“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, సెప్టెంబర్ 2016, గురువారం

జ్యోతిష్య శాస్త్రం సత్యమే - ఇవిగో రుజువులు - 3

5-9-2014 న అంటే సరిగ్గా రెండేళ్ళ క్రితం రోహిణీ శకట భేదనం అనే పోస్ట్ లు నేను వ్రాస్తూ ఈ క్రింది పేరాను రెడ్ కలర్ లో వ్రాశాను.
  • మార్చి-సెప్టెంబర్ 2016 ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన కాలం. ఎందుకంటే,ఒకటిన్నర నెల వ్యవధిలో రాశి మారే కుజుడు,ఆసమయంలో మాత్రం దాదాపు ఆరునెలల కాలం స్తంభన,వక్ర స్థితులలోకి ప్రవేశిస్తూ వృశ్చికంలో ఉన్న శనీశ్వరునితో కలసి ఉండబోతున్నాడు.ఆ సమయంలో వారిద్దరి భయంకరమైన సప్తమదృష్టి వృషభం మీద పడుతున్నది.కన్యారాశిలో ఉన్న రాహువు యొక్క పంచమదృష్టి కూడా ఆ సమయంలో వృషభం మీద పడుతున్నది.కనుక ఇదొక భయంకరమైన Compounding effect ను సృష్టించబోతున్నది.కాబట్టి ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా భయంకర దుర్ఘటనలు ఖచ్చితంగా జరుగబోతున్నాయని నేను ఈరోజు(ఒకటిన్నర సంవత్సరం ముందుగా) చెబుతున్నాను.కావలసిన వారు వ్రాసి పెట్టుకోండి.అవి జరిగినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను.
కావలసిన వారు ఈ క్రింది లింక్ చూడండి.


రోహిణీ శకట భేదనం జరిగే ఈ సమయంలో " లోకులు కష్టాల సముద్రంలో మునిగిపోతారు.' అని వరాహమిహిరాచార్యుడు రెండువేల సంవత్సరాల క్రితం సూత్రీకరించి పెట్టాడు. ఈ సూత్రాన్నే నేను ఉపయోగించి రెండేళ్ళ క్రితం చెప్పాను. అది నేడు ఖచ్చితంగా జరుగుతున్నది గమనించండి.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు నీళ్ళలో మునిగి ఉన్నాయి.అపార్ట్ మెంట్లలోకి నీళ్ళు వచ్చాయి.ప్రజల పరిస్థితి దుర్భరంగా ఉన్నది. ఈ రోజునైతే అవి ప్రయాణిస్తున్న రోడ్లు ముందూ వెనుకా నీళ్ళు పారుతూ ఎన్నోచోట్ల బస్సులు రైళ్ళూ జల దిగ్బంధనం అవుతున్నాయి.

వరాహమిహిరాచార్యుని జ్యోతిష్యసూత్రం ఖచ్చితంగా రుజువౌతున్నదా లేదా? మీరే చెప్పండి !!

నేడు హైదరాబాద్ పరిస్థితి ఏమిటో కొన్ని ఫోటోలు ఈ క్రింది లింకులలో చూడండి.






"2016 మార్చి సెప్టెంబర్ ల మధ్యలో వస్తుంది ఈ చెడుసమయం" అంటూ టైం స్లాట్ తో సహా స్పష్టం గా రెండేళ్ళ క్రితం చెప్పినది ఇప్పుడు జరుగుతున్నదా లేదా?

జ్యోతిష్యశాస్త్రం ఒక గొప్ప సైన్సే నని ఇప్పటికీ నమ్మకపోతే మీకు శాస్త్రీయధోరణి లేనట్లే లెక్క !! రుజువులు చూపించినా నమ్మలేని prejudiced mindset మీకు ఉన్నట్లే లెక్క !!
read more " జ్యోతిష్య శాస్త్రం సత్యమే - ఇవిగో రుజువులు - 3 "

21, సెప్టెంబర్ 2016, బుధవారం

టీ కప్పులో చినుకు...



ఈరోజు ప్రమాదవశాత్తూ ఒక రైలుపెట్టె డిరైల్ అయింది.

దానిని మళ్ళీ రీరైల్ చేసే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నది.స్పాట్ లో నేనూ ఉన్నాను.రీరైల్ చేసే టీం మెంబర్స్ తమ పనిని తాము చకచకా చేసుకుంటున్నారు.వర్షం జల్లులు జల్లులుగా పడుతున్నది.కొందరు గొడుగులు వేసుకుని తడవకుండా పనిని సూపర్ వైజ్ చేస్తున్నారు.నాకు మాత్రం వానలోనే హాయిగా అనిపించి అలాగే తడుస్తూ, చినుకుల స్పర్శను ఆస్వాదిస్తూ నిలబడ్డాను.

ఇంతలో టీ సర్వ్ చెయ్యబడింది. టీ కప్పును చేతిలోకి తీసుకుని సిప్ చెయ్యబోతూ ఉండగా ఆకాశంలోనుంచి ఒక చినుకు ఆ కప్పులో పడి టీలో కలసిపోయింది.సిప్ చేసిన నాలోకి చేరిపోయింది.

ప్రకృతి ఎంత అద్భుతమైనది !!!

కొన్ని క్షణాల క్రితంవరకూ ఎన్నో మైళ్ళ దూరంలో ఆకాశంలో ఉన్న మేఘాలలో ఒక భాగంగా ఉన్న నీటిచుక్క ఇప్పుడు నాలో ఒక భాగంగా మారింది !!!

గమనిస్తే అద్భుతాలు మనతోనే లేవూ?

పరికిస్తే అద్వైతాలు మనలోనే లేవూ?

ఈరోజు జరిగిన ఈ చిన్న సంఘటన (insignificant event) నా మనోవీధిలో మెరుపులు మెరిపించింది. 

ఆ నీటిచుక్కతో మాట్లాడించింది.

ఈ కవితకు ప్రాణం పోసింది.

చదవండి మరి.
--------------------------------------

సుదూర శూన్యంలో అనంత కాలంగా
సుతారంగా తేలుతున్న నీటిచుక్కవు
ఎందుకు నన్నిలా కోరావు?

విశాల గగనంలో విలాస సౌధంలో
విశోకంగా ఉన్న వర్షపు బిందువువు
ఎందుకిలా నాలోకి చేరావు?

నాలో ఏముందని?
నా ప్రాణంలో ప్రాణంగా మారావు?
నీకేమివ్వగలనని?
నను కోరి ఇంతదూరం వచ్చావు?

మేఘాలలో తేలియాడే నీకోసం
నేను రాలేనని కదూ
మట్టిలో నడయాడే నాకోసం
నువ్వే దిగి వచ్చావు?

ఎన్ని జన్మలెత్తినా
నిను చేరుకోలేనని కదూ
ఈ జన్మలోనే నువ్వొచ్చి 
నన్నిలా వరించావు?

కొంచం గురితప్పితే చాలు
ఏ బురదలోనో కలుస్తానని తెలిసీ
నాకోసం ఎంత సాహసం చేశావు?

అనేక యోజనాల నీ ప్రయాణంలో
ఎక్కడైనా నువ్వు ఆవిరి కావచ్చని తెలిసీ
నాకోసం ఎంత తెగువను చూపావు?

నా సావాసం కోరి నీ ఆవాసం వదలి
ఇంత దూరం జారి నాలో వచ్చి చేరి
నిన్ను నువ్వు కోల్పోయావు

నీ ప్రేమకు ప్రతిగా ఏ బహుమతి నివ్వగలను?
నీ కోసం శ్రుతినై ఏ గీతిని పాడగలను?
అమాయకమైన నీ తపనకు ఏమిచ్చి
నీ ఋణం తీర్చుకోగలను?
భయానకమైన ఈ లోకంలోకి
నాకోసం పిచ్చిగా వచ్చిన నిన్ను
ఏ విధంగా ప్రేమించగలను?

లోకపు శాపాలకు చీకటి పాపాలకు 
అతీతంగా వెలిగే లోకంలో గాలికి తేలే ప్రియురాలివి
ఈ బికారి నెందుకు వలచావు?

మానవ చేతనకు మరణపు యాతనకు
ఊహలకందని భూమికలో ఊయలలూగే జవరాలివి
ఈ మట్టిలో ఎందుకు కలిశావు?

దిగంత దూరాలను చిదిమి వేస్తూ అనంత కాలాలను అధిగమిస్తూ
చీకటి తలుపులను చీల్చుకుంటూ రేపటి వెలుగులను మోసుకుంటూ
నాకోసం ఎలా దిగి వచ్చావు?

మరణపు మూల్గులు సోకలేని శిశిరపు రాల్పులు తాకరాని
అనంత గగనపు అమోఘతటిలో అనునిత్యం నర్తించే అమృతానివి
ఈ సామాన్యుడినెలా మెచ్చావు?
read more " టీ కప్పులో చినుకు... "

20, సెప్టెంబర్ 2016, మంగళవారం

Gham Ki Andheri Raat Mein - Talat Mehamood, Mohd Rafi


Gham Ki Andheri Raat Mein...

అంటూ తలత్ మెహమూద్, మహమ్మద్ రఫీలు సంయుక్తంగా ఆలపించిన ఈ గీతం 1963 లో వచ్చిన "సుశీల" అనే సినిమాలోది.దీనిని మేల్ డ్యూయెట్ అని అనలేము గాని అలాంటిదే.పాత సినిమాలలో ఇలాంటి ప్రయోగాలు ఉండేవి.తెలుగులో కూడా మంచిమిత్రులు (1969) సినిమాలో "ఎన్నాళ్ళో వేచిన ఉదయం" అంటూ ఘంటసాలా, బాలసుబ్రమణ్యంలు పాడిన పాట ఇలాంటిదే.మన తెలుగుపాట - ఈ హిందీ పాటకు కాపీ అని నాకు పెద్ద అనుమానం.

C.Arjun అనే మ్యూజిక్ డైరెక్టర్ పేరు అంతగా మనం విని ఉండము. 1960 లలో ఈయన "లో బడ్జెట్" హిందీ సినిమాలకు సంగీతం అందించేవాడు. ఈయన చేసిన మంచి మంచి పాటలలో ఇదీ ఒకటి.

ఇది నిజానికి ఒక ఘజల్. ఘజల్స్ పాడటంలో మంచి గాయకుడైన తలత్ మెహమూద్ స్వరంలో ఈ పాట చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంది. తలత్ మెహమూద్ స్వరంలో కూడా ఒక మ్యాజిక్ ఉన్నది.ఈయన అభిమానులకు ఇతర గాయకులు ఎవరూ నచ్చరు. అంత సాఫ్ట్ మేల్ వాయిస్ ఈయనది. 1960 లలో హిందీ సినిమా సంగీతంలో చాలా మార్పులు వచ్చాయి. పాత ఒరవడి పోయి కొంచం మోడరన్ ఒరవడి మొదలైంది. ఆ సమయంలో వచ్చిన ఈ పాట మాత్రం పాత తరపు సంగీతానికి చెందిన ఆణిముత్యం అనే చెప్పాలి.

ఈ పాటలో ఇద్దరి స్వరాలూ నేనే పాడాను.ఈ ఇద్దరూ నేను ఇష్టపడే పాతతరం గాయకులు కావడమే దీనికి కారణం.మొదట రఫీ ట్రాక్ పాడి ఆ తర్వాత తలత్ మెహమూద్ ట్రాక్ పాడాను.ఆ తదుపరి రెంటినీ మిక్స్ చెయ్యడం జరిగింది.అదీ సంగతి.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Sushila (1963)
Lyrics:--Jan Nisar Akhtar
Music:--C.Arjun
Singers:--Talat Mehamood, Mohd Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------

Rafi
Gham ki andheri raat mein - Dil ko na beqaraar kar
Subah zarur aayegi - Subah ka intazaar kar
Gham ki andheri raat mein
Talat
Dard hai saari zindagi - Jiska koi sila nahi
Dil ko fareb dijiye - Aur ye hausala nahi
Aur ye hausala nahi
Rafi
Khud se to badaguma na ho
Khud pe to aitabaar kar
Subah zarur aayegi - Subah ka intazaar kar
Gham ki andheri raat mein
Talat
Khud hi tadap ke rah gaye - Dil ki sadaase kya mila
Aag se khelate rahe - Hum ko wafa se kya mila
Hum ko wafa se kya mila
Rafi
Dil ki lagi bujha na de - Dil ki lagi se pyaar kar
Subah zarur aayegi - Subah ka intazaar kar
Gham ki andheri raat mein
Talat
Jisse na dil bahel sake - Aisi khabar tu payega
Raat abhi dhali kaha - Aa beshahar se payega
Aa beshahar se payega


Rafi
Katle bahar aayegi - Dore fiza guzar kar
Subah zarur aayegi - Subah ka intazaar kar
Gham ki andheri raat mein
Dil ko na beqaraar kar
Subah zarur aayegi - Subah ka intazaar kar
Gham ki andheri raat mein
read more " Gham Ki Andheri Raat Mein - Talat Mehamood, Mohd Rafi "

18, సెప్టెంబర్ 2016, ఆదివారం

సెప్టెంబర్ - 2016 పౌర్ణమి ప్రభావం

ఈ పౌర్ణమికి ముందూ వెనుకా చాలా దుర్ఘటనలు జరిగినా ఈ రోజున జరిగిన యూరీ సంఘటన - మన దేశ భద్రత దృష్ట్యా చాలా ఘోరమైనది.

ఎందుకంటే - ఈ పౌర్ణమికి నీచ శుక్రునితో కలసిన సూర్యుడు యురేనస్ పట్టులో చిక్కుకున్న చంద్రుడిని చూస్తున్నాడు.ఇది ఖచ్చితంగా ఉగ్రవాద దాడులకు ఊతం ఇచ్చే యోగమే.నీచ శుక్రుడంటే ముస్లిం ఉగ్రవాదులే.హటాత్తు దాడులకు యురేనస్ ఆజ్యం పోస్తుంది.వెరసి యూరీ ఆర్మీ క్యాంప్ మీద పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి జరిగింది.

ఈ రోజు ఉదయం యూరీ సెక్టార్లో ఉన్న ఆర్మీ క్యాంప్ మీదే సరాసరి పాకిస్తాన్ ద్రోహులు దాడి చేశారు.మన సైనికులు 19 మంది చనిపోయారు. 30 మంది గాయపడ్డారు.

ఇది - భారతీయులందరూ చాలా బాధపడవలసిన సంఘటన!! దేశభక్తి ఉన్న ఎవరికైనా సరే గుండెలు మండిపోవలసిన సంఘటన !!

ఈ మధ్యన కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను అంతర్జాతీయ వేదికల పైన సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో మన నాయకులు చక్కగా పనిచేస్తున్నారు.బలూచిస్తాన్లో పౌరులను పాకిస్తాన్ చంపుతూ మానవహక్కులను కాలరాస్తూ ఇంకో పక్క కాశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ ప్రచారం చెయ్యడాన్ని మోడీ గట్టిగా తిప్పి కొడుతున్నారు. తన మోసం ఎండగట్టబడటంతో దిక్కుతోచని పాకిస్తాన్ - తన ఇస్లామిక్ ఉగ్రవాద ముఠాలను ఉసిగోల్పుతూ - "ప్రాక్సీ వార్" ద్వారా - ఈ విధంగా మనమీద కసి తీర్చుకుంటోంది.

కాశ్మీర్ విషయంలో మన నాయకులు ఘోరమైన తప్పులు ఎన్నో చేశారు.అవి ఎంత ఘోరమైన తప్పులంటే దేశభద్రతకే తీరని ప్రమాదాలుగా అవి నేటికీ మిగిలిపోయేటంత ఘోరమైన తప్పులు. ఆనాడు నెహ్రూ చేసిన ఘోరమైన తప్పు వల్ల కాశ్మీర్ రావణకాష్టం ఈనాటికీ రగులుతుంటే, ఆయనగారి కూతురైన ఇందిరాగాంధీ చేసిన ఇంకో ఘోరమైన తప్పు వల్ల PoK తయారై కూచుంది.ఈ రెండూ పీటముడులు పడిపోయి ఎలా వీటిని విప్పాలో తెలియనంతగా చిక్కులు పడిపోయాయి. ఈ ఆరు దశాబ్దాలలో ఇంతమంది సైనికుల ప్రాణాలు పోవడానికీ, లక్షలాది కాశ్మీర్ పండిట్ల కుటుంబాల దయనీయ దుస్థితికీ, కాశ్మీర్లో హిందువులు ఉండలేక ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని పారిపోవడానికీ వీళ్ళిద్దరే కారకులు. వీళ్ళను సపోర్ట్ చేసిన గాంధీయే నేటి ఈ దుస్థితికి అసలైన కారకుడు.

పాకిస్తాన్ తో "అమ్మా బాబూ" అని మంచిగా మాట్లాడితే అది ఆత్మహత్యా సదృశమే అవుతుంది.ఇన్ని దశాబ్దాలుగా మనం అదే తప్పు చేస్తూ అదిప్పుడు అణ్వస్త్ర దేశంగా అవతరించేవరకూ ఓపికగా ఎదురు చూశాం.ఇప్పుడూ అదే తప్పు చేస్తూ కాశ్మీర్ కాష్టాన్ని ఇంకా ఇంకా మండిస్తున్నాం.చావగొట్టి చెవులు మూస్తేనే ఇస్లామిక్ ఉగ్రవాదం చెప్పిన మాట వింటుంది.దానికి వేరే మంత్రం పనిచెయ్యదు.

'హిందూ ముస్లిం భాయీ భాయీ' - అని మనం అనుకోవచ్చు.అది మన ఉదారస్వభావానికి సంకేతం.కానీ ఏ ముస్లిమూ అలా అనుకోడు. అలా నిజంగా మనస్పూర్తిగా అనుకునే ముస్లిం ఒక్కడిని కూడా నేను ఈనాటికీ చూడలేదు.ఇతర మతాల వారిని శత్రువులు గానే వారు ఎప్పటికీ భావిస్తారు.ఇది పచ్చినిజం.ఈ విషయాన్ని అంబేద్కర్ కూడా తన రచనలలో ప్రస్తావించాడు.

ఈరోజున రాం మాధవ్ చెప్పినట్లు - మన పన్ను ఒకటి పోతే - శత్రువు దవడ మొత్తం మనం ఊడగొట్టినప్పుడే ఇస్లామిక్ తీవ్రవాద ముఠాలకు బుద్ధి వస్తుంది.అంతేగాని వారిని ఎప్పుడూ నమ్మకూడదు.స్నేహహస్తాన్ని వారికి ఇవ్వకూడదు.నీతిలేని దొంగలతో స్నేహం ఏమిటి?

"దెబ్బకు దెబ్బ" ఒక్కటే పాకిస్తాన్ తో మనం మాట్లాడే విధానం కావాలి. మనవైపు చూడాలంటేనే అది ఒణికిపోయేలా దానికి బుద్ధి చెప్పాలి. అదొక్కటే దీనికి పరిష్కారం. చర్చలతో ఇది జరిగే పని కాదు.ఈ విషయంలో మనం ఇజ్రాయెల్ ను ఆదర్శంగా తీసుకోవాలి.

నా చిన్నప్పుడు పల్లెటూళ్ళలో ఒక సామెత వినేవాడిని. "నక్కనైనా నమ్మవచ్చు గాని తురకవాడిని మాత్రం తోడు తీసికెళ్ళకూడదురా" అనేదే ఆ సామెత. పల్లెల్లో పెద్దలు ఈ మాట అంటూ ఉండేవారు. అప్పట్లో అది కొంచం అతిగా అనిపించినా తర్వాత్తర్వాత అదెంత నిజమో నాకర్ధం అవుతూ వచ్చింది. ఎంత అనుభవం నుంచి పుట్టిందో ఆ మాట !!

పాకిస్తాన్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత హింస జరుగుతూ ఉంటే - బాధిత దేశాలన్నీ కలసి పాకిస్తాన్ ను "రోగ్ స్టేట్" గా డిక్లేర్ చెయ్యకుండా ఎందుకు ఊరుకుంటున్నాయో అర్ధంకాదు.అదేమంటే 'పవర్ బేలెన్స్' అంటారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటారు. అదంతా ఒక పెద్ద "ఆట" అంటారు."పవర్ గేం" అంటారు. ఈ విధమైన 'గేం' లో  చెడుదేశాలను ఏదో ఒక బలమైన దేశాల కూటమి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది.వారు చేసేవన్నీ చేస్తూనే ఉంటారు మళ్ళీ హాయిగా కాలరెత్తుకుని బ్రతుకుతూనే ఉంటారు. ప్రస్తుతం పాకిస్తాన్ ను చైనా సపోర్ట్ చేస్తున్నట్లు !!

పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా అన్ని రంగాలలోనూ తత్క్షణమే ఐసోలేట్ చెయ్యాలి. అప్పుడే ఆ దేశానికి బుద్ధి వస్తుంది.ఇలాగే ఊరుకుంటే మాత్రం ఇది మరో ప్రపంచ యుద్ధానికి ఖచ్చితంగా దారితీస్తుంది. కానీ ఆ పని చేసేదెవరు?? ఈ ఆటలో ఎవరి స్వలాభాలు వారివి.

బోడి ఇండియా సైనికుల ప్రాణాలు ఎన్ని పోతే మాత్రం ఎవరికి కావాలి??

అసలు మన సైనికులు ఇంకా ఎంతమంది ఈ విధంగా చనిపోవాలో? పాపం మన సైనికులను చూస్తే చాలా బాదేస్తున్నది.ఘనులైన గత నాయకుల తప్పుడు నిర్ణయాలకు ఈనాటికీ వీళ్ళు బలౌతూనే ఉన్నారు.

అసలు కాశ్మీర్ వేర్పాటు వాదులను మన టాక్స్ మనీతో ఎందుకు పోషిస్తున్నామో నాకైతే అర్ధంకాదు.పైగా వాళ్ళను వేర్పాటువాదులని అనకూడదట!! మన కోర్టులు చెబుతున్నాయి. మరేమనాలి? స్వాతంత్ర్య సమరయోధులనాలేమో? It happens only in India అంటే ఇదేనేమో? ఇలాంటి వింతలు ఇంకే దేశంలోనూ జరగవు.ఇంకో దేశంలో నైతే వాళ్ళందరూ రాత్రికి రాత్రి అడ్రస్ లేకుండా మాయమై పోయేవారు.మనమేమో వాళ్లకు చాలా రాయితీలిచ్చి మరీ మహారాజుల్లా పోషిస్తున్నాం.దీనికి తోడుగా మన హైదరాబాద్ నుంచి కొంతమంది దేశద్రోహులు వీరికి సపోర్ట్ ఒకటి !! భలే గొప్ప దేశంరా బాబూ మనది !! ఈ దేశంలో ఎవర్నీ ఏమీ అనకూడదు. దొంగని కూడా "దొంగ" అంటే ఈ దేశంలో అదొక తప్పు!! అసలిలాంటి రాజ్యాంగాన్ని రాసినవాళ్ళననాలి !!

'శాంతి' మంత్రం జపించే ఇస్లాం ఎక్కడుంటే అక్కడ "అశాంతి" పెచ్చరిల్లడం వింతలలో పెద్ద వింత కదూ !! ఈ మాటను సాక్షాత్తూ అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీలో ఉన్న ట్రంప్ గారే అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్న ఇస్లాం ఉగ్రవాదం నాశనం కావడానికి ఈసారి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని నాకిప్పుడు అనిపిస్తోంది.

మన నాయకులు ప్రస్తుతానికి గట్టి ప్రకటనలే చేస్తున్నారు.

చూద్దాం! వీరు ఉత్త ప్రకటనలకు పరిమితం అవుతారో లేక వారి చిత్తశుద్ధిని నిజంగా ఆచరణలో చూపిస్తారో??
read more " సెప్టెంబర్ - 2016 పౌర్ణమి ప్రభావం "

15, సెప్టెంబర్ 2016, గురువారం

Leheron Ki Tarah Yadein - Kishore Kumar


Leheron Ki Tarah Yadein...
Dil Ko Takraathee Hai...
Toofaan Uthaathee Hai...

అంటూ కిషోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ పాట 1983 లో వచ్చిన Nishaan అనే సినిమాలోది. ఈ సినిమాలో రాజేష్ ఖన్నా నటించాడు.సినిమా ఫ్లాప్ అయింది.కానీ ఈ పాట మాత్రం మ్యూజిక్ లవర్స్ గుండెల్లో నిలిచిపోయింది. ఈ విధంగా చాలా సినిమాలలో జరుగుతుంది.ఫ్లాప్ అయిన సినిమాలో కూడా ఒక్కొక్కసారి ఒకటో రెండో మంచి పాటలు తళుక్కుమని మెరుస్తూ ఉంటాయి.ఇదీ అలాంటిదే.

ఈ పాట- ఒకవిధమైన విషాదపు ఛాయతో కూడిన మధురత్వాన్ని కలిగి ఉంటుంది.అంతేగాక, ప్రతివారూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో దీనితో చాలా తేలికగా తాదాత్మ్యం చెందగలిగే విధంగా ఉంటుంది. దానికి తోడుగా రాగం కూడా మధురమైనదే కావడంతో ఇది ఒక haunting pathos song అయి కూచుంది.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Nishaan (1983)
Lyrics:-- Gulshan Bawra
Music:-- Rajesh Roshan
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------------
Leheron Ki Tarah Yadein Dil Se Takrathee Hai
Toofaan Uthathee Hai
Leheron Ki Tarah Yadein

[Kismath Me Hai - Ghor Andhere
Raathe Sulagthee - Dhundhle Savere] – 2

[Takthe Takthe - Soonee Raahe
Pathra Gayee Hai – Ab Tho Nigahe] – 2

[Barsonse Dilpe - Bojh uthaye
Doond Rahaa Hu – Pyaar Ke Saaye] – 2


Leheron Ki Tarah Yadein  Dil Se Takrathee Hai
Toofaan Uthathee Hai

Leheron Ki Tarah Yadein

Meaning

Memories, like waves,
wash against my heart
and create storms

My fate is full of darkness
paths are burnt, mornings are dull

My eyes are waiting for so long
Now they are tired

For many years, my heart is heavy
searching for cool shade of Love

Memories, like waves

wash against my heart
and create storms

తెలుగు స్వేచ్చానువాదం

జ్ఞాపకాలు కెరటాలలా 
నా హృదయాన్ని తాకుతున్నాయి
తుఫాన్ ను రేపుతున్నాయి

జీవితమంతా అంధకారంగా ఉంది
దారులన్నీ భగ్నమయ్యాయి
ఉదయాలేమో నీరసంగా ఉన్నాయి

ఎప్పట్నించో 
నా కన్నులు ఎదురుచూస్తున్నాయి 
ఇప్పుడవి అలసిపోయాయి

ఎన్నో ఏండ్ల నుంచీ
నా హృదయం భారంగా ఉంది
చల్లని ప్రేమఛాయ కోసం అది వెదుకుతోంది

జ్ఞాపకాలు కెరటాలలా 
నా హృదయాన్ని తాకుతున్నాయి
తుఫాన్ ను రేపుతున్నాయి
read more " Leheron Ki Tarah Yadein - Kishore Kumar "

7, సెప్టెంబర్ 2016, బుధవారం

రుజువౌతున్న జోస్యాలు - శుక్రగ్రహ నీచ ప్రభావం - కెయిత్ వాస్ ఉదంతం

మొన్న అమావాస్య నాటి ఫలితాలు వ్రాస్తూ - ప్రముఖులు సెక్స్ కుంభకోణాలలో ఇరుక్కుంటారని వ్రాశాను.

నేటి వార్తలు గమనించండి.

లండన్లోని హౌస్ ఆఫ్ కామన్స్ హోం ఎఫైర్స్ సెలెక్ట్ కమిటీ చైర్మన్ అయిన కెయిత్ వాస్ - సెక్స్ స్కాండల్లో ఇరుక్కుని అప్రతిష్ట పాలై తన పదవిని పోగొట్టుకోవడమే గాక, కుటుంబంలో, సమాజంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

59 ఏళ్ళ వయస్సున్న ఈయన - ఇద్దరు బిడ్డల తండ్రి అయి ఉండి - ఈస్ట్ యూరోప్ కు చెందిన ఇద్దరు మగవేశ్యలను లండన్లోని తన ఫ్లాట్ కు రాత్రి పదకొండు గంటలకు పిలిపించుకున్నాడన్న విషయాన్నీ,లైంగిక ఉత్ప్రేరకంగా పనిచేసే ఒక మాదకద్రవ్యాన్ని కూడా వారిచేత తెప్పించుకున్నాడన్న విషయాన్నీ రుజువులతో సహా 'సండే మిర్రర్' అనే పత్రిక ప్రచురించడం దీనికంతా కారణమైంది.

ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో లా చదివాడు.1987 నుంచి లీసేస్టర్ నుంచి లేబర్ పార్టీ M.P గా ఈయన ఉంటున్నాడు. టోనీ బ్లేయిర్స్ మంత్రివర్గంలో యూరప్ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశాడు.

తప్పును ఒప్పుకుంటూ ఈయన తన పదవి నుంచి గౌరవంగా తప్పుకున్నాడు.

హై సొసైటీలో ఇలాంటి వ్యవహారాలన్నీ సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇంగ్లాండ్ వరకూ ఎందుకు? మన ఇండియా సమాజంలో మన చుట్టుపక్కలే ఇలాంటి "వెరైటీ కోసం ప్రాకులాడేవాళ్ళు" ఎంతోమంది నాకు తెలుసు. ఇంకో విచిత్రం ఏమంటే - వీరిలో చాలామంది ఉన్నత పదవులలో ఉన్నవారే. ఈ మొత్తం వ్యవహారం "తప్పా - ఒప్పా" అన్న నైతికతను నేను ప్రశ్నించడం లేదు. ఎవడి ఖర్మ వాడిది.

గ్రహప్రభావం మానవుల మీద ఎలా పనిచేస్తుందో చెప్పడమే నా ఉద్దేశ్యం.

శుక్రుడు నీచస్థితిలో ఉన్న ఈ నెలలో ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా బయట పడతాయని చెప్పడమే నా ఉద్దేశ్యం.

జోస్యం నిజమైందా  లేదా?
read more " రుజువౌతున్న జోస్యాలు - శుక్రగ్రహ నీచ ప్రభావం - కెయిత్ వాస్ ఉదంతం "

6, సెప్టెంబర్ 2016, మంగళవారం

Tumhe Yaad Hoga - Hemanth Kumar, Latha Mangeshkar






Tumhe Yaad Hoga Kabhi Ham Mile The...

అంటూ హేమంత్ కుమార్, లతా మంగేష్కర్ లు మధురంగా ఆలపించిన ఈ గీతం 1959 లో వచ్చిన Satta Bazaar అనే సినిమాలోది. ఈ పాట ఒక నిష్ఠుర విరహ ప్రేమగీతం.చాలా మంచి రాగంతో కూర్చబడిన పాట. అసలు పాటలో ఇంకా రెండు చరణాలున్నాయి.కానీ ఈ ట్రాక్ లో రెండే చరణాలున్నాయి గనుక అలాగే పాడాను.

వీళ్ళిద్దరూ ఒకప్పటి ప్రేమికులు.కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆమె అతడిని విడిచి వెళ్ళిపోయింది.అతడు ఆమెను మరచిపోలేక దేవదాసులా తయారయ్యాడు.ఆమెకూ బాధగానే ఉంది.కానీ పరిస్థితులకు బందీ అయి ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నది.

ఈ నేపధ్యంలో సాగే పాట ఇది.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Satta Bazaar (1959)
Lyrics:--Gulshan Bawara
Music:--Kalyanji Anandji
Singers:--Hemanth Kumar, Latha Mangeshkar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------
Tumhe yaad hoga - kabhi ham mile the
Mohabbat ki raahon me - milke chale the

Bhula do mohabbat me - Ham tum mile the
Sapna hi samjho ke - Milke chale the

Dooba hu gam ki - Geharaayiyon me
Sahara hai yadon ka - Tanhaayiyon me
Sahara hai yadon ka - Tanhaayiyon me

Agar zindagi ho - Apne hi bas me
Tumhari kasam ham - Na bhule vo kasme
Tumhari kasam ham - Na bhule vo kasme

Tumhe yaad hoga - kabhi ham mile the
Mohabbat ki raahon me - milke chale the

Bhula do mohabbat me - Ham tum mile the
Sapna hi samjho ke - Milke chale the

Tumhe yaad hoga - kabhi ham mile the...

Meaning

One day, you will certainly remember
We met in the past
and walked the path of love for some time

Forget that we met in the path of love
Treat our journey of love as a mere dream

I am drowned - in the shallowness of pain
My shelter is my solitude which is full of memories

If my life were in my hands
Believe me, I would not have forgotten
Our sweet memories and those sweet promises

One day, you will certainly remember
We met in the past
and walked the path of love for some time

Forget that we met in the path of love
Treat our journey of love as a mere dream

తెలుగు స్వేచ్చానువాదం

ఒకరోజున నీకు తప్పకుండా గుర్తుకొస్తుంది
మనం గతంలో కలిశామని
ప్రేమదారిలో కలసి నడిచామని 

అదంతా మరచిపో
మన గతం అంతా ఒక కల అనుకో

నేను బాధ అనే శిశిరంలో మునిగి ఉన్నాను
ఈ బాధలో మన గత స్మృతుల ఏకాంతమే
ఇప్పుడు నా ఓదార్పు

నా జీవితం నా చేతుల్లో ఉంటే
మన ప్రేమను, మన ఊసులను
నేను మరచిపోయేదాన్నే కాదు

ఒకరోజున నీకు తప్పకుండా గుర్తుకొస్తుంది
మనం గతంలో కలిశామని
ప్రేమదారిలో కలసి నడిచామని 

అదంతా మరచిపో
మన గతం అంతా ఒక కల అనుకో
read more " Tumhe Yaad Hoga - Hemanth Kumar, Latha Mangeshkar "

5, సెప్టెంబర్ 2016, సోమవారం

మదర్ తెరెసా జాతకం - కొన్ని ఆలోచనలు

మదర్ తెరెసాకు నిన్న 'సెయింట్ హుడ్' ప్రదానం చెయ్యబడిన సందర్భంగా ఆమె జాతకాన్ని ఒకసారి పరిశీలిద్దాం.ఈ జాతకాన్ని వివరించమని చాలా కాలం నుంచీ కొందరు నన్ను కోరుతున్నారు.నా శిష్యురాళ్ళ లో ఈమెకు వీరాభిమానులు కొందరున్నారు. 

నిర్మొహమాటమైన నా అభిప్రాయాలతో వాళ్ళ మనస్సులు నొప్పించడం ఎందుకని ఇన్నాళ్ళూ వ్రాయలేదు.


అయినా, పోయినవాళ్ళ జాతకాలు వ్రాయడం మనకు వెన్నతో పెట్టిన విద్యకదా ! అందులోనూ ఈమెకు నోబుల్ ప్రైజూ వచ్చె.ఇప్పుడు సెయింట్ హుడ్ కూడా వచ్చె.ఇంకా రాయకపోతే ఎట్టాగబ్బా !

అయినా ఈ సెయింట్ హుడ్ ప్రదానం ఏంటో నా మట్టి బుర్రకు ఎప్పటికీ అర్ధం గాదు.సెయింట్ హుడ్ అనేది ఒకళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ వల్ల వస్తుందా? రావచ్చేమో మరి ! మనకు తెల్వద్...

ఇలాటివన్నీ మతప్రచారం కోసం చేసే జిమ్మిక్స్ అని నాకెక్కడో కొండొకచో ఒక పెద్ద అనుమానం. కానీ నా అనుమానాలు ఎవడిక్కావాలి? వాటికి విలువేముంది?

కనుక -  ఆ సంగతి అలా ఉంచి జాతకం వైపు దృష్టి సారిద్దాం.

ఈమె 26-8-1910 న సెంట్రల్ యూరప్ లోని స్కోపే అనే నగరంలో జన్మించింది. ఈ ప్రదేశానికి లాంగిట్యూడ్ 21 E 25; లాటిట్యూడ్ 41 N 59; Time Zone-+1.00 East of GMT.

ఆమె జనన సమయం ఇచ్చిన యాస్ట్రో డేటాబ్యాంక్ వారు ఈ సమయాన్ని conflicting/unverified అని అన్నారు గనుక ఇది నిజమని మనం నమ్మలేం. కానీ మనకు తెలిసిన జ్యోతిశ్శాస్త్ర సూత్రాల ప్రకారం ఈమె జన్మలగ్నం ధనుస్సు అవడానికి అవకాశం లేదు.ఈమె సన్నగా పొట్టిగా ఉండేవారు గనుక ధనుర్లగ్నం అవడానికి అవకాశం లేదు. నా ఉద్దేశ్యం ప్రకారం ఈమె లగ్నం కన్యలో రెండవ నవాంశ అయ్యి ఉండాలి. అంటే - ఉదయం 6.59 నుంచి 7.16 లోపు జనన సమయం అయి ఉంటుంది.

మనపని జననకాల సంస్కరణ కాదు గనుక ఆ విషయాన్ని అలా వదిలేద్దాం.

వక్రశని వల్ల ఈమెకు లోకంతో తీర్చుకోవాల్సిన ఖర్మ చాలా ఉన్నదన్న విషయం అర్ధమౌతున్నది. అది కూడా నీచశని కావడం వల్ల లోకం నీచంగా భావించే సేవాకర్మలైన రోగులకు, ముఖ్యంగా కుష్టు వాళ్ళకు, సేవ చెయ్యడం మొదలైన పనులు సూచింపబడుతున్నాయి. ఆమె చేసినది అదేగా మరి.

శనిచంద్ర సంయోగం ఆధ్యాత్మిక సంకేతం అయినప్పటికీ - శని నీచ స్థితివల్ల - ఈ ఆధ్యాత్మికత అనేది స్వచ్చమైనది కాదనీ - దీనివెనక మతమార్పిడి అనే ఒక అజెండా ఉందన్న విషయం కనిపిస్తున్నది.

ఉచ్ఛస్థితిలోని రాహుకేతువుల వల్ల ఈమె చేపట్టిన పనులలో కాలం చక్కగా కలసి వస్తుందన్న విషయం తేటతెల్లం అవుతున్నది.

చంద్రుని నుంచి ఆరింట ఉన్న గురు+ఉచ్చ బుదులవల్ల - మతసంబంధమైన తెలివైన కర్మ చేస్తుందని తెలుస్తున్నది. ఈ కర్మవల్ల ఈమెకు లోకప్రఖ్యాతి కలుగుతుందని కూడా సూచన ఇదే యోగం ఇస్తున్నది.

దశమాదిపతీ, సహజ వృత్తి కారకుడూ అయిన శనీశ్వరుడు చంద్రలగ్నంలో నీచస్థితిలో ఉండటం వల్ల - సేవారంగమే ఈమె వృత్తి అనేది స్పష్టంగా తెలుస్తున్నది. శనీశ్వరుని బాధకాదిపత్యం వల్ల, ఈ పనిని ఆమె ఎన్నో బాధలు సహించి చెయ్యవలసి ఉన్నదన్న "కార్మిక్ సిగ్నేచర్" కనపడుతున్నది.

నవాంశలోని ఉచ్ఛగురు+కేతువుల వల్ల మతపరమైన ఔన్నత్యమూ, నాయకత్వమూ కలసి వివాహాన్ని భంగం చేస్తాయన్న సూచన ఉన్నది.

లగ్నం ధనుస్సు అనుకుంటే - దశమంలో ఉచ్ఛ గురుబుధుల వల్ల మంచి మతపరమైన వృత్తి కనిపిస్తున్నది.దీనివల్ల పేరు ప్రఖ్యాతులూ కనిపిస్తున్నాయి. పంచమంలో నీచ శని చంద్రుల వల్ల ఈమె మనస్సు ఎప్పుడూ దీనులకు సేవ ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుందని తెలుస్తున్నది.కానీ సప్తమాధిపతి అయిన బుధుడు ఉచ్చలో ఉన్నందువల్ల త్వరగా వివాహం అవ్వాలి.కనుక ధనుర్లగ్నం కరెక్ట్ కాకపోవచ్చు.

దీనికి ఇంకొక కారణం కూడా ఉన్నది.ధనుర్లగ్నమే అయితే - నవమంలో రవి కుజులవల్ల మతపరమైన బలం సూచింప బడుతూ ఉన్నప్పటికీ,ఈమెకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు గమనించి చూస్తే - ఈ యోగం అంత బలంగా లేదు.

అదే మనం అనుకున్నట్లుగా - కన్యా లగ్నం అయితే - దశమాదిపతి అయిన బుధుడు లగ్నంలో ఉచ్చలో ఉన్నందువలన కూడా మతపరమైన ప్రఖ్యాత వృత్తి కనిపిస్తున్నది.బాధకుడైన సప్తమాధిపతి గురువు లగ్నంలో ఉన్నందువలన, తలపెట్టుకున్న పనికోసం,  అవివాహితగా ఉండిపోవడం కనిపిస్తున్నది.కనుక కన్యాలగ్నమే కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కన్యా లగ్నం రెండో నవాంశ అయితే అది కుంభ నవాంశ అవుతుంది.కనుక అక్కడనుంచి సప్తమంలో ఉన్న శనీశ్వరుని వల్ల వివాహం అయ్యే అవకాశం లేదు.కనుక కన్య రెండో నవాంశ కావచ్చు అని నా ఉద్దేశ్యం.

అంతేగాక - కన్యాలగ్నం నుంచి నవమంలో ఉన్న ఉచ్ఛ రాహువు వల్ల - మతపరమైన ఔన్నత్యమూ - విదేశాలలో కార్యరంగమూ కనిపిస్తున్నాయి. కనుక కన్యకే మార్కులు ఎక్కువగా పడుతున్నాయి.

ఈ ప్రకారంగా ఉదయం 7.00 గంటలకు జనన సమయం అనుకుంటే - అప్పుడు కన్యాలగ్నం అవుతూ ఘటీ లగ్నం పంచమమైన మకరంలో పడుతున్నది.మకరం భారత దేశానికి సూచిక గనుక - భారత దేశంలో ఈమెకు పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న సూచన స్పష్టంగా ఇది ఇస్తున్నది.కర్కాటకం నుంచి శుక్రుడు ఈ ఘటీలగ్నాన్ని చూస్తూ శుక్రదశలో ఈ గౌరవం దక్కుతుంది అని సూచిస్తున్నాడు.ఆమెకు ఇప్పుడు జరుగుతున్న దశ శుక్రదశే. ఎంత విచిత్రమో చూచారా?

జ్యోతిశ్శాస్త్ర సూత్రాలు ఎంత ఖచ్చితంగా పనిచేస్తాయో గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.దశలనేవి మనిషి చనిపోయిన తర్వాత కూడా పనిచేస్తూనే ఉంటాయన్నది అలాంటి ఆశ్చర్యకరమైన వాస్తవాలలో ఒకటి. అలాంటి ఆశ్చర్యకరములైన సూత్రాలలో నుంచి ఒక్క సూత్రాన్ని ఇప్పుడు పరిచయం చేస్తాను.

పేరు ప్రతిష్టలను ఘటీ లగ్నం నుంచి చూడాలి. ఈ ఘటీలగ్నం అనేది లగ్నాత్ అష్టమం అయింది.అంటే మరణానికి సంబంధించినది లేదా మరణం తర్వాత వచ్చే పేరు ప్రతిష్టలకు సూచనగా ఉన్నది.అక్కడే శుక్రుడున్నాడు. దశలను పొడిగించుకుంటూ వస్తే - ప్రస్తుతం ఆమెకు శుక్ర మహర్దశ జరుగుతున్నది.సరిగ్గా చెప్పాలంటే శుక్ర - సూర్య - కేతు దశ జరుగుతున్నది. సూర్యుడు నవమాధిపతిగా ఉండి ఈమెకు వచ్చే పేరు మతపరమైనదై ఉంటుందని సూచిస్తున్నాడు. కేతువు పన్నెండో ఇంటిలో ఉచ్ఛస్థితిలో ఉంటూ మరణానంతరం పట్టే యోగాన్ని సూచిస్తున్నాడు.ఇవన్నీ కలసి - ఆమెకు మరణానంతరం గొప్ప గౌరవం దక్కుతుంది అని చూపిస్తున్నాయి.అదికూడా జరిగే టైం స్లాట్ ను ఖచ్చితంగా సూచిస్తున్నాయి. కనుకనే ఆమె చనిపోయిన 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆ దశలు జరిగే సమయంలో ఆమెకు 'సెయింట్ హుడ్' ప్రదానం చెయ్యబడింది.

ఇంకొక రహస్యాన్ని వినండి.

ఆమె చనిపోయిన 1997 లో రాహుకేతువులు ఏ రాశులలో ఉన్నారో ఇప్పుడు 18 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా అదే రాశులలో ఉన్నారు.కనుక కాలస్వరూపులైన రాహుకేతువుల అనుగ్రహం వల్లే ఈమెకు 'సెయింట్ హుడ్' ప్రదానం చెయ్యబడిందని కనిపిస్తున్నది.

ఒక మనిషి చనిపోయిన తర్వాత 18 గంటలు కూడా గుర్తుంచుకోని నేటి కాలంలో - 18 ఏళ్ళ తర్వాత కూడా బిరుదులూ గౌరవాలూ ప్రదానం చెయ్యబడుతున్నాయంటే ఆ జాతకం విశిష్టమైనదే అయ్యుండాలి.ఆ విశిష్టతలేమిటో పైన వివరించాను కదా !

ఎందుకంటే - ఒకే పనిని చేసిన అందరికీ ఒకే గౌరవం ఈలోకంలో దక్కదు.ఒక్కోసారి ఎక్కువ కష్టపడిన వారికి తక్కువ గౌరవం లభిస్తుంది.తక్కువ కష్టపడిన వారికి ఎక్కువ గౌరవం దక్కుతుంది.ఈలోకంలో ఇదొక విచిత్రం.ఇది అందరికీ తెలిసినా కొన్ని ఉదాహరణలిస్తాను.

మన దేశానికి స్వాతంత్రం రాకముందు దానికోసం ఎంతో కష్టపడి, ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎందఱో ఉన్నారు.వారికి ఏ గుర్తింపూ రాలేదు.వారు ఏ సుఖాలూ అనుభవించలేదు.ఎవరికీ తెలియబడకుండా వారు మౌనంగా కాలగర్భంలో కలసిపోయారు.కానీ నేడు ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్న నాయకులు మాత్రం అప్పటి స్వతంత్ర సమర యోధుల పేర్లు చెప్పుకుని స్వర్గసుఖాలను ఇక్కడే అనుభవిస్తున్నారు.కంటి తుడుపుగా వాళ్ళ 'దినాల' నాడు జెండా ఎగరేసి ఒక సెల్యూట్ కొడతారు.సరిపోతుంది.

సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేగా మరి !!

అలాగే - మదర్ తెరెసా కంటే ఎంతో ముందు, ఇంకా ఎన్నో దుర్భర పరిస్థితులను ఎదుర్కొని, ఈమెకంటే ఇంకా ఎంతో ఎక్కువ సేవ చేసిన గౌరీమా, సిస్టర్ నివేదిత, సిస్టర్ క్రిస్టీన్ మొదలైన మహోన్నత త్యాగమూర్తులు మనకిప్పుడు గుర్తే లేరు.నిజానికి వారికి ఎన్ని నోబుల్ ప్రైజులిచ్చినా తక్కువే. వారికి 'సెయింట్ హుడ్' మనం ఇవ్వనక్కరలేదు. అది భగవంతుడే ఇచ్చాడు. అయినా - ఒకరికి సెయింట్ హుడ్ ఇవ్వడానికి మన తాహతెంత? అలా ఇవ్వడానికి వాళ్ళకంటే మనం ఎక్కువా?

ఈలోకం ఇంతే. అసలైన వ్యక్తులకు ఇక్కడ గుర్తింపు ఎప్పటికీ ఉండదు. ఎవరికైతే బలమైన ఒక వ్యవస్థ యొక్క సపోర్ట్ ఉంటుందో, ఎవరికైతే ధనబలం ఉంటుందో, ఎవరికైతే మంచి మార్కెటింగ్ నెట్వర్క్ ఉంటుందో - వాళ్ళే ఈలోకంలో చెలామణీ అవుతారు.ఇవి లేనివారు - వారెంత నిజమైన మహానీయులైనా సరే - ఊరూ పేరూ లేకుండా ఉండిపోతారు.మట్టిలో కలసిపోతారు.

మాయ అంటే ఇదే.

లోకమంతా మాయలోనే పడి ఉంది మరి !!

నాకు క్రిస్టియానిటీ అంటే ఏమీ ద్వేషం లేదు. క్రీస్తంటే నాకు గౌరవమే. శ్రీరామకృష్ణుల భక్తుడినైన నేను క్రీస్తును ఒక సెయింట్ గా తలుస్తాను. కానీ నేటి క్రైస్తవం చేసే మాయలంటే మాత్రం నాకేమాత్రమూ పడదు.

ఎక్కడో జరిగిన రెండు అద్భుతాల పరంగా నేడు ఈమెకు సెయింట్ హుడ్ ఇస్తున్నామని అంటున్నారు.కానీ మదర్ తెరెసా చనిపోవడానికి ముందు ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉన్నదో వీళ్ళు మరచిపోతున్నారు.

చివరి రోజులలో ఆమె ఒక సైకలాజికల్ పేషంట్ గా మారింది. సైతాన్ ఏ మూలనుంచి తనను ఎటాక్ చేస్తుందో నని అనుక్షణం భయపడుతూ, గదిలో ఒక మూలలో నక్కి - 'జీసస్ సేవ్ మీ' అని గొణుక్కుంటూ ఉండేది.అలాంటి మానసిక పరిస్థితిలో ఆమె తనువు చాలించింది. ఈ విషయాలను ఆమెకు పర్సనల్ సేవకురాలైన సిస్టర్ నిర్మల స్వయానా వెల్లడించింది.

మరణానికి ముందు ఉన్న మానసిక స్థితే ఆ తర్వాత కూడా ఉంటుందనేది భగవద్గీత మాత్రమే చెప్పిన సత్యం కాదు. నేటి పారా నార్మల్ రీసెర్చి కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. మరి అదే నిజమైతే - అటువంటి బాధాకరమైన మానసిక పరిస్థితిలో తనువు చాలించిన వ్యక్తి 'సెయింట్' ఎలా అవుతుందో నాకైతే అర్ధం కాదు.

మనం ఏదైనా నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలి. మదర్ తెరెసా మన దేశానికి తెచ్చిన చెడ్డ పేరు చాలా ఉంది.

దేశదేశాలలో తిరిగి - ఇండియా పరమ దరిద్ర దేశం - అక్కడ మురికీ, రోగాలూ, మాల్ న్యూట్రిషనూ, మూఢనమ్మకాలూ, అవినీతీ తప్ప ఇంకేమీ లేవని ప్రచారం చేసి - అక్కడి ఆడవారినీ పిల్లలనూ ఆదుకోవాలని అర్ధించి - ఇదంతా విని 'అయ్యో పాపం' అంటూ మనసు కరిగిపోయిన విదేశీయులు దానం చేసిన డబ్బుతో ఇక్కడ సేవా కార్యక్రమాలను ఆమె చేసింది.పనిలో పనిగా మతమార్పిడులూ చేసింది. ఏ మిషనరీ అయినా ఇదే చేస్తాడు ఇది విచిత్రం ఏమీ కాదు.

ఈ క్రమంలో - విదేశాల దృష్టిలో - మన దేశపు ఇమేజి చాలా దిగజారిపోయింది.

మన దేశం అంటే వెస్ట్ లో చాలా నీచమైన అభిప్రాయం ఎప్పటినుంచో ఉన్నది. మన ఫిలాసఫీ ఆధ్యాత్మికతా తెలిసిన కొందరికి తప్ప మిగిలిన విదేశీయులందరికీ ఇండియా అంటే ఒక నరకంతో సమానం. ఈనాటికీ ఇదే మన ఇమేజి. ఇలాంటి ఇమేజిని మదర్ లాంటి వారి చర్యలు మరీ ఎక్కువ చేశాయి. అయితే దీనికి ఆమెను తప్పు పట్టవలసిన పని లేదు. దీనికి కారకులు మన నాయకులే. ఇలాంటి మదర్లను సపోర్ట్ చేస్తున్నది వాళ్ళేగా?

స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళౌతున్నా - జనాభా 130 కోట్లు దాటిపోతున్నా - ప్రకృతి సహజ వనరులు రోజురోజుకీ దిగనాసిల్లి పోతున్నా - ఏమీ చెయ్యకుండా - ఎవరి దోపిడీ వాళ్ళు నిస్సిగ్గుగా కొనసాగిస్తున్న నాయకులదే ఈ తప్పు. వీరి వల్లనే - స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా - ప్రపంచ దేశాలలో మనదేశం ఇంకా దరిద్రదేశం గానే గుర్తింపబడుతూ ఉన్నది.

స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాడి దోపిడీ వల్ల మన దేశంలో దరిద్రం ఉందంటే - పోనీలే అనుకోవచ్చు.కానీ ఈ 70 ఏళ్ళలో మనం ఒరగబెట్టింది ఏమిటి? ప్రపంచ దేశాలు దానం చేస్తే ఆ డబ్బుతో మన దేశంలోని కుష్టురోగులకూ, పిల్లలకూ, ఆడవారికీ సేవ చేసుకుంటూ వారిని బ్రతికించుకునేటంత హీనస్థితిలో ఉన్నామా మనం? ఒకవేళ ఉంటే మాత్రం - అలా ఉన్నందుకు మనమందరమూ చాలా సిగ్గుపడాలి.

ఈనాడు మదర్ తెరెసా, సెయింట్ తెరెసా అయింది. కానీ అదే సమయంలో - ప్రపంచ దేశాల వేదికమీద ఈ అవార్డును ప్రదానం చేస్తున్న విదేశీయులు - "మన దేశాలనుంచి వెళ్లి ఇండియాలోని దరిద్రులకూ, కుష్టురోగులకూ సేవ చేస్తూ, ఒక మురికి ఇండియానూ - ఒక దరిద్రపు ఇండియానూ ఉద్ధరిస్తూ ప్రాణాలు పణంగా పెట్టి, అదేపనిలో తనువు చాలించిన మహనీయురాలు" అని ఇచ్చే ఉపన్యాసాలు విన్నపుడు మాత్రం నా మనస్సు చివుక్కు మంటుంది.

విదేశాలు మన దేశం గురించి ఇలా మాట్లాడుతూ - హేళనగా నవ్వుతూ ఉండే అవకాశం మనం వారికి ఎందుకివ్వాలి? ఎవరో వచ్చి మన దేశాన్ని బాగుచెయ్యాలా? మనమే ఆపనిని చేసుకోలేమా?

ఏం? మనకు నాయకులు లేరా? వనరులు లేవా? తెలివితేటలు లేవా? సమర్ధులైన ప్రజలు లేరా? వ్యవస్థలు లేవా? మన దేశాన్ని మనమే బాగుచేసుకోలేమా? ఆ పనికి మత సేవాసంస్థలు అవసరమా?

స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచాక కూడా సోషల్ సర్వీస్ అంటూ కొన్ని సంస్థలు - ప్రభుత్వం చెయ్యవలసిన పనినీ - పౌరులు తాము చేసుకోవలసిన పనినీ - అవి చెయ్యడం అవసరమా? అందులోనూ మతపరమైన సంస్థలు - మతమార్పిళ్లు చేస్తూ - 'ఇలాంటి సేవలు' చెయ్యడం, మనం చేయించుకోవడం, అలా చేసిన వారికి బిరుదులు ప్రదానం చేసి చంకలు చరుచుకోవడం అవసరమా? మనకు కాస్తైనా ఆత్మాభిమానం అక్కరలేదా?

ఆలోచించండి.
read more " మదర్ తెరెసా జాతకం - కొన్ని ఆలోచనలు "

Dhal Ti Jaye Raat - Mohd.Rafi, Asha Bhosle



Dhalti Jaye Raat 

అంటూ మహమ్మద్ రఫీ, ఆశా భోంస్లేలు మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం Razia Sultana (1961) అనే సినిమాలోది. ఇది చాలా మధురమైన రాగంతో కూడిన శ్రావ్యమైన పాట. ఇలాంటి శాస్త్రీయ రాగాలతో కూడిన పాటలు ఆస్వాదించాలంటే ఒక అభిరుచి అనేది ఉండాలి. ఇలాంటి మధురమైన పాటలు రాత్రిపూట పది తర్వాత డాబామీద వెన్నెల్లో కూచుని వింటే చాలా మంచి ఫీల్ ను ఇస్తాయి.

మరపురాని మధుర గీతాలలో ఒకటి.

నా స్వరంలో కూడా వినండి మరి.

మరొక్క మాట. పాడింది నిజంగా నేనే !!! రఫీ అనుకొని భ్రమపడకండి !!

Movie:--Razia Sultana (1961)
Lyrics:--Anand Bakshi
Music:--Lachi Ram
Singers:--Asha,Rafi
Karaoke singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------
Dhalti jaye raat - Kehle dilki baat
Shamma parvaane ka na - hoga phir saath
Dhalti jaaye raat

Mast nazare - chand sitare - Raat ke mehmaa hai ye saare
Utt jayegi rab kee mehfil - Noor e sheher ke sun ke nakaare
Hona ho dubara mulaqaat
Dhalti jaaye raat

Neend ke bas me khoyi khoyi - Kul duniyaa hai soyee soyee
Aise mei bhi jaag rahaa hai - Ham tum jaisa koyi koyee
Kya hasee hai taron kee baaraat
Dhalti jaaye raat

Jo bhi nigahe char hai karta - Uspe zamana war hai karta
Rah e wafaa ka ban ke raahee - Phir bhi tumhe dil pyar hai karta
Baitha na ho leke koyee ghaath

Dhalti jaye raat - Kehle dilki baat
Shamma parvaane ka na - hoga phir saath
Dhalti jaaye raat

Meaning

The night is passing away
Speak out your heart
The moth and the fire may not meet again

The Moon and the stars - how lovely they are !
All these are night's guests
God's show will quickly end
On hearing the bells of dawn
Our this meeting should happen again

The whole world is dozing
gripped by the power of sleep
In these moments, we
and some others like us, do keep awake
How enchanting is the party of stars !!

Whose looks are locked with each other
they will face the wrath of the world
This heart is treading the path of duty
still it continues to love you always
Don't be a coward....

The night is passing away
Speak out your heart
The moth and the fire may not meet again

తెలుగు స్వేచ్చానువాదం

రాత్రి గడచి పోతున్నది
నీ మనసులో ఏముందో వెలిబుచ్చు
ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు

ఈ చంద్రుడూ తారలూ ఎంత బాగున్నాయో
ఇవన్నీ రాత్రి పూట వచ్చే అతిధులు
ఉదయపు గంటలు మ్రోగుతూనే
దైవం ఆడే ఈ ఆట మాయమౌతుంది
కానీ మనం మళ్ళీ కలుసుకుంటాం...

లోకం అంతా నిద్రమత్తులో జోగుతున్నది
మనలాంటి కొందరు మాత్రం మేలుకుని ఉన్నారు
ఈ తారల బారులు ఎంత బాగున్నాయో !!

ఎవరి చూపులైతే ప్రేమతో పెనవేసుకుంటాయో
వారు లోకపు కోపాన్ని ఎదుర్కోక తప్పదు
నేను నా బాధ్యత అనే దారిలో బందీనైనా
ఈ హృదయం నిన్ను ప్రేమిస్తూనే ఉంది
ఎల్లకాలం అలా పిరికివాడిలా కూర్చోకు

రాత్రి గడచి పోతున్నది
నీ మనసులో ఏముందో వెలిబుచ్చు
ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు....
read more " Dhal Ti Jaye Raat - Mohd.Rafi, Asha Bhosle "

4, సెప్టెంబర్ 2016, ఆదివారం

Ay Dil E Awara Chal - Mukesh




Ay Dil E Awara Chal

అంటూ ముకేష్ మధురంగా ఆలపించిన ఈ గీతం Dr.Vaidya (1962) అనే చిత్రంలోనిది.ఈ చిత్రానికి S.D.Burman సంగీతాన్ని సమకూర్చాడు. మనోజ్ కుమార్, వైజయంతి మాలా నటించారు.

ముకేష్ తరహా పాటల్లో ఇదొకటి.
నా స్వరంలోనూ వినండి మరి.

Movie:--Dr.Vaidya (1962)
Lyrics:--Majrooh Sultanpuri
Music:--S.D.Burman
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------
O o o o
Ai dil e aavaaraa chal

Ai dil e aavara chal
Phir vahi dobaaraa chal
Yaar ne didaar ka vaadaa kiyaa hai
O o o ai dil e avaaraa chal
Phir vahi dobaaraa chal
Yaar ne didaar ka vaada kiyaa hai
O o o ai dil e avaaraa chal

Vo unki betaabi - vo unka Chalna chamse
Aachal thaamaa to haske - Kahaa phir milneko hamse
Unse hamse sun aiiiii dillll
Pyaar ka ikrar aankho me hua hai
O o ai dil e avaaraa chal

Khatti ho ya meethi - ab Un aankho se peena
Jite hai chaahat vale - Binaa chaahat ke kya jinaa
Chalte phirte sun ai dil
chaah me ab aah bharanekaa mazaa hai
O o o ai dil e avaaraa chal

[Chamka hai ik mukhda - Kuchh zulphe hai laharayi
Din phir gaye apne Din ke - gai rato ki tanhaai] - 2
Jahaa vo - vahaa ham - sun ai dil

chain se bechain Tukyu - ho rahaa hai
O o o ai dil e avaaraa chal
Phir vahi dobaaraa chal
Yaar ne didaar ka vaada kiyaa hai
O o ai dil e avaaraa chal
read more " Ay Dil E Awara Chal - Mukesh "

Masti Bhara Hai Sama - Manna Dey, Lata Mangeshkar



Masti Bhara Hai Sama - Ham Tum Hai Dono Yahaa....

అంటూ మన్నాడే, లతా మంగేష్కర్ లు ఆలపించిన ఈ గీతం 1958 నాటి Parvarish అనే చిత్రం లోనిది. ఈ సినిమాలో రాజ్ కపూర్,మాలా సిన్హాలు నటించారు.

పాత గాయకులలో మన్నాడే స్వరం చాలా అద్భుతమైనది. ఆ స్వరంలో ఏదో మాయ ఉంది.వింటున్న వారిని మంత్ర ముగ్ధులను చేస్తుంది.అది లైట్ మ్యూజిక్ అయినా, శాస్త్రీయ రాగాలతో కూడుకున్న కష్టమైన పాట అయినా, భక్తిని పలికించే భజన గీతమైనా, విషాదగీతమైనా,లేక హుషారు పాటైనా - ఎటువంటి పాటనైనా సరే అలవోకగా పాడగల ప్రజ్ఞ మన్నాడేకు ఉన్నది. మన్నాడే పాటలు నేను చాలా ఇష్టపడతాను.

1958 లో ఇది చాలా ఫాస్ట్ బీట్ సాంగ్ క్రింద లెక్క. అయినా సరే, మనోజ్ఞమైన రాగంతో కూడిన పాట.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:-- Parvarish (1958)
Lyrics:--Hasrat Jaipuri
Music:--Datta Ram
Singers:--Manna Dey, Lata Mangeshkar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------
Masti bhara hai sama - Ham tum hai dono yahaa
Aakhon me aajaa - Dil me sama ja
Jhome Zamee aasmaa
Masti bhara hai sama - Ham tum hai dono yahaa

Neeli aakho milaalo jee - Dil me aaj chupalo jee -2
Baho me baahe dalo jee - Gir na jaaye sambhalo jee
Bheegee havaavon me - Aisi fijaavon me
Hosh mujhe hai kahaa

Pyar se pyar sajaye chal - Man ki pyas bujhaye chal
Pyar ka raag sunaye chal - Dil ka saaj bajaaye chal
Panchee bhee gaayenge - Sab ko sunayenge
Teri meri daastaan

Masti bhara hai sama - Ham tum hai dono yahaa
Aakhon me aajaa - Dil me sama ja
Jhome Zamee aasmaa
Masti bhara hai sama - Ham tum hai dono yahaa

Meaning

The weather is intoxicating
We are here together
Come into my eyes and light me up
The Earth and Sky are dancing with joy

Join your eyes with mine
Keep me in your heart
Place your hand in mine
Beware - You may fall down
In this cool air, in this lovely weather
How can I remain conscious?

Decorate love with love
Quench the thirst of your mind
Sing the tune of love
on the lute of your heart
(seeing us) Even the birds are singing now
they sing the story of our love to the entire world

The weather is intoxicating
We are here together
Come into my eyes and light me up
The Earth and Sky are dancing with joy

తెలుగు స్వేచ్చానువాదం

వాతావరణం ఎంతో మనోజ్ఞంగా ఉంది
మనిద్దరం ఇక్కడ విహరిస్తున్నాం
నా కన్నులలోకి రా - వాటిల్లో వెలుగును నింపు
భూమీ ఆకాశమూ ఆనందంతో నాట్యం చేస్తున్నాయి

నీలి కన్నులను నా కన్నులతో కలుపు - నన్ను నీ హృదయంలో నిలుపుకో
నా చేతిలో నీ చేతిని ఉంచు - జాగ్రత్తగా నడువ్ క్రింద పడతావు
ఈ చల్లని గాలిలో ఈ మనోజ్ఞ వాతావరణంలో
స్పృహ తప్పకుండా నేనెలా తట్టుకోగలను?

ప్రేమను ప్రేమతో అలంకరించు - మనసు దాహం తీర్చుకో
నీ హృదయమనే వీణపైన - ప్రేమరాగాన్ని పలికించు
మనల్ని చూచి పక్షులు కూడా గానం చేస్తున్నాయి
మన ప్రేమను లోకానికి వెల్లడిస్తున్నాయి

వాతావరణం ఎంతో మనోజ్ఞంగా ఉంది
మనిద్దరం ఇక్కడ విహరిస్తున్నాం
నా కన్నులలోకి రా - వాటిల్లో వెలుగును నింపు
భూమీ ఆకాశమూ ఆనందంతో నాట్యం చేస్తున్నాయి
read more " Masti Bhara Hai Sama - Manna Dey, Lata Mangeshkar "