“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, మార్చి 2017, మంగళవారం

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !!

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

దేనికోసం నీ యుగాల అన్వేషణ?
దేనికోసం  ఈ ఎడతెగని పరిశ్రమ?

నువ్వు వెదికే హృదయం
ఈలోకంలో ఉందంటావా?
నువ్వాశించే ప్రణయం
నీకసలు లభిస్తుందంటావా?

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

చీకటి నిండిన ఈ లోకంలో
ఆకలి దప్పుల పెనుమైకంలో
నువ్వు కోరే వెలుగు నీకు దొరికేనా?
నీ పయనం ఒక మలుపు తిరిగేనా?

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

పంకంతో నిండిన సరస్సులో
పద్మం కోసం వెదుకుతున్నావా?
స్వార్ధంతో కుళ్ళిన లోకంలో
ప్రేమకోసం తపిస్తున్నావా?

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

పెనుచీకటిలో దారి తెలీకున్నా
ధృవనక్షత్రం పైనే దృష్టి నిలిపి
అరికాళ్లను ముళ్ళు కోసేస్తున్నా
చిరునవ్వును పెదవులపై నిలిపి

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

నిరాశకే ఆశను నేర్పిస్తూ
విధాతకే వణుకును పుట్టిస్తూ
నీ రాతనే నువ్వు మార్చి వ్రాసుకుంటూ
వడపోతగా జ్ఞాపకాలను పేర్చుకుంటూ

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

ఉందో లేదో తెలియని
గమ్యాన్ని వెదుక్కుంటూ
ఎదురౌతుందో లేదో తెలియని
నేస్తాన్ని తలచుకుంటూ

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!

కృంగుబాట్లకు చెదరకుండా
వెన్నుపోట్లకు వెరవకుండా
అలుపునెరుగని బాటసారివై
మొక్కవోవని ప్రేమఝరివై

ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !
ఎందుకింత బాధ నీ గుండెల్లో? ఓ నేస్తం !!
read more " ఎక్కడికి పోతున్నావీ చీకట్లో ? ఓ నేస్తం !! "

27, మార్చి 2017, సోమవారం

రెండవ అమెరికా యాత్ర - ఇంటెన్సివ్ సాధన కోసం

అమెరికా వెళ్ళొచ్చి ఏడాది అవుతున్నది.అందుకని వచ్చే ఆదివారం రాత్రి మళ్ళీ అమెరికాకు ప్రయాణం అవుతున్నాము. ఈ సారి మూడునెలలు అక్కడ మకాం. మళ్ళీ జూలైలో ఇండియాకు తిరిగి వస్తాము.

'అమ్మో మూడునెలలా?ఒక్క పదిహేను రోజులకే మాకు ఏమీ తోచక బోరుకొట్టి చచ్చాం అక్కడ. మీకు టైం పాస్ ఎలా?' అడిగాడు ఒకాయన.

'టైం ఎందుకు పాస్ అవదు? నువ్వు ఊరకే కూచున్నా టైం పాస్ అవుతూనే ఉంటుంది.కూచునే విద్య నీకు తెలియాలి.' అన్నా నవ్వుతూ.

'అదికాదు.అక్కడ ఏమీ తోచదు. బయటకు వెళ్ళలేము. విసుగు పుడుతుంది.' అన్నాడు. 

'బయటకు ఎందుకు పోవాలి అసలు?' అడిగాను నవ్వుతూ.

వింతగా చూచాడు.

'నీకు పదిహేను రోజులకే బోరు కొట్టింది.నాకు మూణ్నెల్లు చాలదు. అదే మీకూ నాకూ తేడా' చెప్పాను నవ్వుతూ.

'అదేంటి? బాగా ఊళ్లు తిరుగుతారా? అప్పుడైతే బోరు ఉండదు. లాస్ వెగాస్ చూడండి బాగుంటుంది. ' అన్నాడాయన.

'లాసూ వద్దు ఏ గ్యాసూ వద్దు. ఏముందక్కడ సోది, భ్రష్టు పట్టడం తప్ప? ఎక్కడికీ తిరగను. కనీసం టీవీ కూడా చూడను.కానీ నాకేం బోరు కొట్టదు.' అన్నాను.

'ఎలా సాధ్యం?' అడిగాడు.

'నాతో వచ్చి ఉండు ఎలా సాధ్యమో తెలుస్తుంది. కాకుంటే నాతో జీవితం ఒక్కరోజుకే నీకు తట్టుకోలేని బోరు కొట్టేస్తుంది. పారిపోతావ్! ' అన్నాను నవ్వుతూ.

'ఏమి చేస్తారు మూడు నెలలు?' అన్నాడు.

'ఏమీ చెయ్యను. నాలో నేనుంటాను. ఇక బోరెక్కడుంటుంది?' అడిగాను.

'ఆ మాత్రం దానికి అమెరికా పోవడం ఎందుకు? ఇక్కడే మీ ఇంట్లోనే కూచోవచ్చుగా?' అడిగాడు చనువుగా.

'కూచోవచ్చు. కానీ ఇక్కడే ఉంటానంటే మూడునెలల పాటు నాకెవరూ లీవ్ ఇవ్వరు. అదే అమెరికాకైతే పెట్టుకోవచ్చు. ఇస్తారు కూడా. అందుకే లీవు పెట్టి అమెరికాకు పోతున్నా' అన్నాను.

'లాస్ట్ టైం బాగా ఊళ్లు తిరిగారా?' అడిగాడు.

'తిరగవలసినవి తిరిగాను. చూడవలసినవి చూచాను. అయినా నేను నీలా తిరుగుబోతును కాను.' అన్నా నవ్వుతూ.

'సరే. పనుంది వస్తా' అంటూ దణ్ణం పెట్టి వెళ్ళిపోయాడు.

చాలామంది ఇంతే. ఎక్కడెక్కడో తిరగాలని ఏవేవో చూడాలనీ అనుకుంటూ భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. ఎంత తిరిగినా ఎన్ని చూచినా ఏముంది? ఎక్కడా ఏమీ లేదు. ఉన్నదంతా మనలోనే ఉంది.ఈ సత్యం బాగా అర్ధమైతే, ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఉండవు. పోయిన సారీ ఇదే చెప్పాను. ఇప్పుడూ ఇదే చెబుతున్నాను.

మనిషి చెయ్యవలసిన పని అంతా నిజానికి లోలోపల ఉన్నది. దానిని సక్రమంగా చేస్తే చాలు.అప్పుడు బోరూ ఉండదు.ఏమీ ఉండదు.

ఈసారి అమెరికాలో గడపబోయే మూణ్ణెల్లలో నాకు చాలా పనులున్నాయి.

శ్రీవిద్యా రహస్యం ఇంగ్లీష్ బుక్ రిలీజ్ చెయ్యాలి. తారాస్తోత్రం ఈ-బుక్ రిలీజ్ చెయ్యాలి.లలితాసహస్రనామ భాష్యం తెలుగు+ఇంగ్లీషు పుస్తకాలు విడుదల చెయ్యాలి. ఇవి గాక 300 live charts Astro analysis పుస్తకం రెడీ చెయ్యాలి.ఇవి గాక ఇంకా కొన్ని పుస్తకాలు వ్రాయాలి.

పరాశక్తి ఆలయంలోనూ, కొన్ని స్పిరిట్యువల్ రిట్రీట్స్ లోనూ మళ్ళీ ఉపన్యాసాలు ఇవ్వాలి. పరాశక్తి ఆలయంలో అమ్మవారి సమక్షంలో కూచుని నా సాధనలు చేసుకోవాలి.

వీలు చిక్కితే గాంగెస్ ఆశ్రమం, చికాగో, టెక్సాస్, సెడోనాలను దర్శించాలి. అక్కడ శిష్యులతో స్పిరిట్యువల్ రిట్రీట్స్ చెయ్యాలి. గాంగెస్ లో మా ఆశ్రమం లాండ్ పనులు చూడాలి.

ఇవిగాక,నా రోజువారీ మంత్రధ్యాన సాధనా,మార్షల్ ఆర్ట్స్ అభ్యాసమూ, యోగాభ్యాసమూ,పాటలూ,జ్యోతిష్యపరిశ్రమా, నాతో నివసించే శిష్యులతో సంభాషణలూ, హోమియోపతీ ,అక్కల్టూ మొదలైనవన్నీ యధావిధిగా సాగుతూనే ఉంటాయి.ఈసారి ట్రిప్ లో క్లాసులు పెట్టి ఇవన్నీ నా శిష్యులకు నేర్పించబోతున్నాను. నా శిష్యులను ఈ విద్యలలో నా అంతవారిని చెయ్యడం నా లక్ష్యాలలో ఒకటి.

పోయినసారి మొదటి లెవల్ దీక్ష తీసుకున్న నా అమెరికా శిష్యులకు ఈ సారి రెండవ లెవల్ దీక్ష ఇవ్వబోతున్నాను.

అన్నింటినీ మించి, నేను ఎప్పటినుంచో వాయిదా వేసుకుంటూ వస్తున్న కొన్ని రహస్య తంత్రసాధనలను ఈసారి పూర్తి చెయ్యాలి. దానికి పూర్తి ఏకాంతవాసమూ కొన్ని ప్రత్యేక పరిస్థితులూ అవసరం అవుతాయి.ఈసారి మూడునెలలలో పైన చెప్పిన పనులన్నీ చేసుకుంటూ నా తంత్రసాధనలను తీవ్రస్థాయిలో చెయ్యబోతున్నాను.ఇవన్నీ చెబితే ఎవడికి అర్ధమౌతుంది? అందుకనే ఇవన్నీ చెప్పకుండా, మూడునెలలు ఏమాత్రం చాలదని సింపుల్ గా మా కొలీగ్ కి చెప్పాను.

పైగా - మనల్ని నిజంగా అభిమానించే వాళ్ళు ఎక్కడుంటే అదే మన ప్రపంచం అవుతుంది.నాకలాంటి వాళ్ళు అమెరికాలో చాలామంది ఉన్నారు.

ఒకే ఒక్క ముక్కలో చెప్పాలంటే, తపస్సు కోసం అమెరికాకు వెళుతున్నాను.నన్ను ప్రేమించే నా మనుషులకోసం అక్కడకు వెళుతున్నాను.బార్లూ క్యాసినోలూ చూడటం కోసం కాదు.అవి ఇక్కడా ఉన్నాయి. వాటి కోసమే అయితే అంత దూరం పోవలసిన పని లేనేలేదు.

పిచ్చిజనం, పిచ్చిప్రపంచం! ఎలా చెబితే వీళ్లకు అర్ధమౌతుందో?
read more " రెండవ అమెరికా యాత్ర - ఇంటెన్సివ్ సాధన కోసం "

26, మార్చి 2017, ఆదివారం

Bohu Door Theke E Kothaa - Kishore Kumar


బెంగాలీ పాటలు పాడి చాలా నెలలైంది. అందుకే ఈ పాట.

Bohu Door Theke E Kothaa Dite Laam Upohaar...

అంటూ కిషోర్ కుమార్ తన ఉచ్ఛ స్వరంలో ఆలపించిన ఈ మధురగీతం 1990 లో రిలీజైన Hirak Jayanti అనే బెంగాలీ సినిమాలోది. ఈ పాటకు గౌతమ్ బోస్ సంగీతాన్ని అందించగా, పులక్ బందోపాధ్యాయ సాహిత్యాన్ని అందించారు.

కిషోర్ బెంగాలీ వాడే గనుక ఈ పాటను సునాయాసంగా పాడేశాడు. నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Hirak Jayanti (1990)
Lyrics:--Phulak Bandopaadhyay
Music:--Gowtam Bose
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------
Bohu door theke E kotha Dite laam Upohar

Bohu door theke E kotha Dite laam Upohar-2
Tooomee Je amaar - Ogo tumeee je amaar
Ahaa aaaha haaa

[Amar duchOkhe jaalo - tumi de nuthon alo]-2
Ye dike saakaay ami dekhi taay - tomake yi shudh bare baar
Bohu door theke E kotha Dite laam Upohar
Tooomee Je amaar - Ogo tumeee je amaar
Oho ho ho hoho

Amar maatir bhumee - shorg kore cho tumi -2
Bhore gyaalo mon - bhorlo jigon - chaayina thO kichu aaar
Bohu door theke E kotha Dite laam Upohar
Tooomee Je amaar - Ogo tumeee je amaar
Oho o ho hoho
Ehe aa ha aahaaa
Oho ho Ehe E E….

Meaning

After a long time, this word of yours, gave me lot of joy
You are mine...listen Oh dear....you are mine

To my two eyes, you are the new light
Where ever I look, you alone are seen
in every direction

My land of mud
you have turned into heaven
My mind is filled with joy
I wont ask you anything more
This joy is enough

After a long time, this word of yours, gave me lot of joy
You are mine...listen Oh dear....you are mine.....

తెలుగు స్వేచ్చానువాదం

చాలా కాలం తర్వాత నీ మాట
ఎంతో ఆనందాన్నిచ్చింది
నువ్వు నాదానివి....విను ప్రియతమా
నువ్వు నా దానివి

నా రెండు కన్నులకు
నువ్వే క్రొత్త వెలుగువు
నేనెటు చూచినా నువ్వే కనిపిస్తున్నావు

ఈ మట్టి భూమిని నువ్వు స్వర్గంగా మార్చావు
నా మనస్సును సంతోషంతో నింపావు
ఈ సంతోషం నాకు చాలు
ఇంకేమీ నీనుంచి ఆశించను

చాలా కాలం తర్వాత నీ మాట
ఎంతో ఆనందాన్నిచ్చింది
నువ్వు నాదానివి....విను ప్రియతమా
నువ్వు నా దానివి.....
read more " Bohu Door Theke E Kothaa - Kishore Kumar "

24, మార్చి 2017, శుక్రవారం

Charag -O- Aftab gum Badi Hasin Raat Thi - Jagjit Singh


Charag-o-Aftaab gum badi hasin raat thi...
Shabaab ki naqaab gum badi hasin raat thi....

అంటూ సుదర్శన్ ఫాకిర్ కలంలోనుంచి, జగ్జీత్ సింగ్ స్వరంలోనుంచి సుతారంగా జాలువారిన ఈ గీతం ఒక మృదుమధురమైన ఘజల్. మధుర ప్రేమికుల మనోజ్ఞరాత్రిని వర్ణిస్తూ సాగే పాట ఇది.

అయితే, ఈ ఘజల్ ను ఒక హిందీ సినిమాలో వాడారు. చిత్రీకరణ చాలా ఎబ్బెట్టుగా ఉన్నది. సినిమా చూడకుండా పాటను వింటే ఎంతో అద్భుతమైన ఫీల్ వస్తుంది.కానీ అదే సినిమాలో చూస్తే మాత్రం చండాలంగా అనిపిస్తుంది. అంత దరిద్రంగా చిత్రీకరణ జరిపారు. ఏం చేస్తాం?

ఇలాంటి పాటల్ని చక్కగా చిత్రీకరించాలంటే ఎంతో టేస్టూ ఎంతో ఈస్తటిక్ సెన్సూ ఉండాలి.ఎన్నటికీ మరపురాని ఒక మనోజ్ఞగీతంగా దీనిని చూపించవచ్చు. కానీ ఈ పాట భావాన్ని ప్రతిబింబించడంలో సినిమావాళ్ళు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. నాయికా నాయకులను కరువు బట్టిన వాళ్ళలాగా చూపించి బ్యాక్ గ్రౌండ్ లో ఈ పాటను పెట్టారు. ఖర్మ !!

సినిమా సంగతి అలా ఉంచితే, ఈ ఘజల్ ని ఘజల్ గా వింటే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పాటలో ఉమర్ ఖయ్యాం ఫిలాసఫీ అడుగడుగునా తొంగి చూస్తూ ఉంటుంది. నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Ghajal:- Charag-o-aftaab gum
Lyrics:- Sudarshan Faakir
Singer:-Jagjit Singh
Karaoke Singer:-Satya Narayana Sarma
Enjoy
-------------------------------
Charag - o -  aaftab gum – Badi haseen raat thi -2
Shabaab ki naqaab gum – Badi haseen raat thi
Charag - o -  aaftab gum – Badi haseen raat thi

[Mujhe pila rahe the woh
Ke khud hi shamma bujh gayi] - 2
Gilaash gum sharaab gum
Badi haseen raat thi
Charag - o -  aaftab gum – Badi haseen raat thi

[Likha tha jis kitaab me
Ke ishq tho haraam hai]-2
Huyi wahi kitaab gum
Badi haseen raat thi
Charag - o -  aaftab gum – Badi haseen raat thi

[Labon se lab jo mil gaye
Labon se lab hi sil gaye]-2
Sawaal gum jawaab gum
Badi haseen raat thi

Charag - o -  aaftab gum – Badi haseen raat thi
Shabaab ki naqaab gum – Badi haseen raat thi
Charag - o -  aaftab gum – Badi haseen raat thi

Meaning

The brightness of the lamp was gone
What a charming night it was
The curtain of youth was dropped
What a charming night it was

When she gave the drink to me
The candle light extinguished itself
The glass was gone, the wine was gone
What a charming night it was

It was written in the scripture that
Passion of love is a sin and so prohibited
When that book itself was gone
What a charming night it was

When lips met lips
They became stitched together
The question was gone, the answer was gone
What a charming night it was

The brightness of the lamp was gone
What a charming night it was
The curtain of youth was dropped
What a charming night it was….

తెలుగు స్వేచ్చానువాదం

దీపపు వెలుగు మాయమైంది
ఎంత మనోజ్ఞమైన రాత్రి !
యవ్వనపు పరదా జారిపోయింది
ఎంత మనోజ్ఞమైన రాత్రి !

తను నాకు మధువును అందించినపుడు
దీపం తనంతట తానే ఆరిపోయింది
గ్లాసూ మాయమైంది, మధువూ మాయమైంది
ఎంత మనోజ్ఞమైన రాత్రి !

మోహావేశం మంచిది కాదని గ్రంధాలలో వ్రాసుంది
కానీ ఆ గ్రంధమే ఆ రాత్రి మాయమయ్యింది
ఎంత మనోజ్ఞమైన రాత్రి !

పెదవులు పెదవులతో కలసినప్పుడు
అవి ఒక్కటిగా అతుక్కుపోయాయి
అడగడానికి ప్రశ్నా లేదు
చెప్పడానికి జవాబూ లేదు
ఎంత మనోజ్ఞమైన రాత్రి !

దీపపు వెలుగు మాయమైంది
ఎంత మనోజ్ఞమైన రాత్రి !
యవ్వనపు పరదా జారిపోయింది
ఎంత మనోజ్ఞమైన రాత్రి !
read more " Charag -O- Aftab gum Badi Hasin Raat Thi - Jagjit Singh "

22, మార్చి 2017, బుధవారం

Sab Kuch Lutake Hosh Me Aye Tho Kya Kiya - Talat Mehamood


Sab Kuch Lutake Hosh Me Aye Tho Kya Kiya

అంటూ తలత్ మెహమూద్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1957 లో వచ్చిన Ek Saal అనే సినిమాలోనిది. ఈ పాట ఒక ఆపాత మధురం. దీనికి సాహిత్యాన్ని ప్రేమ్ ధావన్ అందించగా, సంగీతాన్ని మధుర సంగీత దర్శకుడు రవి శంకర్ శర్మ అందించారు. సాహిత్యానికి సాహిత్యమూ సంగీతానికి సంగీతమూ కలసి, ఈ రెంటికీ సున్నితమైన గళం కలిగిన తలత్ మెహమూద్ స్వరం తోడై ఈ పాటను ఒక మరపురాని మధుర గీతంగా మార్చాయి.

మన తెలుగులో ఒక సామెతుంది.'చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంది?' అని. మనం జీవితంలో చాలాసార్లు ఇలాగే ఫూలిష్ గా ప్రవర్తిస్తూ ఉంటాం. ఏదైనా సరే మన చేతుల్లో ఉన్నప్పుడు దాని విలువ తెలీదు. అహంకారంతో విర్రవీగి దాన్ని పోగొట్టుకుంటాం. ఆ తర్వాత తీరికగా కూచుని ఏడుస్తాం. అప్పుడు ఎంత బాధపడినా ఉపయోగం ఏముంటుంది?

అందుకే అంటారు. అదృష్టం తలుపు తట్టినప్పుడే తలుపు తియ్యాలి. అప్పుడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఆ తర్వాత అది వెళ్ళిపోయాక తీరిగ్గా బాధపడితే ఉపయోగం ఏమీ ఉండదు.

ఈ పాట అర్ధం ఇదే.గతంలోకి తొంగి చూచుకుని బాధపడే సమయంలో ప్రతివారికీ తప్పకుండా గుర్తొచ్చే పాట ఇది.ఇది మనలో ప్రతివారికీ వర్తిస్తుంది కదూ?

ఈ పాటలో అశోక్ కుమార్ నటించాడు.

నా స్వరంలో కూడా ఈ క్లాసికల్ మధుర గీతాన్ని వినండి మరి.

Movie:-- Ek Saal (1957)
Lyrics:--Prem Dhavan
Music:--Ravi Shankar Sharma (Ravi)
Singer:--Talat Mehamood
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------
Karte rahe khijaa se ham Souda bahaar kaa
Badla diya tho kya - ye diyaaaa -- Unke pyaar ka

Sab kuch lutake hosh me aaye to kya kiya-2
Din ne agar Charag jalaye tho kya kiya
Sab kuch lutake hosh me aaye to kya kiya

Ham badnaseeb pyar ki rusvaayi ban gaye
Khud hi laga ke aag tamashayi ban gaye – tamasha hi ban gaye
Daman se apne shole bujhaye tho kya kiya
Din ne agar Charag jalaye tho kya kiya
Sab kuch lutake hosh me aaye to kya kiya

Lele ke haar phoolon ke Aaye tho thee bahaar
Nazare uthake hamne hi Dekha na ek baar – dekha na ek baar
Aakhon se abye parde hataye tho kya kiya
Din ne agar Charag jalaye tho kya kiya
Sab kuch lutake hosh me aaye to kya kiya

Meaning

What is the use of opening my eyes now
after losing everything
What is the use of lighting lamps in daytime?

I have become a stigma of failed love
I set fire to myself and became a laughing stock
Now what is the fun of extinguishing the fire
after everything is burnt up

The Spring season came to me with garlands in its hands
But in my egoism, I never lifted my eyes 
and never cared to look at it
Now that it is gone
What is the fun of lamenting now?
What if the dark curtains of my eyes fall down now?

What is the use of opening my eyes now
after losing everything
What is the use of lighting lamps in daytime?

తెలుగు స్వేచ్చానువాదం

అన్నీ పోగొట్టుకుని అప్పుడు కళ్ళు తెరిస్తే ఉపయోగం ఏముంది?
పగటి పూట దీపాలు వెలిగిస్తే ఉపయోగం ఏముంది?

నేనొక విఫలమైన ప్రేమయొక్క మచ్చలా మారాను
నాకు నేనే నిప్పంటించుకుని ఒక నవ్వులాటగా మారాను
అంతా కాలిపోయిన తర్వాత
ఇప్పుడు నిప్పును ఆర్పుకుని ప్రయోజనం ఏముంది?
పగటి పూట దీపాలు వెలిగించి ఉపయోగం ఏముంది?

పూలహారాలు తీసుకుని వసంతం నాకెదురొచ్చింది
కానీ నేను కళ్ళెత్తి దానివైపు ఒక్కసారి కూడా చూడలేదు
ఎంత అహంకారమో నాది?
ఆ వసంతం వెళ్ళిపోయాక ఇప్పుడు
నా కన్నులకు కప్పిన పొరలు తొలగిపోతే ఉపయోగం ఏముంది?

పగటి పూట దీపాలు వెలిగించి ఉపయోగం ఏముంది?
అన్నీ పోగొట్టుకుని అప్పుడు కళ్ళు తెరిస్తే ఉపయోగం ఏముంది?
పగటి పూట దీపాలు వెలిగిస్తే ఉపయోగం ఏముంది?
read more " Sab Kuch Lutake Hosh Me Aye Tho Kya Kiya - Talat Mehamood "

21, మార్చి 2017, మంగళవారం

Khija Ke Phool Pe - Kishore Kumar


Khija Ke Phool Pe Aatee Kabhi Bahaar Nahi

అంటూ కిషోర్ కుమార్ సుమధురంగా ఆలపించిన ఈ గీతం 1969 లో వచ్చిన 'Do Raste' అనే సినిమాలోది.ఈ గీతానికి సాహిత్యాన్ని ఆనంద్ బక్షి అందించగా సంగీతాన్ని లక్ష్మికాంత్ ప్యారేలాల్ అందించారు. ఈ పాటలో రాజేష్ ఖన్నా, ముంతాజ్ లు నటించారు.

ఇదొక నిష్ఠుర ప్రేమగీతం.

మూడో చరణంలో హీర్ - రాంజా ల పేర్లు వస్తాయి. వీళ్ళు క్రీ.శ.1400-1500 ప్రాంతాలలో లోధీ రాజుల కాలంలో పంజాబ్ లో నివసించిన అమర ప్రేమికులు. అయితే వీళ్ళు ఒకరినొకరు చేరుకోలేకపోయారు.వీరి కధ విషాదాంతం అయింది. ఇలాంటి అమరప్రేమికులు చరిత్రలో చాలామంది ఉన్నారు. రోమియో జూలియట్, మిర్జా సాహిబా, సోనీ మహీవాల్,సస్సి పన్నున్ మొదలైనవాళ్ళు. మూడో చరణంలో ఉన్న రిఫరెన్స్ ఇలాంటి విషాద ప్రేమికుల కధలకు చెందినది.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Do Raste (1969)
Lyrics:--Anand Bakshi
Music:--Lakshmikant Pyarelal
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------------
Khija ke phool pe aatee kabhi bahaar nahi
Mere naseeb me E dost tera pyar nahee-2
Khija ke phool pe aatee kabhi bahaar nahi
Mere naseeb me E dost tera pyar nahee-2

Na jane pyar me kab main - Zuba se phir jaavu
Main banke aasu khud apni - Nazar se gir jaavu
Teri kasam hai mera koyee - aitbaar nahee
Mere naseeb me E dost tera pyar nahee

Me roj lab pe nayee ek – Aah taktaa hu
Me roj ek naye gham ki – Raah taktaa hu
Kisee khushee ka mere dil ko – Intzaar nahee
Mere naseeb me E dost tera pyar nahee

Gareeb kaise mohabbat – Kare ameero se
Bichad gayee hai kayee raanjhe – Apni heeron se
Kisee ko apne muqaddar pe – Ikhtiyaar nahee
Mere naseeb me E dost tera pyar nahee

Khija ke phool pe aatee kabhi bahaar nahi
Mere naseeb me E dost tera pyar nahee

Meaning

Spring never visits the flowers of the Autumn
Similary, Oh my friend, there is no luck of your love
in my fate

I don't know when will I betray
the promises of my love
I will become tears of my own eyes
and fall down to the Earth
I swear upon you and say -'I have none to protect me'
In my fate, there is no luck of your love

I have a new sigh on my lips everyday
I wait for a new pain everyday
My heart has no longing for any joy whatsoever
In my fate, there is no luck of your love

How can the poor love the rich?
In this world, many Raanjhas were separated
from their Heeras
Alas ! here nobody has got control over his destiny

Spring never visits the flowers of the Autumn
Similarly, Oh my friend, there is no luck of your love
in my fate...

తెలుగు స్వేచ్చానువాదం

శరత్కాలపు పూలను వసంతం ఎన్నటికీ పలకరించదు
అలాగే, నా జాతకంలో నీ ప్రేమ దక్కే యోగమూ లేదు

నా ప్రేమవాగ్దానాలను ఎప్పుడు మర్చిపోతానో
నాకే తెలియదు
అప్పుడు నేనే నా కన్నీరుగా మారి, నా కన్నుల నుండి జారి
నేలలో ఇంకిపోతాను
నీ మీదొట్టు పెట్టి చెబుతున్నాను
ఈ ప్రపంచంలో నాకు అండగా ఎవ్వరూ లేరు
అలాగే, నా జాతకంలో నీ ప్రేమ దక్కే యోగమూ లేదు

ప్రతిరోజూ నేనొక కొత్త నిట్టూర్పును విడవడం
అలవాటు చేసుకుంటున్నాను
ప్రతిరోజూ ఒక కొత్త బాధను దిగమ్రింగడం
నేర్చుకుంటున్నాను
నా హృదయం ఇప్పుడు ఏ విధమైన సంతోషాన్నీ
కోరుకోవడం లేదు
అలాగే, నా జాతకంలో నీ ప్రేమ దక్కే యోగమూ లేదు

డబ్బున్న అమ్మాయిని ఒక పేదవాడు ఎలా ప్రేమించగలడు?
ఈ లోకంలో తమ హీరాలను చేరుకోలేని
రాంజాలు ఎందఱో ఉన్నారు
ఇక్కడ ఎవరికీ వారి వారి విధిపైన అదుపు లేనే లేదు

శరత్కాలపు పూలను వసంతం ఎన్నటికీ పలకరించదు
అలాగే, నా జాతకంలో నీ ప్రేమ దక్కే యోగమూ లేదు..
read more " Khija Ke Phool Pe - Kishore Kumar "

20, మార్చి 2017, సోమవారం

Yogi Adityanath horoscope analysisఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నియమితుడయ్యాడు. ఈయన జనన వివరాలు 5-6-1972; 11-50 am; Panchur; Pauri Garhwal (UP) 78E26; 29N57 గా లభ్యమౌతున్నాయి. ఈయన జాతకాన్ని విశ్లేషణ చేద్దాం.

ఈయన జాతకంలో కొన్ని విచిత్రమైన యోగాలున్నాయి. కుజ శుక్రులతో లాభస్థానంలో ఏర్పడిన ధర్మకర్మాధిపతి యోగం ఒక స్పష్టమైన రాజయోగం.అలాగే దశమంలో సూర్య బుధుల డిగ్రీ కంజంక్షన్, వీరితో శనీశ్వరుడు కలవడం కూడా రాజయోగమే. ఆరూ పన్నెండులలో ఉండటం రాహుకేతువులకు చాలా మంచి యోగకరమైన ప్లేస్ మెంట్ అని చెప్పాలి.

సప్తమంలో ద్వాదశాదిపతి  అయిన క్షీణ చంద్రుడు ఉండటం వివాహ నాశక యోగం.చంద్రుడు గురు నక్షత్రంలో ఉంటూ మతగురువు కావడం కోసం తన వివాహాన్ని ఈయన త్యాగం చేశాడని సూచిస్తున్నాడు. పంచమంలో గురువూ, చంద్రలగ్నాత్ పంచమంలో కుజశుక్రులూ ఉండటం మంచి ఆధ్యాత్మిక యోగాలు.కానీ గురువు వక్రత్వమూ, శుక్రుని వక్రత్వమూ, ఈ ఆధ్యాత్మికతకు లౌకికత కూడా తోడైందనీ, ఈయనది ప్రపంచాన్ని పట్టించుకోని ఆధ్యాత్మికత కాదనీ, లోకంతోనూ ప్రజలతోనూ బలమైన సంబంధాలు ఉండే ఆధ్యాత్మికత అనీ సూచిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో హిందువులకు ఎక్కడ ఏం కష్టం వచ్చిందని తెలిసినా అక్కడకు ఈయన తన అనుచరులతో వాలిపోతాడు.వారిని ఆదుకుంటాడు. తన గోరఖ్ నాద్ మఠంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఈ లక్షణాలే ఈయనకు విపరీతమైన ప్రజాభిమానాన్ని సంపాదించి పెట్టాయి.

నవాంశలో గురు చంద్రులు ఉచ్చస్థితిలో ఉండటం మంచి ఆధ్యాత్మికమైన యోగం. వీరిద్దరూ శనీశ్వరుని అర్గలం చేస్తున్నారు.కనుక ఈయన అంతరాంతరాలలో ప్రజాసమస్యలు తీర్చాలన్న తాపత్రయం బాగా ఉంటుంది. ఈయనలో ఆధ్యాత్మికతా ప్రజా సంబంధాలూ రెండూ కలగలసిన విచిత్రమైన యోగం ఉంటుంది. 

కారకాంశ వృషభం అవుతూ దశమంలో ఉన్న చంద్రుని నవాంశ ఉచ్చస్థితి వల్ల ప్రజాజీవితంతో పెనవేసుకుపోయి వారి అభిమానాన్ని సంపాదించిన నాయకుడిని సూచిస్తున్నది.

ఈయన గురు నక్షత్రంలో కుంభరాశిలో జన్మించాడు.కనుక ఒక గురువుగా ప్రజలకు మేలు చెయ్యాలన్న ఋణానుబంధంతో ఈయన ఈ జన్మలోకి వచ్చాడు. గణితంలో బీఎస్సీ పూర్తి చేసిన ఈయన తన 21 ఏట కుటుంబాన్ని వదిలిపెట్టి మహంత్ అవైద్యనాద్ శిష్యునిగా చేరాడు.ఆ సమయంలో 1992 ప్రాంతాలలో ఈయనకు శనిదశలో సూర్య అంతర్దశ జరిగింది. ఈయన జాతకంలో వీరిద్దరూ దశమకేంద్రంలో బలంగా ఉండటం చూడవచ్చు. అందుకే ఆ దశలో కన్నతండ్రిని వదిలి ఆధ్యాత్మిక తండ్రి అయిన గురువు దగ్గరకు చేరాడు. శనీశ్వరుడు సూర్యుని తనయుడే అన్న విషయమూ వీరిద్దరికీ ఎప్పుడూ ఎడబాటే నన్న విషయమూ జ్యోతిష్కులు గుర్తుంచుకోవాలి. అందుకే ఈ దశలో తండ్రి ఎడబాటు సంభవించింది.

1998 నుంచి ఈయన నాలుగు సార్లు వరుసగా గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీ గా ఎన్నికౌతూ వస్తున్నాడు.అంటే శనిదశ చివరిభాగం, బుధదశ మొత్తం ఈయనకు బ్రహ్మాండంగా యోగిస్తూ వస్తున్నాయి. దానికి కారణం వీరిద్దరూ దశమంలో బలంగా ఉండటమే. చంద్రలగ్నాత్ ఈ యోగం చతుర్ధ కేంద్రంలో ఉండి దశమాన్ని బలంగా చూస్తున్నది. ఇప్పుడు బుధ మహర్దశలో చివరి ఘట్టం అయిన శని అంతర్దశ జరుగుతున్నది.అందులో మళ్ళీ సూర్య విదశ జరుగుతున్నది. బుధ, శని సూర్యులు దశమంలో ఉంటూ ఈయన్ను మన దేశంలోని అతి ముఖ్యమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసారు.

ఈ ముగ్గురిలో లగ్నాధిపతిగా సూర్యుడు ఈయన్ను సూచిస్తే, తెలివైన వ్యూహవేత్తగా బుధుడు అమిత్ షానూ, ఖచ్చితమైన క్రమశిక్షణతో పనిచేసే తత్త్వం ఉన్న శనీశ్వరుడు మోడీనీ సూచిస్తున్నారు. వెరసి బుధ శనులు ఇద్దరూ కలసి సూర్యుడిని గద్దె నెక్కించారని మనం భావించాలి. అదే నిజం కూడా.

ఈయన జాతకంలో 2018 నుంచీ రాబోయే కేతుమహార్దశ ఏడు సంవత్సరాలుంటుంది. ఈ ఏడు సంవత్సరాలు నల్లేరు మీద నడక ఏమీ కాదు.మత కలహాలు సృష్టించడం ద్వారా ఈయన్ను ఇబ్బంది పెట్టాలని చూచేవాళ్ళు ఉంటారు. కనుక ఒడిదుడుకులు తప్పవు. ఈ ఒడిదుడుకులన్నీ కేతువు నుంచి శత్రుస్థానంలో ఉన్న గురువు వల్ల, అంటే, మతపరమైన విషయాల వల్ల సంభవిస్తాయి. కానీ ద్వాదశంలో ఉన్న కేతువు వల్ల వాటిని తన రహస్య ప్లానింగ్ తో ఎదుర్కొని గెలుపును సాధిస్తాడు.

ఈయన ప్రమాణ స్వీకారం 19-3-2017 నాడు 14.15 కి లక్నోలో జరిగింది.ఈ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని గమనిద్దాం.

గోచారరీత్యా శనీశ్వరుడు జననకాల చంద్రునికి లాభస్థానంలోకి వచ్చి ఉన్నాడు. శని గోచారం గురించి గత పోస్టులో నేను వ్రాసిన ఫలితాలు ఈ జాతకంలో ఖఛ్చితంగా జరగడం గమనించండి. అలాగే సూర్య బుధులు కూడా జననకాల సూర్యబుధులకు లాభస్థానంలోకి వఛ్చి ఉండటం గమనించండి.అందుకే ఇతనికి ఈ లాభం దక్కింది.

లగ్నం మృదు స్వభావ రాశి అయిన కర్కాటకం అయింది. లగ్నాధిపతి చంద్రుని పంచమ నీచస్థితి కుజుని దశమ కేంద్రస్థితివల్ల భంగమై పోయింది.కనుక కొందరి భయాలను అపోహలను పటాపంచలు గావిస్తూ అందరికోసం సుపరిపాలన సాగుతుంది. 

అయితే అంతర్లీనంగా హిందూత్వ భావన తప్పకుండా ఉండే సూచనలున్నాయి.అది మంచిది కూడా. ఎందుకంటే నిజమైన హిందూత్వం ఎవరినీ ద్వేషించదు. అందరినీ కలుపుకుని పోవాలనే అది కోరుకుంటుంది.తొమ్మిదింట శుక్రుని ఉచ్చస్థితి ఆధ్యాత్మిక రంగానికి, పరిపాలనకూ మంచిది. అయితే బుధుని నీచస్థితివల్ల ముస్లిమ్స్ తో బాగున్నప్పటికీ హిందువులతోనే కొందరు మేధావులతో అభిప్రాయభేదాలు వచ్చే సూచనలున్నాయి. మొత్తం మీద దశమాదిపతి కుజుని దశమ స్థితివల్ల పరిపాలన బాగానే ఉంటుంది.చంద్ర బుధులతో సమస్యలు కన్పిస్తున్నాయి. ముస్లిమ్స్ తో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత రామమందిరాన్ని నిర్మించే ప్రయత్నాలు జరుగుతాయి.

ఈ రాజయోగి పరిపాలన ఉత్తరప్రదేశ్ లోని అందరికీ మంచి చెయ్యాలనీ, క్షీణిస్తున్న ధర్మాన్ని తిరిగి నిలబెట్టాలనీ ఆశిద్దాం.
read more " Yogi Adityanath horoscope analysis "

17, మార్చి 2017, శుక్రవారం

విజయనగరంలో ఒక వారంమొన్నీ మధ్యన విజయనగరంలో ఒక వారం రోజులు ఉన్నాను. అప్పుడు తీసిన ఫోటోలు ఇవి.


 

విజయనగరం మొత్తం గజపతి రాజాగారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రాజాగారంటే ఆ ఊరి ప్రజలకు ఇప్పటికీ మంచి భయభక్తులు ఎక్కువ.ఊరుకూడా పాతకొత్తల మేలుకలయికలా ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న కొన్ని ముఖ్యమైన సెంటర్లలో గంట స్థంభం సెంటర్ ఒకటి. అదే ఈ ఫోటో. గంట స్థంభం మీద ఆకాశంలో చంద్రుడిని చూడవచ్చు.

ఆటోల్లో ఊరంతా తిరిగేటప్పుడు ఆటోవాడితో మాటలు కలిపాను. రాజుగారంటే వీళ్లకు ఎంత భక్తో అప్పుడు తెలిసింది. 'కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్న నేలంతా మా రాజుగారిదే. దానిని మిగతా రాజులకు దానం చేసేశారు అని అతను అంటుంటే నాకు నవ్వాగలేదు. పోనీలే అతని నమ్మకాన్ని మనమెందుకు చెడగొట్టాలి? అని మాట్లాడకుండా విన్నాను'. 

విజయనగరం మహారాజా కళాశాల చాలా పాతది.ఇది 1879 లో స్థాపించబడింది. ఇక్కడి రాజుల ఔదార్యం గొప్పది.తమ కోటలు భవనాలు అన్నిటినీ విద్యాలయాలుగా ఎప్పుడో ఇచ్ఛేశారు. ఇప్పుడు వాటిలో స్కూళ్ళు కాలేజీలు నడుస్తున్నాయి.వారు చేసిన పని చాలా దూరదృష్టితో చేశారని నా ఉద్దేశ్యం.లేకుంటే ఆ కోటలన్నీ పాడుబడిపోయి ఉండేవి. ఈ కాలేజీలో చాలామంది పెద్దవాళ్ళు చదివారు. హెరిటేజ్ లుక్ తో అప్పటినుంచీ అలాగే మేనేజ్ చెయ్యబడుతూ వస్తున్నది.మనకు హెరిటేజ్ కట్టడాలంటే బాగా ఇష్టం గనుక దానిదగ్గర ఒక ఫోటో తీసుకోవడం జరిగింది.

గురజాడ అప్పారావు గారి ఇల్లు మంచి సెంటర్లో కోట దగ్గరగానే ఉంటుంది. దీనిని ఇప్పుడు గ్రంధాలయంగా మార్చారు. దీని దగ్గరలోనే కన్యాశుల్కం కధ అంతా జరిగిన సానివీధి ఉందని రత్న చెప్పింది. ఆ వీధి పేరు అలాగే ఉంటె బాగుండదని ఈ మధ్యనే దానిని శివాలయం వీధిగా మార్చారట. రోడ్ వైడెనింగ్ లో కూడా ఈ ఇంటిని కూల్చకుండా అలాగే ఉంచడం మునిసిపాలిటీ వారి ఔదార్యాన్ని చాటుతున్నది.ఈ ఇల్లు పాతకాలంలో లాగే ఉండి చిన్నప్పటి పల్లెటూళ్ళ స్మృతులను గుర్తుకు తెచ్చింది.మా అమ్మాయి స్కూటర్ మీద రాత్రిపూట  విజయనగరంలో విహారం. ఊరు పెద్దదేమీ కాదు. ఒక రెండు గంటల్లో ఊరంతా తిరిగేయ్యచ్చు.కాసేపట్లో ఊరంతా అర్ధమై పోయింది. మేమున్న ఏరియా పేరు పూల్ బాగ్. పాతకాలంలో ఇది రాజుగారి ప్రియురాళ్లు ఉండే పూలతోట ఏరియా అట. ఈ ఫోటోలో కనిపిస్తున్నది మూడులాంతర్ల సెంటర్. మా వెనుకగా పైడితల్లి ఆలయాన్ని చూడవచ్చు..


మేమున్న ఇంటి దగ్గరలోనే కుమారస్వామి ఆలయం ఉన్నది. అందులో ఉన్న పెద్ద విగ్రహం రాత్రిపూట ఇలా దర్శనమిస్తుంది.దీనిని మలేషియా కుమారస్వామి విగ్రహం మోడల్లో కట్టారు. మేము అక్కడ ఉన్న వారంలో రెండ్రోజులు మధ్యాన్నం నుంచి మబ్బులు పట్టి కుంభవృష్టి కురిసింది. అప్పుడు మేఘావృతమై ఉన్న ఆకాశం ఈ ఫోటోలో దర్శనమిస్తుంది. దూరంగా కనిపించేది రాజుగారి ఒకానొక కోట ఉన్న కొండ. రాజుగారి కుటుంబంలో ఎవరికో ఒకాయనకు కుష్టువ్యాధి వస్తే ఆయనకోసం దూరంగా కొండమీద ఒక కోట కట్టించి అందులో ఆయన్ను ఉంచారట. ఆ కొండే దూరంగా కనిపిస్తున్నది.దాని పక్కన రామతీర్ధం కొండా కనిపిస్తూ ఉంటుంది. 


రాత్రిపూట డాబామీద కూచుని పాలకోవా, బజ్జీలూ లాగిస్తూ వింటుంటే ఎక్కడో పెళ్లి ఆర్కెస్ట్రా పాటలు వినిపించాయి. మనవైపు అయితే అన్నీ లేటెస్ట్ సినిమా పాటలే వినిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం పాత సినిమాలలోని - 'కోటలోని మొనగాడా వేటకు వచ్చావా? ' , ' నెలవంక తొంగిచూచింది చలిగాలి మేను సోకింది' అనే పాటలు పాడుతున్నారు.వినసొంపుగా అనిపించింది.నేనూ వెళ్లి నాలుగు పాటలు పాడదామని అనుకున్నా గాని మనం అడుగు పెట్టి వాళ్ళ బిజినెస్ చెడగొట్టడం ఎందుకులే అని జాలేసి వదిలేశాను.
బయలుదేరే రోజున రైల్వే స్టేషన్లో సెండాఫ్.నాకోసం ఇంటినుంచి ఫ్లాస్క్ లో టీ తెచ్చింది రత్న.పాపం ఎంత శ్రద్ధగా తయారు చేసిందో? క్రిందటిరోజే మా అమ్మాయికి 'ఈరోజు నుంచీ టీ మానేస్తున్నాను' అని మాటిచ్చినప్పటికీ, రత్న ఎంత శ్రద్ధగా చేసుకుని తెచ్చిందో అన్న ఒక్క ఆలోచన వచ్చేసరికి ఆ ప్రామిస్ ని పక్కన పెట్టి చక్కగా 'టీ' లాగించేశాను. అదే నేను త్రాగిన ఆఖరు 'టీ'. గుర్రుగా చూచిన మా అమ్మాయికి ఇలా చెప్పాను. 'రూల్స్ ని పాటించడమే కాదు వాటిని ఎక్కడ రిలాక్స్ చెయ్యాలో కూడా మనకు తెలిసి ఉండాలి.నియమాలు పాటించడంలో మూర్ఖత్వం పనికిరాదు.మన నియమాల కోసం ఇతరులను బాధపెట్టకూడదు.'దారిలో విశాఖపట్నం స్టేషన్లో వెంకటరాజుగారు కలిశారు. నేను జూలైలో అమెరికానుంచి తిరిగి వఛ్చిన తర్వాత విజయనగరంలో ఒక వారం ఉండి అక్కడ ఒక స్పిరిట్యువల్ రిట్రీట్ పెడదామని నిశ్చయించాం. అదే సమయంలో శ్రీకూర్మం, అరసవిల్లి, రామతీర్ధం, భీమిలీ మొదలైన ప్రదేశాలు చూడాలని నిర్ణయించుకుని గుడ్ బై చెప్పుకున్నాం.


తిరుగు ప్రయాణంలో పై బెర్తెక్కి అది నిద్రా? ధ్యానమా? లేక పరధ్యానమా? అదిమాత్రం అడక్కండి.
read more " విజయనగరంలో ఒక వారం "

15, మార్చి 2017, బుధవారం

నాళీ వేష్టిత జననం - కొన్ని నివ్వెరపరచే వాస్తవాలు

Cord around the neck of fetus
జ్యోతిష్యశాస్త్రంలో నాళీవేష్టిత జననాన్ని ఒక చెడు శకునంగా భావిస్తారు. నాళీవేష్టిత జననం అంటే బొడ్డుత్రాడును తన మెడ చుట్టూ వేసుకుని శిశువు పుట్టడం. కొంతమంది శిశువులలో ఇది ఉరిత్రాడులా మెడకు బిగుసుకుని శిశువు నీలంగా మారడం కూడా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిని మరీ చెడు శకునంగా భావిస్తారు.కొన్నిసార్లు బొడ్డుత్రాడును జంద్యంలాగా వేసుకుని మరీ శిశువు పుట్టడం జరుగుతుంది. ఇది కూడా దోషమేనని భావిస్తారు.

Cord as a thread around the body
సామాన్యంగా ఇలాంటి శిశువు పుట్టడం తండ్రికి మేనమామకు దోషంగా భావిస్తారు. దానికి దోష పరిహారాలు కూడా మన గ్రంధాలలో చెప్పబడ్డాయి. ఇవిగాక కొన్ని కొన్ని  కులాలలో కొన్ని రకాలైన వింత ఆచారాలు కూడా ఆచరణలో ఉన్నాయి. నవీనులు వీటిని మూఢనమ్మకాలుగా భావిస్తున్నప్పటికీ, వీటి వెనుక మనకు తెలియని ఎంతో విజ్ఞానం దాగి ఉన్నదన్నమాట చాలా నిజం.

ప్రపంచంలో ఏదీ కాకతాళీయం కాదు.ప్రకృతిలోని ప్రతి సంఘటనకూ, కనీసం ఒక పిట్ట అరిచినా సరే, దానికీ ఒక అర్ధం ఉంటుంది.ఈ అవగాహన నుంచీ పరిశీలన నుంచీ పుట్టినదే శకున శాస్త్రం. శకునాలు చాలామంది నమ్మరు కానీ అవి నిజాలే. వాటిని సరిగ్గా అర్ధం చేసుకుని తద్వారా మనం ప్రవర్తించడం నేర్చుకుంటే ఎన్నో ప్రమాదాల నుంచి మనం తప్పుకోవచ్ఛు.

మనం మూఢ నమ్మకాలని భావించేవి నిజానికి ఎంతో పరిశీలన నుంచి పుట్టిన వాస్తవాలు.వాటిని అంత తేలికగా కొట్టి పారవెయ్యడానికి వీలులేదు.ప్రకృతిలో ఏదీ వేస్ట్ కాదు. మనకు అర్ధంకాని ప్రతిదానినీ మూఢనమ్మకం అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం.

జ్యోతిషశాస్త్ర ప్రకారం ఇలాంటి జననం కలిగిన శిశువుల జాతకాలలో రాహుకేతువుల దోషాలు తప్పకుండా ఉంటాయి. సామాన్యంగా వారి వంశాలలో నాగదోషాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక సర్పం శిశువు మెడ చుట్టూ చుట్టుకుని బిగించి ఊపిరి ఆడకుండా చేసినట్లుగా ఇది ఉంటుంది. ఇదే నాగదోష ప్రభావానికి సూచన.

సూక్ష్మంగా గమనిస్తే ఇలాంటి శిశువులు పెరిగి పెద్దయే కొద్దీ వారికి వచ్ఛే రోగాలకూ, ఈ నాళీవేష్టిత జననానికి సంబంధాలు చక్కగా కనిపిస్తాయి. మోడరన్ మెడిసిన్ కూడా ఈ లింకులను ఇప్పుడు ఒప్పుకుంటున్నది.

శిశువు మెడచుట్టూ బొడ్డుత్రాడు గట్టిగా బిగుసుకున్నప్పుడు అమ్మ పొట్టలోని ఆ శిశువుకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పటికి శ్వాస క్రియ లేకున్నప్పటికీ ఆ శిశువుకు ఊపిరాడనట్లు ఫీలింగ్ ఉంటుంది. అదొక ట్రామా కండిషన్ వంటిది. గర్భంలో ఉన్నప్పుడు గాని, లేదా డెలివరీ టైం లో గాని ఇలాంటి ట్రామా కండిషన్ ఎదుర్కొన్న శిశువులు సామాన్యంగా పెరిగి పెద్దయ్యాక ఆస్త్మా పేషంట్స్ గా, బీపీ పేషంట్స్ గా, హార్ట్ పేషంట్స్ గా మారతారు.ఏదైనా విపత్కర పరిస్థితి వారి జీవితంలో ఎదురైనప్పుడు వారికి ఊపిరి అందదు. ఛాతీని చేత్తో పట్టుకుని కూచుండి పోతారు.లేదా ఎగశ్వాస పెడతారు. మెట్లెక్కేటప్పుడు కూడా ఇలాంటి వారికి ఆయాసం వస్తుంది.ఇది ఒకరకమైన హార్ట్ కండిషనే. దీనికంతా కారణం పుట్టుక సమయంలో వారికి కలిగిన ఊపిరాడని పరిస్థితే. ఆ జ్ఞాపకం వారి అంతచ్ఛేతనలో నిక్షిప్తమై పోయి ఇలాంటి పరిస్థితులను వారి భవిష్యత్ జీవితంలో కల్పిస్తుంది. ఏదైనా క్రైసిస్ వారి జీవితంలో వఛ్చినపుడు నేటల్ ట్రామా మెమరీ మళ్ళీ ట్రిగ్గర్ చెయ్యబడుతుంది. ఇదంతా "బొడ్డుత్రాటి ఉరి" ప్రభావమే.ఇదంతా నిజమేనని ఇప్పుడు మోడరన్ మెడిసిన్ కూడా ఒప్పుకుంటున్నది.ఇటువంటి రోగాలు రావడానికి కూడా జాతకంలోని నాగదోష ప్రభావమే కారణం.

మీకెవరికీ తెలియని ఒక రహస్యాన్ని ఇప్పుడు తేటతెల్లం చేస్తున్నాను. ఇది యోగదృష్టి ఉన్నవారికి మాత్రమే అర్ధమయ్యే నిజం.

పుట్టుక సమయంలో బొడ్డుత్రాడు మెడచుట్టూ చుట్టుకొని నీలంగా మారి పుట్టిన పిల్లలు, గత జన్మలో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నవారై ఉంటారు. ఇది వారి జాతకంలో స్పష్టంగా దర్శనమిస్తుంది.జాతకచక్రాన్ని సరిగ్గా డీకోడ్ చెయ్యడం చేతనైతే ఈ విషయాన్ని ఆయా జాతకాలలో స్పష్టంగా చూడవచ్చు.చనిపోయేటప్పుడు ఉన్న పరిస్థితే మళ్ళీ తిరిగి పుట్టే సమయంలో కూడా ఉంటుందనేది మన భగవద్గీతతో సహా ఎన్నో మార్మిక విజ్ఞానగ్రంధాలు చెబుతున్న వాస్తవం. అందుకనే, చనిపోయే సమయంలో ఉరితో ఊపిరాడక చనిపోయినవారు ఈ జన్మలో ఈ విధంగా బొడ్డుత్రాడు మెడచుట్టూ బిగింపబడి ఊపిరాడని పరిస్థితిలో పుడతారు. 

జీవియొక్క జన్మ పరంపరలలో ఏ అనుభవమూ ఎక్కడా మిస్ అవదు.గతజన్మ అనుభవాలే ఈ జన్మలో మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఎక్కడా బ్రేక్ అనేది రాదు.ఇవన్నీ సూక్ష్మమైన మార్మిక కర్మరహస్యాలు.

మీరు దిమ్మెరపోయే ఇంకొక రహస్యాన్ని ఇప్పుడు మీకు చెబుతాను.


Surukuku Snake found in South America
ఇలా జన్మించి నీలంగా మారిన శిశువులకు హోమియోపతిలో ఒక అద్భుతమైన మందు ఉన్నది. దానిని అతి కొద్దీ మోతాదులో వాడితే వెంటనే ఆ నీలం రంగు పోయి శిశువుకు ఊపిరంది దానికి పునర్జన్మ వస్తుంది. దానిపేరు 'లేకసిస్'. అసలైన విచిత్రం ఏమంటే, ఈ మందును బ్రెజిల్ లోని అత్యంత ప్రమాదకరమైన 'సురుకుకు' అనే పాము విషం నుంచి తయారు చేస్తారు.

నాగదోషంతో పుట్టిన పిల్లల జీవన్మరణ సమస్యకు సర్పవిషంతో తయారైన ఔషధమే జీవితాన్ని ప్రసాదించడం విచిత్రంగా లేదూ? ఇదే జ్యోతిష్యశాస్త్రానికి హోమియోపతికీ ఉన్న రహస్యమైన లింక్. ఈ రెండు శాస్త్రాలలో ఇలాంటి కర్మ రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. మచ్ఛుకు ఒకటి మాత్రం మీకు పరిచయం చేశాను.

నాళీవేష్టిత జననం అనేది ఖఛ్చితంగా నాగదోషమే అందులో ఏమీ అనుమానం లేదు.తెలివిలేనివారు నమ్మకపోవచ్చుగాక. కానీ ఇది వాస్తవమే. ఇలాంటి పిల్లల జీవితాలు పరిశీలిస్తే,ముందు ముందు వారికి ఎదురయ్యే సమస్యలు గాని, వారికి వచ్ఛే రోగాలు గాని, దీనికి అనుగుణంగానే ఉంటాయి. ఇది నూటికి నూరు శాతం నిజం. సరిగ్గా గమనించడం చేతనైతే,  ఈ దోషాన్ని వీరి జీవితాలలో అనేక సందర్భాలలో మనం చూడవచ్చు. 

నాగదోషం అనేది నిజమే. ఇది మనిషిని ఎన్నో రకాలుగా వెంటాడుతుంది.నాస్తికులు హేతువాదులు నమ్మినా నమ్మకపోయినా ఇందులో నిజం ఉన్నది.మన దేశంలో మూలమూలలా ఉన్న నాగారాధన ఊరకే పనీపాటా లేనివాళ్ల సృష్టి కాదు. ఎన్నో వేల సంవత్సరాల పరిశీలనా పరిశోధనా దీనివెనుక ఉన్నాయన్నది వాస్తవం.

ఇలా వ్రాసినంత మాత్రం చేత నేను కుహనా జ్యోతిష్కుల మోసాలనూ, పల్లెల్లో నాగదోషం పేరు చెప్పి మోసగాళ్లు చేసే మోసాలనూ సమర్ధిస్తున్నానని అనుకోకండి. అలాంటి వేషాలను నేనస్సలు సమర్ధించను. అంతమాత్రం చేత నాగదోషం మూఢనమ్మకమంటే కూడా నేను ఒప్పుకోను. ఇది మూఢనమ్మకం కాదు.సూక్ష్మ పరిశీలనలో మాత్రమే అందే నిజం.

Disclaimer:-- ఈ పోస్ట్ చదివి, అప్పుడే పుట్టిన పిల్లలకు 'లేకసిస్' మందును పొరపాటున కూడా వెయ్యకండి. దీనిని అనుభవం ఉన్న వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఒకవేళ ఎవరైనా ఆ సాహసానికి ఒడిగడితే అప్పుడు జరిగే దుష్పరిణామాలకు నాకు బాధ్యత లేదని గమనించండి.

హోమియోపతి అనేది ఒక విశిష్ట వైద్య విధానం.ఇందులో ఈ రోగానికి ఈ మందు అని స్పెసిఫిక్స్ ఉండవు.రోగం ఒకటే అయినా మనిషిని బట్టి మందు మారిపోతుంది.కనుక ఈ కండిషన్ కు లేకసిస్ ఒక్కటే మందు అని భ్రమించకండి. 
read more " నాళీ వేష్టిత జననం - కొన్ని నివ్వెరపరచే వాస్తవాలు "

14, మార్చి 2017, మంగళవారం

Koi Gaata Mai So Jaata - Jesudas


Koi Gaata Mai So Jaata

అంటూ జేసుదాస్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1977 లో వచ్చిన Aalaap అనే సినిమాలోనిది.ఇది ఒక మృదు మధుర సాంద్ర గంభీర గీతం. దీనికి లిరిక్స్ ఇచ్చినది హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్. ఈయన అమితాబ్ బచ్చన్ తండ్రిగారు.1930 ప్రాంతాలలోనే ఈయన లబ్దప్రతిష్టుడైన హిందీ కవి. ఉమర్ ఖయ్యామ్ రుబాయత్ పోలికలతో అప్పట్లోనే ఈయన వ్రాసిన 'మధుశాల' అనే కావ్యం అజరామరమైనది.దీనిని మన్నాడే తన మధుర స్వరంతో ఆలపించారు.మధురమైన భావలహరితో కూడిన మనోజ్ఞమైన గానాన్ని వినాలనుకునే భావుకులు మన్నాడే పాడిన 'మధుశాల' ను వినాల్సిందే.

అదలా ఉంచితే, ఈ గీతానికి సంగీతం అందించినది ప్రఖ్యాత సంగీత దర్శకుడు జయదేవ్. ఈ రెంటికి తోడు జేసుదాస్ మధుర గాత్రం తోడైంది. ఇక ఈ పాట ఎంత మధురంగా రూపుదిద్దుకుందో వేరే చెప్పక్కర్లేదుగా? 

ఈ పాటలో అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్ నటించారు.

నా స్వరంలో కూడా ఈ మధుర గీతాన్ని వినండి మరి.

Movie:--Aalaap (1977)
Lyrics:--Harivansh Roy Bachchan
Music:--Jayadev
Singer:-- Jesudas
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------
Koi gaata mai so jata -2
Koi gaata

Sansriti ke vistrit saagar par
Sapno ki nouka ke andar
Such dukh ki leharon par uth gir
Behata jata mai so jata
Koi gaata mai so jata koi gaata

Akhon me bhar kar pyar amar
Aashish hatheli me bhar kar
Koi mera sar godi me rakh
sahalaata mai so jata
Koi gaata mai so jata koi gaata

Mere jeevan ka karajal
mere jeevan ka haalahal
Koi apne swar me madhumay kar
Barsata mai so jata
Koi gata mai so jata-2
Koi gata mai so jata…

Meaning

Let some one sing for me now
I will sleep

On the vast sea of this world
In the ship of past memories
Swinging on the waves of 
happiness and sorrow
I float and fall into sleep
Let someone sing for me now

Filling my eyes with eternal love
Keeping blessings of elders in my palms
Placing my head in someone's lap
I will doze into sleep
Let someone sing for me now

The nectar and the poison of my life
Let someone rain out 
from his melodious voice
I will sleep now

Let someone sing for me
I will sleep now

తెలుగు స్వేచ్ఛానువాదం

ఎవరో ఒకరు నాకోసం ఒక పాటను పాడండి
నేనిక నిద్రిస్తాను

ఈ ప్రపంచమనే విశాల సముద్రం పైన
స్వప్నాల నౌక లోలోపల
సుఖదుఃఖాలనే అలలపై తేలుతూ
నేనిక నిద్రిస్తాను
ఎవరైనా నాకోసం ఒక పాటను పాడండి

నా కన్నులలో అమరప్రేమను నింపుకుని
నా చేతులలో ఆశీస్సులను దాచుకుని
ఎవరో ఒకరి ఒడిలో నా తలను దాచుకుని
నేనిక నిద్రిస్తాను
ఎవరైనా నాకోసం ఒక పాటను పాడండి

నా జీవితపు అమృతాన్నీ హాలాహలాన్నీ
తన మధుర గాత్రంలో నింపుకుని
ఎవరో ఒకరు ఏదో రోజున తప్పక గానం చేస్తారు
ప్రస్తుతానికి నేనిక నిద్రిస్తాను
ఎవరైనా నాకోసం ఒక పాటను పాడండి... 
read more " Koi Gaata Mai So Jaata - Jesudas "