఈ నది తన అలలతో నిన్ను తాకుతోంది

నా పాటలను లెక్కచెయ్యకపోయినా
ఈ అందరి మాటలనూ విను
ఎన్నో హృదయాల ఆశీస్సులు నిన్ను పిలుస్తున్నాయి

ఈ లోయలు ఈ ఆకాశం నిన్ను పిలుస్తున్నాయి
నిశ్శబ్దం యొక్క స్వరం నిన్ను పిలుస్తోంది
ఈ లోయలు ఈ ఆకాశం నిన్ను పిలుస్తున్నాయి
read more " Ye Wadiya Ye Fizaye - Mohammad Rafi "

15, మార్చి 2019, శుక్రవారం

Door Rehkar Na Karo Baat - Mohammad Rafi


Door Rahkar Na Karo Baat Kareeb Aa Javo అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1970 లో వచ్చిన Amaanat అనే చిత్రంలోనిది. ఈ గీతాన్ని సాహిర్ లూదియాన్వి రచించగా, రవిశంకర్ శర్మ సంగీతాన్ని అందించారు.

మరపురాని ఈ సుమధుర రొమాంటిక్ గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి !

Movoe:--Amaanat (1970)
Lyrics:-- Sahir Ludhianvi
Music:-- Ravi Shankar Sharma (Ravi)
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
------------------------------------------
Door rehkar na karo baat - kareeb aa javo – 2
Yaad reh jayegi – Ye raat – Kareeb aa javo

Ek muddat se tamannaa thi – Tumhe chune ki -2
Aaaj  bas me nahi Jazbaat – Kareeb aa javo – 2
Door rehkar na karo baat karee baa javo

Sard jhonkon se Bhadakte hai Badan me shole -2
Jaan lelegiye Barsaat – Kareeb aa javo – 2
Door rehkar na karo baat karee baa javo – 2

Is Qadar hamse Jhijakne ki Zarurat kya hai-2
Zindagi bharka hai ab saath – Kareeb aa javo -2
Yaad reh jayegi – Ye raat –Kareeb aa javo
Door rehkar na karo baat karee baa javo

Meaning

Speak not from afar
Come nearer
Speak not from afar
Come nearer
This night will be remembered forever
Come nearer

For a long time, I had a desire to touch you
For a long time...
Today my emotions are not under my control
Speak not from afar
Come nearer

The cold winds
are stoking up flames in my body
and the rain is out to kill us
Speak not from afar
Come nearer

What is the need to be so reserved with me?
What is the need?
Now we have a lifetime
of togetherness before us
Speak not from afar
Come nearer
This night will be remembered forever
Come nearer

Speak not from afar
Come nearer...
read more " Door Rehkar Na Karo Baat - Mohammad Rafi "

11, మార్చి 2019, సోమవారం

ఇథియోపియా విమాన ప్రమాదం - జ్యోతిష్య కోణం

ఆదివారం ఉదయం ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇధియోపియా ఎయిర్ లైన్స్ విమానం ET302 కూలి పోయింది.దానిలో ఉన్న 35 దేశాలకు చెందిన 157 మంది చనిపోయారు. ఇందులో మన భారతీయులు కూడా ఉన్నారు.

రాహుకేతువులు, యురేనస్ గోచార ఫలితాలకు అనుగుణంగానే, రాహువు వాయుతత్వ రాశిలోకి అడుగుపెట్టీ పెట్టకముందే ఘోరమైన వాయుప్రమాదం జరగడం గమనార్హం.

ఇంకో రెండురోజులలో సూర్యుడు రాశి మారి కుంభరాశి నుండి మీనరాశికి పోతున్నాడు. ప్రస్తుతం ఎనిమిదో నవాంశలో ఉంటూ వాయుతత్వ రాశిలో ఉన్న ఉచ్చరాహువుకు దగ్గరగా వస్తున్నాడు. ఆ సూర్యుడు శనిదైన కుంభంలో ఉంటూ నల్లవారుండే ఆఫ్రికా దేశాలను సూచిస్తున్నాడు.

విమానం నంబర్ 302=5 బుధునికి సూచిక.
చనిపోయినవారు 157=4 కేతువు/(రాహువు)కు సూచిక.
రాహువు బుధుని రాశిలో అడుగు పెట్టగానే ఈ ప్రమాదం జరిగింది.

మేజర్ గ్రహాల మార్పులు జరిగినప్పుడు మేజర్ ప్రమాదాలు జరుగుతాయి అనడానికి ఇంతకంటే ఇంకా ఎన్ని ఉదాహరణలు కావాలి?
read more " ఇథియోపియా విమాన ప్రమాదం - జ్యోతిష్య కోణం "

5, మార్చి 2019, మంగళవారం

శివరాత్రి జాగారం

సామూహిక శివరాత్రి అభిషేకాలున్నాయ్
మీరూ రమ్మని పిలిచారు పరిచయస్తులు
సామూహికం ఏదీ నాకు పడదు
నేను రానని మర్యాదగా చెప్పాను

నాలుగు ఝాముల్లో నాలుగు రకాల పూజలు
నాలుగు రకాల నైవేద్యాలున్నాయ్
వచ్చి చూచి తరించమన్నారు
మీరు తరించండి నాకవసరం లేదన్నాను

నిద్రకు ఆగలేవా అని హేళనగా అడిగారు
నిద్రపోతూ మెలకువగా ఉంటానన్నాను
శివరాత్రి జాగారం చెయ్యాలన్నారు
జీవితమంతా జాగారమే అన్నాను

ఏమీ తినకుండా వాళ్ళు ఉపవాసం ఉన్నారు
అన్నీ తిని నేనూ ఉపవాసం ఉన్నాను
రాత్రంతా అభిషేకాలు చేస్తూ వాళ్ళు జాగారం చేశారు
హాయిగా నిద్రపోతూ నేనూ జాగారమే చేశాను

తెల్లగా తెల్లవారింది
పూజలకు ఫుల్ స్టాప్ పడింది
జాగారం చేసిన వాళ్ళు నిద్రలో జోగుతున్నారు
నేనుమాత్రం మెలకువలో మేల్కొనే ఉన్నాను

రాత్రంతా అభిషేకాలు పూజలు చేసిన
శివలింగం దగ్గర ప్రస్తుతం ఎవరూ లేరు
ఉన్నట్టుండి అందరూ దాన్ని అనాధను చేశారు
నేను మాత్రం దానినే చూస్తున్నాను

అది నన్ను చూచి ప్రేమగా నవ్వింది
పిచ్చిలోకులింతే అన్నట్లు
ఆ నవ్వు ధ్వనించింది
నా శివరాత్రి జాగారం అద్భుతంగా జరిగింది
read more " శివరాత్రి జాగారం "

4, మార్చి 2019, సోమవారం

Chalte Chalte - Kishore Kumar


Chalte Chalte Mere Ye Geet Yaad Rakhna
Kabhi Alvida Na Kehna....

అంటూ కిషోర్ కుమార్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1976 లో వచ్చిన Chalte Chalte అనే చిత్రంలోనిది. ఇది కూడా ఆపాత మధురాలలో ఒకటే.

జీవితం అనేది చాలా విచిత్రమైనది. ఈ పయనంలో ఎందఱో కలుస్తారు. ఎందఱో విడిపోతారు. కానీ, కొందరే మన మనసును గెలుస్తారు. అయితే, కాలగమనంలో అలాంటివారితో కూడా ఎడబాటు తప్పదు. కానీ ఈ పయనం ఆగేది కాదు. ఈ తపన తీరేది కాదు. ఏ ఎడబాటూ శాశ్వతం కాదు. ఏ కలయికా నిత్యం కాదు.

విడిపోయినవారు మళ్ళీ కలవక తప్పదు. అయితే అది ఈ రూపంలో కాకపోవచ్చు. ఇంకో రూపంలో ఇంకో జన్మలో కావచ్చు. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని దారులు మారినా, ప్రేమబంధం మాత్రం ఎప్పటికీ అలా కొనసాగుతూనే ఉంటుంది. ప్రేమే సత్యం, ప్రేమే నిత్యం, ప్రేమే దైవం. జీవితంలో ప్రేమను మించినది లేనేలేదు.

ఈ భావాన్నే ఈ గీతం ప్రతిఫలిస్తోంది.

ఈ మధ్య నేను పాటలు పాడటం లేదని నా అభిమానులు కొంతమంది నిద్రాహారాలు మానేసి చకోరపక్షుల్లా వేచి చూస్తున్నారని నాకు కర్ణపిశాచి చెప్పింది. అందుకే ఈ పాటను అర్జంటుగా పాడి పోస్ట్ చేస్తున్నాను.

నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:--Chalte Chalte (1976)
Lyrics:-- Amit Khanna
Music:-- Bappi Lahiri
Singer:-- Kishore Kumar
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------------
[Chalte chalet mere ye geeet yaad rakhna
Kabhi alvida na kehna kabhi alvida na kehnaa]-2
Rote haste bas yoohi tum gungunate rehna
Kabhi alvida na kehna kabhi alvida na kehna

[Pyar karte karte hum tum kahi kho jayenge
Inhi baharon ke Achal me thakke so jayenge]-2
Sapno ko phir bhi tum yoohi sajate rehna
Kabhi alvida na kehna kabhi alvida na kehna
Chalte chalet mere ye geeet yaad rakhna
Kabhi alvida na kehna kabhi alvida na kehnaa

[Beech raha me dilbar Bichad jaye kahi hum agar
Aur soonisi lage tumhe Jeevan ki ye dagar]-2
Hum laut ayenge Tum yoohi bulate rehna
Kabhi alvida na kehna kabhi alvida na kehna
Chalte chalet mere ye geeet yaad rakhna
Kabhi alvida na kehna kabhi alvida na kehnaa
Rote haste bas yoohi tum gungunate rehna
Kabhi alvida na kehna kabhi alvida na kehna
Hmm hmm hmm hmm hmm hmm

Meaning

While going along the path
remember this song of mine
never say bye forever, never say bye forever
Crying or smiling
Just keep humming this song
never say bye forever, never say bye forever

Immersed in love
Let us get lost somewhere
After getting tired
we will sleep in the arms of these flowers
You keep decorating my dreams like this

Oh my love !
If we ever get parted
in the middle of our journey
and life becomes lonely to you
Don't worry...
I will come along this path once again
But you keep calling me
never say bye forever, never say bye forever

తెలుగు స్వేచ్చానువాదం

దారిలో నడుస్తూ నడుస్తూ
ఈ నా పాటను గుర్తుంచుకో
ఇక వెళ్తా అనిమాత్రం
ఎప్పుడూ చెప్పకు
ఏడుస్తున్నా నవ్వుతున్నా
ఇదే పాటను అంటూ ఉండు
ఇక వెళ్తా అనిమాత్రం
ఎప్పుడూ చెప్పకు

ఇలా ప్రేమిస్తూ ప్రేమిస్తూ
ఎక్కడో మనం మైమరచిపోదాం
ఈ పూలఛాయలలో సేదదీరుదాం
నా స్వప్నాలను నువ్వు ఇలాగే
అలంకరిస్తూ ఉండు
ఇక వెళ్తా అనిమాత్రం
ఎప్పుడూ చెప్పకు

ఈ పయనం మధ్యలో
మనం ఎప్పుడైనా విడిపోతే
నీ జీవిత రహదారి
నీకు చాలా ఒంటరిగా అనిపిస్తే
నేను మళ్ళీ తిరిగి వస్తాను
నువ్వు నన్నిలాగే పిలుస్తూ ఉండు
ఇక వెళ్తా అనిమాత్రం
ఎప్పుడూ చెప్పకు

దారిలో నడుస్తూ నడుస్తూ
ఈ నా పాటను గుర్తుంచుకో
ఇక వెళ్తా అనిమాత్రం
ఎప్పుడూ చెప్పకు
ఏడుస్తున్నా నవ్వుతున్నా
ఇదే పాటను అంటూ ఉండు
ఇక వెళ్తా అనిమాత్రం
ఎప్పుడూ చెప్పకు...
read more " Chalte Chalte - Kishore Kumar "