“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, సెప్టెంబర్ 2018, గురువారం

మార్జాలోపాఖ్యానం - 'నా పిల్లి ఎక్కడుంది?' - ప్రశ్నశాస్త్రం

నిన్న మధ్యాన్నం క్యాంప్ కు వెళుతున్నాను. ట్రెయిన్ నడికూడి దగ్గర ఉండగా ఒక ఫోనొచ్చింది.

'నా పేరు ఫలానా. మా స్నేహితుడూ నేనూ మీ బ్లాగ్ రెగ్యులర్ గా చదువుతూ ఉంటాం. మా స్నేహితుడికి ఒక సమస్య వచ్చింది. మీతో మాట్లాడాలంటే భయపడుతున్నాడు. అందుకని నేను ధైర్యం చెప్పి మీకు ఫోన్ చేయిస్తున్నాను. ఇదుగోండి మా ఫ్రెండ్ మాట్లాడతాడు.' అంటూ ఒకాయన ఫోన్లో చెప్పాడు.

అతని ఫ్రెండ్ ఫోనందుకుని - 'నాకొక పెంపుడు పిల్లి ఉండేది. పద్దెనిమిది నెలల క్రితం అది ఎటో వెళ్లిపోయింది. అది ఇప్పుడు ఎక్కడుందో చెప్పగలరా? అదసలు బ్రతికుందా లేదా?' అని ప్రశ్నించాడు.

నాకు ఆశ్చర్యమూ, జాలీ రెండూ ఒకేసారి కలిగాయి.

'చెబితే ఏం చేస్తావు నాయనా?' అడిగాను.

'వెళ్లి దానిని తెచ్చుకుంటాను. అదంటే నాకు చాలా ప్రేమ' అన్నాడు.

'ఏం నీకెవరూ లేరా?' అడిగాను.

'అందరూ ఉన్నారు. అమ్మా నాన్నా అందరూ ఉన్నారు. కానీ నాదగ్గర ఎవరూ లేని సమయంలో అదే నాతో ఉండేది. అందుకే అదంటే నాకు చాలా ఇష్టం' అన్నాడు.

సమయం చూచాను. మధ్యాన్నం 12.12 గంటలయింది. శుక్రహోర నడుస్తోంది. ప్రస్తుతం మనం మహాలయ పక్షాలలో ఉన్నాం. అంటే, ఇవి పితృదేవతల రోజులు. ప్రాచీన సాంప్రదాయాలలో పిల్లి అనేది పితృదేవతలకు చిహ్నంగా భావించబడుతూ ఉండేది. ఈజిప్షియన్లు నేటికీ ఈ భావనను కొనసాగిస్తూ ఉంటారు. కనుక మహాలయ పక్షాలలో ఇలాంటి ప్రశ్న రావడం కరెక్టే.

గ్రహ పరిస్థితిని మనస్సులోనే గమనించాను. ధనుర్లగ్నం అయింది. శుక్రుడు షష్టాధిపతి అయ్యాడు. జ్యోతిష్య శాస్త్రంలో షష్ఠభావం పెంపుడు జంతువులను సూచిస్తుంది. సామాన్యంగా అయితే షష్ఠభావం శత్రు, రోగ, రుణాలను సూచిస్తుంది. కానీ ఇదే భావం పెంపుడు జంతువులను కూడా సూచిస్తుంది. అదెలాగో చెప్తా వినండి.

చతుర్ధం మన ఇంటికి సూచిక. అక్కడ నుండి తృతీయం మన సహచరులు, మన ఇంట్లో ఉండే జీవులను సూచిస్తుంది. కనుక చతుర్ధం నుంచి తృతీయం అయిన షష్ఠమస్థానం మేక, కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులను సూచిస్తుంది. ఇంకా పెద్ద సైజు జంతువులైతే ద్వాదశభావం వాటిని సూచిస్తుంది. ద్వాదశం జైలు గనుక, పెద్ద జంతువులను మన ఇంట్లో కట్టేసి ఉంచితే అది వాటికి జైలులాగే ఉంటుంది గనుక, ద్వాదశభావం పెద్దపెద్ద పెంపుడు జంతువులను సూచిస్తుంది. ఈ విధంగా జ్యోతిశ్శాస్త్రం అంతా లాజిక్ మీదే నడుస్తూ ఉంటుంది.

సరే మన ప్రశ్న చార్ట్ కి వద్దాం.

హోరాధిపతి అయిన శుక్రుడే షష్ఠభావాదిపతీ అయ్యాడు. కనుక పెంపుడు జంతువుల ప్రశ్న ఆ సమయంలో అడుగబడింది. శుక్రుడూ లగ్నాధిపతి అయిన గురువూ కలసి లాభస్థానంలో ఉన్నారు. అంటే, ఇతనికి ఆ పిల్లి అంటే చాలా ప్రేమ ఉన్నమాట నిజమే ! కానీ ధనుర్లగ్నానికి శుక్రుడు మంచిని చెయ్యడు. శత్రువైన శుక్రక్షేత్రంలో గురువున్నాడు. కనుక పిల్లి దృష్టిలో ఇతని ప్రేమకు విలువ లేదు. పిల్లికి అవసరమేగాని ప్రేమ ఉండదు.

కుక్కకు విశ్వాసం ఉంటుంది గాని, పిల్లికి ఉండదు. వీడు నా యజమాని అని కుక్క అనుకుంటుంది. వీడు నా బానిస అని పిల్లి అనుకుంటుంది. పిల్లి చాలా స్వతంత్రమైన జంతువు. దానికి ఒకచోట స్థిరంగా ఉండటం ఇష్టం ఉండదు. అందుకని మనం ఎంత బాగా చూసుకున్నప్పటికీ, దానిష్టం వచ్చిన చోటకు అది వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రేమకు కుక్క కట్టుబడినట్లు పిల్లి కట్టుబడదు. ఎందుకంటే అది పులి జాతికి చెందినది. పులీ పిల్లీ ఒకే జాతికి చెందుతాయి. కాకుంటే సైజులో తేడా అంతే ! అందుకే పులిని 'బిగ్ క్యాట్' అంటారు.

ఒకచోట స్థిరంగా ఉండలేకుండా ఎంతసేపూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండాలని అనుకునేవారు కొందరు ఉంటారు. వాళ్ళు పిల్లిజాతి మనుషులు. అదొక రోగలక్షణం. వీరికి చాలా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. కొందరిలో ఈ లక్షణం తర్వాత్తర్వాత కేన్సర్ గా కూడా రూపొందుతూ ఉంటుంది. ఎందుకంటే మానసికంగా స్థిరత్వం లేకుండా ఎప్పుడూ ఏదో ఒకదాని వెంట పరుగెత్తుతూ, ఎక్కడో బైటబైట తిరుగుతూ ఉండాలని ఎప్పుడూ అనుకునేవారికి పెద్ద వయసులో కేన్సర్ వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉంటుంది. ఈ మనస్తత్వం పోవాలంటే పిల్లిపాలతో తయారు చేసిన 'లాక్ ఫెలినినం' అనే హోమియౌ ఔషధం బ్రహ్మాండంగా పని చేస్తుంది. ముల్లును ముల్లుతోనే తియ్యాలి అనే సూత్రం మీదే హోమియో ఔషధాలు పని చేస్తాయి.

పాతకాలంలో ఆయుర్వేదంలో ఇలాంటి మందులు తయారీ ఉండేది. కేరళలో ఆయుర్వేదం ఎక్కువగా వాడతారని మనకు తెలుసు. అదే కేరళకు చెందిన అయ్యప్పస్వామి కధలో కూడా, రాణికి ఏదో తలనొప్పి అని వంకపెట్టి పులిపాలు తెమ్మని ఈయన్ను అడవిలోకి పంపిస్తారు. ఆ కధ నిజం అయినా కాకపోయినా, అలాంటి మందులు అప్పట్లో తయారు చేసేవారని మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఆయుర్వేద వైద్యులకే ఆ శాస్త్రం పూర్తిగా తెలీదు. తెలిసినా కంపెనీ తయారు చేసిన మందులే అందరూ వాడిస్తున్నారు గాని, పాతకాలంలో లాగా వాళ్ళే మూలికలు తెచ్చి తయారు చెయ్యడం లేదు. అందుకే ఇప్పటి ఆయుర్వేదం పని చెయ్యడం లేదు. 

ఈ విధంగా జ్యోతిష్యశాస్త్రానికీ, హోమియోపతి వైద్యశాస్త్రానికీ, మానవ జీవితానికీ, ఆధ్యాత్మికతకూ సూక్ష్మమైన సంబంధాలు ఉంటాయి. అర్థం చేసుకోగలిగితే ఇదంతా చాలా అద్భుతమైన సైన్స్ గా కనిపిస్తుంది.

జ్యోతిశ్శాస్త్రంలో కుక్కకూ పిల్లికీ చాలా ప్రాముఖ్యత ఉంది. రాహువు పిల్లికి సూచకుడు. కేతువు కుక్కకు సూచకుడు. అందుకే కేతుదోషం ఉన్నప్పుడు కుక్కను పెంచుకోమని చెబుతూ ఉంటారు. కుక్కను పెంచుకున్నాక కలసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాహుదోషం ఉన్నప్పుడు అది పోవడానికి శనివారం నాడు నల్లపిల్లికి పాలు పొయ్యమని రెమెడీ చెబుతారు. ఎందుకంటే నల్లపిల్లి శనికీ రాహువుకూ రెంటికీ సూచిక. 'శనివత్ రాహు:' అని కదా జ్యోతిష్య సూత్రం ! రాహుకేతువుల ప్రభావం మనిషి మీద ఖచ్చితంగా ఉందనడానికి అతనితో నిత్యం కలసి ఉంటున్న కుక్కా పిల్లులే సాక్ష్యం. ఏ దేశంలోనైనా మనుషులు ఈ రెంటినీ సాకుతూ ఉండటం మనం గమనించవచ్చు.

ఎవరి సమక్షంలోనైతే కుక్కా పిల్లీ తమతమ జాతివైరాన్ని వదలిపెట్టి స్నేహంగా ఉంటాయో అలాంటి వారిమీద రాహుకేతువుల ప్రభావం ఉండదు. రాహుకేతువులు కాలస్వరూపులు గనుక అలాంటి మహనీయులు కాలానికి అతీతంగా పరిణతి చెంది ఉంటారు. జిల్లెళ్ళమూడి అమ్మగారి సమక్షంలో కుక్కలూ పిల్లులూ కలసి మెలసి ఉండేవి. రమణ మహర్షి సమక్షంలో కూడా శత్రు జంతువులు కలసి మెలసి ఉండేవి. శ్రీ రామకృష్ణుల సమక్షంలో అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. నిజమైన మహనీయుల సమక్షం అలా ఉంటుంది.

'అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధే వైరత్యాగ:' అంటాడు పతంజలి మహర్షి తన యోగసూత్రాలలో. అంటే - అహింస అనే భావంలో నిజంగా నిత్యమూ ఉండేవారి సమక్షంలో శత్రుజంతువులు కూడా మిత్రులౌతాయి. అదే వారి మహనీయతకు నిదర్శనం !- అంటాడు. అలాంటి మహనీయుల సమక్షంలో దివ్యభావనా తరంగాలు చాలా బలంగా ఉంటాయి. అందుకే, వారి దగ్గర ఉన్న కాసేపూ మన మనస్సులు మనకు తెలీకుండానే మారిపోతూ ఉంటాయి. వారి సమక్షం ఎంతో హాయిగా ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉండటానికి ఇదే కారణం.

సరే, ఈ జ్యోతిష్య-వేదాంతచర్చ ఆపేసి మన ప్రశ్నలోకి వద్దాం !

శుక్రుడు రాహువుదైన స్వాతీ నక్షత్రంలో ఉన్నాడు. అంటే, ఈ పిల్లి చాలా స్వతంత్రమైన వ్యక్తిత్వం కలిగినది. అందుకే ఇంట్లోనుంచి వెళ్ళిపోయింది. అయితే, ఇది ఎక్కడికి పోయింది? ఏమైంది?

తులారాశికి రాహుకేతువులతో అర్గలం పట్టింది. కనుక పిల్లికి టైం ఏమీ బాగాలేదు ! పైగా దాని చతుర్దంలో బలంగా ఉన్న ఉచ్ఛ కుజుడు, కేతువుతో కలసి ఉన్నాడు. కేతువు శనిని సూచిస్తునాడు. శనికుజుల కలయిక యాక్సిడెంట్ ను ఇస్తుంది. కేతువు కుక్కకు సూచకుడు. అంటే ఎరుపూ నలుపూ మచ్చలున్న ఒక బలమైన కుక్క చేతిలో ఈ పిల్లి చనిపోయింది అని అర్ధం ! పైగా, పిల్లిని సూచించే రాహువు ప్రశ్నలగ్నం నుంచి అష్టమంలో ఉంటూ మరణాన్ని సూచిస్తున్నాడు !

దశ వైపు దృష్టి సారించాను. బుధ-చంద్ర-కుజ దశ నడుస్తోంది. ఈ లగ్నానికి బుధుడు బాధకుడు. చంద్రుడు నాశనాన్ని సూచిస్తాడు. కుజుడు కేతువుతో కలసి బలమైన కుక్కను సూచిస్తున్నాడు. కనుక దశాసూచన కూడా మన డిడక్షన్ తో సరిపోయింది ! అదీగాక, పౌర్ణమి సమయంలో అడుగబడే ప్రశ్నలు చాలావరకూ నెగటివ్ రిజల్ట్ నే ఇస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం పౌర్ణమి ఛాయలోనే ఉన్నాం మరి !

ఈ విషయాన్ని ఇతనికి చెబితే బాధపడతాడని, ఇలా అడిగాను.

'పిల్లి ఎన్నాళ్ళు బ్రతుకుతుంది బాబు? ఎందుకు దానిమీద నీకింత వ్యామోహం?'

'ఏమోనండి. దాదాపు ఎనిమిది తొమ్మిదేళ్ళు బ్రతుకుతుందేమో తెలియదు. కానీ నాకదంటే చాలా ఇష్టం.' చెప్పాడతను సందేహిస్తూ.

లగ్నాధిపతికీ, షష్టాధిపతికీ సంబంధం ఉంటే వాళ్ళు పెట్ లవర్స్ అవుతారు. ఏదో ఒక జంతువును పెంచుకుంటారు. ఇది తిరుగులేని జ్యోతిష్యసూత్రం. అది జంతువా, పక్షా లేక ఇంకోటా అనే విషయం కూడా చక్రంనుంచి చెప్పవచ్చు. అమెరికాలో అయితే పాములనీ, మొసళ్ళనీ ఇంకా నానారకాల జీవుల్నీ పెంచుకునే విచిత్రమైన మనుషులు కూడా ఉంటారు. ప్రశ్నచార్ట్ లో లగ్నాదిపతీ ఆరవ అధిపతీ కలిసే ఉన్నారు.

అతన్ని ఇలా అడిగాను.

'మరి ఆ తర్వాతైనా అది చనిపోతుంది కదా ! దానిగురించి చింత వదిలేయ్. దానికి నీ మీద ప్రేమ లేదు. దానికిష్టమైన చోట అది హాయిగా ఉంది అనుకో. నీ మానాన నువ్వు హాయిగా జీవించు. అంతేగాని దానికోసం వెదుకకు'.

పాపం అతనికీ మాట నచ్చలేదు.

'సార్ సార్ ప్లీజ్. నాకోసం కాస్త ప్రశ్న చూచి చెప్పండి. ఎక్కడుందో చెబితే వెళ్లి తెచ్చుకుంటాను.' అడిగాడు.

'నీ పిచ్చిప్రేమా నువ్వూనూ? చనిపోయిన పిల్లిని ఎక్కడనుంచి తెచ్చుకుంటావ్ రా బాబూ' - అనుకుంటూ మళ్ళీ ఓపికగా అతనికి కౌన్సిల్ చేశాను.

అంతా విని అతను మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు.

ఇక నాకు విసుగొచ్చింది.

ఎలాగూ ఈ పోస్ట్ అతను చదువుతాడు. అప్పుడు నిజం గ్రహిస్తాడని తెలుసు. అందుకని - 'సరేలే చూస్తాలే బాబు. బాధపడకు.' - అని చెప్పి ఫోన్ కట్ చేసేశాను.

ఫోన్ పెట్టేశాక ఒక సామెత గుర్తొచ్చింది.

పనిలేని మంగలి, పిల్లి తల గొరిగాట్ట. మనమూ అలా తయారు అవుతున్నామా? అని నాకే అనుమానం వచ్చింది. మళ్ళీ నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. మనకు బోలెడంత పని ఉంది. ఎంత చేసినా, ఈ జన్మంతా చేస్తూనే ఉన్నాకూడా, తరగనంత పని ఉంది. ఆ పని చేసుకుంటూనే ఇలాంటి పిల్లిప్రశ్నలు కూడా ఇంత ఓపికగా చెబుతున్నందుకు నా ఓపికకు నాకే చాలా ముచ్చటేసింది.

'భేష్ రా సత్యా! వెరీ గుడ్' - అంటూ నా భుజాన్ని నేనే తట్టుకున్నాను.

సారాంశం ఏమంటే - ప్రేమ !

ప్రేమ అనేది అది మనిషి మీదైనా జంతువు మీదైనా దేనిమీదైనా ఉండొచ్చు. కానీ, మనిషి జీవితం ప్రేమతోనే పుట్టి, ప్రేమతోనే నడచి, ప్రేమతోనే అంతమౌతుందని వెనుకటికి ఎవడో వేదాంతి అన్నట్లు గుర్తు !

నిజమే కదూ !
read more " మార్జాలోపాఖ్యానం - 'నా పిల్లి ఎక్కడుంది?' - ప్రశ్నశాస్త్రం "

24, సెప్టెంబర్ 2018, సోమవారం

September - 2018 పౌర్ణమి ప్రభావం

ప్రస్తుతం మనం పౌర్ణమి ఛాయలో ఉన్నాం.

నిన్న విశాఖ మన్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను నక్సల్స్ కాల్చి చంపేశారు. ఇది వింత కాదు. నక్సల్స్ ఇంతకు ముందు ఇలాంటివెన్నో చేశారు. కానీ అసలైన వింత ఆ తర్వాత జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులు అభిమానులు ఎగబడి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చెయ్యడం, పోలీస్ వాహనాలను తగలబెట్టడం, పోలీస్ స్టేషన్ను ఎటాక్ చెయ్యడమే అసలైన వింత.

అసలు దేశాన్ని నాశనం చేస్తున్నదే రాజకీయ నాయకులు. పోలీసులు ఏం చెయ్యగలరు? వాళ్ళను కూడా తమ పావులుగా వాడుకుంటున్నారు నాయకులు ! మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు పోలీసులనే దోషులుగా తిడుతున్నారు ! అందరూ దొంగలే ! కాకుంటే నోరున్నవాడు నోరులేనివాడిని దొంగ అంటాడు. భలేగా ఉంది ఈ డ్రామా అంతా !

ఈ మధ్యనే ఒక రాజకీయ నాయకుడు ఒక సోకాల్డ్ జ్ఞానప్రబోధకుడిని కోట్లు అడిగాడని, ఆయన ఇవ్వనని నిరాకరిస్తే, ఆ ఆశ్రమం మీద కక్ష గట్టి హింస పెడుతున్నాడని ఆ ప్రబోధకుడు రాయలసీమలో ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలో స్వామీజీ అనుచరులే తమను వెంటాడి పైపులతో రాళ్ళతో కొట్టారని చెబుతూ ఆ రాజకీయ నాయకుడు తమను రక్షించలేని పోలీసులను అసభ్యమైన భాషతో దూషిస్తూ హిజ్రాలతో పోల్చడం, దానికి స్పందిస్తూ పోలీసు సంఘంవారు, అలా మాట్లాడేవాళ్ళను నాలుక కోస్తామనడం, ఆ నాయకుడు స్పందిస్తూ 'ఎక్కడికి రమ్మంటావో చెప్పు వస్తా. నాలుక కొయ్యి చూస్తా' అని సవాల్ విసరడం - ఇవన్నీ ఏంటో? ఏమీ అర్ధం కావడం లేదు. అధికారంలో ఉన్న పార్టీ నాయకులూ పోలీసులూ ఈ విధంగా మీడియాలో సవాళ్లు విసురుకుంటూ తిట్టుకుంటూ ఉంటే ప్రజలకు వీళ్ళమీద ఎలా నమ్మకం కుదురుతుంది? వీళ్ళందరూ కల్సి దేశాన్ని ఎలా ఉద్దరిస్తారని నమ్మాలి?

ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఇలా చట్టాన్ని ఖూనీ చేస్తూ, న్యాయాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ పోతే చివరకు ఎక్కడకు పోతాం మనం?? ఎవరికి వారే న్యాయాధిపతుల లాగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక న్యాయవ్యవస్థ ఎందుకు? 

గుంటూరులో పోలీస్ స్టేషన్ను ఒక వర్గం వారు ఎటాక్ చేసి రాళ్ళు రువ్వి, వాహనాలకు నిప్పు పెడితే, ఓట్ల కోసం వారిని బుజ్జగిస్తూ, ఏ యాక్షన్ తీసుకోకపోవడం, మళ్ళీ అమరావతిలో పది ఎకరాలలో ప్రపంచంలోనే ఇప్పటిదాకా లేని మసీదు కట్టిస్తామని ముఖ్యమంత్రి గారే ప్రకటన చెయ్యడం - ఏంటో ఇదంతా?? ఓట్ల కోసం మరీ ఇంత దిగజారాలా?? 

అసలు మనం ఒక గౌరవనీయమైన రాజ్యాంగం నడుపుతున్న దేశంలో ఉన్నామా లేక అవినీతితో కుళ్ళిపోయిన ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నామా తెలియడం లేదు. లా అండ్ ఆర్డర్ అనేది ఉందా లేదా అర్ధం కావడం లేదు.

ఇలాంటి నాయకులు? ఇలాంటి పోలీసులు? ఇలాంటి స్వామీజీలు? వీళ్ళను చూస్తుంటే -- ఛీ ఛీ ఎలాంటి దేశంలో ఉన్నాంరా దేవుడా? అని అనుకోవలసి వస్తోంది. నాయకులూ అధికారులూ దారి తప్పుతుంటే ప్రజలు బుద్ధి చెప్పాల్సి రావడం - దానికోసం బ్యాలెట్ చాలక బులెట్ ను ఎంచుకోవలసిన దుస్థితి పట్టడం - ఈ రాష్ట్రపు ఖర్మ కాకపోతే మరేంటి?

ఆంధ్రాకు దరిద్రం పట్టిందని రాష్ట్రం విడిపోయినప్పుడే నేను వ్రాశాను. తెలంగాణా నిజంగానే బంగారు తెలంగాణా అని కూడా వ్రాశాను. అది ప్రతిరోజూ నిజం అవుతోంది.

మొత్తానికి ఈ పౌర్ణమి భలే డ్రామాలను చూపిస్తోంది. చూడండి మరి !
read more " September - 2018 పౌర్ణమి ప్రభావం "

23, సెప్టెంబర్ 2018, ఆదివారం

'శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రం' తెలుగు ఇంగ్లీష్ ప్రింట్ పుస్తకములు ఈ రోజు విడుదలయ్యాయి

శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రం తెలుగు ఇంగ్లీష్ ప్రింట్ పుస్తకములు ఈ రోజున విడుదల అవుతున్నాయి. ఎవరి చేతులమీదుగా మా సంస్థలో ఏ పని జరగాలో ముందే నిర్ణయించబడి ఉంటుంది. జగన్మాత ఆ అదృష్టాన్ని కొంతమందికి అలా కలిగిస్తుంది. కనుక, ఇదే సమయానికి అనుకోకుండా ఇక్కడకు వచ్చిన వెంకటరాజుగారు, ప్రసాద్ గార్ల చేతుల మీదుగా ఈ పుస్తకములను విడుదల చేయించడం జరిగింది.

లోకం మెప్పులు, గొప్పలు, పటాటోపాల మీద మాకు నమ్మకం లేదు. వాటికి మేము ఏమాత్రం విలువనూ ఇవ్వము. మా పుస్తకాలను ఏ సోకాల్డ్ ప్రముఖుల చేతా ఆర్భాటంగా విడుదల చేయించము. ఆ పని మేమే చేస్తాం. ఎందుకంటే దేనికైనా కొన్ని అర్హతలనేవి ఉండాలి మరి ! పైగా, ఆ ప్రముఖుల చేతుల మురికి మా పుస్తకాలకు అంటుకోవడం మాకిష్టం లేదు.

యోగమార్గంలో పయనించే వారికి ఎంతో ఉపయోగపడే ఈ పుస్తకములను మా సంస్థనుండి ముద్రించడం ఒక అదృష్టంగా భావిస్తూ, త్వరలోనే 'శ్రీ జాబాల దర్శనోపనిషత్' ఇంగ్లీష్ ఈ బుక్ విడుదల అవుతుందని తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకములు google play books నుండి లభిస్తాయి.
read more " 'శ్రీ దత్తాత్రేయ యోగశాస్త్రం' తెలుగు ఇంగ్లీష్ ప్రింట్ పుస్తకములు ఈ రోజు విడుదలయ్యాయి "

21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

మా క్రొత్త పుస్తకం 'శ్రీ జాబాల దర్శనోపనిషత్' E Book ఈరోజు విడుదలైంది



పంచవటి ప్రచురణల నుంచి ఆరవ E Book గా 'శ్రీ జాబాల దర్శనోపనిషత్' ఈ రోజున విడుదలైంది. ఈ పుస్తకం కూడా యధావిధిగా pustakam.org నుండి లభిస్తుంది.

దత్తాత్రేయులవారు మహాయోగి, మహాజ్ఞాని. అవతార మూర్తియగు పరశురామునకే ఈయన గురువు. తన శిష్యుడగు సాంకృతికి ఈయన ఉపదేశించిన అనేక యోగరహస్యములు దీనిలో కలవు. 

ఇది సామవేదమునకు చెందిన యోగోపనిషత్తు. ఉపనిషత్తులు సాధారణముగా జ్ఞానభాండాగారములుగా ఉంటాయి. వాటి మధ్యలోనున్న కొన్ని యోగోపనిషత్తులలో ఇదీ ఒకటి. ఈ రోజున దీని "ఈ-బుక్" ను విడుదల చేస్తున్నాను. మా ప్రచురణల నుండి వస్తున్న అమూల్య రత్నములలో ఇదీ ఒకటి. త్వరలోనే దీని ఇంగ్లీష్ వెర్షన్ విడుదల అవుతుంది. దానివెంట వీటి ప్రింట్ పుస్తకములూ వస్తాయి.

దత్తాత్రేయుల వారి అనుగ్రహంతోనే పదిరోజులలో ఈ పుస్తకాన్ని వ్రాయడం సాధ్యమైందని భావిస్తున్నాను. అతి తక్కువ కాలంలో ఈ పుస్తకాన్ని పూర్తి చేయడంలో ఎంతో సహాయపడిన నా అమెరికా శిష్యురాళ్ళకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

మా పుస్తకములను నిరంతరం ఆదరిస్తున్న పాఠకులకు నా అభినందనలు, కృతజ్ఞతలు.
read more " మా క్రొత్త పుస్తకం 'శ్రీ జాబాల దర్శనోపనిషత్' E Book ఈరోజు విడుదలైంది "

19, సెప్టెంబర్ 2018, బుధవారం

Tere Bheegi Badan Ki - Mehdi Hassan


Tere Bheegi Badan Ki Khushbu Se

అంటూ మెహదీ హసన్ నయ్యర్ నూర్ లు మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1974 లో వచ్చిన Sharafat అనే పాకిస్తానీ సినిమాలోది. ఈ మధుర రొమాంటిక్ గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి.


Movie:--Sharafat (1973)
Lyrics:--Not known
Music:--Robin Ghosh
Singer:--Mehdi Hassan, Nayyar Noor
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------

Tere bheege badan ki khushbu se -2
Lehere bhi huyi mastaani see
Teri zulf ko chukar aaj huyi
Khamosh hawa deewani see
Humming

Ye roop ka kundan dehka huvaa-2
Ye jism ka chandan mehka huva – mehka huva
Ilzaam na dena phir mujhko -2
Hojaay agar naadaani see
Humming

Bikhra huva kaajal aakhon me -2
Toofan ki halchal saaso me – Saaso me
Ye narm labon ki khamoshi -2
Palkome chupee heraani see
Humming

Tere bheege badan ki khushboo se
Leheraa bhi huyi mastaani see
Teri zulf ko chukar aaj huyi
Khamosh hawa deewaani see-3
read more " Tere Bheegi Badan Ki - Mehdi Hassan "

18, సెప్టెంబర్ 2018, మంగళవారం

Hamare Dil Se Mat Khelo - Mehdi Hassan


Hamare Dil Se Mat Khelo
Khilona Toot Jayega

అంటూ మెహదీ హసన్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1973 లో వచ్చిన పాకిస్తానీ చిత్రం Daaman Aur Chingari ఆనే చిత్రంలోనిది. ఇందులో మహమ్మద్ అలీ, జేబా నటించారు. మెహదీ హసన్ ఈ పాటను ఎంతో మధురంగా ఆలపించాడు.

నా స్వరంలో కూడా ఈ మధుర గీతాన్ని వినండి మరి !

Movie:-- Daaman Aur Chingari (1973) Pakistani Movie
Lyrics:--Not known
Music:--Not known
Singer:-- Mehdi Hassan
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------------------------------------------------------

Hamare dilse mat khelo – Khilona toot jayega – 2
Zarasi thehs pahuchegee – Ye sheesha toot jayega
Hamare dilse mat khelo – Khilona toot jayega

Yahaa ke log tho – Do gaam chalkar - Chod dete hai -2
Zarasi der me – Barso ke rishte – Tod dete hai
Khabar kyaa thee – Ke kismat ka – Sitara toot jayega
Hamare dilse mat khelo – Khilona toot jayegaa

Jo milte hai – Bazaahir dost bankar – Raazda bankar – 2
Chupe rehte hai – unki aasteeno me - kayi khanzar
Khulegi aankh tho – Sapna suhanaa –Toot jayega
Hamare dilse mat khelo – Khilona toot jayega

Khabar kya thi - Chupi hai mere daaman – Me bhi chingari-2
Lagegi aag gulshan -- me jalegi - saari phulwaari
Girengi bijiliyaa itnee – Nazaara toot jayega

Hamare dilse mat khelo – Khilona toot jayega
Zarasi thehs pahuchegee – Ye sheesha toot jayega
Hamare dilse mat khelo – Khilona toot jayega

Meaning

Don't play with my heart
like a toy, it will break
If heated a little more
the Hookah will break

People of this place
will walk two steps with you
and then disappear
Within a few minutes they will break
the promises of many years
The thing is that
the star of destiny will be broken

Those who appear as good friends
outwardly, will have many daggers
hidden in their sleeves
By the time you open your eyes
your lovely dream will break

The thing is, in my pocket too
there is a sparkling light
If the garden is set to fire
all the flowers will burn
This much of lightening will
destroy the scenery for sure

Don't play with my heart
like a toy, it will break
If heated a little more
the Hookah will break

తెలుగు స్వేచ్చానువాదం

ఒక బొమ్మనుకుని
నా గుండెతో ఆటలాడకు
అది పగిలిపోతుంది
ఈ హుక్కాను ఇంకా వేడిచెయ్యకు
అది పగిలిపోతుంది

ఇక్కడి మనుషులింతే
నీతో రెండడుగులు కలసి నడుస్తారు
ఆ తర్వాత మాయమైపోతారు
కొన్ని నిముషాలలో
ఏళ్ళ నాటి వాగ్దానాలను
భగ్నం చేసేస్తారు
ఆ క్రమంలో నీ అదృష్టం
అనే నక్షత్రం పగిలిపోతుంది

బయటకు ఎంతో మంచి మిత్రులలా
నటించేవారి చొక్కా మడతలలో
కనిపించని కత్తులుంటాయి
నీవు కళ్ళు తెరిచేసరికి
నీ మధురస్వప్నం చెదరిపోతుంది

నా దగ్గర కూడా మెరిసే ఒక వెలుగుంది
కానీ అది జ్వాలగా మారితే
గులాబీ తోట తగలబడుతుంది
పూలన్నీ అప్పుడు కాలిపోతాయి
మెరుపు వెలుగు ఎక్కువైతే
ప్రకృతంతా నాశనం అవుతుంది


ఒక బొమ్మనుకుని
నా గుండెతో ఆటలాడకు
అది పగిలిపోతుంది
ఈ హుక్కాను ఇంకా వేడిచెయ్యకు
అది పగిలిపోతుంది
read more " Hamare Dil Se Mat Khelo - Mehdi Hassan "

మానవుడు

ఒక మానవుడు....

మట్టిలో పుట్టి
మట్టికోసం కొట్టుకుని
మట్టిలో కలసి
మట్టికొట్టుకు పోతున్నాడు

తప్పని తెలిసీ
తప్పించుకునే మార్గం తెలియక
చేసిన తప్పులనే మళ్ళీ చేస్తూ
తప్పుల కుప్ప అవుతున్నాడు

ఒప్పులివీ అంటూ
ఒప్పించేవాళ్ళు చెప్పినా
ఒప్పుకోలేక
ఒప్పులకుప్పలా వగలేస్తున్నాడు

తనతో ఏదీ రాదనీ తెలిసినా
తమాయించుకోలేక
తనివి తీరకుండానే
తనువు చాలిస్తున్నాడు

ఇంకో మానవుడు

మట్టిలో పుట్టినా
మత్తులో జోగకుండా
మనసునధిగమిస్తూ
మహనీయుడౌతున్నాడు

దానవత్వాన్ని దాటిపోతూ
మానవత్వాన్ని పోగు చేస్తూ
దైవతత్వాన్ని అందుకుంటూ
ధన్యజీవిగా మారుతున్నాడు

రహదారిలో తాను నడుస్తూ
తనవారిని తనతో నడిపిస్తూ
పరతత్వపు పందిళ్ళలో
పరవశించి పోతున్నాడు

చావు పుట్టుకల ఆటలో
పావుగా ఇక్కడ పుట్టినా
ఆట నియమాలను దాటి
అనంతంలోకి అడుగేస్తున్నాడు

మానవుడు....
read more " మానవుడు "

16, సెప్టెంబర్ 2018, ఆదివారం

Duniya Kisi Ke Pyar Me - Mehdi Hassan


Duniya Kisi Ke Pyar Me
Zannat Se Kam Nahee

అంటూ గానగంధర్వుడు మెహదీ హసన్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ ఘజల్ ను ఆ తర్వాత చాలా మంది ఆలపించారు.

ఈ గీతంలో సాహిత్యం చాలా మధురంగా ఉంటుంది. ఈ పాటను స్వరపరచిన భూపాల రాగం కూడా చాలా మధురమైనది. ఈ పాటకు వాడిన తబలా బిట్స్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. జాగ్రత్తగా వింటే వీటిని బాగా ఎంజాయ్ చెయ్యవచ్చు.

Genre:-- Ghazal
Lyrics:-- Unknown Poet
Singer:--Mehdi Hassan
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------

Bulbul ne gul se - Gulne baharon se keh diya
Ek choudwee ka chand ne - Taron se keh diya

Duniya Kisike Pyar me – Zannat se kam nahee -2
Ek dilruba hai dilme jo – Hooron se kam nahee-2
Duniya Kisike Pyar me – Zannat se kam nahee

Tum baadshaa-e-husn ho – Husn-e-jahaan ho-2
Jan-e-wafa ho aur – Mohabbat ki shaan ho-2
Jalwe tumhare husn ke – Taron se kam nahi
Duniya Kisike Pyar me – Zannat se kam nahee -2

Bhoole se muskuraavo tho – Mouti baras pade – 2
Palke uthake dekho tho – Kaliyaa bhi has pade-2
Khushbu tumhare zulf ki – Phoolo se kam nahee
Duniya Kisike Pyar me – Zannat se kam nahee
Ek dilruba hai dilme jo – Hooron se kam nahee
Duniya Kisike Pyar me – Zannat se kam nahee-2
Duniya kisike pyar me

Meaning

The nightingale said to the rose
And rose said it to the spring
A full Moon said it to the stars...

When the heart is full of love
the world is no less than paradise
The beloved of your heart
is no less than a heavenly damsel

You are the queen of beauty
You are the elegance of the world
You are the soul of trust
You are the light of love
The splendor of your beauty
Is no less than the glow of stars

If you smile by chance
Pearls shower like rain
When you lift your eyes to look
buds will bloom as if it is spring
Fragrance of your tresses
is no less than that of flowers

When the heart is full of love
the world is no less than paradise
The beloved of your heart
is no less than a heavenly damsel


తెలుగు స్వేచ్చానువాదం

కోయిల పువ్వులతో ఇలా అన్నది
పువ్వులు వసంతంలో అన్నాయి
ఒక పున్నమి జాబిలి, చుక్కలతో ఇలా అన్నది.

హృదయం ప్రేమతో నిండి ఉన్నప్పుడు
ప్రపంచం స్వర్గం కంటే తక్కువేమీ కాదు
నా గుండెలో కొలువై ఉన్న ప్రేయసి
అప్సరసల కంటే తక్కువేమీ కాదు

సౌందర్యానికి నీవు రాణివి
నువ్వే ప్రకృతిలోని అందానివి
నమ్మకపు ఆత్మవు నీవే
ప్రేమయొక్క వెలుగువూ నీవే
నీ అందం యొక్క తేజస్సు
తారల జ్యోతిస్సు కంటే తక్కువేమీ కాదు

నువ్వు పొరపాటున నవ్వితే
ముత్యాల వాన కురుస్తుంది
కనురెప్పలెత్తి నువ్వు చూస్తే
వసంతం వచ్చిందేమో అని
మొగ్గలు వికసిస్తున్నాయి
నీ కురుల పరిమళం
పువ్వుల సువాసనకేమీ తీసిపోదు

హృదయం ప్రేమతో నిండి ఉన్నప్పుడు
ప్రపంచం స్వర్గం కంటే తక్కువేమీ కాదు
నా గుండెలో కొలువై ఉన్న ప్రేయసి
అప్సరసల కంటే తక్కువేమీ కాదు
read more " Duniya Kisi Ke Pyar Me - Mehdi Hassan "

మైకుకు మోక్షం వచ్చింది

యధావిధిగా ప్రతి ఏడాదీ వచ్చేటట్లే వినాయక చవితి వచ్చింది. యధావిధిగా ప్రతి ఏడాదీ అడిగేటట్లే కుర్రాళ్ళు వచ్చి చందాలు అడిగారు.  

యధావిధిగా నేనివ్వను పొమ్మన్నాను.

వాళ్ళు నన్నొక హిందూమత ద్రోహిని చూచినట్లు చూస్తూ వెళ్ళిపోయారు.

పందిళ్ళు లేచాయి. పెద్ద వినాయక విగ్రహం వచ్చి అందులో కూచుంది. కాసేపు అందరూ గోల చేశారు. ఆ తర్వాత అక్కడ ఎవ్వరూ లేరు.

మూడురోజుల పాటు అందులోని మైకులో లేటెస్ట్ ఐటం సాంగ్స్ హోరెత్తాయి. ఎప్పుడు చూచినా పందిర్లో వినాయకుడూ, మైకూ తప్ప ఎవరూ ఉండటం లేదు. సాయంత్రం పూట మాత్రం నిక్కర్లేసుకున్న చిన్నపిల్లలు కొంతమంది వచ్చి ఆ ఐటం సాంగ్స్ కి డాన్సులు చేసి పోతున్నారు. ఆర్గనైజర్స్ ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు.

నాకు వినాయకుడి మీద భలే జాలేసింది. ఆ చెత్తపాటలన్నీ ఆయన ఎలా వింటున్నాడో, ఆ డాన్సులు ఎలా చూస్తున్నాడో అని !

ఇవాళ పందిరి పీకేస్తున్నారు. మూడ్రోజుల్నించీ పాటలు పాడిన మైకుకు విశ్రాంతి దొరికింది. ఒక బండిమీద కూచుని మైక్ సెట్టు తన షాపుకు పోతోంది.

మైకుకు మోక్షం వచ్చింది.

మనుషులకి మాత్రం ఎన్నేళ్ళకీ రావడం లేదు !
read more " మైకుకు మోక్షం వచ్చింది "

Koi Sagar Dilko Behlata Nahi - Mohammad Rafi


Koi Sagar Dilko Behlata Nahi...

అంటూ మహమ్మద్ రఫీ సున్నితంగా ఆలపించిన ఈ గీతం 1966 లో వచ్చిన Dil Diya Dard Liya అనే చిత్రం లోనిది. ఇది పాథోస్ గీతం. అప్పట్లో ఇలాంటి పాటలు చాలా వచ్చాయి. ఇలాంటి పాటలు ఇప్పటికీ నిలబడి ఉన్నాయంటే వాటిలోని సాహిత్యమూ సంగీతాలే కారణాలు. ఈ గీతాన్ని దిలీప్ కుమార్, వహీదా రెహమాన్ ల మీద చిత్రీకరించారు.

దీనిని వ్రాసింది షకీల్ బదయూని. ఇతను ఉర్దూ పదాలను ఎక్కువగా తన పాటలలో వ్రాస్తాడు. ఈ పాటలోని సాగర్ అంటే సముద్రం అని అర్ధం కాదు. పార్సీలో సాఘర్ అంటే మధుపాత్ర అని అర్ధం. ఈ పదం యొక్క అర్ధం అదే.

ఈ సుమధుర గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి.

Movies:--Dil Diya Dard Liya (1966)
Lyrics:-- Shakil Badayuni
Music:--Naushad
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------

Koi Sagar Dilko Behlata Nahi-2
Bekhudi me bhi karaar aata nahi
Koi Sagar dilko behlata nahi

Mein koi paththar nahi insaan hu-2
Kaise keh du Ghamse ghabrata nahi
Koi Sagar Dilko Behlata Nahi
Bekhudi me bhi karaar aata nahi

Kal to sab the kaarwa ke saath saath-2
Aaj koi raah dikhlata nahi
Koi Sagar Dilko Behlata Nahi
Bekhudi me bhi karaar aata nahi

Zindagi ke aayine ko tod do
Iss me ab kuch bhi nazar aata nahi
Koi Sagar Dilko Behlata Nahi
Bekhudi me bhi karaar aata nahi
Koi Sagar Dilko Behlata Nahi

Meaning

No goblet could comfort my heart
Intoxication also could not give me peace

I am not a stone, but a human being
How can I say that
I am not afraid of sorrow?

Yesterday everybody was with me
Today I am not able to see any path

Break all the mirrors from life
Nothing is visible in them now

No goblet could comfort my heart
Intoxication also could not give me peace

తెలుగు స్వేచ్చానువాదం

ఏ మధుపాత్రా
నా హృదయాన్ని సేదదీర్చలేకపోతోంది
మధువు మత్తులో కూడా
నాకు శాంతి కరువైంది

నేను రాయిని కాను, మనిషినే
బాధ అంటే నాకు భయం లేదని
నేనెలా చెప్పగలను?

నిన్న అందరూ నాతో ఉన్నారు
ఈ రోజు నాకు ఏ దారీ కనిపించడం లేదు

జీవితంలో అన్ని అద్దాలనూ భగ్నం చెయ్యి
వాటిల్లో ఏమీ కన్పించడం లేదు

ఏ మధుపాత్రా
నా హృదయాన్ని సేదదీర్చలేకపోతోంది
మధువు మత్తులో కూడా
నాకు శాంతి కరువైంది
read more " Koi Sagar Dilko Behlata Nahi - Mohammad Rafi "

15, సెప్టెంబర్ 2018, శనివారం

Ek Naye Mod Pe - Mehdi Hassan


Ek Naye Mod Pe
Le Aayi Hai Halaat Mujhe

అంటూ గానగంధర్వుడు మెహదీ హసన్ మృదు మధురంగా ఆలపించిన ఈ గీతం 1967 లో వచ్చిన పాకిస్తానీ చిత్రం Ehsaan లోనిది. అప్పటి రాగాలకు తగినట్లుగానే ఈ గీతం చాలా మధురంగా ఉంటుంది. దీనిని Wahid Murad and Zeba ల మీద చిత్రీకరించారు.

ఇలాంటి పాటలు ఇప్పుడు ఎవరికీ తెలియను కూడా తెలియవు.  అయితే కొంతమందికి కోపం రావచ్చు. పాకిస్తానీ పాటలు పాడాలా? మనకు లేవా? అని. పాకిస్తాను మనకు శత్రుదేశం అయితే కావచ్చు. కానీ సంగీతానికి శత్రుత్వం లేదు. కళకు హద్దులు లేవు. మాధుర్యానికి ఎల్లలు లేవు. కళాకారుడు ఏ దేశంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా అతను కళాకారుడే. దైవానుగ్రహం కలిగినవాడే.

మీలో ఎవ్వరూ ఈ పాటను కనీసం ఒక్కసారి కూడా విని ఉండరు.

అందుకే నా స్వరంలో కూడా ఒకప్పటి ఈ అమరగీతాన్ని వినండి మరి !

Movie:--Ehsaan (1967) Pakistani Movie
Lyrics:--Mansoor Anwar
Music:--Sohail Rana
Singer:--Mehdi Hassan
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------

Ik naye mod pe – le aaye hai haalaat mujhe-2
dil ne jo maangee -2
wohi mil gayi sougaat mujhe
Ik naye mod pe – le aaye hai haalaat mujhe
Ik naye mod pe

Door reh kar bhi - khayalon me  - mere paas ho tum-2
kitni pyare hai-2
ye jazbaat ye lamhaat mujhe
Ik naye mod pe – le aaye hai haalaat mujhe
ik naye mod pe

Dil me ek aznabi ehesaas ki khushboo jaagi-2
aaj lagtee hai -2
har ik baat nayi baat mujhe
Ik naye mod pe – le aaye hai haalaat mujhe
Ik naye mod pe

Tum kabhi khud ko meri aankho se chup kar dekho-2
kya kahu tumne-2
nazar aaati hai kya baat mujhe
Ik naye mod pe – le aaye hai haalaat mujhe
dil ne jo maangee-2
wohi mil gayi sougaat mujhe
Ik naye mod pe

Meaning

Circumstances have brought me
to a new twist in my life
Whatever my heart desired
That treasure has come to me

Though you are physically away from me
In my thoughts you are with me always
How lovely !!
How lovely, are these emotions
and these moments !

In my heart is waking up
the fragrance of a strange feeling
Today It appears to me that
Every thing is a new thing

Sometimes, you just look through my eyes
How can I express my awe?
You are looking so beatiful
So beautiful !

Circumstances have brought me
to a new twist in my life
Whatever my heart desired
That treasure has come to me


తెలుగు స్వేచ్చానువాదం

పరిస్థితులు నా జీవితంలో
ఒక క్రొత్త మలుపును తీసుకొచ్చాయి
నా హృదయం దేనినైతే కోరిందో
అది నాకిప్పుడు దొరికింది

నువ్వు భౌతికంగా
నాకెంతో దూరంలో ఉన్నప్పటికీ
నా ఆలోచనలలో
నా పక్కనే ఉన్నావు
ఈ అనుభూతి ఎంత బాగుందో?
ఈ క్షణాలు ఎంత బాగున్నాయో?

ఈరోజు నా హృదయంలో
ఎప్పుడూ లేని ఒక మధుర భావం యొక్క
పరిమళం నిద్ర లేస్తోంది
ప్రతి ఒక్కటీ నాకేదో క్రొత్తగా కనిపిస్తోంది

ఎప్పుడైనా ఒక్కసారి
నా కన్నులతో నిన్ను చూచుకో
ఎంత అందంగా కనిపిస్తున్నావో
నేనైతే చెప్పలేను !

పరిస్థితులు నా జీవితంలో
ఒక క్రొత్త మలుపును తీసుకొచ్చాయి
నా హృదయం దేనినైతే కోరిందో
అది నాకిప్పుడు దొరికింది
read more " Ek Naye Mod Pe - Mehdi Hassan "

14, సెప్టెంబర్ 2018, శుక్రవారం

Hungama Hai Kyo Barpa - Ghulam Ali


Hungama Hai Kyo Barpa
Todi Si Jo Peeli Hai

అంటూ గులాం అలీ అత్యంత మధురంగా ఆలపించిన ఈ ఘజల్ చాలా సోగసైనది. ఒక్కొక్క చరణాన్ని ఒక్కొక్క రకంగా గులాం అలీ పాడిన తీరు అనితర సాధ్యం. ఈయన పాడిన ఘజల్స్ వేటికవే సాటి. వాటిల్లో కొన్ని మరీ మధురాతి మధురంగా ఉంటాయి. అలాంటి ఘజల్స్ లో ఇదీ ఒకటి. నా స్వరంలో కూడా ఈ ఘజల్స్ ను వినండి మరి. దీనిని మరీ ఖూనీ చెయ్యలేదనే నేను అనుకుంటున్నాను. సరిగమలతో కూడిన ఘజల్స్ ని ట్రాక్ లో పాడటం చాలా కష్టం. పాస్ మార్కులు వచ్చినా పరవాలేదని నా ఉద్దేశ్యం. మరి ఎలా వచ్చిందో విన్నవాళ్ళు చెప్పాలి.

ఈ ఘజల్ దర్బారీ కానడ రాగంలో స్వరపరచబడింది.

Genre : Ghazal
Lyrics: Akbar Allahabadi
Singer:--Ghulam Ali
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------
Hangama hai kyo barpa, thodi si jo pee lee hai -2
Daka tho nahi dala - 2
Chori tho nahi kee hai
Hangama hai kyo barpa, thodi si jo pee lee hai

Usmese nahi matlab - Dil jis se ho begana - 2
Maqsood hai usme se-2
Dil hi mejo khinchti hai
Hangama hai kyo barpa, thodi si jo pee lee hai
Daka tho nahi dala - 2
Chori tho nahi kee hai
Hangama hai kyo barpa, thodi si jo pee lee hai

Suraj me lage dhabba - Fitrat ke karishme hai - 2
Buth hamko kahe kaafir - 2
Allah ki marji hai
Hangama hai kyo barpa, thodi si jo pee lee hai -2
Daka tho nahi dala - 2
Chori tho nahi kee hai
Hangama hai kyo barpa
Panidare Gagamapa Gamarisa Rinisaridani
Mapadanisa Mapadanisa Mapadanisa
Hangama hai kyo barpa, thodi si jo pee lee hai

Na tajruba kaari se - Waayij ki ye baate hai
Mamapa Gagani Pamapa Saanipamapani 
Gamarisanidani Dani Reesa
Na tajruba kaari se - Waayij ki ye baate hai
Is Rang ko Kya Jane - 2
Pucho tho kabhi pee hai
Hangama hai kyo barpa, thodi si jo pee lee hai
Daka tho nahi dala - 2
Chori tho nahi kee hai
Hangama hai kyo barpa, thodi si jo pee lee hai

Har zarra chamakta hai – Anvaar- e - Ilaahi se-2
Har sans ye kehti hai –2
Hum haitho khuda bhi hai
Hangama hai kyo barpa, thodi sijo pee lee hai
Daka tho nahi dala-2
Chori tho nahi kee hai
Hangama hai kyo barpa, thodi sijo pee lee hai
Panidare Gagamapa gamarisa rinisaridani mapadanisa  
mapadanisa mapadanisa
Hangama hai kyo barpa, thodi sijo pee lee hai
Thodee sijo pee lee hai
Jo pee lee hai
Jo pee leeeee hai

Meaning

Why so much ruccus?
I took but a few sips
Haven't committed wayside robbery
or indulged in stealing

That drink is of no use
which makes my heart forsaken
I want that love wine
which springs up from within the heart

The mighty sun is covered by a dark shadow
it is but nature’s magic
The false God is accusing me of being a Kafir
'Let it be' - It is Allah’s will

The priest is inexperienced so is his intentions
How can he appreciate the color of wine?
Ask him if he ever took to drinking

Every particle sparkles from the effulgence
borrowed from the whole
Yet every breath boasts saying
If we exist, so does the mystery of the universe

Why so much ruccus?
I took but a few sips
Haven't committed wayside robbery
or indulged in stealing

తెలుగు స్వేచ్చానువాదం

ఎందుకింత గోల చేస్తున్నారు?
నేనేం చేశాను?
రెండు గుక్కలు మధువును పుచ్చుకున్నాను
దారి దోపిడీ చెయ్యలేదు
దొంగతనమూ చెయ్యలేదు

మధువు త్రాగితే హృదయం పక్కదారి పడుతుందో
దానివల్ల ఉపయోగమూ లేదు
నాకది ఒద్దు
హృదయంలో నుంచి పొంగి వచ్చే 
ప్రేమమధువు నాకు కావాలి

సూర్యుడు కూడా ఒక్కొక్కసారి
నీడతో కప్పబడి పోతాడు
అది ప్రకృతి చేసే మాయ
సైతాన్ నన్నే సైతాన్ అంటున్నాడు
సర్లే కానీ..
ఇది కూడా భగవంతుని కారుణ్యమే

గురువుగారికి మతి పోయింది
ఆయనకు మధువు రుచి ఎలా తెలుస్తుంది?
ఒక్కసారి ఆయన్ను అడగండి
ఎప్పుడైనా మధుసేవ చేశాడో లేదో?

సృష్టిలో ప్రతి అణువూ
దైవం యొక్క వెలుగును తీసుకుని వెలుగుతోంది
కానీ దానికి గర్వం పెరిగింది
దాని ప్రతి శ్వాసా ఇలా అంటోంది
'నేనుండబట్టే దేవుడున్నాడు'
'అంతా నావల్లే జరుగుతోంది'

ఎందుకింత గోల చేస్తున్నారు?
నేనేం చేశాను?
రెండు గుక్కలు మధువును పుచ్చుకున్నాను
దారి దోపిడీ చెయ్యలేదు
దొంగతనమూ చెయ్యలేదు....
read more " Hungama Hai Kyo Barpa - Ghulam Ali "