Human ignorance is incurable

27, డిసెంబర్ 2016, మంగళవారం

స్వామియే శరణమయ్యప్ప

(పక్కవాళ్ళని ఇబ్బంది పట్టకుండా, మౌనంగా తమ పూజ తాము చేసుకుంటూ, నిత్యజీవితంలో నిర్మలంగా ఉంటూ దీక్షలు చేసేవారిని ఉద్దేశించి ఈ పోస్ట్ వ్రాయబడలేదు. పటాటోపం కోసం, దీక్షలు అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడం కోసం, నలుగురిలో మెప్పుకోసం, పెద్ద మతాచారపరులలాగా పోజులు కొడుతూ,పెద్దగా మైకులు పెట్టి పక్కవాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ, నాటకాలాడే దొంగ దీక్షాపరులకే ఈ పోస్ట్ అంకితం)

తేే|| కొండ దేవత బట్టుక గుడులు గట్టి
దిక్కు మాలిన దీక్షల దిగుమతించి
నల్ల గుడ్డల మోసపు నాటకముల
బ్రదుకు తెరువుకు దీసిరి బల్లకట్టు


కం|| నలువది రోజుల దీక్షని
వలువలు నల్లనివి గట్టి వేషము వేయున్
మల దిగియున్ దిగక మునుపె
సలసలమను మందు బుడ్డి చక్కగ ఎత్తున్

ఆ|| మాల కొక్క రేటు మడిగుడ్డకో రేటు
తిండి కొక్క రేటు తస్స దియ్య
వ్యాను కొక్క రేటు; వెన్నంటి వచ్చేటి
గుడ్డి గురువు కొక్క గెస్టు రేటు

కం|| ఒంటిన్ హింసల బెట్టగ
కంటకములు దీరునంట కలయా నిజమా?
మంటల గాలక యున్నన్
ఒంటికి కర్మలు దొలగునె? ఓ యని అరవన్

శరీరాన్ని హింస పెట్టుకున్నంత మాత్రాన చేసిన పాపాలు ఎక్కడికీ పోవు. పుట్టమీద కొడితే పుట్టలోని పాము చస్తుందా? చావదని యోగి వేమన ఎప్పుడో చెప్పాడు.మన హిందూమతంలో కూడా ఇదే మాటను ఎంతోమంది గతంలో చెప్పారు.వినేవారేరి? అర్ధం చేసుకునేవారేరి?

ఆ|| శరణు శరణ మంచు అరవంగ నేమౌను
శరణు మనసులోన సాగవలయు
నోట యరచి నంత నీతిబద్ధత గల్గ
కాకులన్ని గావె కావ్యవిదులు ?

ఊరకే నోటితో శరణు శరణు అని అరిచినంత మాత్రాన ఏమీ జరగదు. ఆ 'శరణాగతి' అనేది మనసుకి పట్టాలి. నిత్యజీవితంలో ప్రతిక్షణం అది ప్రతిఫలించాలి.అప్పుడు నోటితో అరవాల్సిన పనీలేదు.లోకానికి ఫోజు కొట్టాల్సిన పనీ లేదు.ఊరకే అరచినంత మాత్రాన పవిత్రత వచ్చే పనైతే 'కావుకావు' మంటూ అరిచే కాకులన్నీ ఎప్పుడో దేవతలై కూచుని ఉండేవి.

ఆ|| తెలుగు నేలయందు దేవుళ్ళు కరవైరి
చేర దేవుడొచ్చె చెంగుమనుచు
గురువు స్వాములంచు గుదిబండ లందందు
పుట్టుకొచ్చిరంత పుట్ట బగుల

ఆ|| పనియు పాట లేని పారసైటులు జేరి
నల్ల దీక్షలనుచు నేల ఈని
శరణు ఘోష యంచు చిందులే వేయంగ
కంపరంబు గల్గె కాంచినంత

ఆ|| పిచ్చి పిచ్చి రూల్సు పుచ్చిపోయిన రూల్సు
అర్ధరాత్రి మీల్సు అరవ డాన్సు
భజన లంచు జేరి 'భౌ'వంచు బాడంగ
రోడ్డు కుక్కలరచె  రోదనముగ

కం|| కుయ్యూ మొర్రో కేకల
కయ్యో యని లేచి పారె ఆ అయ్యప్పే
అయ్యా ఆపుడు భజనల
సయ్యాటల డాన్సులొద్దు చంపకుడంచున్

పటాటోపం లేకుండా కేరళలో మౌనంగా చేసుకునే ఈ దీక్షను ఆంధ్రాకు తెచ్చి పెద్ద రొచ్చు రొచ్చు చేసి,చూసేవాళ్ళకు ఈ దీక్షలంటేనే అసహ్యం పుట్టేలా భ్రష్టు పట్టించి 'మాస్ దీక్షలుగా' మార్చి పారేశారు తెలుగువాళ్ళు. ఆంధ్రాలో ఈ గోల చూసి అసలా అయ్యప్పే కొండదిగి పారిపోయాడేమో అని నా అనుమానం.

కం|| గడ్డము జేయరు సరిగా
అడ్డముగా పొట్ట బెంచి అరచుట యేలో?
నడ్డులు వంచరు పనిలో
హెడ్డులు ఎత్తుక దిరుగుచు హెచ్చులు బోదుర్

కం|| పనిలేని దీక్ష బట్టుక
మనజోలికి రాడు వీడు మంచిదె యనుచున్
వనితల్ డాన్సులు జేసిరి
పని ముగిసిన వెనుక వారి పని ఏమౌనో?

ఆ|| ఇంటిఖర్మ వదలె ఇక రెండు నెలలంచు
పీడ బోయెనంచు భార్య యనియె
రెండు నెలల మీద రెట్టింపు హింసంట
దాని దల్చుకోవె డామియాన

ఆ|| నల్ల గుడ్డవాడు నట్టేటిలో ముంచు
ఎర్ర గుడ్డవాడు బొర్ర బెంచు
పసుపు గుడ్డ వాడు పడద్రోయ జూచురా
తెల్లగుడ్డ వాడు వెల్ల వేయు

ఆ|| రంగుగుడ్డ కన్న భంగుబీల్చుట మేలు
పార్టు దీక్ష కన్న పడక మేలు
బొట్లు బెట్టినంత బ్రహ్మంబు నెరుగునా
పార్టులందు లేదు పరమదీక్ష

కం|| డ్రస్సుల రంగులు మారిన
కస్సుల బుస్సుల గరచెడి కాకలు దిగునా?
మిస్సవ నేలన్ సుఖముల్?
ఎస్సను విద్యన్ దెలియక ఎందుకు దీక్షల్?  

ఆ|| పార్టు టైము దీక్ష పగలంత పతిదీక్ష
రాత్రియైన యంత రిథము మారు
పాడు దీక్షలేల పతిత జీవనమేల?
ఫుల్లు టైము దీక్ష పుణ్యమిచ్చు

ఆ|| ఒక్క పూట దినుచు బక్క చిక్కుచుబోవ
ఏమి దక్కు నీకు? వెర్రి వాడ
బిచ్చ గాడు జూడ బ్రహ్మవేత్తాయెనా?
మాయ పనులు మాని మింగు బాగ

కం|| మండల దీక్షలు జేయుచు
మెండుగ మిగతా దినముల మెక్కిన దగునా?
కండువ వేసిన యంతనె
కొండొక యౌన్నత్య మెట్లు గుదురును గురుడా?

ఆ|| యియరు మొత్తమంత ఇష్టానుసారంబు
కొన్నినాళ్ళ దీక్ష కోతి దీక్ష
చెప్పులేయకున్న చిత్తంబు గుదురన్న
కోయలెల్ల శ్రేష్ఠగురులు గారె?

కం|| గురుస్వాముల నిజజీవిత
చిరునామా దెలిసినంత చీదర బుట్టున్
పర ధనమున్ పరదారను
పరపర మని మింగువీరు గురులెట్లైరో?

ఆ|| ఉదయ మందు లేచి వాకింగు కేబోవ
నల్ల డ్రస్సు వాడు కళ్ళ ముందు
కాన వచ్చినంత ఖర్మలే మొదలౌను
నల్లడ్రస్సు కన్న పిల్లి మేలు

ఆ||నల్ల పిల్లి యొకటి నల్లడ్రస్సొక్కటి
ఎదురు వచ్చినంత ఎంచి ఎంచి
పిల్లి వైపు జూడు నల్లవానిన్ వీడు
నల్లడ్రస్సు కన్న పిల్లి మేలు

ఆ|| సివికు సెన్సు లేక చీదరల్ బుట్టించు
పిచ్చి కేకలేసి పెనుగు లాడి
వెర్రి డాన్సు జేయ విజ్ఞాన మొదవునా?
ఎంత పతనమాయె వేదభూమి?

ఆ|| బ్లాకు క్యాటు యొకటి పొద్దు పొద్దున లేచి
బయటి కేగ మరొక బ్లాకు క్యాటు
మనిషి లాగ వచ్చె; మన క్యాటు జచ్చెరా
క్యాటు మేలు బ్లాకు క్యాటు కన్న
  
కం|| నమ్మకుమీ నల్ల దొరల
నమ్మకుమీ దీక్షలిచ్చు నాటక గురులన్
నమ్మకు నలభై రోజుల
దిమ్మరి సోమరి తనముల దీక్షల నెపుడున్

ఆ|| నీతి లేని బ్రతుకు నిండారగా బ్రతికి
నల్ల డ్రస్సు వేయ నాణ్యమౌనె?
పతిత యొకటి పెద్ద పట్టుచీరన్ గట్ట
సాధ్వి యౌనె? తృష్ణ జావకున్న? 

ఆ|| హిందు మతము జూడ హీనస్థితికి జారె
పిచ్చి దీక్షలెల్ల పెరిగి పోయె
అసలు ధర్మ మెల్ల అప్పుడే అణగారె
వెర్రి పప్పలైరి ఉర్వి జనులు

ఆ|| పాత దేవుడన్న పాడైన దొరగారు
పాత భార్య యన్న పాడు గంప
కొత్త దేవుడన్న కోతికొమ్మచ్చిరా
కొత్త భార్య యన్న కొబ్బరాకు

పాత దేవుళ్ళు పనికిరాని దేవుళ్ళు.కొత్త దేవుడంటే మోజెక్కువ. పాతభార్య పాడు పిశాచంలా కనిపిస్తుంది.కొత్త భార్యేమో కొబ్బరి ముక్కలా ఉంటుంది. కొత్తొక వింత పాతొక రోత కదా !!

ఆ|| కొత్త పాతలేల కోణంగి పనులేల?
ఒక్కడైన విభుని వదలుటేల?
తాత తండ్రులెల్ల దద్దమ్మ లౌదురా?
వారి దైవమెట్లు వెడలి పోయె?

కొత్త కొత్త దేవుళ్ళ కోసం పాత దేవుళ్ళను పారవెయ్యడం మంచిదేనా? అసలు దేవుళ్ళు ఇంతమంది ఉన్నారా? దేవుడు ఒకడే అని వేదం చెప్పడం లేదా?అలాంటప్పుడు రోజుకొక్క దేవుడిని మార్చడం అవసరమా? మనకు తెలిసినమాత్రం మన తాతతండ్రులకు తెలియదా? వారు పూజించిన దేవుళ్ళను మనం వదలి కొత్తవాళ్ళ వెంట పరుగెత్తాలా?

తే|| తెలుగు వారల దేవులు తరలి పోవ
ఇతర రాష్ట్రపు దేవులు ఇళ్ళ లోకి
వచ్చి చేరిరి ఎంతయు వింతగాను
ఎంత మూర్ఖము? జూడగ నెంత వెర్రి?

మన దేశంలోని అన్ని రాష్ట్రాలలోకీ - తెలుగురాష్ట్రాలకు - అందులోనూ ముఖ్యంగా ఆంధ్రాకి ఉన్నంత దరిద్రం ఇంకే రాష్ట్రానికీ లేదు.అన్ని దేశాల అన్ని రాష్ట్రాల దేవుళ్ళనూ మనం తలుపులు తీసి బార్లా ఆహ్వానిస్తాం.మన ఇళ్ళలో ఎప్పటినుంచో ఉన్నవారిని మాత్రం బజార్లో పారేస్తాం.ఇదే తెలుగువాడికున్న వెర్రి. ఒక్క తెలుగువాడు తప్ప ఇంకే రాష్ట్రం వాడూ ఇలా చెయ్యడు.

ఆ|| ఇంటి దైవమింక ఇంకొల్లు పాలాయె
ఇతర దైవమేమొ ఇంటికొచ్చె
అచ్చ తెనుగు మరచి అరవమ్ములో పాడ
మల్లయాళ మింక మోగిపోయె

మనకు భాష లేనట్లు అరవంలోనూ మలయాళం లోనూ భజనలు చేస్తూ మన తెలుగును మనమే చంపుకుంటున్నాం. ఎంత దరిద్రమో మనది?

ఆ|| భాష లేదు మనకు భావశుద్ధియు లేదు
దైవమేది లేదు దిక్కు లేదు
సినిమ దీసినంత సిగ్గులేకుండగా
తెలివిలేక బారు తెలుగుజాతి

మనకు భాషాభిమానం లేదు. భావశుద్ధి లేదు. మనకు దేవుళ్ళూ లేరు. ఎవరు ఏ సినిమా తీస్తే వాడే మన దేవుడు.నేను తమాషాకి చెప్పడం లేదు. స్టాటిస్టిక్స్ తో సహా నిరూపిస్తా...

1960 లో 'శ్రీ వెంకటేశ్వర మహాత్యం' అన్న సినిమా వచ్చాకనే తిరుపతికి జనం పోలో మంటూ పరిగెత్తడం మొదలైంది. అంతకుముందు తిరుపతికి ఇంత ఆదాయం లేదు.ఈ విషయం టీటీడీ రికార్డులే నిరూపిస్తున్నాయ్.ఈ సినిమాలో ఘంటసాల పాడిన పాటలు జనాన్ని ఐదుదశాబ్దాలుగా మెస్మరైజ్ చేసి పారేశాయి.జనాన్ని తిరుపతి కొండకు పరిగెత్తించాయ్.

తెలుగువారి ఈ వెర్రి చూచి, 1977 లో అనుకుంటా "స్వామి అయ్యప్ప మహాత్యం" అని ఒక సినిమా వచ్చింది.అందులో జేసుదాస్ పాడిన మంచి పాటలున్నాయి.అవి ఇప్పటికీ ఆపాత మధురాలే.ముఖ్యంగా 'శబరిమలను స్వర్ణచంద్రోదయం' అనే పాట చాలా బాగుంటుంది.ఇక అక్కడ నుంచి మనకు వెర్రి మొదలైంది.ఆంధ్రావాళ్ళు దీక్షలంటూ తండోపతండాలుగా శబరిమల పోవడం అప్పుడే మొదలైంది.తిరుపతికి వచ్చే ఆదాయం 'ట్రావెన్కోర్ దేవస్వోం బోర్డ్' కి మళ్లడంకూడా అప్పుడే మొదలైంది.

తిరుపతికి వస్తున్న ఆదాయం చూసి కేరళ ప్రభుత్వమే ఈ సినిమా తీయించి ఆంధ్రాలోకి వదిలిందని ఒక పుకారు కూడా ఉంది.అది పుకారో నిజమో తెలియదు గాని ఆ సినిమా తీసిన వారి ఉద్దేశ్యం మాత్రం బ్రహ్మాండంగా నెరవేరింది. అప్పటిదాకా శుభ్రంగా ఉన్న పంపానదీ తీరమంతా తెలుగువాళ్ళ పెంటలతో నిండి పోయింది.

1978 లో 'కరుణామయుడు' అని విజయచందర్ తీసిన సినిమా రిలీజైంది.ఆ తరువాత తెలుగువాళ్ళు క్రైస్తవం లోకి మారడం ఒక తుఫాన్ లా మొదలైంది. అప్పటినుంచే ఆంధ్రాలో కన్వర్షన్స్ ఊపందుకున్నాయ్.

ఆ తర్వాత షిరిడీ సాయిబాబా మీద సినిమాలొచ్చాయి. ఇంకేముంది?పోలో మంటూ తెలుగువాళ్ళు శిరిడీకి పరిగెత్తడం ప్రారంభం !!

ఇంకా నయం !! ఎవరూ "మారిలిన్ మన్రో" అని సినిమా తియ్యలేదు. సంతోషం !!

కం|| ఇదియా హిందూ ధర్మము?
ఇది ఏ కలగూర గంప? ఇది ఏ మతమౌ?
అదియో ఇదియో తెలియని
పెదకాకర మొక్క వోలె ఫెళ్ళున బెరిగెన్

హిందూధర్మం అంటే ఇదా? అసలైన హిందూమతం ఏం చెప్పిందో అది ప్రస్తుతం ఎక్కడుందో ఎవరికైనా తెలుసా అసలు? ఎవరు ఏది చేస్తే అది హిందూధర్మం అయిపోతుందా?

కం|| కలియందున పెనుమాయల
పలుదీక్షల్ బుట్టునన్న పరగురు బోధన్
పలుమారులు దలచి తలచి
విలువల నడువుము బ్రతుకున వేరొకటేలా?

కలియుగంలో ఊరికి పదిమంది గురువులూ, ఇరవై రకాల మతాలూ పుట్టగొడుగుల లాగా పుట్టుకొస్తాయని పెద్దలు ఏనాడో చెప్పారు.వ్యాసమహర్షి వ్రాసిన భవిష్య మహాపురాణం గాని,బ్రహ్మవైవర్త పురాణం గాని,లేదా బ్రహ్మంగారి కాలజ్ఞానం గాని చదవండి. నేను చెబుతున్నది నిజమో కాదో తెలుస్తుంది.

ప్రస్తుతం జరుగుతున్నది అంతా ముందే వ్రాయబడి ఉంది. సమాజంలో కొత్త కొత్త దేవుళ్ళు కొత్త కొత్త దీక్షలు ఇవన్నీ వస్తున్నాయి గాని మనిషిలో నీతి మాత్రం ఎక్కడా పెరగడం లేదు.అది రోజురోజుకీ దిగజారిపోతున్నది.మతం కూడా నేడు వ్యాపారవస్తువుగా మారింది.ప్రతివాడూ ఒక గుడి కట్టడం, అక్కడ పనీపాటా లేని సోమరిపోతులు కూచుని పూజలంటూ జనాన్ని మభ్యపెడుతూ బ్రతకడం.అక్కడ ఒక రెలిజియస్ మాఫియా తయారు కావడం తప్ప ఇంకేమీ జరగడం లేదు.పాపులర్ మతం అంతా మోసమే !!

అసలు నిత్యజీవితంలో నీతిగా ఉంటే ఏ దీక్షలూ అవసరం లేదు. జీవితంలో రంగులు మార్చేవాడే,బట్టల రంగులు కూడా మారుస్తాడు.ఎప్పుడూ మనస్సులో శుద్ధంగా,జీవితంలో నిర్మలంగా ఉండేవాడికి ఏ దీక్షా అవసరం లేదు.వాడు దేవుడి దగ్గరకు పోనవసరం లేదు.దేవుడే వాడి దగ్గరకు వెతుక్కుంటూ వస్తాడు.

ఇంతమంది ఇన్ని దీక్షలు చేస్తున్నారు కదా మరి మన సొసైటీలో ఇంత నల్లడబ్బు ఎలా వచ్చింది? అందరూ నీతిమంతులైతే అందరూ మహాభక్తులైతే ఈ నల్లధనం గోల ఏమిటి?

అందరూ శ్రీవైష్ణవులే కానీ బుట్టలోని చేపలు మాత్రం మాయం !!

అంతేగా ???
read more " స్వామియే శరణమయ్యప్ప "

19, డిసెంబర్ 2016, సోమవారం

నోట్ల కష్టాలు - నోటి పద్యాలు

అందరినీ అల్లాడిస్తున్న నోట్ల కష్టాల మీద ఆశుపద్యాలను వినండి మరి.

ఆ|| రెండువేల నోటు రంగులీనుచు నుండు
మార్చబోయినంత మూర్ఛ వచ్చు
చిల్లరంచు వెదుక చీకాకు గలిగించు
మోడి మాయ పెద్ద మోళి మాయ

ఆ|| మందు షాపు లందు మనుషులే కరవైరి
విందు హోటలేమొ వెలిసి పోయె
అందమెల్ల దిద్దు అందాల పార్లర్లు
బోసిపోయి మిగుల బోర్డు దిప్పె

ఆ|| రెండువేల నోట్లు నిండు జేబున బెట్టి
పాని పూరి దినగ పరువు బోయె
చిన్న నోట్లు లేక చింతాయె బ్రతుకంత
వంద నోటులున్న వాడె రాజు

ఆ|| రెండు వేలు దెచ్చి నిండుగా పెట్రోలు
వెయ్యి రూప్యములకు పొయ్యమన్న
చిల్లరడిగినంత ఛీకొట్టి పొమ్మంచు
భాష మార్చివేసె బంకు వాడు

ఆ|| రెండు టీలు దెచ్చి రంజుగా ఇమ్మంచు
ఆర్డరేసి నంత అట్లె నిలిచి
చిల్లరివ్వ మంచు చేజాచి బెదిరించె
వెయిటరొక్కరుండు వింతగాను

ఆ|| మిరపకాయ బజ్జి మింగబోయిన యంత
చిల్లరడిగె బండి శీనుగాడు
ఛాటు బండివాడు నోటీసు అతికించె
పిల్ల నోట్ల వారె ప్రిన్సులనుచు

ఆ|| మంచి హోటలనుచు లంచి జేయగబోయి
పట్టి పట్టి యచటి ఫుడ్డు మెక్కి
కార్డు ఇచ్చినంత క్యాషివ్వమనె వాడు
క్లీను జెయ్యమనుచు కిచెను జూపె

ఆ|| బారు షాపులెల్ల భోరుభోరున యేడ్చె
కూర గాయలేమొ కొక్కిరించె
పెట్టురోలు బంకు పెనుశాపమాయెరా
మోడి మాయ పెద్ద మోళి మాయ

కం|| అతి ఖర్చుల్ ఆవిరులై
మితిమీరిన ఎచ్చులెల్ల మిస్టున గలసెన్
ప్రతివాడున్ నేలకు దిగి
గతి ఏమని ఏడ్వసాగె గొల్లున సత్యా

కం|| సరదా లన్నియు మానిరి
జరభద్రం బనిరి; జనుల జావలు గారెన్
పొరపాటున యన్వాంటెడు
కొరఖర్చుల బెట్టకుండ గుమిలిరి ప్రజలే !!

కం|| సినిమా హాళ్ళకు ఈగలు
మినిమంలో బ్రతుకునట్లు మెయింటెనెన్సుల్
పనిపాటలు కరువాయెను
తినికూర్చొను వారి లైఫు తుక్కై పోయెన్

కం|| పొదుపే మరచిరి లోకులు
మదుపున్ జేయంగబోవ మని కనపడదే !
అదుపున బెట్టక ఖర్చుల
విదిలించగ డబ్బులన్ని వీధిన బడుగా !!

కం|| లేజీ లైఫుకు అలవడి
పోజులు కొట్టుట మరిగిన పోరంబోకుల్
ఈజీ మని కన్పించక
క్రేజీగా యనిరి మోడి క్రూరుండంచున్

ఆ|| క్రైము రేటు తగ్గె క్రీముపూతలు తగ్గె
నల్ల వర్తకములు డొల్ల బారె
కట్న కాన్క లిచ్చు కల్యాణములు తగ్గె
మోడి మాయ పెద్ద మోళి మాయ

ఆ|| అన్ని కార్డు లిచట యాక్సెప్టు లౌనంచు
బార్ల ముందు పెద్ద బోర్డు లొచ్చె
మందుబాబు లెల్ల మంచిగా స్వైపింగు
చేయసాగిరంత చేష్ట లుడిగి

కం|| బ్యాలెట్టుల వెర్డిక్టున
వ్యాలెట్టుకు బొక్క బడగ వ్యాల్యూ తగ్గెన్
టూలెట్టుల బోర్డులవే
రోలెట్టుల యాక్టులౌచు రోడ్డుల వెలసెన్ 

కం|| ఐటీ దాడుల భయమున
పోటీ పడి మూసివేసి బిజినెసు హౌసుల్
కోటీశ్వర నల్ల దొరలు
నోటీసుల కందకుండ నక్కిరి ఎటనో ??

ఆ|| చిల్లరున్న వాడు చిట్వేలు యువరాజు
పెద్ద నోట్ల వాడు పేడివాడు
చిన్న పెద్దలందు చిక్కొచ్చి పడెనయా
మోడి మాయ పెద్ద మోళి మాయ

కం|| మోదీ వేసిన మందుకు
దీదీకే భేదులొచ్చి దిక్కులు మరచెన్
ఏదీ మునుపటి ధైర్యము?
మాదీఫల లేహ్యమింక మ్రింగక యున్నన్

కం|| యూపీ ఎన్నికలందున
పాపాలే బ్రద్దలౌను పంటలు బండున్
కోపపు పెద్దల యుద్ధము
పాపము ! పౌరుల బ్రతుకుల శాపంబయ్యెన్

కం|| ఏటీ ఎమ్ముల ముంగిట
మాటేసిన రాత్రి యంత మంచున బడుచున్
నోటే దక్కక పాయెను
వోటేసిన నమ్మకంబు వేస్టై పోయెన్

కం|| మోడీ కొట్టిన దెబ్బకు
కేడీలై కూలబడిరి కోటీశ్వరులే
ఏడీ మేనేజరుడని
లేడీలై పరుగులిడిరి లక్షల కొరకై

ఆ|| పెద్ద నోటులున్న పోతురాజౌ గాని
నూరు నోట్ల వాడు నూకరాజు
చిన్నచిన్న నోట్లు శ్రీమహాలక్ష్మిరా
మోడి మాయ పెద్ద మోళి మాయ

ఆ|| తెల్ల డబ్బులన్ని నల్లడబ్బై పోయె
బ్యాంకు కొచ్చు నోట్లు మాయమాయె
కొత్త కొత్త నోట్లు కోట్లాదిగా మార్చి
పెద్ద పెద్ద వారి ఫేసు వెల్గె

ఆ|| లూపు హోలు బట్టి లూటింగు మాస్టరై 
బ్యాంకు బాబు జేసె బ్యాకు స్టాబు
మోడి ప్లాను జూడ ముక్కలై పోయెరా
దేశమెట్లు వెలుగు దొంగలున్న?

ఆ|| రెండువేల నోట్లు రద్దౌను ముందంచు
భయము మాని వినుడు బెస్టు ట్రూతు
ట్వెల్వు మంత్సు లోన తెల్ల పేపర్లుగా
మారునంట తిక్క దీరునంట !!
read more " నోట్ల కష్టాలు - నోటి పద్యాలు "

18, డిసెంబర్ 2016, ఆదివారం

ఎంతో బాగుంటుంది ... కానీ ఏమీ ఉపయోగం ఉండదు

అధికారంలో ఉంటూ పదేళ్ళ పాటు నల్లధనం సంపాదిస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఒక్క రాత్రిలో ఆ మొత్తం చిత్తు కాగితాలుగా మారిపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

దేశాన్ని బాగు చెయ్యాలని కంకణం కట్టుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
బ్యాంకర్ల రూపంలో పిశాచాలుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని పార్లమెంట్లో రచ్చ చేస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
పీఎం నుంచి ఉలుకూ పలుకూ లేకపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

చనిపోయిన ప్రతివారినీ ఏటీఎం క్యూలో పోయారని పేపర్లో చూపిస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
స్మశానాలలో కూడా "ఈ - పోస్" మిషన్లు వచ్చేస్తే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

బిచ్చగాడి ఎకౌంట్లో కూడా రాత్రికి రాత్రి కోట్లు వచ్చి పడితే
ఎంతో .....బాగుంటుంది
కానీ
మూడ్రోజులలో మళ్ళీ నిల్ బేలెన్స్ అయిపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

శ్రీవారి సొమ్ముతో బంగారం గోడల ఇల్లు కట్టుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఐటీ వాళ్లోచ్చి అదంతా పట్టుకుపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు.

చనిపోయి ఇరవైరోజులైనా ఆమె ఆరోగ్యం భేషని టీవీలో న్యూసొస్తుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
బాడీకి కాళ్ళు లేవన్న విషయం జనానికి తెలిసిపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఇరవై ఏళ్ళు అధికారంలో ఉండి అన్నీ అనుభవిస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ప్రాణం పోయి ఇరవై రోజులైన శవానికి ఇంకా ఇంజక్షన్లు చేస్తుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

దేశం చాలా ముందుకెల్తోందని మన చంకలు మనమే చరుచుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
రాజధానిలో ప్రతిరోజూ రేపులమీద రేపులు జరుగుతూనే ఉంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఆకాశంలోకి ఉపగ్రహాలను పంపామని పండగ చేసుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
దేశం నిండా అవినీతి శనిగ్రహాలే అయితే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ప్రెసిడెంట్ గా గెలిచానని సంబరపడి గంతులేస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ప్రతివాడూ "ఛీ" నువ్వు మా ప్రెసిడెంట్ వి కావు అంటుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

అధ్యక్ష ఎన్నికలు ఎంతో పకడ్బందీగా చేసామని ఎగురుతుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఎలక్షన్ ప్రక్రియను రష్యా హైజాక్ చేసిందని తెల్సిన రోజున 
ఏమీ .....ఉపయోగం ఉండదు

సెక్రెటరీ అయ్యానని సంబర పడితే
ఎంతో .....బాగుంటుంది
కానీ
మెంబర్స్ మీద అలిగి తనే బయటకు వెళ్ళిపోతే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఏళ్ళకేళ్ళు కష్టపడి జ్యోతిష్య శాస్త్రం నేర్చుకుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
అన్నీ అయిపోయాక తీరిగ్గా విశ్లేషణ చేస్తుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

నలభై రోజులు నల్ల డ్రస్సు వేసుకుని డబ్బా ఫోజులు కొడితే
ఎంతో .....బాగుంటుంది
కానీ
కొండ దిగీ దిగకముందే మందు బాటిలు ఓపన్ చేస్తుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఫేస్ బుక్ ఫోటో చూసి లవ్వులో మునిగిపోతే
ఎంతో .....బాగుంటుంది
కానీ
అది ముప్పై ఏళ్ళ క్రితం ఫోటో అని తీరిగ్గా తెలిస్తే
ఏమీ .....ఉపయోగం ఉండదు

జుట్టుకి రంగేసుకుని కుర్ర వేషాలేస్తుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఆ కెమికల్స్ బాడీలోకి ఇంకి కిడ్నీలు పాడయ్యాయని తెలిసిన రోజున 
ఏమీ .....ఉపయోగం ఉండదు

అందరికీ అల్లోపతీ ఇచ్చే డబల్ ఎండీకి సంఘంలో
ఎంతో .....బాగుంటుంది
కానీ
తనింట్లో మాత్రం హోమియోపతీ వాడుతుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు

ఆఫీసు యూ ట్యూబులో సెక్స్ సినిమాలు చూస్తుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
బాసు పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రోజున
ఏమీ .....ఉపయోగం ఉండదు

అమెరికా సంబంధం అని ఎగురుకుంటూ పెళ్లి చేసి పంపిస్తే
ఎంతో .....బాగుంటుంది
కానీ
నెల తిరక్కుండానే 'నీ అల్లుడు సంసారానికి పనికిరాడని' పిల్ల వెనక్కొచ్చేస్తే
ఏమీ .....ఉపయోగం ఉండదు

"గో క్యాష్ లెస్" అన్న నినాదాన్ని విన్న రోజున
ఎంతో .....బాగుంటుంది
కానీ
హోటల్లో బాగా తిని కార్డిస్తే - 'ఓన్లీ క్యాష్ యాక్సెప్టెడ్' అంటూ వాళ్ళు పిండి రుబ్బిస్తే
ఏమీ .....ఉపయోగం ఉండదు

నల్ల డబ్బు నిర్మూలనం ఐపోయిందని సంబరపడితే
ఎంతో .....బాగుంటుంది
కానీ
మర్నాడే పాకిస్తాన్ తీవ్రవాదుల దగ్గర మన కొత్త కరెన్సీ ప్రత్యక్షమైతే
ఏమీ .....ఉపయోగం ఉండదు

రెండువేల నోట్లు జేబు నిండా ఉన్నాయని గంతులేస్తుంటే
ఎంతో .....బాగుంటుంది
కానీ
ఎక్కడికి పోయినా 'నో చేంజ్' అని వినిపిస్తుంటే
ఏమీ .....ఉపయోగం ఉండదు
read more " ఎంతో బాగుంటుంది ... కానీ ఏమీ ఉపయోగం ఉండదు "

Abhi Na Jao Chodkar Ke Dil Abhi Bhara Nahi - Asha, Rafi


Abhi na jao chod kar Ke dil abhi bhara nahi --

అంటూ ఆశా భోంస్లే, మహమ్మద్ రఫీలు మధురంగా ఆలపించిన ఈ గీతం 1961 లో వచ్చిన Hum Dono అనే చిత్రం లోనిది. ఇది చాలా మధురమైన నిత్యనూతన రొమాంటిక్ గీతం.సంగీత దర్శకుడు జయదేవ్ ఈ గీతానికి ఇచ్చిన రాగం చాలా మధురమైనది.యధావిధిగా రఫీ ఆశాలు ఈ పాటలో తమ విశ్వరూపం చూపించారు.ఇక దేవానంద్, సాధనా శివదాసని ఈ పాటలో చాలా బాగా నటించి మెప్పించారు.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Hum Dono (1961)
Lyrics:--Sahir Ludhianvi
Music:--Jaidev
Singers:--Asha Bhonsle, Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------
Abhi na jao chodkar
Abhi na jao chodkar E dil abhi bhara nahee

Abhi abhi tho aayi ho

Abhi abhi tho aayi ho - Bahar banke chaayi ho
Hawa Zara mehek tho le - Nazar zara behek tho le
Ye shaam dhal tho le Zara - Ye dil sambhal tho le zara
Mai thodi der jeetho lu - Nashe ke ghoont peetho lu
Abhi tho kuch kaha nahi - Abhi tho kuch sunaa nahi 
Abhi na jao chodkar E dil abhi bhara nahee

Sitare Jhilmila uthe
Sitare jhilmila uthe - charag jagmaga uthe
Bas ab na mujhko tokna - na badke raah rokna
Agar main ruk gayee abhi - tho jaana paavongee kabhi
Yahi kahonge tum sadaa - Ke dil abhi nahi bhara
Jo khatm ho kisee jagaah - Ye aisa silsilaa nahi
Abhi nahi abhi nahiNahi nahi nahi nahi
Abhi na jao chodkar E dil abhi bhara nahee

Adhuri aas...
Adhuri aas chodke - adhuri pyaas chodke
Jo roj yoohi jaavogi - Tho kis tarah nibhavogi
Ke zindagi ki raah me - Java dilon ki chaah me
Kayee maqaam aayenge - Jo hamko aazmayenge
Bura na maano baath ka - Ye pyaar hai gilaa nahi
Haa.. yahi kahonge tum sadaa - Ke dil abhi bhara nahi
Ye dil abhi bhara nahee - nahi nahi nahi nahi....

Meaning

Please dont go, leaving me here alone
My heart is not satisfied yet

You have come just now
like the spring season
Let the air imbibe your fragrance a little
Let my looks go mad
Let this evening become night
Let me stabilize my heart and live for a few more moments
Let me take a few sips of your beauty and become intoxicated
I haven't said anything yet and haven't heard anything yet

Please dont go, leaving me here alone
My heart is not satisfied yet

Stars are shining and lamps are lit
Dont stop me now
dont come into my way, I have to leave now
If I stay back now, I will never be able to leave you
You will always say that your heart is not satisfied yet
This affair will not end at any point of time
Not yet, not yet
No no please no

Unquenched earning and unquenched thirst
If you leave these daily and go away like this
How can you live upto love's expectations
Because in the path of life, many obstacles will come
that will test our love to the core
Never think that I am complaining
I am speaking out of love

You will always say that your heart is not satisfied yet
Yes my heart is not satisfied yet
No ...no.. please let me go...

తెలుగు స్వేచ్చానువాదం

అప్పుడే నన్ను వదలి వెళ్ళకు
నా హృదయానికి తృప్తి కలగడం లేదు

నువ్వు ఇప్పుడేగా వసంతంలా వచ్చావు
నీ సుగంధాన్ని ఈ గాలికి కొంచం సోకనీ
నా చూపులకు కొంచం పిచ్చి ఎక్కనీ
ఈ సాయంత్రం రాత్రిగా మారనీ
నా హృదయం కొంచం కుదుట పడనీ
నేను ఇంకొంచం సేపు ఈ క్షణాలను ఆస్వాదించనీ
నీ అందాన్ని ఇంకొంచం త్రాగి నాకు మత్తెక్కనీ
నేనేమీ మాట్లాడలేదు నువ్వేమీ మాట్లాడలేదు
అప్పుడే వెళ్లిపోతానంటే ఎలా?

చుక్కలు వచ్చేశాయి, దీపాలు వెలుగుతున్నాయి
నే వెళ్ళాలి - నా దారికి అడ్డు రాకు - నన్నాపకు
ఇప్పుడు ఉండిపోయానంటే ఇంకెన్నటికీ వెళ్ళలేను
నాకింకా తృప్తిగా లేదనే నువ్వెప్పుడూ అంటావు
ఇది అయ్యే పని కాదు
ప్లీజ్ ప్లీజ్
సారీ సారీ

తీరని దాహాన్నీ ఆరని ఆశలనూ ఇలా వదిలేసి
నువ్వు రోజూ వెళ్ళిపోతూ ఉంటే నేనేం కావాలి?
ఇలా అయితే ముందు ముందు మనకెదురయ్యే
సమస్యలను నువ్వు ఎలా తట్టుకుంటావు?
నేను ఫిర్యాదు చెయ్యడం లేదు
నా ప్రేమే నన్నిలా వాగిస్తోంది

చాల్లే నీ గోల...ఎంతసేపున్నా నీ హృదయానికి తృప్తి ఉండదు
నిజం ...దానికింకా తృప్తి కలగలేదు
వద్దు వద్దు. నేను వెళ్ళాలి...
read more " Abhi Na Jao Chodkar Ke Dil Abhi Bhara Nahi - Asha, Rafi "

16, డిసెంబర్ 2016, శుక్రవారం

Raat Ne Kya Kya Khwaab Dikhaye - Talat Mehamood


Raat Ne Kya Kya Khwaab Dikhaye అంటూ Talat Mehamood మధురంగా ఆలపించిన ఈ గీతం 1957 లో వచ్చిన Ek Gaon Ki Kahani అనే సినిమాలోది.

ఇది చాలా మధురమైన గీతం. తలత్ మహమూద్ తన సాఫ్ట్ మేల్ వాయిస్ లో ఈ పాటను చాలా మధురంగా పాడాడు.నేను కూడా ఈ పాటకు చాలావరకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను. పాతకాలంలో గుర్రబ్బండి మ్యూజిక్ తో వచ్చిన పాటలు చాలా ఉన్నాయి. మన తెలుగులో కూడా మాయాబజార్ లో "భళిభళి భళిభళి దేవా" అనే పాట గుర్రబ్బండి మ్యూజిక్ పాటే.

సలీల్ చౌదురీ చేసిన పాటలన్నీ సుమధుర గీతాలే. అలాగే శైలేంద్ర సాహిత్యం గురించి ఇక చెప్పనే అక్కర్లేదు.వీరిద్దరికీ తలత్ మెహమూద్ మధురస్వరం తోడై ఈ పాటను మరపురాని మధురగీతంగా మలచింది. అందుకే 60 ఏళ్ళ తర్వాత కూడా ఈ పాటను మనం వింటున్నాం.

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి.

Movie:--Ek Gaon Ki Kahani (1957)
Lyrics:--Shailendra
Music:--Salil Choudhury
Singer:--Talat Mehamood
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------
Raat ne kya kya khwaab dikhaye  - Rang bhare sou jaal bichaye
Aankhe khulee tho sapne toote - Reh gaye gam ke kaale saaye
Raat ne kya kya khwaab dikhaye

O..o..o Humne tho chaahaa bhool hi jaaye
Wo afsanana kyo dohraaye -2
Dil reh rehke yaad dilaaye
Raat ne kya kya khwaab dikhaaye

O..o..o Dill me dilkaa dard chupaaye
Chalo jahaa kismat le jaaye-2
Duniya parayi log paraye

Raat ne kya kya khwaab dikhaye  - Rang bhare sou jaal bichaye
Aankhe khulee tho sapne toote - Reh gaye gam ke kaale saaye
Raat ne kya kya khwaab dikhaye....

Meaning

How many dreams did the night show me up?
and has set and caught me in a hundred traps..
Alas, when I opened my eyes,all those dreams are shattered
And only dark shadows remained
How many dreams did the night show me up?

I wanted to forget the past
But why the old story is repeating again?
The heart cannot forget it easily
and reminding it again and again

How many dreams did the night show up to me?

Hide your heart's sorrow in your heart alone
And just go where your fate takes you
After all,the world is but a strange place
and the people are not your own

How many dreams did the night show me up?
and has set and caught me in a hundred traps..
Alas, when I opened my eyes,all those dreams are shattered
And only dark shadows remained


How many dreams did the night show me up?

తెలుగు స్వేచ్చానువాదం

రాత్రి ఎన్నెన్ని స్వప్నాలను చూపించింది?
ఎన్ని వందల రంగురంగుల ఉచ్చులతో నన్ను బంధించింది?
కళ్ళు తెరవగానే ఆ స్వప్నాలన్నీ ఆవిరయ్యాయి
నల్లని పాత చీకటి మేఘాలే మిగిలాయి
రాత్రి ఎన్నెన్ని స్వప్నాలను చూపించింది?

నేను గతాన్ని మరచిపోదామని అనుకున్నాను
కానీ అది మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తొస్తోంది?
ఈ హృదయం దాన్ని మర్చిపోలేక 
మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తోంది?
రాత్రి ఎన్నెన్ని స్వప్నాలను చూపించింది?

నీ వేదనను నీ గుండెలోనే దాచుకో
నీ అదృష్టం ఎక్కడకు తీసుకెళితే అక్కడకు వెళ్ళు
ఈ ప్రపంచం ఒక పరాయి ప్రదేశం
ఈ మనుషులు నీవాళ్ళు కారు

రాత్రి ఎన్నెన్ని స్వప్నాలను చూపించింది?
ఎన్ని వందల రంగురంగుల ఉచ్చులతో నన్ను బంధించింది?
కళ్ళు తెరవగానే ఆ స్వప్నాలన్నీ ఆవిరయ్యాయి
నల్లని పాత చీకటి మేఘాలే మిగిలాయి
రాత్రి ఎన్నెన్ని స్వప్నాలను చూపించింది?
read more " Raat Ne Kya Kya Khwaab Dikhaye - Talat Mehamood "

12, డిసెంబర్ 2016, సోమవారం

Chod Do Achal Zamana Kya Kahega - Asha, Kishore


Chod Do Achal Zamana Kya Kahega...

అంటూ ఆశా, కిషోర్ లు మధురంగా ఆలపించిన ఈ గీతం 1957 లో వచ్చిన Paying Guest అనే సినిమాలోది. ఇది చాలా మధురమైన రొమాంటిక్ గీతాలలో ఒకటి. ఇలాంటి పాటలు పాడాలంటే 'ఆశా' పెట్టింది పేరు.పదాలను విరవడం, హొయలు పోవడం ఆమె తర్వాతే ఎవరైనా.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Paying Guest (1957)
Lyrics:--Majrooh Sultanpuri
Music:--Sachin Dev Burman
Singers:--Asha Bhonsle, Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------
Chod do achal Zamana kya kahega
Ahaha in Adavon ka Zamana bhi hai deewana Diwana kya kahega
Oho ho chod do achal Zamana kya kahega

Mai chali ab khub chedo Pyar ke afsaane
Kuch mousam hai deewane, kuch tum bhi ho diwane
Zara sun na Jane tamanna, O Zara sun na jane tamanna
Itna tho soch ye mousam suhana kya kahega
O o o chod do achal Zamana kya kahega

Yoona dekho jaag jaaye Pyar ki angdaayi
Ye rasta ye tanhayi Lo dil ne thokar khayi
Yahi din hai, masti ke din hai
Kisko ye hosh hai apna Begana kya kahega
O o o chod do achal Zamana kya kahega

Ye bahare Ye puvare Ye barasta saavan
Dhar dhar kapehai tan man Meri bayya jhar lo saajan
Aji aanaa dil me samana
Ek dil ek jaan hai hamtum Zamana kya kahega

O o o ...Chod do achal Zamana kya kahega
Ahaha in Adavon ka Zamana bhi hai deewana Diwana kya kahega
Oho ho chod do achal Zamana kya kahega

read more " Chod Do Achal Zamana Kya Kahega - Asha, Kishore "

వెర్రి తలలేస్తున్న సనాతన ధర్మం

మొన్నీ మధ్యన ఏదో పనిమీద నంబూర్ అనే ఊరికి వెళ్ళవలసి వచ్చింది.విజయవాడ నుంచి గుంటూరు వచ్చే దారిలో నంబూరు అనే బోర్డు చూడటమే గాని ఆ ఊళ్లోకి ఎప్పుడూ పోలేదు. దానికి కారణం మెయిన్ రోడ్డుకు రెండు మూడు కి.మీ లోపలకు ఈ ఊరు ఉండటమే.

ఊరు చాలా పెద్దది. ఏదో చిన్న పల్లెటూరులే అనుకున్న మాకు చాలా ఆశ్చర్యం కలిగింది.ఈ ఊర్లో అందరూ బాగా డబ్బున్న వారే అని మాటలమధ్యలో తెలిసింది.పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినా, మంచి నీటి వసతి ఉండటమూ, మంచి నేల కావడంతో  రైతుల దగ్గర బాగా డబ్బులున్నాయి.

నన్ను ఆశ్చర్య పరచిన అసలు విషయం అది కాదు.

ఊరినిండా మైకులు పెట్టి హోరుగా ఏదో ఎనౌన్స్ మెంట్ వస్తోంది. ఏంటా అని ఒక చెవి అటు పారేస్తే అర్ధమైంది ఏమంటే - ఆరోజు సాయంత్రం ఊరి శివాలయం దగ్గర రోడ్డుమీద రుద్రాభిషేకం ఉందిట. అభిషేకం ఆలయం లోపల కదా జరగవలసింది? రోడ్డు మీద ఏమిటా అని సందేహం వచ్చి శివాలయం బయటే కూచున ఉన్న ఒక బ్లాక్ క్యాట్ ని అడిగాము. అప్పుడు అసలు విషయం తెలిసింది.

ఆయనే ఈ మొత్తం కార్యక్రమానికి ఆర్గనైజర్ అని చెప్పాడు.

రోడ్డు మీద ఒక పెద్ద స్టేజి వేసి ఆ రోజు సాయంత్రం నాగ సాధువుల చేత అప్పటికప్ప్పుడు మట్టితో శివలింగం స్టేజిమీదే చేయించి దానికి అభిషేకాలు చేస్తారట.

'నాగ సాధువులు మీకెక్కడ దొరికారు? వాళ్ళు పూర్గిగా నగ్నంగా ఉంటారు.ఎక్కడో మానవసమాజానికి దూరంగా కొండలలో అడవులలో ఉంటారు.కుంభమేళాలో మాత్రమే వారు మనకు కనిపిస్తారు.ఆ తర్వాత ఎక్కడకు మాయమై పోతారో ఎవరికీ తెలియదు.వాళ్ళను మీరెక్కడ పట్టుకొచ్చారు?' - అని ఆయన్ను అడిగాను.

'వీళ్ళు నాగ సాధువులు కారు.వాళ్ళ శిష్యులు.వీళ్ళను కాపాలికులని అంటారు' అన్నాడు బ్లాకీ.

నాకు మతిపోయినంత పనైంది.

'కాపాలికులు,పాశుపతులు మొదలైన తెగలను ఆదిశంకరులు ఎప్పుడో ఓడించి ఆయా శైవమతశాఖలు పూర్తిగా పనికిరానివని ఎప్పుడో తేల్చేశారు. వీళ్ళంతా మళ్ళీ పుట్టగొడుగులలాగా ఎలా పుట్టుకొస్తున్నారు?' అని ఆశ్చర్యం వేసింది.

'కార్యక్రమం చాలా భారీ ఎత్తున చేస్తున్నారే? ఎంత ఖర్చౌతుంది?' పందిరిని చూస్తూ అడిగాను.

'ఏభై వేలు అవుతుంది. ఇంకా పెద్దగా చేస్తే రెండు మూడు లక్షలు కూడా అవుతుంది.కానీ కార్యక్రమం అంతా ఒక్క గంట మాత్రమె ఉంటుంది.వాళ్ళు టైంను చాలా ఖచ్చితంగా పాటిస్తారు.' - అన్నాడు.

'అంత టైం పాటించడానికి వాళ్లకు వేరే పనీపాటా ఏముంది గనక? అయినా అంత ఖర్చుకు ఏముంది ఇక్కడ? మహా అయితే స్టేజి డెకరేషన్ అవుతుందేమో?' అంతేకదా?' - అన్నాను.

'అబ్బే అలా కాదు స్వామీ. బిందెలకు బిందెలు పళ్ళరసాలు,తేనె, కొబ్బరినీళ్ళు,పాలు,పెరుగు,నెయ్యి, గంధం,పసుపు ఇంకా చాలా సుగంధ ద్రవ్యాలు వాడతారు. ఆ బిందెలతో శివలింగానికి అభిషేకం చేస్తారు. చాలా క్వాలిటీ ద్రవ్యాలు వాడతారు.అందుకని అంత ఖర్చు అవుతుంది.వాళ్ళు ఏమీ డబ్బులు తీసుకోరు.వస్తువులకే ఖర్చంతా'  - అన్నాడు.

'ఒక్క గంటలో అలా బిందెలు బిందెలు తేనే, పళ్ళరసాలూ వగైరాలన్నీ స్టేజీమీది మట్టిలింగానికి దొర్లించేసి చేతులు దులిపేసుకుని వాళ్ళు వెళ్లిపోతారన్న మాట. అంటే ఈ ఏభై వేలూ జస్ట్ ఒక్క గంటలో మురిక్కాలవ పాలు !! అంతేనా?' అడిగాను నవ్వుతూ.

ఆయనకు కోపం వచ్చేసింది.

'అదేంటి స్వామీ అలాగంటారు? శివుడికి అభిషేకం. అలా అనకండి.అసలు ఆ కాపాలిక స్వామి ఎంత నిష్టగా చేస్తాడో తెలుసా?' అన్నాడు.

'ఎంత నిష్టగా చేస్తాడేంటి?' అడిగాను అమాయకంగా.

'లింగానికి బిందెలు బిందెలు అలా దొర్లిస్తూ ఉన్నప్పుడు ఒక్క క్షణం అందించే బిందె ఆలస్యం అయినా ఆయనకు ఉగ్రం వచ్చేస్తుంది.ఒకసారి బిందెలు అందించే అసిస్టెంట్ స్వామి ఒక్క క్షణం ఆలస్యం చేసాడని, చేతులో ఉన్న బిందెను అతని మీదకు విసరికొట్టాడా కాపాలికస్వామి. ఆ అసిస్టెంట్ పోయి జనంలో పడ్డాడు.'-అన్నాడు భక్తిగా కళ్ళు మూసుకుని ఊగిపోతూ.

'ఓరి నీ భక్తి పాడుగాను. దాన్ని నిష్ఠ అంటారా? అంత కోపం ఉన్నవాడు వాడు స్వామేంటిరా? ఆ అసిస్టెంట్ ప్లేస్ లో నేనుంటేనా, ఒక్క తన్నుకు ఆ కాపాలిక స్వామి పోయి జనంలో పడేవాడు."- అనుకున్నా లోలోపల.

'చాలా బాగుంటుంది స్వామీ సాయంత్రం వరకూ ఉండి చూడండి.' అన్నాడు బ్లాక్ క్యాట్ భక్తిలో గుడ్లు తేలేస్తూ.

'లేదండి.నాకు వేరే పనుంది. కుదరదు.' అన్నాను సీరియస్ గా.

'హు!! గొప్ప అవకాశం మిస్  అవుతున్నావు.' అన్నట్లు నావైపు జాలిగా చూచాడు బ్లాక్ క్యాట్.

నేనది పట్టించుకోకుండా బయల్దేరి వచ్చేశాను.ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయాను.

నిన్న - మా ఇంటి దగ్గర రోడ్డు మీద ఏదో భారీ ఎత్తున పందిరి వేస్తుంటే, ఏంటా అని వాకబు చేశాను. పక్కనే ఉన్న గుళ్ళో ఇదే కార్యక్రమం పెట్టారని తెలిసింది. యధావిధిగా రోడ్డు మీద స్టేజి కట్టి అట్టహాసంగా డ్రమ్ములు బిందెలు అన్నీ పేర్చి మైకులు పెట్టి చాలా హోరుతో ఇదే కార్యక్రమం చేస్తున్నారని తెలిసింది.

అదృష్టవశాత్తూ నేను మేట్నీకి అట్నించటే ఫస్ట్ షోకీ పోయాను గనుక బ్రతికిపోయాను. లేకపోతే ఈ డబ్బా కార్యక్రమం చూడవలసిన ఖర్మ నాకూ పట్టి ఉండేది.దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత అయ్యప్ప పుణ్యమా అని ఈ గోల తప్పించుకోవడానికి ఒకేరోజున రెండు సినిమాలు చూచాను.

బిందెల కొద్దీ తేనే, పళ్ళ రసాలూ, కొబ్బరి నీళ్ళూ,పాలూ పెరుగూ నెయ్యీ ఇంకా ఏవేవో కలిపి రోడ్డుమీద మట్టి లింగానికి అభిషేకం చేసారట కాపాలికులు. ఈ భక్తులేమో పూనకాలు తెచ్చుకుని ఊగిపోయారట.ఈ లిక్విడ్స్ అన్నీ చక్కగా రోడ్డు పక్కన మురిక్కాలవలో కలసి పోయాయిట.ఆ తర్వాత ఆ శివలింగాన్ని కూడా తొక్కేసి రోడ్డు పక్కన మట్టిలో ఆ మట్టిని కలిపేశారట. ఒక్క గంటలో యాభై వేల రూపాయల విలువైన పదార్ధాలన్నీ కాలవలో కలసి పోయాయి.

ఈ విషయమంతా మా నైబర్ ఒకాయన చెబితే నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.

ఒక పక్కన తినడానికి తిండి లేక ఎంతో మంది చచ్చిపోతున్నారు.వీళ్లేమో భక్తి పేరుతో వేలూ లక్షలూ మురిక్కాలవకు పోస్తున్నారు. ఆ తిండి పదార్ధాలు ఏ ఆస్పత్రికో లేదా ఏ అనాధ శరణాలయానికో ఇస్తే బాగుంటుంది కదా? ఊరకే కాలవకు పోస్తే ఏమొస్తుంది?

రోడ్లమీద మురిక్కాలవల పక్కన ఇలాంటి కార్యక్రమాలు చెయ్యమని ఏ వేదం చెప్పిందో ఎంత ఆలోచించినా నాకు గుర్తు రాలేదు.ఈ మధ్యన మెమొరీ తగ్గిందా అని కొంచం అనుమానం కూడా వచ్చింది నాకు.

పైగా దీనికి హిందూమతం అని ఒక ముసుగు !!

ఇందులో హిందూమతం ఎక్కడుందో నాకైతే అర్ధం కావడం లేదు.

సాటి మనిషి ఆకలితో చచ్చిపోతుంటే, తేనే పళ్ళరసాలూ మురిక్కాలవకు పొయ్యమని ఏ సనాతన ధర్మం ఎక్కడ చెప్పింది? ఒకవేళ చెబితే మాత్రం, కామన్ సెన్స్ కు విరుద్ధంగా మానవత్వానికి విరుద్ధంగా ఉన్న అలాంటి ధర్మాన్ని అసలెందుకు పాటించాలి? ఎక్కడో ఏదో వ్రాస్తే మనం గుడ్డిగా చేసెయ్యడమేనా? మనకు కామన్ సెన్స్ అక్కర్లేదా?

ఆంధ్రాలోకి అయ్యప్పా, సాయిబాబా అడుగు పెట్టిననాటి నుంచే సనాతనధర్మానికి అధోగతి మొదలైందనేది నా వ్యక్తిగత దృఢవిశ్వాసం.జనాలలో ఇలాంటి పిచ్చి చేష్టలు కూడా అప్పటినుంచే ఎక్కువయ్యాయి.సాయిబాబా ఒక ముస్లిం సెయింట్,అయ్యప్ప ఒక ట్రైబల్ ప్రిన్స్.వీళ్ళిద్దరినీ హిందూమతంలోకి ఇండక్ట్ చేసుకుని గుళ్ళుకట్టి పూజిస్తున్నారు.ఇది చాలా పొరపాటు.అయితే ఈ విషయం సో కాల్డ్ భక్తులకు ఏమాత్రం అర్ధం కావడం లేదు.ఈ క్రమంలో హిందూ మతాన్ని ఒక చేపల మార్కెట్ లా మార్చేస్తున్నారు.

మానవత్వం లేని మతం ఎందుకు? ఎందుకు చేస్తున్నామో తెలియని పిచ్చి తంతులు అసలెందుకు? ప్రతిదానికీ ఒక కధ అల్లేసి, త్రిమూర్తులతోనో, దత్తాత్రేయునితోనో,లేకపోతే ఇంకెవరితోనో ఆ కధకు ముడి పెట్టేసి, ఆ కధను లీగలైజ్ చేసేసి గుళ్ళు కట్టేసి వ్యాపారం చేసుకోవడమే హిందూమతమా?? అసలైన హిందూమతం ఎక్కడుందో అదెలా ఉంటుందో ఎవరికైనా తెలుసా అసలిప్పుడు??

అసలు హిందూమతం ఏం చెప్పిందో తెలుసుకుని దానిని ఆచరించడం కరెక్టా?? లేక మనం ఏది చేస్తే అదే హిందూమతం అనుకుంటూ అజ్ఞానంలో అహంకారంలో బ్రతకడం కరెక్టా??

సాటిమనిషిలో శివుణ్ణి చూడమని వివేకానందస్వామి అన్నారు.ఆ పనిని చెయ్యగలిగితే ఈ పిచ్చిగోలలూ ఉండవు.ఈ కుళ్ళు బ్రతుకులూ ఉండవు.ఈ అవినీతీ ఉండదు.మతం పేరుతో ఇంత బ్లాక్ మనీ సర్కులేషనూ ఉండదు.ప్రముఖ దేవాలయాల బోర్డు మెంబర్లు ఒక్కొక్కరూ ఎంతెంత అవినీతి రాక్షసులో, భక్తుల వేషాలలో ఉన్న గుంటనక్కలో కనిపిస్తూనే ఉందిగా?? అవినీతి బంగారాన్ని గోడలలో దాచుకోమనీ, ఇంట్లో ఎక్కడ చూచినా డబ్బు సంచులు దాచుకోమనీ, పైకి భక్తుల వేషాలు వెయ్యమనీ ఏ సనాతన ధర్మం చెప్పిందో మరి? 

"కాదేదీ కవిత కనర్హం" అని శ్రీశ్రీ అన్నట్లు "కాదేదీ అవినీతి కనర్హం" అని మనం అనుకోవాలేమో? ఈ డబ్బంతా ఎవరి దగ్గరో వసూలు చెయ్యడం !! అందులో చాలాభాగం నొక్కెయ్యడం ఇదీ వీళ్ళు చేసేపని !! మనిషిని దోచుకోడానికి పెట్టుబడి లేని వ్యాపారమంటే మతాన్ని మించినది ఇక ఏదీ లేదేమో? "మతం మత్తు మందు" అని మార్క్స్ అన్న దాంట్లో చాలా నిజం ఉందని నాకనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు.

నవీనయుగంలో కూడా మనల్ని చీకటిలోకి తీసుకెళుతున్న ఇలాంటి చీకటి తంతులు అవసరమా?మతం పేరుతో ఇంత అవినీతి అవసరమా?సనాతనధర్మం పేరిట ఇలాంటి వెర్రి వేషాలు అవసరమా? పైగా వీటికి దీక్షలనీ నిష్ఠలనీ పేర్లు అవసరమా?

ఆలోచించండి.
read more " వెర్రి తలలేస్తున్న సనాతన ధర్మం "

11, డిసెంబర్ 2016, ఆదివారం

Chiru Navvu Loni Haayi - Ghantasala,Susheela


చిరునవ్వులోని హాయి చిలికించే నేటి రేయి...

అంటూ ఘంటసాల, సుశీల మధురంగా ఆలపించిన ఈ గీతం 1966 లో వచ్చిన 'అగ్గిబరాటా' అనే సినిమాలోది. ఈ పేర్లేంటో? 'అగ్గిబరాటా', 'ఉల్లిపరోటా' అంటూ కాకా హోటల్లో మెనూలా ఉండి ఇప్పుడు చదివితే చచ్చే నవ్వొస్తుంది.

తెలుగు పాటలు పాడి చాలా రోజులైంది. ఎన్టీ ఆర్ పాట ఒకటి పాడదామని ఇవాళ అనిపించింది. అందుకే ఈ పాట.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Aggi Barata (1966)
Lyrics:--Dr.C.Narayana Reddy.
Music:--Vijaya Krishnamurty
Singers:--Ghantasala, Susheela
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------------
చిరునవ్వులోని హాయి – చిలికించే నేటి రేయి
ఏనాడు లేని హాయీ – ఈనాడు కలిగెనోయి]-2

నెలరాజు సైగ చేసే వలరాజు తొంగి చూసే-2
సిగపూల లోన నగుమోము లోన వగలేవో చిందులేసే-2

చిరునవ్వులోని హాయి – చిలికించే నేటి రేయి
ఏనాడు లేని హాయీ – ఈనాడు కలిగెనోయి

నయనాల తార వీవే నా రాజహంస రావే -2
నను చేరదీసి మనసార చూసి పెనవేసినావు నీవే-2

చిరునవ్వులోని హాయిచిలికించే నేటి రేయి
ఏనాడు లేని హాయీ – ఈనాడు కలిగెనోయి

పవళించు మేనిలోనా రవలించె రాగవీణా-2
నీలాల నింగి లోలోన పొంగి కురిపించే పూలవానా
నీలాల నింగి లోలోన పొంగి కురిపించే పూలవానా
చిరునవ్వులోని హాయి – చిలికించే నేటి రేయి
ఏనాడు లేని హాయీ – ఈనాడు కలిగెనోయి
ఈనాడు కలిగెనోయి
read more " Chiru Navvu Loni Haayi - Ghantasala,Susheela "